
రెండు రాష్ట్రాల్లో మాదే అధికారం: బీజేపీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని వ్యాఖ్యానించింది. కచ్చితమైన మెజార్టీతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
పోలింగ్ సరళి తమ పార్టీకే అనుకూలంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జేపీ నద్దా అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, నమ్మకమైన నాయకత్వానికే ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాము ప్రణాళిక ప్రకారం ఎన్నికల ప్రచారం సాగించామన్నారు.