చండీగఢ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇస్తున్న ఎన్నికల హామీలు అమలే కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆయన ఆదివారం హరియాణాలోని గురుగ్రాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలుకు వీలుకాని ఎలాంటి హామీనీ బీజేపీ ఇవ్వదని మంత్రి అన్నారు.
‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ బాబా అండ్ కంపెనీ ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. హరియాణాలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధికి హామీ ఇస్తుంది’’ అన్నారు. ‘‘సరిహద్దులను రక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. ఆరి్టకల్ 370ను మళ్లీ రానివ్వం’’ అని స్పష్టం చేశారు. వక్ఫ్ నిబంధనల్లో లొసుగులను సరిదిద్దేందుకే పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. రాహుల్‌ను అబద్ధాల మిషన్‌గా అభివరి్ణంచారు. అగి్నవీర్‌లకు ఉద్యోగాలు రావంటూ దు్రష్పచారం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment