utter flops
-
Haryana Assembly elections 2024: రాహుల్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్: అమిత్
చండీగఢ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇస్తున్న ఎన్నికల హామీలు అమలే కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆయన ఆదివారం హరియాణాలోని గురుగ్రాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలుకు వీలుకాని ఎలాంటి హామీనీ బీజేపీ ఇవ్వదని మంత్రి అన్నారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ బాబా అండ్ కంపెనీ ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. హరియాణాలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధికి హామీ ఇస్తుంది’’ అన్నారు. ‘‘సరిహద్దులను రక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. ఆరి్టకల్ 370ను మళ్లీ రానివ్వం’’ అని స్పష్టం చేశారు. వక్ఫ్ నిబంధనల్లో లొసుగులను సరిదిద్దేందుకే పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. రాహుల్‌ను అబద్ధాల మిషన్‌గా అభివరి్ణంచారు. అగి్నవీర్లకు ఉద్యోగాలు రావంటూ దు్రష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. -
పవన్ సభ అట్టర్ ప్లాప్
గుడివాడరూరల్: వారాహియాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శనివారం గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయింది. సభకు భారీ ఏర్పాట్లు చేశామని కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. ఉదయం 11 గంటలకు పవన్ హాజరవుతారని చెప్పగా 12.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పవన్ వచ్చే సరికి పట్టుమని మూడు వేల మంది కూడా లేరు. దీంతో కూటమి అభ్యర్థులు, నాయకులపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ ప్రసంగం మొదలయ్యే సమయానికి కేవలం 2 వేల మంది జనాలు లేకపోవడంలో పవన్ ప్రసంగం చప్పగా సాగింది. సభా ప్రాంగణం వద్ద సరిగా ఏర్పాట్లు కూడా చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సభ ఫెయిల్ కావడంతో కూటమి నేతల్లో ఓటమి భయం నెలకొంది. కుమ్ములాటలే కారణమా...? పవన్ బహిరంగ సభ ఫెయిల్ కావడానికి నియోజకవర్గం టీడీపీలో కుమ్ములాటలే కారణమా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఒంటెద్దు పోకడలతోనే టీడీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ నాయకులే బాహాటంగా పేర్కొంటున్నారు. తాను జీతం ఇచ్చి నియమించుకున్న వారిని తప్ప జనసేన, బీజేపీ నేతలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులను రాము పట్టించుకోవడం లేదని అంటున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదనేది వాపోతున్నారు. కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, బీజేపీ, జనసేన దళిత నేతలకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడుతున్నా పొత్తు ధర్మాన్ని పాటించకుండా తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సైతం పిలవకుండా రాము వ్యవహరిస్తున్న తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చిన సమయంలోనూ కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై సొంత పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.తూతూ మంత్రంగా సాగిన పవన్ ప్రసంగం బహిరంగ సభలో జనం లేకపోవడంతో పవన్ ప్రసంగం తూతూ మంత్రంగా సాగింది. ఎప్పుడు గుడివాడ వచ్చిన ఒకే విధంగా పవన్ మాట్లాడటం, స్థానిక నాయకులు ఇచ్చే పేపర్లు చదివి వెళ్లిపోవడం మినహా గుడివాడకు తాము ఏమి చేస్తామనే అంశం చెప్పకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ పేకాట, మట్టికి సంబంధించి మాత్రమే పవన్‌తో గుడివాడ నాయకులు మాట్లాడించడం పట్ల ప్రజలు పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు, టీడీపీ అగ్రనాయకులు వస్తే మాత్రం మంచినీళ్ల ప్రాయంగా రాము డబ్బు ఖర్చు పెట్టే వాడని, పవన్ వస్తే కనీస ఏర్పాట్లు చేయడం అటు ఉంచితే ప్రజలను సైతం తీసుకురావడంలో విఫలమయ్యాడని విమర్శిస్తున్నారు. మరోసారి ఓటమి ఖాయమనే భావనలోకి కూటమి నేతలు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదని, మరోసారి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ప్రజలు పేర్కొంటున్నారు. -
పులివెందులలో షర్మిల ప్లాప్ షో
-
కూటమి ఆశలు పటాపంచలు
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు. ఏలూరు లోక్‌సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది. సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్‌ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి. అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్‌ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు. కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్‌పై అవే విమర్శలను కొనసాగించారు. ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్‌ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా.. 2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు. -
ప్రధాని ప్రసంగాన్ని భగ్నం చేసిందెవరు?
చిలకలూరిపేట ప్రజాగళం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని, 10 లక్షల మంది వస్తారని టిడిపి, జనసేన ఘనంగా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది.? తీరా సభ మొదలయ్యాక మైకులు మొరాయించాయి. పాపం.. ప్రధాని కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయినా ఏం చేయలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? అది కప్పిపుచ్చుకోడానికి టిడిపి నేతలు ఏం చేశారు? సభ ఏర్పాట్ల వెనక లోకేష్ గత పది రోజుల పచ్చమీడియా పత్రికలు చూస్తే.. పలుమార్లు లోకేష్ జపం కనిపించింది. చిలకలూరిపేట సభ ఏర్పాట్లన్నీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడని, అసలు కనీవినీఎరుగని రీతిలో లోకేష్ టెక్నాలజీ బ్రెయిన్‌తో ఏర్పాట్లు చేస్తున్నాడని పొగిడేసింది ఎల్లో మీడియా. పది లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోకేష్ ఏర్పాట్లు చేశాడని చెప్పుకొచ్చింది. పైగా ప్రధాని సభలో స్టేజ్ పైకి ఎక్కకుండా.. జనంలోనుంచే లోకేష్ అన్నీ గమనిస్తాడని తెగ పొగిడేసింది. సభ తర్వాత ఏం జరిగింది? సభలో అవాంతరాలపై షాక్‌కు గురయింది తెలుగుదేశం. అంతకు మించిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎల్లో మీడియా. లోకేష్‌ను తప్పించడానికి అర్జంటుగా ఓ బకరాను పట్టుకొచ్చారు ఎల్లో మీడియా ఎడిటర్లు. సభ నిర్వహణలో ప్రత్తిపాటి పుల్లారావు వల్లే అట్టర్ ఫ్లాప్ అయిందని నిందించేశారు. నిన్న టీవీ ఛానళ్లలో వచ్చిన బ్రేకింగ్‌లు చూస్తే.. మొత్తం ఫెయిల్యూర్‌కు పుల్లారావే కారణమని నిందించారు. వేదికను సరిగ్గా నిర్వహించలేకపోయాడని పుల్లారావును తప్పుబట్టిన ఎల్లోమీడియా.. యాంకరింగ్ కోసం తెచ్చిన మహిళ సరిగ్గా మాట్లాడలేదని తేల్చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన మహిళకు చూసి చదవడం కూడా రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రధాని సభకు యాంకరింగ్ డొల్లతనం బయటపడిందని చెప్పుకొచ్చారు. సరైన మైక్ సిస్టమ్ పెట్టలేదని, సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ప్రత్తిపాటి పుల్లారావును తప్పుబట్టారు. పదేళ్ల తర్వాత జరిగే ఎన్డీఏ సభను సరిగ్గా పట్టించుకోని పుల్లారావు వల్ల సభ పూర్తిగా నవ్వులపాలయిందని చెప్పుకొచ్చారు. యాంకరింగ్ తడబాటుతో వేదికపై ఉన్న అతిథుల్లో అసహనం నెలకొందన్నారు. మైక్ సిస్టమ్ కు రక్షణ ఏర్పాటు చేయడంపై పుల్లారావు విఫలమయ్యాడని రాసుకొచ్చారు. ఇవ్వాళ నాలుక మడత నిన్నంతా పుల్లారావు తప్పుంటే.. ఇవ్వాళ సీన్ మారిపోయింది. మైక్‌లు పని చేయకపోవడం పోలీసుల వైఫల్యమంటూ ఏకంగా ఏపీ పోలీసుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు వర్ల రామయ్య. ప్రజాగళం సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామన్న వర్ల రామయ్య, సభను భగ్నం చేయాలని పోలీసులు కంకణం కట్టుకున్నారని నిందలేశారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ డిస్టర్బ్ కావడం ఏమిటంటూ ప్రశ్నలు వేసుకున్న వర్ల రామయ్య.. దానికి నలుగురు పోలీసులే కారణమని నిందలేశాడు. ఇక్కడ అందరికి వచ్చే అనుమానాన్ని మాత్రం వర్ల రామయ్యకు రాకపోవడం విశేషం. సభ ఏర్పాట్లన్నీ లోకేష్ చేస్తే.. అది రాకపోవడానికి పుల్లారావో, పోలీసులో ఎలా కారణమవుతారు? పైగా ప్రధాని మోదీని సన్మానించడానికి చేతులు రాక.. ఉత్త చేతులు ఊపుతూ స్టేజ్‌పైన ఉండిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తాపీగా తాము ఇవ్వాలనుకున్న బహుమతులు చెకింగ్‌లో ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇవ్వాలనుకున్న చందనం మాల, చంద్రబాబు ఇవ్వాలనుకున్న వెంకటేశ్వరస్వామి ప్రతిమకు అనుమతి నిరాకరించారని చెప్పుకొచ్చారు. మరి పురందేశ్వరీ తెచ్చిన వినాయకుడి ప్రతిమకు ఎలా అనుమతి వచ్చిందబ్బా? -
ఇవ్వడానికి బొకే కూడా లేదు..అత్యంత నాసిరకంగా మోదీ సభ
-
సభ అట్టర్ ప్లాప్..స్టేజ్ పై బాబు, పవన్ కు క్లాస్ పీకిన పీఎం మోదీ..
-
జయహా బీసీ సభ అట్టర్ ప్లాప్...షాక్ లో బాబు, పవన్
-
జండా సభతో నిరాశలో బాబు, పవన్
-
టీడీపీ, జనసేన జెండా సభ అట్టర్ ప్లాప్..
-
ఉత్తరాంధ్రలో పేలవంగా లోకేష్ శంఖారావం
-
కుప్పంలో తుస్సుమన్న టీడీపీ గాండ్ల కుల సమావేశం
-
నెల్లూరులో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్
-
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
టీడీపీ రా...కదలిరా సభల్లో ఖాళీ కుర్చీలు
-
చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు!
కర్నూలు(సెంట్రల్)/నెల్లూరు, సాక్షి ప్రతినిధి/ నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా.. ‘మేము రాము బాబో.. మీ సభలకు’ అంటూ ప్రజలు ముఖంమీదే తేల్చి చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతోపాటు క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. జగన్ అర్జునుడు కాదు : చంద్రబాబు పత్తికొండ, నెల్లూరు సభల్లో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆయన అభిమన్యుడు కాదు.. అర్జునుడూ కాదూ.. భస్మాసురుడు’ అని విమర్శించారు. సాక్షి పత్రికలో అబద్ధాలే రాస్తారని, చదవొద్దని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పారు. రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఐటీకి తానే ఆద్యుడినని, తనకు 80 దేశాల్లో మద్దతు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్జగన్ చెబుతున్నట్లు 175 సీట్లు వారు గెలవలేరని, పులివెందులలో జగన్‌ను ఓడిస్తామన్నారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిలో రౌడీలు, దోపిడీ దారులే అధికంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించేందుకు ఏపీలోని 5 కోట్లమంది స్టార్ క్యాంపెయినర్లు కలసి తనతో రావాలని పిలుపునిచ్చారు. తన 45 ఏళ్ల పాలనలో ఇంత తీవ్ర వ్యతిరేక ఉన్న ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సీఎం జగన్ నాపై ఎన్ని కేసులుపెట్టి వేధించారో ప్రజలు చూశారన్నారు. సీఎం జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలపై సోమిరెడ్డి మండిపాటు నెల్లూరు సభలో జనసేన కార్యకర్తలు వారి పార్టీ జెండాలను ఊపుతుండగా, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జెండాలు అడ్డుగా ఉన్నాయని, పక్కకు వెళ్లాలని సూచించారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు వినలేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి సూచించినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైక్ తీసుకుని జనసేన కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు ఎవరు చెప్పినా వినరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 31న కృష్ణపట్నం పోర్టులో ఉన్న కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతుందని విమర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరోక్షంగా దుర్భాషలాడారు. డబ్బులు, మద్యం ఎర చూపినా.. నెల్లూరులో డబ్బులు, మద్యం ఎర చూపినా ప్రజలు చంద్రబాబు సభ వైపు రాలేదు. కేవలం రెండు వేల మంది మాత్రం ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హడావుడి చేశారు. వారూ వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద నాయకులకు టెంట్, కూలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో మండుటెండలో వారు విలవిలలాడారు. ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టింది. సభకు వచ్చిన కార్యకర్తలకు రూ.250, క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేయడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆద్యంతం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను మాట్లాడే సమయానికి ప్రజలను నిలబెట్టలేకపోయారా అని నెల్లూరు నగర రూరల్ ఇన్చార్జిపై మండిపడ్డారు. పత్తికొండలోని ఆదోని రోడ్డులో జరిగిన సభకు కచ్చితంగా లక్ష మంది వస్తారని శనివారం సాయంత్రం స్థానిక నేతలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. తీరా ఆదివారం ప్రజలెవరూ రాకపోవడంతో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచలేదు. -
అయ్యో పాపం బాబు...ఎవరు దేకడంలేదు
-
గుడివాడలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు సుత్తి స్పీచ్..
-
ఆళ్లగడ్డ: రా..రమ్మన్నా.. రాని జనం.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ, పదివేల మంది కూడా సభకు రాలేదు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యం దరిదాపుల్లోకి చేరలేదు. నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలని ముందుగానే చెప్పినప్పటికీ జనాలను తరలించలేక నాయకులు చేతులెత్తేశారు. రూ.2 కోట్లు వృథా.. సభ కోసం సుమారు రూ.రెండు కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా తెలుగుదేశం పార్టీ సభకు జనం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ పార్టీ నాయకులుండిపోయారు. సభపై జనాలకు ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమని తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. తాను అధికారంలో ఉండి ఉంటే రాయలసీమను సస్యశ్యామలం చేసేవాడినని చెప్పడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బిర్యానీ, మందు ఇచ్చి జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలామంది సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సభలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఇక ఆళ్లగడ్డ టికెట్ విషయంలోనూ భూమా అఖిలప్రియకు ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు.. టీడీపీ–జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ఏర్పాటుచేసిన మొదటి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరుకాలేదు. అసహనానికి గురైన చంద్రబాబు సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది. సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. సభకు వచ్చేందుకు స్థానిక కార్యకర్తలు ఆసక్తి కనబరచలేదు. ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం. -
చంద్రబాబు సభలకు రా..రమ్మన్నా..రాని జనం
-
అచంటలో చంద్రబాబు రా కదలిరా సభ అట్టర్ ప్లాఫ్
-
కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్
సాక్షి, ప్రకాశం జిల్లా: కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీకి నిరాశే ఎదురైంది. ఊహించిన రీతిలో సభ సక్సెస్ కాకపోవడంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే జనం కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ తన ప్రసంగాన్ని చంద్రబాబు కొనసాగించారు. తన పాత స్టైల్లోనే వెలిగొండ ప్రాజెక్టుకు తానే శిలా ఫలకం వేశానని, తానే ప్రారంభిస్తానంటూ ఊదరగొట్టారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపు. తాగునీటికి, సాగునీటికి రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పశ్చిమ ప్రకాశం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణానికి రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, పొదిలి పెద్దచెరువుకు సాగర్ నీటి సరఫరా, వైద్యశాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగినా వారిపై కన్నెర్రచేశారు. ఆయన పాలనలో ఈ ప్రాంతమంతా దుర్భిక్షంగా మారింది. 2019లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు, మార్కాపురానికి రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, రూ.720 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు నీటిని అన్నీ గ్రామాలకు అందించే ఇన్‌టెక్‌వెల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, జిల్లా వైద్యశాలలో అభివృద్ధితో పాటు, ఏడుగురు ఉన్న డాక్టర్ పోస్టులను 34 మందికి పెంచారు. 100 బెడ్లను 330 బెడ్ల స్థాయికి పెంచడంతో ఇప్పుడిప్పుడే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇదీ చదవండి: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు -
ఓ అసమర్ధుని కామెడీ యాత్ర
-
టీడీపీ కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్
అమరావతి: టీడీపీ నిర్వహించిన కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు నిచ్చినప్పటికీ.. ప్రజలు, టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. ఇళ్లల్లో నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు బయటికి కూడా రాలేదు. చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’ -
నారా లోకేష్‌కి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అంశాన్ని జనాల్లో నానుతూ ఉండేలా చేయాలని టీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. అన్ని ఫెయిల్ అవుతున్నాయి. టీడీపీకి ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. లోకేష్ పిలుపును జనాలు పట్టించుకోకపోవడంతో ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబుకు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల వరకు తాళ్లు, గుడ్డ, రిబ్బన్లతో సంకెళ్ల వేసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నామమాత్రం కూడా స్పందన లేదు. ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు.. బాల్కనీలో కూడా కనిపించలేదు. బాబు అరెస్టుపై లోకేష్ మాటలను విశాఖ నగర వాసులు లెక్కచేయలేదు. అవినీతి పరులకు సంఘీభావం ఏమిటంటూ జనాలు నవ్వుకుంటుకున్నారు. ఇప్పటికే అట్టర్ ప్లాప్ మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి న్యాయానికి సంకెళ్లు సంఘీభావ కార్యక్రమాలు. స్వయంగా అచ్చెంన్నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో కనీసం 50 మంది టీడీపీ కార్యకర్తలు కూడా కనిపించలేదు. చదవండి: పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం