చిలకలూరిపేట ప్రజాగళం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని, 10 లక్షల మంది వస్తారని టిడిపి, జనసేన ఘనంగా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది.? తీరా సభ మొదలయ్యాక మైకులు మొరాయించాయి. పాపం.. ప్రధాని కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయినా ఏం చేయలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? అది కప్పిపుచ్చుకోడానికి టిడిపి నేతలు ఏం చేశారు?
సభ ఏర్పాట్ల వెనక లోకేష్
గత పది రోజుల పచ్చమీడియా పత్రికలు చూస్తే.. పలుమార్లు లోకేష్ జపం కనిపించింది. చిలకలూరిపేట సభ ఏర్పాట్లన్నీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడని, అసలు కనీవినీఎరుగని రీతిలో లోకేష్ టెక్నాలజీ బ్రెయిన్‌తో ఏర్పాట్లు చేస్తున్నాడని పొగిడేసింది ఎల్లో మీడియా. పది లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోకేష్ ఏర్పాట్లు చేశాడని చెప్పుకొచ్చింది. పైగా ప్రధాని సభలో స్టేజ్ పైకి ఎక్కకుండా.. జనంలోనుంచే లోకేష్ అన్నీ గమనిస్తాడని తెగ పొగిడేసింది.
సభ తర్వాత ఏం జరిగింది?
సభలో అవాంతరాలపై షాక్‌కు గురయింది తెలుగుదేశం. అంతకు మించిన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది ఎల్లో మీడియా. లోకేష్‌ను తప్పించడానికి అర్జంటుగా ఓ బకరాను పట్టుకొచ్చారు ఎల్లో మీడియా ఎడిటర్లు. సభ నిర్వహణలో ప్రత్తిపాటి పుల్లారావు వల్లే అట్టర్ ఫ్లాప్ అయిందని నిందించేశారు. నిన్న టీవీ ఛానళ్లలో వచ్చిన బ్రేకింగ్‌లు చూస్తే.. మొత్తం ఫెయిల్యూర్‌కు పుల్లారావే కారణమని నిందించారు. వేదికను సరిగ్గా నిర్వహించలేకపోయాడని పుల్లారావును తప్పుబట్టిన ఎల్లోమీడియా.. యాంకరింగ్ కోసం తెచ్చిన మహిళ సరిగ్గా మాట్లాడలేదని తేల్చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన మహిళకు చూసి చదవడం కూడా రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రధాని సభకు యాంకరింగ్ డొల్లతనం బయటపడిందని చెప్పుకొచ్చారు. సరైన మైక్ సిస్టమ్ పెట్టలేదని, సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ప్రత్తిపాటి పుల్లారావును తప్పుబట్టారు. పదేళ్ల తర్వాత జరిగే ఎన్డీఏ సభను సరిగ్గా పట్టించుకోని పుల్లారావు వల్ల సభ పూర్తిగా నవ్వులపాలయిందని చెప్పుకొచ్చారు. యాంకరింగ్ తడబాటుతో వేదికపై ఉన్న అతిథుల్లో అసహనం నెలకొందన్నారు. మైక్ సిస్టమ్ కు రక్షణ ఏర్పాటు చేయడంపై పుల్లారావు విఫలమయ్యాడని రాసుకొచ్చారు.
ఇవ్వాళ నాలుక మడత
నిన్నంతా పుల్లారావు తప్పుంటే.. ఇవ్వాళ సీన్ మారిపోయింది. మైక్‌లు పని చేయకపోవడం పోలీసుల వైఫల్యమంటూ ఏకంగా ఏపీ పోలీసుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు వర్ల రామయ్య. ప్రజాగళం సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామన్న వర్ల రామయ్య, సభను భగ్నం చేయాలని పోలీసులు కంకణం కట్టుకున్నారని నిందలేశారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ డిస్టర్బ్ కావడం ఏమిటంటూ ప్రశ్నలు వేసుకున్న వర్ల రామయ్య.. దానికి నలుగురు పోలీసులే కారణమని నిందలేశాడు. ఇక్కడ అందరికి వచ్చే అనుమానాన్ని మాత్రం వర్ల రామయ్యకు రాకపోవడం విశేషం. సభ ఏర్పాట్లన్నీ లోకేష్ చేస్తే.. అది రాకపోవడానికి పుల్లారావో, పోలీసులో ఎలా కారణమవుతారు?
పైగా ప్రధాని మోదీని సన్మానించడానికి చేతులు రాక.. ఉత్త చేతులు ఊపుతూ స్టేజ్‌పైన ఉండిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తాపీగా తాము ఇవ్వాలనుకున్న బహుమతులు చెకింగ్‌లో ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇవ్వాలనుకున్న చందనం మాల, చంద్రబాబు ఇవ్వాలనుకున్న వెంకటేశ్వరస్వామి ప్రతిమకు అనుమతి నిరాకరించారని చెప్పుకొచ్చారు. మరి పురందేశ్వరీ తెచ్చిన వినాయకుడి ప్రతిమకు ఎలా అనుమతి వచ్చిందబ్బా?
Comments
Please login to add a commentAdd a comment