implementation guarantees
-
Haryana Assembly elections 2024: రాహుల్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్: అమిత్
చండీగఢ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇస్తున్న ఎన్నికల హామీలు అమలే కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆయన ఆదివారం హరియాణాలోని గురుగ్రాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలుకు వీలుకాని ఎలాంటి హామీనీ బీజేపీ ఇవ్వదని మంత్రి అన్నారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ బాబా అండ్ కంపెనీ ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. హరియాణాలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధికి హామీ ఇస్తుంది’’ అన్నారు. ‘‘సరిహద్దులను రక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. ఆరి్టకల్ 370ను మళ్లీ రానివ్వం’’ అని స్పష్టం చేశారు. వక్ఫ్ నిబంధనల్లో లొసుగులను సరిదిద్దేందుకే పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. రాహుల్‌ను అబద్ధాల మిషన్‌గా అభివరి్ణంచారు. అగి్నవీర్లకు ఉద్యోగాలు రావంటూ దు్రష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. -
వైఎస్సార్‌ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్‌కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
హామీల అమలుకు పోరాటాలు
♦ కార్పొరేషన్ ఎన్నికల్లోప్రజాతీర్పును స్వాగతిస్తున్నాం ♦ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ♦ సమీక్ష సమావేశంలో ఎంపీ పొంగులేటి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. - సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పోరాటం సాగిద్దామని నగరంలోని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేషన్ ఎన్నికల కో-ఆర్డినేటర్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలకు నగరంలో సీఎం కేసీఆర్ పర్యటించి, అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్య పెట్టారని, టీఆర్ఎస్కు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నట్టుగా భయభ్రాంతులను చేశారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించిన ప్రజలకు సేవ చేయడం ద్వారా వారి రుణం తీర్చుకుంటామని అన్నా రు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై కొంతవరకు పడిందని, పాలకుల అధికార దుర్వినియోగం తోడైందని అన్నారు. ‘‘ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు.. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీల నాయకులు నన్ను సంప్రదించారు. మీ పార్టీకి (వైఎస్సార్ సీపీకి) పదికి పైగా సీట్లు వస్తాయని; మద్దతునిస్తే మేయర్, ఉప మేయర్ పదవులను పంచుకుందామని అన్నారు’’ అని చె ప్పారు. ప్రతి ఓటమి వెనుక ఒక గెలుపు ఉంటుం దన్న విషయాన్ని పోటీ చేసిన అభ్యర్థులు గమనంలో ఉంచుకుని.. ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని, సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. దుష్ర్పచారం సాగిస్తున్నారు ‘‘రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రాబల్యం తగ్గిందని, ఈ పార్టీ నాయకులు త్వరలోనే వేరే పార్టీలో చేరతారని కొందరు దుష్ర్పచారం సాగిస్తున్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’’ అని అన్నారు. ‘‘గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ బలమేమిటో అందరూ చూశారు. దానిని మర్చిపోయి ఇలా దుష్ర్పచారం సాగిస్తే ప్రజలు సహించరు’’ అని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. సమావేశంలో 4, 32 డివిజన్ల కార్పొరేటర్లు సలువాది వెంకయ్య, దోరేపల్లి శ్వేత; పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా దయానంద్, కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, సంయుక్త కార్యదర్శులు షర్మిలాసంపత్, సూతగాని జైపాల్; జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుండా వెంకటరెడ్డి; పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్చార్జిలు సాధు రమేష్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్; జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు బీమా శ్రీధర్, కొంగర జ్యోతిర్మయి, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి; యువజన, మహిళ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి.ముస్తఫా, కీసర పద్మజారెడ్డి, గుమ్మా రోశయ్య తదితరులు పాల్గొన్నారు.