ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ‘షోలాపూర్ సౌత్’ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే.. మహా వికాస్ అఘాడి (MVA)కి సమస్యలను సృష్టించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాబితాలో షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దిలీప్ మానేను ప్రకటించింది. మేము ఇప్పటికే అదే స్థానం నుంచి మా పార్టీ తరఫున అమర్ పాటిల్‌ను బరిలోకి దింపాం. అయితే.. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో టైపింగ్ పొరపాటుగా భావిస్తున్నా.
.. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాటు జరగొచ్చు. మా సీటు షేరింగ్ ఫార్ములాలో భాగమైన మిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విన్నా. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే.. అది ఎంవీకే సమస్యలను సృష్టించినట్లు అవుతుంది’ అని అన్నారు.
ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడంపై రౌత్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ముంబైలో మరో సీటు అడుగుతోంది. సాధారణంగా ముంబైలో శివసేన(యూబీటీ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది’ అని అన్నారు.
మరోవైపు.. షోలాపూర్ సౌత్ స్థానంలో పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మేము దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇక.. రేపటితో నామినేషన్ల దాఖలు అంశం ముగుస్తుంది’’ అని అన్నారు.నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 200కు పైగా స్థానాలకు అభ్యర్థులను ఎంవీఏ కూటమి ప్రకటించింది. అయితే.. శివసేన (యూబీటీ ), కాంగ్రెస్ పార్టీ మధ్య కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం గమనార్హం.
చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
Comments
Please login to add a commentAdd a comment