Maharashtra elections
-
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అక్రమాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌లు, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకేమహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు. ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్‌ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.అన్ని గణాంకాలను వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. -
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
వయనాడ్ లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం
-
ఏక్నాథ్ షిండే అనే నేను.. రెండోసారి?
-
Kishan Reddy: బీజేపీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేశారు
-
మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
-
Live: ‘మహా’యుతిదే అధికారం.. 25న సీఎం ఎన్నిక?!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికాసేపట్లో ఆ ఉత్కంఠకు తెరపడనుంది. -
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్‌లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. -
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
పొలిటికల్ ట్విస్టులతో దద్దరిల్లిపోతున్న మహారాష్ట్ర
-
హానికరమైన కొత్త జాతీయవాదం
2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు. కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే. అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. నిజమైన లక్ష్యంఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్‌లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్‌తో, వెలమలు బీఆర్ఎస్తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్‌లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు. ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.కుల గణనతోనే రిజర్వేషన్లుఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికికేంద్రం సుముఖంగా లేదు.ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్‌గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్‌తో జతకట్టారు.కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
PM Modi: మోదీకి తప్పిన ప్రమాదం ?
-
కంగ్రాట్స్ సార్! మనకు ఈసారి డిపాజిట్ గ్యారంటీనట!!
కంగ్రాట్స్ సార్! మనకు ఈసారి డిపాజిట్ గ్యారంటీనట!! -
Maharashtra Elections: స్కూటర్లో రూ. 1.5 కోట్లు.. కంగుతిన్న పోలీసులు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ మరింత సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా నగదును సీజ్ చేస్తున్నారు.తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆశ్చర్యకర ఉదంతం వెలుగుచూసింది. స్కూటర్‌పై ఏకంగా రూ.1.5 కోట్లతో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడాన్ని చూసిన పోలీసులు తెగ ఆశ్యర్యపోయారు. ఈ భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశామన్నారు. పట్టుబడిన రూ.1.5 కోట్ల నగదును ఏదైనా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారా లేదా ఎన్నికల్లో మనీలాండరింగ్‌కు సంబంధించినదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు యశోధర నగర్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతనిని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.అనుమానితుడు స్కూటర్ ట్రంక్‌లో దాచిన రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, దీంతో తమకు అతనిపై అనుమానం పెరిగిందని పోలీసులు తెలిపారు. కాగా మహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు -
మహాయుతికి ఉల్లిమంట
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిలో భాగమైన అధికార పార్టీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఓ పక్క పెరుగుతున్న ధరలతో సామాన్యులు అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు గక్కుతున్నారు. ఎగుమతులపై నిషేధంతో తమకు గిట్టుబాటు తగ్గిందని రైతులు సైతం గగ్గోలు పెడుతుండటం మహాయుతి కూటమికి సంకటంగా మారింది.దేశీయ అవసరాలకు అవసరమైన ఉల్లిలో 40 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుండగా, ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్ మార్కెట్లకు తరలివస్తున్న ఉల్లి సరకు పరిమాణం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఉల్లిసీజన్లో ప్రతి రోజూ దాదాపు 2,000 టన్నుల ఉల్లి మార్కెట్‌వ వచ్చింది. అది ప్రస్తుతం 300–400 టన్నుల మధ్య తచ్చాడుతోంది. దీనికి తోడు గత రబీలో సేకరించి పెట్టిన ఉల్లి నిల్వలు పూర్తిగా అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో రూ.40–50 నుంచి రూ.90–100కి ఎగబాకింది. దీని ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా పడుతుందని ముందే పసిగట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రంగంలోకి దిగింది. ధర మరీ పెరిగిపోకుండా కట్టడిచేసేందుకు 4.7లక్షల టన్నుల బఫర్ నిల్వలోంచి 1.50లక్షల టన్నుల మేర విడుదలచేసింది. దీంతో నాసిక్ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని విక్రయ కేంద్రాల్లోకి ఉల్లి సరఫరా సాధ్యమైంది. వీటిల్లో కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. అయినాసరే ధరల పెరుగుదల ఆగడం లేదు. ‘గత రబీ సీజన్‌లోని పాత స్టాక్ దాదాపు అయిపోయింది. కొత్త స్టాక్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ సరఫరా–డిమాండ్ అసమతుల్యత ధర పెరుగుదలకు కారణం. దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ధరల ఉరవడిపై మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు షిండే సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఎగుమతుల నిషేధంపై రైతుల్లో ఆగ్రహం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో డిసెంబర్ 2023 వరకు ఉన్న ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రప్రభుత్వం 2024 మార్చినెల వరకు పొడిగించింది. దీనికి తోడు ఎగమతి సుంకాలను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎగుమతి ఆంక్షలు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని మహారాష్ట్ర రైతుల ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సాగు అధికంగాఉండే ధూలే, దిండోరి, అహ్మద్‌నగర్, పుణె, నాసిక్‌లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎగుమతులను నిషేధించిన కేంద్రం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ నుంచి మాత్రం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కారణంగానే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో మహాయుతి కూటమి ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు వెలువడ్డాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి పేలవ ప్రదర్శన వెనుక ఉల్లి రైతుల ఆగ్రహం ఉందని అంగీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రలోని ఉల్లి రైతుల కంటే గుజరాత్‌లోని ఉల్లి రైతుల గురించే పట్టించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి మంట నుంచి బయట పడేందుకు పాలక కూటమి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఎన్నికల్లో సామాన్యులు, రైతుల సానుకూల, ప్రతికూల ఓటింగ్ సరళి ఆధారపడిఉంటుందని తెలుస్తోంది. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్‌కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
‘మహా’ ఎన్నికలు: బీజేపీపై నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఓబీసీ కమ్యూనిటీ విషయంలో బీజేపీ పార్టీ నేతలు కుక్కలా వ్యవహరిస్తారని మండిమండ్డారు. ఓబీసీలంతా తామేంటో బీజేపీకి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆయన అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘బీజేపీ నేతుతు తమను తాము ‘దేవుళ్లుగా’గా భావిస్తున్నారు. మిమ్మల్నీ కుక్కలుగా భావించే.. బీజేపీకి అకోలా జిల్లా ఓబీసీ ప్రజలు ఓటేస్తారా?. ఇప్పుడు బీజేపీని మీరు(ప్రజులు) కుక్కలా చేసే సమయం వచ్చింది. మహారాష్ట్ర నుంచి బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా విశ్వగురువుగా భావించుకుంటారు. బీజేపీ నేత ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారు’’ అని మండిపడ్డారు. -
మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ హామీలు
-
Maharashtra Assembly elections 2024: కులగణన, రుణమాఫీ
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే కులగణన ప్రారంభిస్తామని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) హామీ ఇచి్చంది. 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో రెండు ఐచి్ఛక సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ‘మహారాష్ట్రనామ’ పేరిట ఎంవీఏ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేకంగా సాధికారత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిశు సంక్షేమం కోసం డెడికేటెడ్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున ధరతో ప్రతిఏటా ఆరు వంట గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంవీఏ మేనిఫెస్టోలోని కీలక అంశాలు...→ రూ.3 లక్షల దాకా రైతు రుణమాఫీ. రుణాలు సక్రమంగా చెల్లించేవారికి రూ.50 వేల ప్రోత్సాహకం → 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ → బాలికలకు ఏటా రూ.లక్ష నగదు→ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని వితంతువులు, చిన్నారులకు ఆర్థిక సాయం → యువత సంక్షేమానికి కమిషన్. డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి → నూతన ఇండ్రస్టియల్ పాలసీ. ఎంఎస్ఎంఈ శాఖ.→ అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కార్పొరేషన్ → నిత్యావసరాల ధరల నియంత్రణ→ నెలకు 300 యూనిట్ల దాకా విద్యుత్‌పై 100 యూనిట్ల రుసుం మాఫీ → ప్రభుత్వోద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ విధానంకుల గణనపై బీజేపీ నేతలది తప్పుడు ప్రచారం: ఖర్గేపలు సామాజికవర్గాల స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవడానికే కులగణన తప్ప సమాజాన్ని కులాలవారీగా విభజించడానికి కాదని ఖర్గే చెప్పారు. ఆ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేయాల్సిన విధానాల రూపకల్పనకు ఆ డేటా తోడ్పడుతుందన్నారు. కులగణనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదని, అర్బన్ నక్సలైట్లకు ప్రతీక అని మోదీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేని మోదీని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాలని ఎద్దేవా చేశారు. 2017 జూలై 16న ఇలాంటి రాజ్యాంగ ప్రతినే అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ అందజేశారన్నారు. చదవండి: మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే.. -
మహా ఎన్నికలు: ‘నన్ను గెలిపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు జరిపిస్తా’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024 దేశ్‌ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆరోపణలు చేశారు.చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ -
మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ మేనిఫెస్టో విడుదల
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార కూటమి ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించడానికి కొల్హాపూర్‌లో నిర్వహించిన మహాయుతి ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం ప్రకటించిన పది హామీల్లో ఈ హామీలు ఉన్నాయి. వరి రైతులకు హెక్టారుకు రూ. 25,000 బోనస్, వ్యవసాయ రుణాల మాఫీ, లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక ప్రయోజనాన్ని రూ.1,500 నుండి రూ.2,100కి పెంపు. 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి హామీలు ఇచ్చారు.राष्ट्रवादी काँग्रेस पार्टी घोषणापत्र प्रकाशनाचे थेट प्रक्षेपण https://t.co/aOTUc1UcyS— Ajit Pawar (@AjitPawarSpeaks) November 6, 2024 బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. ‘లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది’ అని అన్నారు. -
అలా అయితే.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: మహారాష్ట్ర సీఎం
ముంబై: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'లడ్కీ బహిన్ యోజన' పథకానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే తప్పుపట్టారు. ఈ పథకం నేరమైతే.. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘లడ్కీ బహిన్ (ప్రియమైన సోదరీమణులు) కోసం నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. లడ్కీ బహిన్ యోజనను నిలిపివేయాలని ఒత్తిడి చేస్తున్న మహా వికాస్ అఘాడీని ఓడించడానికి శివసేన, మహాయుతికి మహిళలంతా మద్దతు ఇవ్వాలి. ప్రియమైన సోదరీమణులు లడ్కీ బహిన్ యోజన కింద ప్రతి నెల రూ.1,500 పొందుతారు. లడ్కీ బహిన్ యోజనను మూసివేయాలని ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోంది.ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్ల వద్దకు వస్తే.. లడ్కీ బహిన్ యోజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నిలదీయండి...ఆ పథకాన్ని ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని అడగండి. ఇది సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మీ వద్దకు ఎవరు వచ్చినా.. లడ్కీ బహిన్ యోజనను వ్యతిరేకించే వారికి మీరేంటో చూపించండి. అసెంబ్లీ ఎన్నికల్లో లడ్కీ బహిన్ యోజన, ఇతర సంక్షేమ పథకాలను ఆపేయాలనుకువారికి వారికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీస్తారని శివసేన(యూబీటీ) అసత్య ప్రచారం చేస్తోంది’’ అని అన్నారు. -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’
ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్‌ను అనుకరించారు. శరద్ పవార్ ప్రసంగిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు....నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్‌కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్‌కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్ పవార్ పైవ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వటం గమనార్హం.చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్ -
మహారాష్ట్రలో "మహా" సమరం .. బీజేపీ మూడో జాబితా విడుదల
-
సమతా పథంలో సాగాలంటే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది. నిజానికి ఆర్ఎస్ఎస్కు, విశ్వహిందూ పరిషత్‌కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్‌లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే. ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది. ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్ఎస్ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది. అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు. ఆయన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
షోలాపూర్ సీటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ‘షోలాపూర్ సౌత్’ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే.. మహా వికాస్ అఘాడి (MVA)కి సమస్యలను సృష్టించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాబితాలో షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దిలీప్ మానేను ప్రకటించింది. మేము ఇప్పటికే అదే స్థానం నుంచి మా పార్టీ తరఫున అమర్ పాటిల్‌ను బరిలోకి దింపాం. అయితే.. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో టైపింగ్ పొరపాటుగా భావిస్తున్నా. .. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాటు జరగొచ్చు. మా సీటు షేరింగ్ ఫార్ములాలో భాగమైన మిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విన్నా. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే.. అది ఎంవీకే సమస్యలను సృష్టించినట్లు అవుతుంది’ అని అన్నారు.ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడంపై రౌత్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ముంబైలో మరో సీటు అడుగుతోంది. సాధారణంగా ముంబైలో శివసేన(యూబీటీ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు.. షోలాపూర్ సౌత్ స్థానంలో పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మేము దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇక.. రేపటితో నామినేషన్ల దాఖలు అంశం ముగుస్తుంది’’ అని అన్నారు.నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 200కు పైగా స్థానాలకు అభ్యర్థులను ఎంవీఏ కూటమి ప్రకటించింది. అయితే.. శివసేన (యూబీటీ ), కాంగ్రెస్ పార్టీ మధ్య కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం గమనార్హం.చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
మహా సంగ్రామంలో విజేతగా నిలిచేదెవరు ?
-
థాక్రే వర్గానిదే ‘అంధేరీ’.. కానీ, ఇక్కడో సర్ప్రైజ్ఉంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్ప్రైజ్గా చెప్పాలి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్‌గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు -
ఎన్నికల వేళ ఉల్లిబాంబ్
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి ఉల్లిబాంబు పేలింది. కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజధాని ఢిల్లీ, ముంబైలలో కేజీ 80 రూపాయలు దాటేసింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుల వరకు ఉల్లి లేనిదే ముద్ద దిగని కుటుంబాలే ఎక్కువ. ఎన్నికల సమయంలో ఉల్లి ధర పెరిగిదంటే ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనల్ని గతంలో చూశాం. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండడంతో తమ అధికార పీఠం ఎక్కడ కూలిపోతోందన్న ఆందోళనతో కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ధరకు కళ్లెం వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి ? ►ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది. ►కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో తక్షణమే 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ►కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్ డైయిరీ సఫాల్ ఔట్లెట్స్ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది. ►కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్‌చేశారు. ఉల్లి కావాలన్న రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్‌చేస్తోంది. వీటిని ఆయారాష్ట్రాలు రూ. 24కి అమ్ముతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే సప్లయ్ చేస్తున్నారు. నవంబర్ నాటికి కొత్తవి మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా. అయితే అక్టోబర్‌లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉల్లి ధరని దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ధర ఎందుకు పెరుగుతోంది? ఉల్లి పంట ఎక్కువగా పండే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ధర ఆకాశాన్నంటింది. పండగ సీజన్ వస్తూ ఉండడంతో కొందరు దళారులు కావాలనే స్టాక్‌ని దాచేసి కృత్రిమ కొరతను సృష్టించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ, ముంబై మార్కెట్లలో ఉల్లి ధర కేజీ రూ.70–80 పలికింది. నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ సీజన్లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువ. -
విపక్షాలకు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ విపక్షాలకు మరోసారి షాక్ ఇవ్వనుంది. ప్రముఖ నటి, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్‌కౌర్ రానా, ఆమె భర్త యువ స్వాభిమాన్ పార్టీ అధ్యక్షుడు రవిరాణా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన రవిరాణా దంపతులు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో నవనీత్ కౌర్ రానా అమరావతి నుంచి గెలిచారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బీజేపీలో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. వారి చేరికలు కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల నాయకులైన రాధాకృష్ణ పాటిల్, జయదూత్లు బీజేపీలో చేరి మంత్రి పదవులు పొందారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతుండటం గమనార్హం. రవిరాణా తమ పార్టీలోకి వస్తే తూర్పు విదర్భ ప్రాంతంలో పార్టీ బలం పెరుగుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రవిరాణా మాత్రం అమరావతికి ఎయిర్పోర్ట్, మహిళలకు స్వతంత్ర పోలీస్ స్టేషన్ల నిర్మాణం కోసమే కలిశానని చెప్పారు. -
మహారాష్ట్రలో మజ్లిస్–బీబీఎం పొత్తు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం, భరిపా బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ రెండు పార్టీలు 2019లో జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం వెల్లడించారు. బీబీఎం అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ అక్టోబర్ 2న ఔరంగాబాద్‌లో నిర్వహించే ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఆ ర్యాలీలో సంకీర్ణ కూటమి గురించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
‘మహా’ అసెంబ్లీలో కరెంటు పోయింది!
నాగ్‌పూర్: భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ అంతరాయం కలగడంతో శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ స్తంభించింది. సభ ప్రారంభం కాకముందే సభను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో పాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం శాసన సభ, మండలి ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో చీకటి అలుముకోవడంతో ఒక రోజుకు వాయిదా పడింది. గురువారం రాత్రి నాగ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అసెంబ్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు మాట్లాడాలని భావించినా విద్యుత్ లేకపోవడంతో మైకులు పనిచేయలేదు. మరమ్మతులు జరుగుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగ్దే సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని పార్టీల సభ్యులతో సమావేశమై ఒక రోజుకు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘నగరంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడింది. అయితే గురువారం రాత్రి మాత్రం భారీగా వర్షం పడింది. విద్యుత్ సరఫరా చేసే విభాగం సెల్లార్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా వర్షపు నీరు చేరింది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది’అని చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహించారు. -
సింహం, పులి కలిసే పోటీ: సీఎం
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎలుకల గురించి బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలిలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. మండలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సింహం, పులి కలిసి 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పరోక్షంగా బీజేపీ- శివసేన బంధం గురించి పేర్కొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్.. సచివాలయంలో ఎలుకలు ఉన్నాయన్న ఏక్నాథ్ ఖడ్సే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘ఎలుకలన్నీ కలిసి బీజేపీని సింహాసనం నుంచి కూలదోస్తాయి అంటూ ఎద్దేవా చేశారు. దీనికి స్పందనగా సీఎం మాట్లాడుతూ.. ‘పులి(శివసేన గుర్తు), సింహం కలిసే ఉన్నాయి. ఎలుకలు మమ్మల్ని ఏమీ చేయలేవు. సింహం, పులి కలిసి ఎలుకల్ని నాశనం చేస్తాయంటూ’ ధీటుగా బదులిచ్చారు. స్పందించిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘మాకు పులి గురించి తెలుసుగానీ, సింహం ఎవరనేదీ తెలియడం లేదంటూ’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘ఎలుకలు మీకు దారి ఇవ్వచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో జంతువులకు వాటి స్ధానాన్ని తప్పక తెలియజేస్తార’ని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలను వీకే పాటిల్ ఉటంకిస్తూ.. ‘సింహం, పులిల మధ్య ఉన్న ప్రేమానురాగాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి బంధం ఎంతటి బలమైందో కూడా వారికి తెలుసు అంటూ’ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపుతూ.. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు కాంట్రాక్ట్ సంస్థ చెప్పిందని గుర్తు చేశారు. వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందనీ, కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చర్చలేవనెత్తిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీలో 60 మంది మద్యం ప్రియులు!
సాక్షి, ముంబై : నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనారోగ్యంతో వైద్యం పొందిన ప్రముఖుల్లో 60 మంది అతిగా మద్యం సేవించడంవల్ల వారి ఆరోగ్యం పాడైనట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. దీంతో నాయకుల క్వార్టర్స్‌లో మద్యం నిషేధం అమలులో ఉన్నప్పటికీ మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమవుతోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మహారాష్ట్రకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల నాయకులు నాగ్‌పూర్‌లో తిష్ట వేస్తారు. వీరితోపాటు ముంబై, వివిధ ప్రాంతాల నుంచి సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అత్యవసర సమయంలో లేదా వీరు అనారోగ్యానికిగురైతే వైద్యం అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం, ఎమ్మెల్యే క్వార్టర్స్, రవీ భవన్ ఇలా మూడు చోట్ల వైద్య కేంద్రాలు (క్లినిక్‌లు) అందుబాటులో ఉంచుతారు. అందుకు 48 మంది వైద్యులు విధులు నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో (కేవలం రెండు వారాల్లోనే) ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు కార్యదర్శులు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం 7,016 మంది వివిధ వైద్య సేవలు పొందారు. అందులో 60 మంది అతిగా మద్యం సేవించడం వల్లే అనారోగ్యానికి గురైనట్టు రక్త, మూత్ర పరీక్ష నివేదికలో బయటపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసముంటున్న రవీ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మద్యపాణ నిషేధం అమలులో ఉంది. అయినా అక్కడికి మద్యం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. సమావేశాలు ముగిసిన తరువాత వీరు బయట మద్యం సేవించారా..? లేక ఏకంగా గదిలోకే మద్యం తీసుకొచ్చారా...? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
పగలు, రాత్రి అనే తేడా లేకుండా షాపింగ్!
సాక్షి ముంబై: పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా తినవచ్చు, కొనవచ్చు. మహారాష్ట్ర వ్యాప్తంగా షాపులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలపాటు తెరిచే ఉండనున్నాయి. రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు 24 గంటలపాటు తెరిచి ఉండేలా చట్టంలో మార్పు చేసిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. దీంతో ఇకపై రోజంతా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. కాని కొన్ని షరతులతో ఈ బిల్లును ఆమోదించారు. ఒకవేళ 24 గంటలపాటు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచాలనుకునేవారు కచ్చితంగా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. మరోవైపు 50 మందికిపైగా మహిళలు ఉద్యోగాలు చేసే షాపింగ్ మాల్, రెస్టారెంట్లలో యజమాని తప్పనిసరిగా చైల్డ్ కేర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 100 మందికిపైగా సిబ్బంది ఉండే హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లలో క్యాంటీన్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. నైట్ షిప్లో పనిచేసే మహిళలను సురక్షితంగా ఇంటి చేర్చే బాధ్యత యజమానిదేనని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి షాపులో తప్పనిసరిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలతో 24 గంటలపాటు షాపులు, మాల్స్ తదితరాలు తెరిచిఉంచే అవకాశం ఏర్పడింది. -
19 మంది ఎమ్మెల్యేలపై వేటు
ముంబై: మహారాష్ట్ర శాసనసభలో గలాభా సృష్టించిన విపక్ష ఎమ్మెల్యేలపై వేటు పడింది. 19 మంది ఎమ్మెల్యేలను 9 నెలల పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగాడే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31 వరకు సభలో అడుగుపెట్టకుండా సస్పెండ్ చేశారు. ఈ నెల 18న శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ప్రతులు చదువుతున్న సమయంలో మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగకుండా బడ్జెట్ ప్రసంగం వినపడకుండా గట్టిగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల వ్యవహారశైలిని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించారని మండిపడ్డారు. విపక్ష సభ్యుల క్రమశిక్షణారాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ వారిపై వేటు వేశారు. -
కన్హయ్య కుమార్ ఏమైనా ఉగ్రవాదా..?
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సభలోకి కన్హయ్యను అనుమతించకపోవడానికి అతనేమైనా ఉగ్రవాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నదీన్ ఖాన్ విమర్శించారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నదీన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కన్హయ్య ఉగ్రవాది కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ కార్యకలాపాలను వీక్షించవచ్చని చెప్పారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కన్హయ్యకు పాస్ ఉందని, అతన్ని అనుమతించకపోవడానికి తగిన కారణంలేదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ బగడే స్పందిస్తూ.. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ కన్హయ్యను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. కన్హయ్యను అడ్డుకున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న విద్యార్థి సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య ముంబై వచ్చాడు. ఈ విషయంపై కన్హయ్య స్పందిస్తూ.. విధాన సభ కార్యకలాపాలు చూడాలని కోరానని, ప్రత్యేకించి సభలో విదర్భపై జరిగే చర్చ వినాలనుకున్నానని, అయితే తనను అనుమతించలేదని చెప్పాడు. -
మహారాష్ట్రలో ‘ద్రవ్య’ బిల్లుపై డివిజన్
2014 ఏప్రిల్ 16న మహారాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును కేవలం మూజువాణి ఓటుతోనే సరిపెట్టాలని, డివిజన్ (అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను స్పష్టంగా నిర్ధారించడానికి వీలుగా సభలో నిర్వహించే ఓటింగ్ ప్రక్రియ)కు అవకాశం లేదంటూ ఏపీ శాసనసభలో బుధవారం అధికార పక్షం చేసిన వాదనలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ బిల్లుపై డివిజన్‌కు అవకాశం కల్పిం చడం.. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర శాసనసభలో నూ జరగలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన దాంట్లోనూ నిజం లేదని తేలింది. 2014 ఏప్రిల్ 15న మహారాష్ట్ర శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపిన తర్వాత.. అప్పటి ప్రతిపక్షం (బీజేపీ, శివసేన) డివిజన్ కోరింది. అప్పటి స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్.. ప్రతిపక్షం డిమాండ్ కు సానుకూలంగా స్పందించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌కు అంగీకరించారు. బిల్లుకు అనుకూలంగా 105, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. బిల్లుకు ఆమో దం లభించిందని స్పీకర్ ప్రకటించారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీలకతీతంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సౌత్ ముంబైలోని బైకుల్లా స్థానం నుంచి గెలిచిన పఠాన్‌పై సస్పెన్షన్ వేటు ప్రస్తుత బడ్జెట్ సెషన్స్ అయ్యే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ‘‘జాతీయ నాయకులను అగౌరవ పరచడంతో పాటు ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు పఠాన్ నిరాకరించారు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గిరీష్ బపత్ చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఔరంగాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది. ‘‘ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ‘గొప్ప వ్యక్తుల’ స్మారక చిహ్నాలు కట్టడానికి వెచ్చించడం ప్రభుత్వానికి తగదు’’ అని జలీల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ శివసేన ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘జలీల్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అనేది లేదని ఇటీవల వ్యాఖ్యానించారు’ అని గుర్తు చేశారు. పఠాన్ కలుగజేసుకుని... ‘‘మేం ‘జైహింద్’ అంటాం కానీ ‘భారత్ మాతాకీ జై’ అనం. కచ్చితంగా ఈ నినాదం చెప్పాలని చట్టంలో ఎక్కడా లేదు’’ అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన అధికార బీజేపీ, శివసేనతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పఠాన్‌ను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో హోంమంత్రి రంజిత్ పాటిల్ పఠాన్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘వాక్స్వాతంత్య్రాన్ని పఠాన్ దుర్వినియోగపరిచారు. సభ సంప్రదాయాన్ని మంటగలిపారు’ అని పాటిల్ చెప్పారు. మజ్లిస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన ఒవైసీ అన్నారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్ఎస్ జమ్మూ: ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం తాను చేయనన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. భారత్‌ను తమ మాతృభూమిగా భావించనివారు దేశం వదిలి వెళ్లిపోవాలని సూచించింది. ‘ఒవైసీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాతృభూమికి గౌరవం ఇవ్వనివారు దేశం వదిలి తమకు నచ్చిన చోటుకి వెళ్లవచ్చు. ఇలాంటి వారు పార్లమెంట్‌కు ఎన్నికవడం దురదృష్టకరం. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆర్ఎస్ఎస్ జమ్మూ కశ్మీర్ ప్రాంత్ సంగ్ చాలక్ బ్రిగ్ సుచెట్ సింగ్ అన్నారు. ‘తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అని అనను’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనిలా స్పందించారు. -
'అలా అని కలలో కూడా అనుకోను'
ముంబై: దేశం పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎవరి దేశభక్తినైనా ఒక్క నినాదంతోనే ఎలా అంచనా వేస్తారని ఆయన ప్రశ్నించారు. జై హింద్, జై భారత్, జై మహారాష్ట్ర అంటేనే ప్రేమ ఉన్నట్టా అని అడిగారు. తాను ఇక్కడే పుట్టానని, తుదిశ్వాస వరకు ఇండియాలోనే ఉంటానని స్పష్టం చేశారు. మాతృదేశాన్ని అవమానించాలని కలలో కూడా అనుకోనని పేర్కొన్నారు. అసెంబ్లీలో 'భారత్ మాతాకి జై' అని నినదించేందుకు పఠాన్ నిరాకరించడంతో ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించారు. -
మహారాష్ట్ర సర్కారులోకి శివసేన
మంత్రులుగా పది మంది ప్రమాణం బీజేపీ తరఫున మరో పది మంది మంత్రుల ప్రమాణం 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-సేన ప్రభుత్వం సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ముందు నుంచి బీజేపీ-శివసేన పార్టీల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకున్న రెండు పార్టీలు తిరిగి ఒక్కటయ్యాయి. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో శివసేన భాగస్వామిగా చేరింది. శివసేన తరఫు నుంచి ఐదుగురు కేబినెట్ మంత్రులుగా, మరో ఐదుగురు సహాయ హోదాతో మొత్తం పది మందికి మంత్రులుగా అవకాశం లభించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-శివసేన నేతృత్వంలోని కాషాయ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయింది. మరో విశేషం ఏమిటంటే ప్రతిపక్ష హోదాలోని పార్టీ ప్రభుత్వంలో చేరడం, అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల సమయంలో కావడం గమనార్హం. మహారాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ, శివసేన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సమక్షంలో ఆ రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు మొత్తం 20 మందితో మంత్రులుగా ప్రమాణం చేయిం చారు. ఇందులో కేబినెట్ మంత్రులుగా బీజేపీ తరఫున గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, చంద్రశేఖర్ బావన్కులే, బబన్‌రావ్ లోణికార్, రాజ్‌కుమార్ బడోలేతో పాటు శివసేన తరఫున దివాకర్ రావుతే, సుభాష్ దేశాయ్, రాందాస్ కదం, ఏక్నాథ్ షిండే, దీపక్ సావంత్ ప్రమాణం చేశారు. సహాయ మంత్రులుగా బీజేపీ తరఫున రామ్ షిండే, విజయ్‌కుమార్ దేశ్‌ముఖ్, అంబరీష్ రాజే ఆత్రాం, రంజిత్ పాటిల్, ప్రవీణ్ పోటే, శివసేన తరఫున సంజయ్ రాఠోడ్, దాదాజీ భుసే, విజయ్ శివ్‌తారే, దీపక్ కేసర్కర్, రవీంద్ర వాయ్‌కర్ ప్రమాణం చేశారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ, శివసేన మినహా మిత్రపక్షాలైన ఆర్పీఐ, శివ్‌సంగ్రామ్ పార్టీలకు అవకాశమివ్వలేదు. దీంతో వారు కొంత అసంతృప్తికి గురైనట్లు గుర్తించిన ఫడ్నవిస్.. త్వరలో జరిగే రెండో విడత విస్తరణలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
‘బలనిరూపణ’పై మరో పిటిషన్ దాఖలు
ముంబై: గత వారం జరిగిన ‘బలపరీక్ష’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోని బీజేపీ మైనారిటీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఇప్పటివరకు ఈ విషయమై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. కేతన్ తిరోడ్కర్, రాజ్‌కుమార్ అవస్తి అనే ఇద్దరు వ్యక్తులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్షనాడు బీజేపీ సర్కారు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించిందని వారు తమ పిటిషన్లో ఆరోపించారు. ఓటింగ్ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలైన శివసేన, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసినా స్పీకర్ ఏమాత్రం పట్టించుకోకుండా మూజివాణి ఓటుతో ప్రభుత్వం బలపరీక్ష నెగ్గిందని ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్, సీఎంల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కేతన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 288 కాగా, బీజేపీ ప్రభుత్వానికి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా, ఆ పార్టీకి 122 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 23 మంది సభ్యుల మద్దతుకు గాను ఆ పార్టీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీపై ఆధారపడాల్సి వచ్చింది. చిన్నచిన్న పార్టీలు, స్వతంత్రులను కలుపుకుపోదామన్నా వారి బలం తగినంత లేదు. -
మహారాష్ట్ర గవర్నర్‌పై దాడి
* అసెంబ్లీలోకి రాకుండా విద్యాసాగర్‌రావును అడ్డుకున్న విపక్షాలు * తోపులాటలో గవర్నర్ చేతికి స్వల్ప గాయాలు * ఐదుగురు కాంగ్రెస్ సభ్యులపై రెండేళ్లపాటు సస్పెన్షన్ * విశ్వాసపరీక్షలో మూజువాణి ఓటుతో నెగ్గిన బీజేపీ సర్కార్ సాక్షి, ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుపై బుధవారం దాడి జరిగింది. అసెంబ్లీలో జరిగిన తోపులాటలో గవర్నర్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా జరిగిన విశ్వాసపరీక్షలో మూజువాణి ఓటుతో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గట్టెక్కింది. అయితే సర్కారు వ్యవహరించిన తీరుపై విపక్ష శివసేన, కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీ అట్టుడికింది. మరోవైపు గవర్నర్‌పై దాడికి కారణమైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు అంతకుముందు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ర్ట కొత్త సర్కారు ఒడ్డునపడింది. తొలుత సభ విశ్వాసాన్ని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ శేలార్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శివసేన, కాంగ్రెస్ డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టినా మూజువాణి ఓటుతోనే తీర్మానానికి ఆమోదం లభించినట్లు స్పీకర్ హరిభావ్ బాగ్డే ప్రకటించారు. దీంతో శివసేన సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. పోడియంలోకి దూసుకెళ్లి.. డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టారు. వీరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తోడయ్యారు. మూజువాణి ఓటుతో విశ్వాసపరీక్షను నెగ్గి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ సర్కారు ఖూనీ చేసిందని ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు. దీనికి సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ.. ప్రతిపక్షమైనంత మాత్రాన ప్రతి విషయాన్నీ వ్యతిరేకించకూడదని, ప్రజాక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలపాలని సూచించారు. మరోవైపు బీజేపీ సర్కారుకు బయటినుంచి మద్దతు ప్రకటించిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. సభలో గొడవ జరుగుతున్నంతసేపూ తమ సీట్లోనే కదలకుండా కూర్చున్నారు. విపక్షాల ఆందోళనతో సభ కొంతసేపు వాయిదా పడింది. నిజానికి డివిజన్ ఓటింగ్ పెట్టినప్పటికీ ప్రభుత్వం సులభంగానే నెగ్గేది. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, మిత్రపక్షం ఆర్ఎస్పీకి ఒక ఎమ్మెల్యే, ఎన్సీపీకి 41 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు స్వతంత్రులు, చిన్నపార్టీలకు చెందిన పలువురి మద్దతు ఉంది. గవర్నర్ వద్దకు వెళతాం: శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని విపక్షాలు వెల్లడించాయి. మళ్లీ ఓటింగ్ నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు తెలిపాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో దీన్ని బ్లాక్ డేగా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ అభివర్ణించారు. డివిజన్ ద్వారా మెజారిటీని నిరూపించుకునే వరకు ఈ ప్రభుత్వం అక్రమంగా కొనసాగుతున్నట్టే భావిస్తామన్నారు. మైనారిటీ ప్రభుత్వం డివిజన్ ద్వారానే బలాన్ని నిరూపించుకోవాలని రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్‌రావు థాక్రే అన్నారు. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ మద్దతుదారులైన 40 మంది ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్షలో సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసేవారని శివసేన ఎమ్మెల్యే రాందాస్ కదం పేర్కొన్నారు. అందుకే ముందస్తు వ్యూహం ప్రకారమే మూజువాణి ఓటుతో ప్రభుత్వం బయటపడిందని విమర్శించారు. ధైర్యముంటే మరోసారి విశ్వాస పరీక్ష నిర్వహించి మెజారిటీ రుజువు చేసుకోవాలని సవాల్‌విసిరారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వా స తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై ఇతర పక్షాలతో చర్చిస్తామని కూడా రాందాస్‌తో పాటు, కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ తెలిపారు. అయితే డివిజన్ ఓటింగ్ డిమాండ్‌ను విపక్షాలు ఆలస్యంగా తనముందుకు తెచ్చాయంటూ.. స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గవర్నర్ రాకతో తోపులాట విశ్వాసపరీక్ష తర్వాత ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ విద్యాసాగర్‌రావు అసెంబ్లీ ప్రాంగణానికి రావడంతో ప్రతిపక్షాలు ఆయనకు అడ్డుకున్నాయి. సభలోకి ప్రవేశించకుండా అసెంబ్లీ మెట్ల వద్దే పలువురు సభ్యులు భైఠాయించారు. మరికొందరు ఆయన కారును అడ్డుకున్నారు. విద్యాసాగర్‌రావు చలే జావ్ అంటూ శివసేన ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కారు దిగి లోపలికి వెళుతుండగా విద్యాసాగర్‌రావును చుట్టుముట్టిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తోపులాటకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తీసుకె ళ్లారు. ఈ పెనుగులాటలో గవర్నర్ చేతికి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను అధికారపక్షం కోరింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయాలని బీజేపీకి చెందిన ఏక్నాథ్ ఖడ్సే ప్రతిపాదించారు. ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఏక్నాథ్ షిండే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కోరారు. అయినా గవర్నర్‌కు గాయాలవడాన్ని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ కాంగ్రెస్ సభ్యులు వీరేంద్ర జగ్తాప్, రాహుల్ బోంద్రే, జైకుమార్ గోరే, అబ్దుల్ సత్తార్, అమర్ కాళేలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. పారదర్శక పాలన అందిస్తాం: గవర్నర్ మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నట్టు ఇటీవలి ఎన్నికల్లో వెలువడ్డ ప్రజాతీర్పే నిదర్శనమని గవర్నర్ విద్యాసాగర్‌రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆర్థిక లోటు, కరెంటు సరఫరా, మౌలిక వసతుల లేమి తదితర ఎన్నో సవాళ్లను రాష్ట్రం ఎదుర్కొంటోందన్నారు. తమ ప్రభుత్వం నిర్ణీత సమయంలో, పారదర్శక రీతిలో ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ సేవల గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. అధికారాలను వికేంద్రీకరించి ప్రజలే కేంద్రంగా పాలన అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా వంద రోజుల్లో తమ ప్రభుత్వం ‘అపాలే సర్కార్’ పేరుతో ఇ-పోర్టల్‌కు రూపకల్పన చేస్తుందన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్రతిపక్షాలు హోరెత్తించాయి. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక విశ్వాసపరీక్షకు ముందు అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నేత హరిభావ్ బాగ్డేను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దమ్ముంటే అవిశ్వాసాన్ని పెట్టండి: ఫడ్నవిస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను అక్రమంగా నెగ్గిందన్న విపక్షాల ఆరోపణను సీఎం ఫఢ్నవిస్ తోసిపుచ్చారు. తీర్మాన ఆమోదంలో నిబంధనలన్నీ పాటించామని విలేకర్లతో అన్నారు. కాంగ్రెస్, శివసేనలు సరైన సమయంలో డివిజన్ ఓటింగ్‌కు డిమాండ్ చేసి ఉంటే అందుకంగీకరించి ఉండేవారిమన్నారు. విపక్షాలకు దుమ్ముంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. తన ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కనుక ఆ తీర్మానాన్ని నెగ్గుతామన్నారు. తన ప్రభుత్వం ఎన్సీపీ మద్దతును నిరాకరించడం కానీ స్వీకరించడం కానీ చేయలేదన్నారు. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రభుత్వం
మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాసపరీక్షలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు నెగ్గింది. విడిగా ఓటింగ్ నిర్వహించాలని, మొత్తం సభ్యుల నుంచి ఓటింగ్ తీసుకోవాలని, విడివిడిగా లెక్కించాలంటూ శివసేన పట్టుబట్టింది. డివిజన్ చేయాల్సిందేనని భీష్మించుకుంది. అందుకు స్పీకర్ హరిభావు బాగ్డే నిరాకరించారు. దాంతో శివసేన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. దాంతో మూజువాణీ ఓటుతో విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ సర్కారు సులభంగా గట్టెక్కేసింది. -
తొలి పరీక్ష నెగ్గిన ఫడ్నవిస్ సర్కారు
మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష శివసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్థి హరిభావు బాగ్డే ఏకగ్రీవంగా స్పీకర్ అయ్యే అవకాశం ఏర్పడింది. ఆయన ఔరంగాబాద్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. తొలుత శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ స్పీకర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే, తర్వాత ఇరుపార్టీలూ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. స్పీకర్ ఎన్నిక వరకు సహకరించినా, విశ్వాస పరీక్షలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన ఎమ్మెల్యేలకు సూచించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తప్ప.. వేరెవరి నుంచి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా ఆమోదించేది లేదని ఠాక్రే కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు. అయితే.. తమకు స్వతంత్రులు, చిన్న పార్టీల సభ్యులతో కలిపి 138 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. ఎన్సీపీ కూడా బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ధీమాగా ఉంది. -
అసెంబ్లీలో బలపరీక్ష రేపే!
మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు తన బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతోంది. బుధవారమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో తనకు ఎంతమంది మద్దతు ఉందో నిరూపించాలి. మొత్తం 289 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 145 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి సొంతంగా 122 మంది, మరో మిత్రపక్షానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఎంతలేదన్నా మరో 22 మంది మద్దతు అవసరం అవుతుంది. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటూ శివసేన లేఖ ఇచ్చినా.. ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని మరో ప్రకటన కూడా చేసింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ బీజేపీ సర్కారుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. మళ్లీ ఎన్నికలు రాకూడదన్న ఉద్దేశంతోనే తాము మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మరెవరు మద్దతిచ్చినా తీసుకుంటామని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. అసెంబ్లీలో బల నిరూపణకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నంలోపే మరాఠా బరిలో ఏం జరిగిందో తెలిసిపోతుంది. -
12న ఫడ్నవీస్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష!
ముంబై: మహారాష్ట్ర సీఎంగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 12వ తేదీన విశ్వాస పరీక్ష ఎదుర్కొవడానికి సిద్ధమవుతున్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొవడానికి 24 స్థానాల దూరంలో ఉంది. ఇదిలా ఉండగా నేటినుంచి మూడు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం ప్రోటెం స్పీకర్ గా జీవ పండు గావిట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాజ్ భవన్ లో మహారాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్ రావు..గావిట్ చేత ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12 వ తేదీ విశ్వాస పరీక్ష అంశానికి సంబంధించి ఫడ్నవీస్ స్పీకర్ అనుమతి కోరతారు. ఇప్పటికే విశ్వాస పరీక్ష అంశంపై బీజేపీ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతిస్తామని 41 మంది సభ్యులున్న ఎన్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. 122 శాసనసభా స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపి మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్‌పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీకి 41 స్థానాలను సాధించాయి. -
ఎమ్మెన్నెస్‌లో బీజేపీ ముసలం
సాక్షి, ముంబై: నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకులు చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెన్నెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వసంత్ గీతే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాసిక్ కార్పొరేషన్‌లోని 18 మంది కార్పొరేటర్లు కూడా గీతే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాసిక్ కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారంలో కొనసాగుతోంది. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం గీతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనతో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాజ్‌ఠాక్రే పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీనుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఎమ్మెన్నెస్‌లో ప్రముఖ నాయకుడైన ప్రవీణ్ దరేకర్ కూడా బీజేపీ బాటలో ఉన్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. తాజాగా గీతే పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినప్పుడు తన పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీని వీడిపోనని ప్రకటించారు. కాని కొద్ది సేపటిలోనే ఆయన బీజేపీతో సంప్రదింపులు జర్పుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, నాసిక్‌లోని అనేక మంది కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యకర్తలు బీజేపీ బాటలో ఉన్నారని బీజేపీ ఉత్తర మహారాష్ట్ర చీఫ్ విజయ్ సానే అన్నారు. ఈ విషయంపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సానే పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన రాజ్ ఠాక్రేతో అనేక మంది కార్యకర్తలు, పదాధికారులు మీకు అండగా మేమున్నామంటూ ఆయనకు మనోధైర్యాన్ని నూరిపోశారు. కాని వారం రోజులైన గడవకముందే వలసలకు సిద్ధం కావడం రాజ్ ఠాక్రేకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కార్పొరేషన్లో ఎన్నెమ్మెస్కు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే బీజేపీకి 18, ఎన్సీపీకి 20, కాంగ్రెస్, 13, శివసేన,ఆర్పీఐ కూటమికి 23 మంది సభ్యులున్నారు. -
పరాజయం వెనుక కుట్ర
సాక్షి, ముంబై: ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం వెనక పెద్ద కుట్ర జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ పనులు దాదాపు పూర్తికావచ్చయని త్వరలో పూర్తి వివరాలు బయటపెడతానని రాజ్ అన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటిరోజు శనివారం అహ్మద్‌నగర్ జిల్లా పాతర్థి తాలూకాలో పర్యటించిన విషయం తెలిసిందే. అనంతరం షిర్డీ సమీపంలో పర్యటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలు అంతర్గత విబేధాలు కావచ్చని తొలుత భావించామని అన్నారు. కాని ఓటమికి- పదాధికారులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని విశ్లేషణలో తేలిందన్నారు. దీని వెనక కుట్ర జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తాము అడ్డుకుంటున్నామని కొన్ని పార్టీలు చేసిన దుష్ర్పచారం చేయడం వల్ల తమ పార్టీ చాలా నష్టపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను మూసివేయాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదన్నారు. ‘రాష్ట్రంలో అనేక రహదారులు బీఓటీ పద్ధతిలో నిర్మించారు.. అందుకు వెచ్చించిన వ్యయాన్ని వాహనదారుల నుంచి వసూలు చేసేందుకు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారని మాకు తెలుసు.. ఒప్పందం ప్రకారం వెచ్చించిన డబ్బులు వసూలైన టోల్‌ప్లాజాలను మాత్రమే ఎత్తివేయాలని మేం డిమాండ్ చేశామ’ని ఆయన అన్నారు. ‘ప్రతీరోజు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి..? వాటి ద్వారా కాంట్రాక్టర్‌కు ఎంత మేర ఆదాయం వస్తుంది..తదితరవివరాలు ఎవరి వద్దా లే వు. ప్రభుత్వం వద్ద కూడా వాటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాష్ లెస్ వ్యవహారాన్ని చేపట్టాల’ని తాముడిమాండ్ చేశామన్నారు. ఈ పద్ధతి ద్వారా రహదారులపై నిత్యం ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి... వాటి ద్వారా ఎంత మేర డబ్బులు వసూలవుతున్నాయి...అవకతవకలేమైనా జరుగుతున్నాయా... ఇలా అనేక వివరాలు బయటపడతాయని ఆయన వివరించారు. దీన్ని బట్టి సంబంధిత కాంట్రాక్టర్‌కు గడువు పెంచివ్వాలా..? వద్దా అనేది నిర్ణయించేందుకు వీలుపడుతుందని తాము భావించామని చెప్పారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ చేపట్టిన ఆందోళనల వల్ల అనేక టోల్ ప్లాజాలను ప్రభుత్వం మూసివేసిందని గుర్తుచేశారు. కొందరు నాయకులు ఈ ఆందోళనను అడ్డుపెట్టుకుని ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేశారని ఆరోపించారు. ఆదాయం లేనిదే అభివృద్ధి పనులు జరగవని, దీన్ని ఎమ్మెన్నెస్ అడ్డుకుంటోందని కొన్ని పార్టీలు పనిగట్టుకుని ప్రచారం చేశాయని, దీని వల్ల తమ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పులి కాస్తా పిల్లి అయింది
అతి విశ్వాసం వమ్మయిన వైనం * సీఎం తానేనన్న ఉద్ధవ్ ఠాక్రేకు భంగపాటు * మోదీ హవాను అంచనా వేయని వైఫల్యం * బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పని దుస్థితికి చేరిన శివసేన సాక్షి, ముంబై: మహారాష్ట్ర 2014 అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాలు బీజేపీ, శివసేనలకు మరచిపోలేని అనుభవాలను ఇచ్చాయి. 2014 ఎన్నికల ముందు వరకు కూడా ఈ రెండు పార్టీల్లో మహారాష్ట్రలో సేనది పైచేయి కాగా.. బీజేపీ జూనియర్ భాగస్వామిగానే ఉంది. కానీ 2014 ఎన్నికల్లో ‘మోదీ హవా’ పరిస్థితులను తారుమారు చేసింది. శివసేన ఊహించని స్థాయిలో మహారాష్ట్రలో బీజేపీ బలపడింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి తానేనని కలలు కన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ప్రస్తుతం వాస్తవాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు, తరువాత ఆయన స్వరంలో మార్పులను కళ్లకు కట్టే కథనం..! పొత్తు చర్చల్లో.. పొత్తు చర్చల సందర్భంగా కూడా శివసేన ఒంటెద్దు పోకడలనే అనుసరించింది. తాము ఇచ్చేవారమే కానీ తీసుకునేవారం కాదంటూ గొప్పలు పోయింది. బీజేపీకి 119 సీట్లకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ ఇవ్వబోమంటూ ఉద్ధవ్ ఠాక్రే మొండిగా వ్యవహరించారు. పోటీకి దిగాక.. పొత్తు చర్చలు విఫలమై.. ఎవరికి వారు పోటీకి దిగిన తరువాత కూడా వ్యూహాత్మకంగా బీజేపీ శివసేనపై ప్రత్యక్ష దాడికి దిగలేదు. ప్రధాని మోదీ కూడా ‘మహా’ ప్రచారంలో బాల్ ఠాక్రేపై తనకున్న గౌరవం దృష్ట్యా శివసేనను విమర్శించబోనన్నారు. కానీ శివసేన మాత్రం బీజేపీ, మోదీలే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. బీజేపీ తమను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించింది. ‘మోదీ హవానే ఉంటే ఆయన ఇక్కడ ఇన్ని సభల్లో ఎందుకు పాల్గొంటున్నారు?’ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం.. ఎన్నికలు జరిగిన రోజు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే హవా అంటూ ప్రకటించడంతో సేన స్వరంలో మార్పు ప్రారంభమైంది. తమ మధ్య శత్రుత్వమేమీ లేదని అక్టోబర్ 17న వ్యాఖ్యానించింది. ‘హృదయాలు పగిలాయి. అవి అతకడం కష్టమే అయినా.. మహారాష్ట్రకు ఇప్పుడు స్థిరత్వం, శాంతి అవసరం’ అంటూ పరోక్షంగా పార్టీ పత్రిక ‘సామ్నా’లో బీజేపీకి స్నేహ హస్తాన్ని చాచింది. ఫలితాలు వెలువడ్డాక.. బీజేపీకి మద్ధతిచ్చేందుకు, ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమయింది. మంత్రిత్వ శాఖల విషయంలోనూ బీజేపీ ఎలాంటి మాటివ్వకపోయినా.. బీజేపీ ఎవరిని సీఎం చేసినా మద్ధతిస్తామంటూ ఏకపక్షంగా ప్రకటించింది. -
శివసేన స్వరం మారిందా?
నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద కారాలు.. మిరియాలు నూరిన శివసేన ఉన్నట్టుండి గొంతు మార్చినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధికార పత్రిక 'సామ్నా'లో సోమవారం ఉదయం రాసిన సంపాదకీయంలో.. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామి కావాలన్న ఆకాంక్షలు స్పష్టంగా కనిపించాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధాన కారకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలేనని అందులో రాశారు. 'మహారాష్ట్ర ప్రయోజనాలు' నెరవేరాలంటే బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే.. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎన్నుకున్నా దానికి శివసేన సరేననేలాగే ఉంది. ఇంతకుముందు సామ్నాలో రాసిన సంపాదకీయాలలో మాత్రం బీజేపీ మీద కారాలు, మిరియాలు నూరారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా స్వరం మార్చడం.. ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో రాసిన సంపాదకీయాల్లో అయితే.. ప్రధాని తీవ్రంగా ప్రచారం చేసినా కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు. తాజా వ్యాసంలో మాత్రం ''రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. -
'మహా'లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ ఇప్పటికే తాను సీఎం పదవికి రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షడు దేవేంద్ర పడ్నవిస్ సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దేవేంద్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదికాక కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎంపిక అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితీన్ గడ్కారీని సీఎంగా ఎంపిక చేయాలని మహారాష్ట్రలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో తాను కేంద్ర మంత్రిగా న్యూఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నానని... తిరిగి ముంబై వచ్చేందుకు అంత సుముఖుంగా లేనట్లు నితీన్ గడ్కారీ గురువారం వెల్లడించారు. అక్టోబర్ 15న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 సీట్లు గల మహారాష్ట అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 146 సీట్లు రావాలన్న విషయం తెలిసిందే. -
దేవేంద్ర ఫడ్నవిస్ కే "మహా" పగ్గాలు
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్?
ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కే ఈ పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకుంది. క్యాంపు రాజకీయాలతో కలకలం రేపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా.. శివసేన ఒత్తిడికి తలొగ్గకుండా పార్టీని విజయపథంలో నడిపించిన ఫడ్నవిస్‌నే ఎంచుకుంది. ఎన్నికలకు ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన పొత్తును శివసేన తెంచుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. దేవేంద్ర ఫడ్నవిస్ చాలా గట్టిగా నిలబడ్డారు. కనీసం 135 స్థానాల్లో పోటీ చేయాల్సిందేనని అధిష్ఠానానికి చెప్పారు. అయితే శివసేన మాత్రం 119 స్థానాలకు మించి ఇచ్చేది లేదని అన్నప్పుడు, అవసరమైతే పొత్తును తెంచుకోవాలని కూడా అధిష్ఠానం దగ్గర ఫడ్నవిస్ వాదించారు. ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన నాయకుడు. సాధారణంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మారాఠ్వాడా ప్రాంత నాయకులదే హవా నడుస్తుంటుంది. ఈసారి ఆ ప్రాంతాన్ని కాదని.. కరువు కాటకాలతో రైతు ఆత్మహత్యలలో ముందున్న విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడికే కమలనాథులు పట్టంగట్టారు. -
అవినీతిపరుల కోసమే సర్కారుకు మద్దతా?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన ఉలిక్కిపడింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తును తెంచుకున్న శివసేన.. తీరా ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అనుకోకుండా ఎన్సీపీ నాయకులు బీజేపీవైపు మొగ్గు చూపడంతో తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీపై శివసేన మండిపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అనేకమంది అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని, అందులో ఎన్సీపీ ముందుందని చెప్పింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 123 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 22 స్థానాలు అవసరం. 41 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీ.. ఫలితాలు రాగానే తాము బేషరతుగా బీజేపీకి మద్దతిస్తామని తెలిపింది. కానీ బీజేపీ ఇంతవరకు దానిపై స్పందించలేదు. శివసేనకు 63 స్థానాలు రావడం, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు ఉండటంతో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు శివసేన పెట్టే షరతులను అంగీకరించొద్దంటూ గట్టిగా పట్టుబట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ లాంటి నాయకులను ముఖ్యమంత్రి చేయడానికి శివసేన ఎంతవరకు అంగీకరిస్తుందన్నది కూడా అనుమానమే. అవసరమైతే స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు తీసుకుని.. అటు శివసేన, ఇటు ఎన్సీపీ రెండు పార్టీల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న వాదనలు సైతం వచ్చాయి. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో.. దీపావళి తర్వాతే ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అప్పటికి అందరూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మహిళా ఎమ్మెల్యేలు 16 మందే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహిళలకు సరైన వాటా దక్కలేదు. మొత్తం 16 మంది మహిళలు మాత్రమే గెలిచారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎన్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. శివసేన, ఎమ్మెన్నెస్‌లకు మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. బీజేపీకి చెందిన ఆ పార్టీ దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ, మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుశ్రీ మిసాల్లు తమ సీట్లలో తిరిగి గెలిచారు. కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం అశోక్ చవాన్ భార్య అమీతా చవాన్ ఉన్నారు. -
‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
* బీజేపీ, శివసేనల మధ్య తొలగని ప్రతిష్టంభన * ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లనున్న కమలనాథులు! * బీజేపీకి మద్దతు నిర్ణయాన్ని సమర్థించుకున్న శరద్ పవార్ ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఎన్సీపీ ఇచ్చే బేషరతు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేక బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది స్పష్టం కావడం లేదు. ఒకప్పటి మిత్రులైన బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన కూడా తొలగలేదు. సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఆ పార్టీ చీఫ్ అమిత్ షాలను అభినందిస్తూ ఫోన్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. శివసేనను సస్పెన్స్‌లో ఉంచి ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశమివ్వాలని కోరాలని కాషాయదళం యోచిస్తోంది. తమది పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అడిగే హక్కు తమకే ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి పదవిని తీసుకునేది తామేననన్నారు. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ ప్రతిపాదనపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇప్పటికైతే చర్చించలేదన్నారు. తాము అన్ని మార్గాలను తెరిచే ఉంచామని బీజేపీ నేత ఓమ్ మాథుర్ చెప్పారు. తద్వారా సేన మద్దతిస్తే తీసుకోవడానికి సిద్ధమేనని చెప్పకనే చెప్పారు. మరోవైపు.. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో చర్చించారు. 288 స్థానాలు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 122, దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్పక్షకు ఒకటి, శివసేనకు 63, కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన145 మేజిక్ మార్కును సాధించాలంటే బీజేపీకి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. శివసేన సస్పెన్స్: మరోపక్క.. కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై తమ శాసనసభాపక్షనేతను ఎన్నుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌కు కట్టబెట్టారు. అయితే బీజేపీతో 25 ఏళ్ల పొత్తు పునరుద్ధరణపై కానీ, బీజేపీకి మద్దతిచ్చే అంశంపై కానీ ఎలాంటి చర్చా జరగలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఉత్తమ ప్రత్యామ్నాయం: పవార్ ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి బయటను నుంచి మద్దతిస్తామని ప్రకటించిన ఎన్సీపీ నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర ప్రధాన పార్టీల సీట్లను చూస్తే సుస్థిర ప్రభుత్వానికి అదే ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన బంధువు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత శరద్ పవార్ వారినుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత ఒకరు తనను ఫోన్లో సూచించారని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే మూడు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 146 కనుక ప్రభుత్వం స్థిరంగా ఉండదని చెప్పాననన్నారు. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేన మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని, వీటికి ఇతర చిన్న పార్టీలూ తోడైతే బీజేపీని అధికారానికి దూరంగా పెట్టగలవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, ‘నేషనలిస్ట్ కరప్ట్ పార్టీ’ అని మోదీ విమర్శించిన ఎన్సీపీతో బీజేపీ ఎలా చేతులు కలుపుతుందని కాంగ్రెస్ నేత రణదీప్ దుయ్యబట్టారు. ముందంజలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం పదవి రేసులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. రద్దుకానున్న అసెంబ్లీలో విపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శాసనమండలి విపక్ష నేత వినోద్ థావ్డే, దివంగత పార్టీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ తదితరుల పేర్లూ చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో అమిత్, మహారాష్ట్రకు చెందిన గడ్కారీతో మంతనాలు జరపడంతో గడ్కారీ కూడా సీఎం రేసులోకి వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను పరిశీలించేందు పార్టీ నేత జేపీ నడ్డాతోపాటు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్ సమావేశం కారణంగా సోమవారం ముంబై వెళ్లలేకపోయారు. -
మహా ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు?
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత స్పష్టమైన ఆధిక్యం రాకపోయినా.. అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన మద్దతు ఇస్తుందో, లేదా ముందే ప్రకటించిన ఎన్సీపీ మద్దతు తీసుకుంటారో.. ఇవన్నీ కావు ఇండిపెండెంట్ల సాయంతోనే గద్దెనెక్కేస్తామని అంటారో గానీ కమలనాథులు తమ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. దాంతో పలువురు ఆశావహుల పేర్లు సీఎం పదవికోసం ముందుకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి తాను వెళ్లేది లేదని పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెబుతున్నా, ఆయన పేరుకూడా ప్రముఖంగా వినపడుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్లమీద కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేరునూ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో వందకు పైగా ర్యాలీలు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన గడ్కరీ... తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదంటున్నారు. మహారాష్ట్ర బీజేపీలో అనుభవజ్ఞుడైన నేతగా మిగతా నేతల మద్దతున్న ఆయన మాత్రం తాను కేంద్రంలోనే ఆనందంగా ఉన్నానని చెబుతున్నారు. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ పేరు కూడా సిఎం రేసులో ప్రముఖంగా వినపడుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ గల యువనేతగా పార్టీ అధిష్టానాన్ని ఆయన ఆకర్షించారు. సీఎం రేసులో వినపడుతున్న మరో పేరు వినోద్ తావ్డే. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టగలిగే చురుకైన యువనేతగా తావ్డే గుర్తింపు తెచ్చుకున్నారు. తావ్డే అభ్యర్ధిత్వాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సారి మహారాష్ట్రకు మహిళా సీఎం రాబోతున్నారంటూ ముంబైలో ఫలితాలకు ముందునుంచే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా పంకజాముండే గురించే. ఇటీవల కన్నుమూసిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ. ఉజ్వల భవిష్యత్తు ఉండీ అకస్మాత్తుగా కన్నుమూసిన బీజేపీ నేత ప్రమోద్ మహాజన్‌కు పంకజ కోడలు. పర్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమెకు ఐదేళ్ల రాజకీయ అనుభవం మాత్రమే ఉంది. కుటుంబ నేపథ్యం ఆధారంగా చూస్తే ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఏ అడ్డంకులూ లేవు. ముండే, మహాజన్‌ల మరణాల నేపథ్యంలో పార్టీ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తే ఆమె అభ్యర్ధిత్వానికి ఎవరూ అడ్డుచెప్పే అవకాశం లేదు. అయితే కుటుంబ నేపథ్యాలకన్నా అనుభవానికే పార్టీ పెద్దలు ప్రాధాన్యతనిస్తే పంకజకు ప్రస్తుతానికి అవకాశం లేనట్లే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సోమవారం సమావేశమై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తేలుస్తుంది. -
బీజేపీ హీరో.. ఎంఎన్ఎస్ జీరో!!
ముంబై మహానగరంలో ఒకప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అంటే.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉండేది. రాజ్ ఠాక్రే స్థాపించిన ఈ పార్టీ.. ముంబై నగరం మరాఠీలకే సొంతం కావాలన్న నినాదంతో ప్రజల్లో వీరాభిమానాన్ని సంపాదించుకున్న ఎంఎన్ఎస్.. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. ముంఖ్యంగా ముంబై మహానగరంలో పూర్తిగా చతికిలబడిపోయింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో అత్యధికంగా 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 14 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ మాత్రం ఈ రెండింటికీ చాలా దూరంగా 5 సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. చివరకు హైదరాబాదీ పార్టీగా పేరొందిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) కూడా అక్కడ బోణీ కొట్టింది గానీ, ఎంఎన్ఎస్ మాత్రం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. ఎంఎన్ఎస్ ఒక్కసారిగా ఇలా చతికిలబడుతుందని వాస్తవానికి ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ముంబై రాజకీయ చిత్రపటం నుంచి అది పూర్తిగా మాయమైపోయింది. ఒకప్పుడు సేవ్రి, మాహిమ్, మగాథానె లాంటి ప్రాంతాలన్నీ ఎంఎన్ఎస్ కంచుకోటలు. కానీ, వాటిలో ఎక్కడా గెలవలేదు. అలాగే బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దారేకర్ లాంటి మహాయోధులు కూడా మట్టికరిచారు. పైగా కేవలం ఓడిపోవడమే కాదు.. వాళ్ల మెజారిటీలలో తేడాలు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు నందగావ్కర్ అయితే తన ప్రత్యర్థి, శివసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కూడా సంపాదించలేకపోయారు. ఒకప్పుడు ఆయన బ్రహ్మాండమైన నాయకుడు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. అలాగే ప్రవీణ్ దారేకర్ అయితే ఏకంగా మూడోస్థానానికి పడిపోయారు. ఒక్క మాహిమ్ నియోజకవర్గంలో మాత్రం అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే సర్దేశాయ్ కాస్త గట్టి పోరాటం చేశారు. ఆయన కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇక్కడి ఓటమి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేకు చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే.. మాహిమ్ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం. శివాజీ పార్కు లాంటి కీలక ప్రాంతాలన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. బాలఠాక్రే కూడా ఇక్కడినుంచే తన ఉత్తేజపూరితమైన ప్రసంగాలు ఇచ్చేవారు. ఆయన మాటలు వింటేనే మరాఠీల రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి స్థానాన్ని కూడా పోగొట్టుకున్న ఎంఎన్ఎస్.. ఇక రాబోయే ఎన్నికల నాటికి ఏమవుతుందోనని అంతా చూస్తున్నారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 288 సీట్లు ఉన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41, ఎంఐఎం 2. రాష్ట్రీయ సమాజ్ పక్ష 1, బహుజన్ వికాస్ ఆఘాదీ 03, పీజెంట్స్ వర్కర్ పార్టీ 3, ఎంఎన్ఎస్ 1, సీపీఐ 1, ఇతరులు 8 సీట్లను గెలుచుకున్నాయి. -
బీజేపీ 'సెంచరీ' రికార్డు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభంజనంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలో 24 ఏళ్ల తర్వాత 100కు పైగా అసెంబ్లీ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు కాంగ్రెస్ పేరిట ఉంది. 1990 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 144 సీట్లు సాధించింది. ఆ తర్వాత జాతీయ పార్టీలు గానీ, ప్రాంతీయ పార్టీలు గాని ఇప్పటివరకు వంద సీట్లు దక్కించుకోలేకపోయాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ 120 పైగా స్థానాలను బీజేపీ కైవశం చేసుకోనుందని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. 2009 కంటే మూడు రెట్లు అధిక స్థానాలను బీజేపీ గెల్చుకోనుండడం విశేషం. మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉన్నాయి. -
'రెండు రాష్ట్రాల్లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న తమ ఎన్నికల ప్రచారం ఫలించిందన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలే విజయం సాధించారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలన తీరుపై ప్రజలు ఆలోచించారన్నారని అమిత్ షా అన్నారు. ఈ రెండు రాష్టాల్లో విజయంతో తిరుగులేని నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారన్నారు. -
మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సంచలన విజయం సాధించింది. హైదరాబాద్‌లోనే బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం మరాఠా గడ్డపై ఊహించని ఫలితాలు నమోదు చేసింది. మూడు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోగా, మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం అభ్యర్థులు వారిష్ యూసుఫ్ పఠాన్ ముంబైలోని బైకులా నియోజకవర్గం నుంచి, ఇంతియాజ్ ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి, అబ్దుల్ గఫార్ ఔరంగాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. నాందేడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి మొయిన్ ఖాన్ ముందంజలో ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 చోట్ల అభ్యర్థులను బరిలో దింపింది. -
నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు
నాసిక్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కషాయ జెండా రెపరెపలాడుతోంది. రాష్టంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) ను బీజేపీ మట్టకరిపింది. ఎమ్మెన్నెస్ సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. ఇక్కడున్న మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. నాసిక్ సెంట్రల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవయాని పరాండే గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెన్నెస్ అభ్యర్థి వసంత్ గీతెపై 28,272 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాసిక్ వెస్ట్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమా మహేష్ హిరాయ్ గెలుపొందారు. మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి బాలాసాహెబ్ సనాప్... నాసిక్ ఈస్ట్ నుంచి విజయం సాధించారు. -
బీజేపీకి మద్దతిస్తాం : ఎన్సీపీ
-
బీజేపీకి మద్దతిస్తాం: ఎన్సీపీ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోపక్క రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. ఈ మేరకు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ తో మైత్రి చెడిపోవడంతో ఈ ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. కాగా ఎన్పీపీ మద్దతు బీజేపీ తీసుకుంటుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సహజ మిత్రపక్షమైన శివసేన వైపే బీజేపీ మొగ్గుచూపే అవకాశముందంటున్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. -
ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో రెండవ స్థానంలో శివసేన, ఆ తర్వాత స్థానాలు వరుసగా కాంగ్రెస్, ఎన్సీపీ నిలిచేలా ఉన్నాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక్కడ రెండవ స్థానంలో ఐఎన్ఎల్డీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇరు రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 55 శివసేన - 29 కాంగ్రెస్ - 25 ఎన్సీపీ - 21 ఇతరులు - 17 గెలుపొందినవారు: అజిత్ పవర్ (ఎన్సీపీ) వైభవ్ నాయక్ (శివసేన) దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) ఓడిపోయినవారు: నారాయణ రాణె (కాంగ్రెస్) హర్యానాలోని మొత్తం 90 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 45 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ - 19 హెచ్జేసీ - 2 ఇతరులు - 6 విజయం సాధించినవారు: భూపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్) -
మహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రముఖులు
హైదరాబాద్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఆధిక్యంలో ఉన్నారు. పర్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి నిలిచిన బీజేపీ అభ్యర్థి, గోపినాథ్ ముండే కుమార్తె పంకజాముండే ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే దక్షిణ కరాడ్‌లో మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), నాగ్‌పూర్‌లో దేవేంద్ర ఫడ్నవిస్ (బీజేపీ), బారమతిలో అజిత్ పవార్ (ఎన్సీపీ), కుడాల్లో మాజీ సీఎం నారాయణరావు రాణెతోపాటు మాజీ మంత్రులు ఆర్ఆర్ పాటిల్, ఛగన్ బుజబల్, అశోక్ చవాన్ భార్య అమృతా చవాన్ కూడా అధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న వారు: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రావూ షాహెబ్ షెకావత్ కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే -
ఓటేయలేదని వృద్ధురాలి సజీవదహనం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీకి ఓటయేనందుకు ఆ పార్టీ అభిమానులు 65 ఏళ్ల వృద్ధురాలిని సజీవదహనం చేశారు. నాసిక్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని బభుల్గావ్ ఖుర్ద్ గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమెకు 80% కాలినగాయాలు కావడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జెలుబాయ్ జగన్నాథ్ వాబ్లే ఫిర్యాదు మేరకు అశోక్ బొర్నారే, పాండురంగ బొర్నారే, నందకిశోర్ భురక్ అనే ముగ్గురిని హత్యాయత్నం, నేరపూరితంగా బెదిరించడం నేరాల కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆ వృద్ధురాలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు ఈ ముగ్గురూ దారిలో ఆమెను ఆపి, మూడో నెంబరు బటన్ ఒత్తాలని చెప్పారు. అది శివసేన అభ్యర్థి శంభాజీ పవార్‌ది. కానీ బయటకు వచ్చాక ఆమె రెండో నెంబరు బటన్ (ఎన్సీపీ అభ్యర్థి ఛగన్ భుజ్‌బల్) నొక్కానని చెప్పడంతో ఆమెను చంపేస్తామని బెదిరించారు. తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చి, ఆమెను దుర్భాషలాడి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే వాబ్లే కొడుకు రఘునాథ్ మాత్రం అందుకు భిన్నంగా చెబుతున్నాడు. తనను కాపాడేందుకు వచ్చినవాళ్లే తనను చంపడానికి ప్రయత్నించారంటూ తన తల్లి చెబుతోందని అతడు అన్నాడు. ఇంట్లో వంట చేస్తుండగా దీపానికి ఆమె చీర అంటుకుందని అతడు చెబుతున్నాడు. వాస్తవాలేంటో తాము పరిశీలిస్తామని ఎస్పీ సంజయ్ మోహితే తెలిపారు. -
టెన్షన్..టెన్షన్..టెన్షన్!
రేపే ఓట్ల లెక్కింపు చక్రం తిప్పనున్న ఇండిపెండెంట్లు? సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది...? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే... విషయంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే కేంద్రీకృతమైంది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించనుందని తేలడంతో బీజేపీ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు లభ్యమైతే ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, పంకజా ముండే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఏక్నాథ్ ఖడ్సేలున్న సంగతి తెలిసిందే. వీరితోపాటు ఇప్పుడు మరో పేరు విన్పిస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలున్నాయంటూ కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశముంది. కీలకంగా మారనున్న ఇండిపెండెంట్లు... ఎవరికీ పూర్తి మెజార్టీ లభించనట్టయితే ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాతికేళ్ల తర్వాత పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటివరకు మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు శివసేన, బీజేపీల ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఎవరు గెలిచినా చాల స్వల్పమెజార్టీతో గట్టెక్కే అవకాశాలున్నాయి. మరోవైపు గతంలో మాదిరిగా ఓట్లు చీలి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పరాజయం పాలయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీరాకుండా హంగు ఏర్పడినట్టయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,686 మంది ఇండిపెండెంట్లు పోటీచేశారు. వీరిలో ఎంత మంది విజయం సాధిస్తారనేది ఆదివారం వరకు వేచిచూడాల్సిందే. ప్రతిపక్షంలో ఎవరో మరి.. సాక్షి, ముంబై: రాష్ట్రంలో బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే కొన్ని ప్రముఖ పార్టీలు తమకు తోచిన విధంగా పదవులపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని, సొంత బలంపై ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం కావడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరుంటారనే దానిపై ప్రముఖ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ ఉండగా రెండు, మూడు, నాలుగో స్థానంలో నిలిచే పార్టీల మధ్య ఎక్కువ తేడా లేదు. దీంతో ప్రతిపక్షంలో ఎవరు కొనసాగుతారనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. కాగా సర్వే రిపోర్టు ప్రకారం రెండో స్థానంలో శివసేన ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కూడా పార్టీ వర్గీయుల్లో చర్చనీయంశమైంది. కాని సర్వే రిపోర్టుపై తమకు నమ్మకం లేదని తామే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే ధీమాతో శివసేన నాయకులు ఉన్నారు. కాని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకున్నప్పటికీ కనీసం ప్రతిపక్షంలోనైనా కొనసాగుతామనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటులో ఎన్సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికి వారు ఫలితాల తర్వాత ఎదురయ్యే రాజకీయ పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు. -
ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా?
దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన. ఇక 90 స్థానాలున్న హర్యానాను కూడా మోదీ వదల్లేదు. అక్కడ ఏకంగా 11 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రాన్ని కూడా వశం చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బ్రాండ్ పనిచేసిందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. 19వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించాలంటే తగినంత స్థాయిలో అసెంబ్లీల బలం కూడా మోదీకి అవసరం. అందుకే ముందుగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఒకదశలో గొంతు సహకరించకపోయినా కూడా అలాగే ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత బోర్డర్ ఔట్‌పోస్టులపై దాడులు చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏం చేస్తారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం కష్టమనే తెలుస్తోంది. అక్కడ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చని, అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీయే అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. -
రెండు రాష్ట్రాల్లో మాదే అధికారం: బీజేపీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని వ్యాఖ్యానించింది. కచ్చితమైన మెజార్టీతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. పోలింగ్ సరళి తమ పార్టీకే అనుకూలంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జేపీ నద్దా అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, నమ్మకమైన నాయకత్వానికే ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాము ప్రణాళిక ప్రకారం ఎన్నికల ప్రచారం సాగించామన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
-
ఓటేసి.. సెల్ఫీ తీసుకున్న సుప్రియ
మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ ప్రధాన అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్.. ఇలా పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సుప్రియా సూలే తాను ఓటు వేయడమే కాక.. బయటకు వచ్చిన తర్వాత వేలికి ఇంకు గుర్తు చూపిస్తూ మరికొందరు మహిళా నేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్యా పొత్తులు లేకపోవడంతో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. అన్నీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. -
పోలింగ్ కేంద్రంలో పిడుగుపడి.. ఒకరి మృతి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సావనీయ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. తాడ్‌దేవ్ ప్రాంతంలోని గుజరాతీ పాఠశాలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. -
ఎన్నికల వేళ.. శివసేన పత్రికా ప్రకటనలు!
మహారాష్ట్రలో ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు శివసేన భారీ పత్రికా ప్రకటనలతో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజు ఇలా ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ, బాల ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేల ఫొటోలు, బాణం గుర్తుతో భారీ ప్రకటన ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తామే ప్రధాన పోటీదారులం అన్నట్లుగా ఈ ప్రకటనలు గుప్పించింది. తమ పార్టీ అధికారిక పత్రికలైన సామ్నా, దోపహర్కా సామ్నా పత్రికల్లో బుధవారం నాటి ఎడిషన్ మొదటిపేజీలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. 'ధనుష్య బాణ్ కీ టంకార్ హై, ఆనీ అబ్ అప్నీ సర్కార్ హై' అని ఇందులో నినాదం ఇచ్చింది. ధనస్సు, బాణం శివసేన ఎన్నికల గుర్తు. వాటిని గుర్తు చేసేలా.. ఈసారి మన ప్రభుత్వమే రావాలంటూ ఈ ప్రకటన ఇచ్చింది. అలాగే, ముంబైలోని ఇతర మీడియాకు మరో రకం పెద్ద ప్రకటన ఇచ్చింది. అందులో అయితే.. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకునేలా ఉంది. ''రావణుడిని హస్తంతో (కాంగ్రెస్ గుర్తు), వాచీతో (ఎన్సీపీ) లేదా పువ్వుతో (బీజేపీ) చంపలేదు. ధనస్సుతో బాణం వేసి చంపారు'' అని ఆ ప్రకటనలో ఉంది. అవినీతి, విద్యుత్ కోతలు, విధాన సంక్షోభం, దుష్పరిపాలన.. వీటన్నింటినీ అరికట్టాలంటే ధనస్సు, బాణాలకు ఓటు వేయాలన్నది ఆ ప్రకటనల సారాంశం. -
మహారాష్ట్రలో నాలుగు స్తంభాలాట
నాలుగు పార్టీల హోరాహోరీ బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏర్పడుతుందంటున్న ఒపీనియన్ పోల్స్ ఇటీవలివరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చాలామంది దాదాపు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, పరిపాలనాపరమైన నిష్క్రియాపరత్వం.. వీటి కారణంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని.. మోదీ హవా, శివసేనల కేడర్ బలం తో శివసేన-బీజేపీ సంకీర్ణం ఈజీగా మెజారిటీ సీట్లు సాధిస్తుందని అంతా అంచనావేశారు. కానీ ఆ రెండు కూటముల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు తలెత్తి.. నాలుగు పార్టీలు వేటికవే సొంతంగా బరిలోకి దిగడంతో ఒక్కసారిగా మహారాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం మారింది. 288 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏ పార్టీకీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీకి అవకాశం ఉందని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితి ఉందని పలు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. మహారాష్ట్రలో ఆయా పార్టీల ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణ.. మోదీనే నమ్ముకున్న బీజేపీ! శివసేనతో విడిపోయిన తరువాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైననే అన్ని ఆశలు పెట్టుకుంది. ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్న మోదీ కూడా సాధ్యమైనన్ని ప్రచార సభల్లో పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలోనూ గెలిపిస్తే.. అభివృద్ధికి అవకాశం ఉంటుందంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే, రాష్ట్రంలో బలమైన నేత లేకపోవడం బీజేపీకి ప్రతికూలించే అంశం. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో మంచి పేరున్న దళిత నేత గోపీనాథ్ ముండే మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా మళ్లీ రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. మరోవైపు, విదర్భ సహా సంప్రదాయ ఓటర్లు బలంగా ఉన్న అనేక ప్రాంతాల్లో శివసేన, రాజ్‌ఠాక్రే పార్టీ ఎంఎన్ఎస్, బీజేపీల మధ్య ఆ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉండటం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏర్పడే అవకాశముందని రెండు టీవీ చానళ్ల ఒపీనియన్ పోల్స్‌లో తేలింది. దాంతో ఎన్నికల అనంతరం బీజేపీ మళ్లీ శివసేనతో జట్టు కడుతుందా? లేక శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని అక్కున చేర్చుకుంటుందా? అనేది వేచిచూడాల్సి ఉంది. ‘శివసేన మాకు సహజ భాగస్వామి’ అంటూ బీజేపీ నేత నితిన్ గడ్కారీ ఇటీవల చేసిన వ్యాఖ్యను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. గతమే ఘనమైన శివసేన! బీజేపీతో విడిపోవడం వల్ల ఎక్కువ నష్టం శివసేనకే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్ఠాక్రేకున్న చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందని సేన భావిస్తోంది. రాష్ట్రంలో పార్టీకున్న బలమైన కేడర్‌ను కూడా సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నమ్ముకున్నారు. కానీ వాస్తవానికి బాల్ఠాక్రేకున్న జనాదరణ ఆయనకుమారుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేకు లేదని.. మరోవైపు, పార్టీ కేడర్ చాలావరకు బీజేపీ, శివసేననుంచి విడిపోయి రాజ్‌ఠాక్రే స్థాపించిన ఎంఎన్ఎస్ల వైపు వెళ్లిందని విశ్లేషకుల భావన. శివసేనకు బీజేపీ కన్నా తక్కువ సీట్లు వస్తే మాత్రం సొంతగడ్డ మహారాష్ట్రలో సేన ప్రాభవం తగ్గుముఖం పట్టినట్లేనని స్పష్టమవుతుంది. అలాగే, బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచి.. మళ్లీ బీజేపీతో అధికారం పంచుకున్నా.. సీఎం సీటుపై ఆశలను ఉద్ధవ్ ఠాక్రే వదిలేసుకోవాల్సిందే. మరోవైపు, ఎంఎన్ఎస్ కూడా సేన ఓట్లకు గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎన్ఎస్ కనీసం 27 స్థానాల్లో గెలుస్తుందని ఇటీవలి ఒక ఒపీనియన్ పోల్ తేల్చిన విషయం ఇక్కడ గమనార్హం. కాంగ్రెస్.. మునక ఖాయం! మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోతున్న నావేనని దాదాపు అందరి నిశ్చితాభిప్రాయం. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు వ్యక్తిగతంగా మంచి పేరున్నా ప్రభుత్వ వైఫల్యం, సహచరుల అవినీతి, విధానలోపాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయి. 2009 ఎన్నికల్లో 82 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి ఆ సంఖ్యను తిరిగేస్తే వచ్చే 28 స్థానాలైనా గెలుచుకుంటుందా? అనేదే ఇక్కడ ప్రశ్న. ఎన్సీపీ.. పవర్ చూపుతుందా?! రాష్ట్రంలో కాంగ్రెస్‌తో అధికారం పంచుకున్న ఎన్సీపీకి కాంగ్రెస్ వైఫల్యాల్లోనూ భాగం ఉంది. అయితే మరాఠ్వాడా నేత శరద్ పవార్ ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాలపైనే ఎన్సీపీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధించడంతో ఎన్సీపీలో విశ్వాసం పెరిగింది. అయితే, పార్టీ కేడర్ చాలావరకు బీజేపీకి వెళ్లడం, పార్టీ బలంగా ఉన్న దక్షిణ మహారాష్ట్రలో ‘స్వాభిమాని షేత్కారీ పక్ష’ పార్టీ ప్రాబల్యం పెరగడం ఎన్సీపీకి ఆందోళనకరంగా మారింది. - నేషనల్ డెస్క్