![AmitSha Comments In Haryana Election Rally](/styles/webp/s3/article_images/2024/09/17/amitsha.jpg.webp?itok=Dw1tLXIV)
చండీగఢ్:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,హర్యానా మాజీ సీఎం భూపీందర్‌సింగ్‌హుడాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. అగ్నివీర్ పథకంపై రాహుల్,హుడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(సెప్టెంబర్17)లోహారులో నిర్వహించిన ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడారు.
రాహుల్ ఏ భాషలోనైనా అబద్ధాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవేళ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని హెచ్చరించారు.
జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయడంపై రాహుల్ తన వైఖరిని స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఆర్మీలో ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకాన్ని అమలు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు అక్టోబర్5న పోలింగ్, 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి.. మోదీ వందరోజుల పాలన బుక్‌లెట్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment