
'రెండు రాష్ట్రాల్లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న తమ ఎన్నికల ప్రచారం ఫలించిందన్నారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలే విజయం సాధించారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలన తీరుపై ప్రజలు ఆలోచించారన్నారని అమిత్ షా అన్నారు. ఈ రెండు రాష్టాల్లో విజయంతో తిరుగులేని నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారన్నారు.