ముంబై: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'లడ్కీ బహిన్ యోజన' పథకానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే తప్పుపట్టారు. ఈ పథకం నేరమైతే.. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘లడ్కీ బహిన్ (ప్రియమైన సోదరీమణులు) కోసం నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. లడ్కీ బహిన్ యోజనను నిలిపివేయాలని ఒత్తిడి చేస్తున్న మహా వికాస్ అఘాడీని ఓడించడానికి శివసేన, మహాయుతికి మహిళలంతా మద్దతు ఇవ్వాలి. ప్రియమైన సోదరీమణులు లడ్కీ బహిన్ యోజన కింద ప్రతి నెల రూ.1,500 పొందుతారు. లడ్కీ బహిన్ యోజనను మూసివేయాలని ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోంది.ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్ల వద్దకు వస్తే.. లడ్కీ బహిన్ యోజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నిలదీయండి.
..ఆ పథకాన్ని ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని అడగండి. ఇది సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మీ వద్దకు ఎవరు వచ్చినా.. లడ్కీ బహిన్ యోజనను వ్యతిరేకించే వారికి మీరేంటో చూపించండి. అసెంబ్లీ ఎన్నికల్లో లడ్కీ బహిన్ యోజన, ఇతర సంక్షేమ పథకాలను ఆపేయాలనుకువారికి వారికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీస్తారని శివసేన(యూబీటీ) అసత్య ప్రచారం చేస్తోంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment