chilakaluripet
-
మాజీ మంత్రి విడదల రజిని మామ కారుపై దాడి.. హత్యాయత్నం!
చిలకలూరిపేట: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధుడు అనే విజ్ఞత మరచి టీడీపీ వర్గీయులు మాజీ మంత్రి విడదల రజిని భర్త తండ్రి లక్ష్మీనారాయణపై దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ కారు పురుషోత్తమపట్నంలోని ఇంటికి వెళుతున్న క్రమంలో వేణుగోపినాథస్వామి ఆలయం సమీపంలో టీడీపీ వర్గీయులు పలువురు ఆయనపై దాడిచేసే ఉద్దేశంతో కారును అడ్డగించారు. లక్ష్మీనారాయణను ఉద్దేశించి కిందకు దిగరా అంటూ రాళ్లు, రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పినట్టయింది. దాడికి పాల్పడిన వారి నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని కారుతో పాటు ఇంటికి చేరాడు.ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన విషయంపై ఆమె మీడియాలో టీడీపీ ఆగడాలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె మామ కారుపై దాడి జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
చిలకలూరిపేటలో వైఎస్ జగన్.. ఉప్పొంగిన అభిమానం..
-
సీఎం జగన్ రోడ్ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)
-
మళ్ళీ చెపుతున్న..!
-
Watch Live: చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచార సభ
-
కూటమి ఆశలు పటాపంచలు
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు. ఏలూరు లోక్‌సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది. సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్‌ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి. అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్‌ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు. కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్‌పై అవే విమర్శలను కొనసాగించారు. ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్‌ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా.. 2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు. -
ప్రధాని ప్రసంగాన్ని భగ్నం చేసిందెవరు?
చిలకలూరిపేట ప్రజాగళం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని, 10 లక్షల మంది వస్తారని టిడిపి, జనసేన ఘనంగా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది.? తీరా సభ మొదలయ్యాక మైకులు మొరాయించాయి. పాపం.. ప్రధాని కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయినా ఏం చేయలేక ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? అది కప్పిపుచ్చుకోడానికి టిడిపి నేతలు ఏం చేశారు? సభ ఏర్పాట్ల వెనక లోకేష్ గత పది రోజుల పచ్చమీడియా పత్రికలు చూస్తే.. పలుమార్లు లోకేష్ జపం కనిపించింది. చిలకలూరిపేట సభ ఏర్పాట్లన్నీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడని, అసలు కనీవినీఎరుగని రీతిలో లోకేష్ టెక్నాలజీ బ్రెయిన్‌తో ఏర్పాట్లు చేస్తున్నాడని పొగిడేసింది ఎల్లో మీడియా. పది లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోకేష్ ఏర్పాట్లు చేశాడని చెప్పుకొచ్చింది. పైగా ప్రధాని సభలో స్టేజ్ పైకి ఎక్కకుండా.. జనంలోనుంచే లోకేష్ అన్నీ గమనిస్తాడని తెగ పొగిడేసింది. సభ తర్వాత ఏం జరిగింది? సభలో అవాంతరాలపై షాక్‌కు గురయింది తెలుగుదేశం. అంతకు మించిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎల్లో మీడియా. లోకేష్‌ను తప్పించడానికి అర్జంటుగా ఓ బకరాను పట్టుకొచ్చారు ఎల్లో మీడియా ఎడిటర్లు. సభ నిర్వహణలో ప్రత్తిపాటి పుల్లారావు వల్లే అట్టర్ ఫ్లాప్ అయిందని నిందించేశారు. నిన్న టీవీ ఛానళ్లలో వచ్చిన బ్రేకింగ్‌లు చూస్తే.. మొత్తం ఫెయిల్యూర్‌కు పుల్లారావే కారణమని నిందించారు. వేదికను సరిగ్గా నిర్వహించలేకపోయాడని పుల్లారావును తప్పుబట్టిన ఎల్లోమీడియా.. యాంకరింగ్ కోసం తెచ్చిన మహిళ సరిగ్గా మాట్లాడలేదని తేల్చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన మహిళకు చూసి చదవడం కూడా రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రధాని సభకు యాంకరింగ్ డొల్లతనం బయటపడిందని చెప్పుకొచ్చారు. సరైన మైక్ సిస్టమ్ పెట్టలేదని, సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ప్రత్తిపాటి పుల్లారావును తప్పుబట్టారు. పదేళ్ల తర్వాత జరిగే ఎన్డీఏ సభను సరిగ్గా పట్టించుకోని పుల్లారావు వల్ల సభ పూర్తిగా నవ్వులపాలయిందని చెప్పుకొచ్చారు. యాంకరింగ్ తడబాటుతో వేదికపై ఉన్న అతిథుల్లో అసహనం నెలకొందన్నారు. మైక్ సిస్టమ్ కు రక్షణ ఏర్పాటు చేయడంపై పుల్లారావు విఫలమయ్యాడని రాసుకొచ్చారు. ఇవ్వాళ నాలుక మడత నిన్నంతా పుల్లారావు తప్పుంటే.. ఇవ్వాళ సీన్ మారిపోయింది. మైక్‌లు పని చేయకపోవడం పోలీసుల వైఫల్యమంటూ ఏకంగా ఏపీ పోలీసుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు వర్ల రామయ్య. ప్రజాగళం సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామన్న వర్ల రామయ్య, సభను భగ్నం చేయాలని పోలీసులు కంకణం కట్టుకున్నారని నిందలేశారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ డిస్టర్బ్ కావడం ఏమిటంటూ ప్రశ్నలు వేసుకున్న వర్ల రామయ్య.. దానికి నలుగురు పోలీసులే కారణమని నిందలేశాడు. ఇక్కడ అందరికి వచ్చే అనుమానాన్ని మాత్రం వర్ల రామయ్యకు రాకపోవడం విశేషం. సభ ఏర్పాట్లన్నీ లోకేష్ చేస్తే.. అది రాకపోవడానికి పుల్లారావో, పోలీసులో ఎలా కారణమవుతారు? పైగా ప్రధాని మోదీని సన్మానించడానికి చేతులు రాక.. ఉత్త చేతులు ఊపుతూ స్టేజ్‌పైన ఉండిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తాపీగా తాము ఇవ్వాలనుకున్న బహుమతులు చెకింగ్‌లో ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇవ్వాలనుకున్న చందనం మాల, చంద్రబాబు ఇవ్వాలనుకున్న వెంకటేశ్వరస్వామి ప్రతిమకు అనుమతి నిరాకరించారని చెప్పుకొచ్చారు. మరి పురందేశ్వరీ తెచ్చిన వినాయకుడి ప్రతిమకు ఎలా అనుమతి వచ్చిందబ్బా? -
రాజకీయ నేపథ్యం: గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిని అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరుసగా రెండుసార్లు తెలుగుదేశం గెలిచిన ఈ నియోజకవర్గంలో రజిని తనదైన ముద్ర వేశారు. ఆమెకు పోటీగా ఎవరిని పెట్టాలనే దానిపై తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయి ఇప్పటి వరకూ కష్టపడ్డ వారందరిని కాదని, ఒక మహిళకు కేటాయించాల్సి వచ్చింది. నియోజకవర్గం: గుంటూరు పశ్చిమ పేరు: విడదల రజిని వయస్సు.: 34 విద్యార్హత: బీఎస్సీ, ఎంబీఏ సామాజిక వర్గం: కాపు ఎన్నికల్లో పోటీ: రెండో సారి రాజకీయ నేపథ్యం: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో వైఎస్సార్ సీపీలో చేరారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. -
YSRCP: గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్సీపీ 12వ జాబితా విడుదల అయ్యింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట(అసెంబ్లీ) సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు, గాజువాక(అసెంబ్లీ) సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమించారు. -
మంత్రి విడదల రజిని స్పీచ్... దద్దరిల్లిన చిలకలూరిపేట
-
చిలకలూరిపేటలో YSRCP సామాజిక సాధికార యాత్ర దృశ్యాలు
-
సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది:విజయసాయి రెడ్డి
-
చిలకలూరిపేటలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
చిలకలూరిపేటలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
మాది కుటుంబ గొడవ.. మంత్రి విడదల రజినికి ఎలాంటి సంబంధం లేదు ..
చిలకలూరిపేట: తమది పూర్తిగా కుటుంబ వివాదమని, ఈ వ్యవహారంతో మంత్రి విడదల రజినికి ఎలాంటి సంబంధం లేదని చందవరం గ్రామానికి చెందిన గొంటు జయభరత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ఈ నెల 20వ తేదీన అన్నదమ్ములు జయభరత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఇందులో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జయభరత్‌రెడ్డి కుటుంబసభ్యులు చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జరిగిన గొడవ పూర్తిగా తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని చెప్పారు. గ్రామంలో గతంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తన సోదరుడు శ్రీనివాసరెడ్డి తనకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఆ డబ్బులు అడిగేందుకు వెళ్లినందుకే తన భార్య గొంటు సామ్రాజ్యంతోపాటు తన కుమార్తైపె దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులపై మూకుమ్మడి దాడికి పాల్పడటంతో తాను ఆత్మరక్షణ కోసం గొడవ పడాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ విషయంలో మంత్రి రజినికి ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కావాలని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆమె పేరును వాడుతున్నారని అన్నారు. దీనికి తోడు సొలస గ్రామానికి చెందిన బీవీరెడ్డి మా కుటుంబ వ్యవహారంపై మాట్లాడటం సముచితం కాదన్నారు. బీవీ రెడ్డి గురించి ఆరా తీస్తే అతను కూడా జనాల వద్ద డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిగా తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు వారి స్వలాభం కోసం మంత్రిపై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి బీవీరెడ్డి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. మంత్రి విడదల రజినిని అడ్డంపెట్టుకొని పదవులు పొంది జనాలను మోసం చేసే వారు విమర్శలకు దిగడం సరికాదన్నారు. శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ గ్రామంలో చేసిన దౌర్జన్యాల ఫలితంగా గతంలో టీడీపీకి ఓట్లే లేని గ్రామంలో ఆ పార్టీకి మనుగడ ఏర్పడిందని విమర్శించారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. -
చిలకలూరిపేట టిక్కెట్ నాదే..?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తనకు నచ్చకపోయినా.. గెలవడన్న అనుమానం వచ్చినా.. అప్పటి వరకూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ఎంతటి వారినైనా చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాడన్న విషయం అందరికీ ఎరుకే. తాజాగా పదేళ్లపాటు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఐదేళ్లు మంత్రిగా, ప్రస్తుతం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్గా పనిచేస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రత్తిపాటిని వదిలించుకునేందుకు పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ మరో వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. దీనికి గత ఏడాది ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడు నాందీ పలికింది. గుంటూరు జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బాష్యం ప్రవీణ్‌ను చిలకలూరిపేటలో రంగంలోకి దింపేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగుతు న్నాయి. ఇటీవల భాష్యం ప్రవీణ్ గుంటూరు పట్టణంతో పాటు యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోనూ చిరువ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశాడు. టీడీపీ మహానాడు ప్రకాశం జిల్లా లో జరిగినప్పుడు యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామం హైవే పక్కనే మహానాడుకు వెళ్లే పార్టీ శ్రేణులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని మూడు రోజులు ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు ప్రారంభించి అక్కడే ప్రచార రథంపై ఉండి ప్రసంగించారు. ఆ తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు వెళ్లి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర విజయవంతం కావాలంటూ కొన్ని పాటల్నీ రిలీజ్ చేశారు. చిలకలూరిపేటలో రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా, అలాగే రోజా ఉన్న దీక్షాధారులకు ఇఫ్తార్ విందును వేర్వేరుగా ఇవ్వనున్నట్లు అలాగే పట్టణంలోని అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేస్తానంటూ మీడియాకు వెల్లడించారు. దీంతో కంగారుపడిన ప్రత్తిపాటి తనకు సన్నిహితంగా ఉండే అచ్చెన్నాయుడి ద్వారా ప్రవీణ్‌కు ఫోన్ చేయించి ఈ కార్యక్రమం జరగకుండా చూశారు. తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసి తన గోడు వినిపించగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందగానే హైదరాబాద్‌కు ప్రత్తిపాటి ఫ్యామిలీతో సహా మకాం మార్చిన విషయాన్ని, కోవిడ్ వేళలోనూ పార్టీ వర్గీయులను పట్టించుకోలేదని, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను పట్టించుకోని విషయాన్ని, గత ప్రభుత్వ హయాంలో ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య చేసిన వసూళ్లను అడ్డుకోలేదన్న విషయాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. అయినా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా చూద్దాం అని చెప్పి పంపినట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాలలో మిర్చి రైతులను పరామర్శించేందుకు చేపట్టిన యాత్రకు చిలకలూరిపేటలో స్పందన లేకపోవడం కూడా ప్రత్తిపాటిపై ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు చిలకలూరిపేట నియోజకవర్గం టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న భాష్యం ప్రవీణ్ చంద్రబాబు 73వ పుట్టినరోజు నాడు వెళ్లి రూ.73 లక్షలు పార్టీకి విరాళంగా అందజేసి మార్కులు కొట్టేశాడు. ఇప్పటికే తనకు సహకరిస్తున్న కొంతమంది ప్రత్తిపాటిని వ్యతిరేకిస్తున్న నాయకుల ద్వారా పేట లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం యువ గళం కార్యక్రమంలో లోకేష్‌ను ప్రత్తిపాటి కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే లోకేష్ నుంచి ఎటువంటి హామీ రాలేదని సమాచారం. దీంతో ఈ నెల 15 నాటికి సీటు నాదే అని ప్రకటించకపోతే మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చని, దానికి తాను కూడా సహకరిస్తానని చెప్పినట్లు బాష్యం ప్రవీణ్ వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ తమ మద్దతు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
పల్లె గడపకు ఫ్యామిలీ డాక్టర్.. జయహో జగనన్న (ఫొటోలు)
-
ఆ తోడేళ్లవి ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు: సీఎం జగన్
సాక్షి, పల్నాడు: ఆరోగ్యశ్రీ పథకం పేరు వినగానే మహానేత వైఎస్సార్ గుర్తొస్తారు. ఖరీదైన కార్పొరేట్ పథకాన్ని పేదలకు అందించిన ఘనత వైఎస్సార్‌ది. అలాంటి గొప్ప పథకాన్ని వైఎస్సార్ చనిపోయాక నీరుగార్చారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గురువారం చిలుకలూరిపేట లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. అందుకే వైద్య ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనకడాడం లేదు. చంద్రబాబు పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను సైతం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. 2,265 ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ విస్తరించాం. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 3,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటిదాకా 9 వేల కోట్లు ఖర్చు చేశాం. అలాగే.. ఆరోగ్య ఆసరా కోసం రూ. 900 కోట్లు ఖర్చుచేశాం. ఇప్పటిదాకా 35 లక్షల 71 వేలపైగా మంది ఆరోగ్య సేవలను పొందారు. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్య రంగాలపై రూ. 8వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై రూ. 18 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆశా వర్కర్ల జీతం పెచాం. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ పీహెచ్‌సీలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో 49వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. శిథిలావస్థకు చేరుకున్న మరో 11 మెడికల్ కాలేజీల రూపురేఖలు మారుస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో 48, 639 ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో స్టాఫ్ నర్సుల పోస్టులు వంద శాతం భర్తీ చేశాం. రాష్ట్రంలో 96 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం. నూరు శాతం ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశాం. మనది బ్రతికించే ప్రభుత్వం. ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. లంచాలు, వివక్ష లేకుండా పాలన చేస్తున్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధికి అడుగులు వేస్తున్నాం. బటన్ నొక్కి 2 లక్షల 5 వేల 108 కోట్ల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం ప్రతీ గడపకూ కనిపిస్తుంది. స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు.. సామాజిక న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ ప్రతిపక్ష టీడీపీ అండ్ కోను సీఎం జగన్ ఏకిపారేశారు. మీ బిడ్డను ఎదుర్కొనలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు. నాకు పొత్తుల్లేవ్. పొత్తులపై ఆధారపడను. నాకు పొత్తు ఉంటే అది మీతోనే(ప్రజలతోనే) అని సీఎం జగన్ పేర్కొన్నారు. నవరత్నాలతో మీ బిడ్డ వస్తుంటే.. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి. వాళ్లలా నాకు అర్థబలం, అంగబలం లేకపోవచ్చు. వాళ్లకు లేనిది నాకు ఉంది.. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు. నాకు తెలిసింది ఒక్కటే. నేను నేరుగా చెప్తా. ఏదైతే చెప్తానో అదే చేస్తా.. మీ ఇంట్లో మంచి జరిగితే తోడుగా ఉండండి. మీ బిడ్డకు మీరే సైనికులు అంటూ సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. -
చిలకలూరిపేటలో కిడ్నప్ అయిన బాలుడు క్షేమం
-
చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం
చిలకలూరిపేట (పల్నాడు జిల్లా): చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. మంత్రి రజిని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తోందని చెప్పారు. దీని కోసం ఇప్పటికే రూ.18.57 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 4.147 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతోందని, పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండు నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఆస్పత్రిలో ఏకంగా 95 మంది సిబ్బందిని నియమించనున్నట్టు వెల్లడించారు. 23 మంది వైద్యులే ఉంటారని చెప్పారు. అన్ని స్పెషాలిటీల వైద్యులూ ఉంటారని వివరించారు. ఆస్పత్రిని ట్రామా కేర్ సెంటర్‌గా కూడా మార్చేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చుట్టూ ప్రహరీ, సిమెంట్ రోడ్లు, ఫర్నిచర్ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అనంతరం మంత్రి రజిని ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు. మంత్రి వెంట ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏఎస్ఎంఎస్ఐడీసీ సీఈ శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ ప్రదీప్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, ఏఎంసీ చైర్మన్ మద్దిరాల విశ్వనాథం ఉన్నారు. వచ్చే జూన్ నాటికి బైపాస్ పూర్తి వచ్చే ఏడాది జూన్ నాటికి చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ బైపాస్‌ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. రోడ్డుకిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, దేశంలోనే ఇలాంటి రహదారి నిర్మాణం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కోటప్పకొండకు ప్రభలు వెళ్లడానికి వీలుగా రహదారికి పురుషోత్తమపట్నం వద్ద అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని ఎంటీ కృష్ణబాబును మంత్రి కోరారు. గణపవరం–అప్పాపురం రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలని, నరసరావుపేట, కోటప్పకొండ రహదారి మధ్యన బైపాస్కు రెండో వైపునా సర్వీసు రోడ్డు నిర్మించేలా ప్రతిపాదించాలని సూచించారు. ఈ మూడు అంశాలను తాను ప్రత్యేకంగా పరిశీలిస్తానని, నేషనల్ హైవేస్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కృష్ణబాబు తెలిపారు. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) -
చిలకలూరిపేటలో పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశ్రుతి
-
ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీ చేతిలో అబ్బా-కొడుకులిద్దరికీ బాదుడే బాదుడు
-
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
పెదకాకాని(గుంటూరు జిల్లా): చెల్లెలు వరుస అయిన యువతిని మాయమాటలతో మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన న్యాయవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చిలకలూరిపేట తూర్పు మాలపల్లికి చెందిన జంగా ప్రతాప్ 2019 నుండి గడ్డిపాడులోని తన చిన్నమ్మ దీనకుమారి ఇంటిలో ఉంటూ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రతాప్ తల్లి, దీనకుమారిలు స్వయానా అక్కచెల్లెళ్ల పిల్లలు. గడ్డిపాడులోని దీనకుమారి కుమార్తె దొడ్డా రమాదేవి సిమ్స్ కళాశాలలో బిఫార్మసీ చదువుతుంది. చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. వరుసకు అక్కచెల్లెళ్ల పిల్లలు అయినప్పటికీ వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిత్యం అక్రమ సంబంధానికి దారి తీసింది. జంగా ప్రతాప్ రమాదేవికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. 2021 ఆగస్టు నెలలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన రోజు కూడా రమాదేవితో ఫోన్లో మెసేజ్‌ల రూపంలో సంభాషించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంపై రమాదేవి నిలదీసింది. వరుసకు సోదరుడైన ప్రతాప్ చేసిన మోసానికి మనస్థాపానికి గురై 2021 సెప్టెంబరు నెలలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫోన్ సంభాషణలు, మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగుచూశాయి. జంగా ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించాడు. నిందితుడు ప్రతాప్‌ను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. -
అధికారిణిపై దాడి.. టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై కేసు..
సాక్షి, పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదైంది. మున్సిపల్ అధికారిణిపై దాడి చేసిన కేసులో పత్తిపాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్లాంట్ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు. ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. -
టీడీపీ నేత పత్తిపాటి, అనుచరుల దౌర్జన్యకాండ.. అధికారిణిపై దాడి
చిలకలూరిపేట(పల్నాడు జిల్లా): అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్లాంట్ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగింది. వివరాలివీ.. చదవండి: సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..? చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు. పోలీసులను తోసేసి వాటర్‌ప్లాంట్‌లోకి ప్రవేశిస్తున్న పత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకులు మహిళా అధికారిణిపై దాడి ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. ఈ గందరగోళం ఇలా జరుగుతుండగానే పుల్లారావు ప్లాంటులోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టేశారు. ఆసుపత్రిలో టీపీఎస్ సునీత చేరిక మరోవైపు.. సంఘటనలో గాయపడ్డ సునీతను మునిసిపల్ సిబ్బంది ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత విడదల గోపి, మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరాల విశ్వనాథం, మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్నా తదితరులు ఆమెను పరామర్శించారు. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ.. తనను కారుతో గుద్దించే ప్రయత్నం చేశారని, ఎస్సీ మహిళనైన తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. టీడీపీ నేతల తీరు అమానుషమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి
సాక్షి, చిలకలూరిపేట (పల్నాడు): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాపం చేసింది కట్టుకున్న వాడైనా సహించేది లేదని జరిగిన దారుణాన్ని లోకానికి తెలిపి, పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మాతృత్వపు ఔన్నత్యాన్ని చాటుకుంది ఆ కన్నతల్లి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్‌బాషా ఆదాం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్‌పాలేనికి చెందిన హుస్సేన్‌బీతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. షఫీ బొప్పూడిలో కుటుంబంతో నివాసం ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్లోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. రాత్రిపూట పాప తండ్రి వద్ద, చిన్నవాడైన బాబు తల్లి వద్ద నిద్రిస్తారు. ఇటీవల పాపను స్కూల్‌కు పంపే క్రమంలో తల్లి చిన్నారికి స్నానం చేయిస్తుండగా, తనకు జననాంగాల వద్ద నొప్పిగా ఉందని రాత్రి సమయాల్లో తండ్రి పక్కన పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. చదవండి: (Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్) వారం రోజుల్లో ఇదే విషయాన్ని పలుమార్లు తల్లికి చెప్పడంతో అనుమానించిన ఆమె భర్త ప్రవర్తనపై కన్నేసింది. ఆదివారం రాత్రి భోజనం తర్వాత భర్త షఫీ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్‌బీ నిద్రపోతున్నట్లు నటించింది. సెల్‌ఫోన్ లైట్ వేసి భార్య నిద్రపోతున్నట్లు భావించి కుమార్తె పక్క చేరాడు. సెల్ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త దారుణం పసిగట్టిన హుస్సేన్‌బీ వెంటనే అపరకాళిగా మారింది. భర్తను నిలదీయడంతో బంధువులకు సమాచారం అందించింది. దీంతోపాటు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. చదవండి: (ఎస్ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్లో మాట్లాడారా?) -
Chilakaluripet: నెక్లెస్ ఆకారంలో రోడ్డు నిర్మాణం
యడ్లపాడు(చిలకలూరిపేట): పుష్కరకాలంగా నిలిచిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక చొరవ చూపారు. పెద్దమనసుతో కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు నష్టపరిహారం కోసం నిధులు మంజూరు చేశారు. ఫలితంగా పనులు వేగవంతమయ్యాయి. ఆది నుంచీ వివాదాలు 16వ నంబర్ జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణ పనులను 2009లో హైవే అథారిటీ సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నెక్లెస్ ఆకారంలో బైపాస్ వేయాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దీనివల్ల తాము నష్టపోతామని రైతులు వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం 2010లో కోర్టుకు చేరింది. ఫలితంగా విజయవాడ టోల్‌ప్లాజా నుంచి చిలకలూరిపేట మండలం తాతాపూడి వరకు 84.5 కిలోమీటర్ల మేర జరగాల్సిన రహదారిలో చిలకలూరిపేట పరిధిలోని 16 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం 2016లో బైపాస్ నిర్మాణానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నష్టపోయే రైతులకు పరిహారం అందించేందుకు 2018లోనే అవార్డు పాస్‌చేసినా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పరిహారం వాటా నిధులు మంజూరు కాలేదు. అప్పటి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండి కూడా రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఎమ్మెల్యే రజినీ కృషితో కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే విడదల రజిని హైవే అథారిటీ సంస్థతో సంప్రదింపులు జరిపారు. సమస్యను తెలుసుకుని సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.57 కోట్లను తక్షణం మంజూరు చేశారు. 2019లోనే రైతులకు నష్టపరిహారం అందించారు. స్వరూపం ఇలా.. ► చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, మండలాలను కలుపుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ బైపాస్‌ను నిర్మిస్తోంది. ► యడ్లపాడు మండలం తిమ్మాపురం చేపల చెరువు హైవే నుంచి చీలి చిలకలూరిపేట మండలంలోని రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం కానుంది. ► ఈ మార్గంలో మూడుచోట్ల ఫ్లైఓవర్లు, ఐదుచోట్ల వంతెనలు, ఆరుచోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ చివరన ప్రారంభమైన ఈ పనులు 2023 మార్చికి పూర్తికానున్నాయి. సీఎం పెద్దమనసు చూపారు గత ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులకు నష్టపరిహారం నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా బైపాస్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో నేను హైవే అథారిటీ ప్రతినిధులతో పలుమార్లు మాట్లాడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూ.57కోట్లు కేటాయించారు. వెంటనే రైతులకు పరిహారం అందింది. బైపాస్ పనులు మొదలయ్యాయి. – విడదల రజిని, ఎమ్మెల్యే పిల్లర్ల పనులు చేస్తున్నాం బీఎస్ఈపీఎల్ కంపెనీ బైపాస్ నిర్మాణ పనులు చేపట్టింది. సర్వే పనులు పూర్తయ్యాయి. హద్దురాళ్ల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్సు పనులూ గతంలోనే ముగిశాయి. ప్రస్తుతం రామచంద్రాపురం వద్ద ఫ్లైఓవర్, బొప్పూడి వద్ద అండర్‌పాస్, ఓగేరు, కుప్పగంజి వాగుల వద్ద వంతెనల నిర్మాణానికి పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. వరుస వర్షాల వల్ల కొంత ఆటంకం కలుగుతోంది. అయినా గడువులోపు పనులు పూర్తిచేస్తాం. – అబ్దుల్ ఖాదర్, పీడీ బైపాస్ నిర్మాణ సంస్థ -
మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా!
కోతి చేష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఆకతాయి పనులు చేసే వారిని ఆ కోతి చేష్టలు ఏమిటా అని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ తుంటరి పని చేసినా కోతితోనే పోలుస్తాం. చివరికి మందేసి.. చిందేసినా పెద్ద కోతి అంటూ విమర్శిస్తాం. మరి కోతే మందేస్తా.. అచ్చం మనషులు మందు తాగినట్లే తాగితే, మందుతో పాటు సోడా కూడా తాగాలని ఆ కోతి అనుకుంటే, అందులో మంచింగ్ ఉండాలని భావిస్తే ఏమనుకోవాలి. కాస్త విడ్డూరంగా అనిపించినా ఒక కోతి సోడా తాగి గ్లాస్లో ఉన్న మందు తాగి, ఆపై మంచింగ్ కూడా తీసుకుంటే ఏమనుకుంటాం.. ‘మందు.. సోడా.. మంచింగ్...ఆ కోతే వేరబ్బా’ అని అనుకోక తప్పదు. ఇలా ఒక కోతి మందేసిన ఘటన చిలకలూరిపేట మేఘన బార్ సమీపంలో చోటు చేసింది. అక్కడ షెడ్డుపై తాగేసి వదిలేసిన సోడాతో పాటు మందును తాగి తన దాహార్తిని కాస్త తగ్గించుకుంది. -
మహిళపై లైంగికదాడి.. రూ.50 వేలు దోపిడీ
ప్రత్తిపాడు : ఓ ఆటో డ్రైవర్ మహిళపై రెండు సార్లు లైంగికదాడికి పాల్పడి ఆపై ఆమె వద్ద ఉన్న నగదును దోచుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగింది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు రూరల్ మండలం పొత్తూరుకు చెందిన ముక్కల విజయలక్ష్మి శనివారం పొత్తూరు నుంచి చిలకలూరిపేటకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దిగిపోవడంతో ఆటో డ్రైవర్ గొర్రెముచ్చు శివరామయ్య.. ఆటోలో ఒంటరిగా ఉన్న మహిళతో మాటమాటా కలిపాడు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి ఆటోను తీసుకువెళ్లి మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ.50 వేలు దోచుకెళ్లాడు. బాధిత మహిళ 100కు డయల్ చేయడంతో ప్రత్తిపాడు పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
భళా బాలిక: తొమ్మిదేళ్లకే గిన్నిస్ రికార్డు..
నాదెండ్ల (చిలకలూరిపేట): తొమ్మిదేళ్ల వయస్సులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట చిన్నారి ఫజీలాతబస్సుమ్ స్థానం సాధించింది. రసాయన శాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను 1.43 నిమిషాల్లో అమర్చి రికార్డు నెలకొల్పింది. గతంలో పాకిస్తాన్‌కు చెందిన చిన్నారి 2.27 నిమిషాల్లో ఈ ఘనత సాధించగా, దానిని ఫజీలాతబస్సుమ్ బ్రేక్ చేసింది. చిలకలూరిపేటలోని సుభానీనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ రహీమ్ కుమార్తె షేక్ ఫజీలాతబస్సుమ్ తన తండ్రి పాఠశాలలోనే ఐదో తరగతి చదువుతోంది. కాగా, గతంలో ఫజీలా 118 మూలకాలను ఒక నిమిషం 57 సెకన్లలోనే అమర్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సాధించింది. ఈ ఏడాది జనవరిలో గణపవరం సీఆర్ కళాశాలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు అఫీషియల్ అటెమ్ట్ నిర్వహించగా 1.43 నిమిషాల్లో ఈవెంట్‌ను పూర్తి చేసింది. ఏప్రిల్ 27న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారికంగా సమాచారం, సర్టిఫికెట్ అందుకుంది. ప్రస్తుతం 1.30 నిమిషాల్లోనే ఆవర్తన ప్రక్రియ అమర్చి తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. చదవండి: World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్ అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో -
ప్రేమ పెళ్లి, పోలీస్ స్టేషన్‌కు వధూవరులు
చిలకలూరిపేటటౌన్: తమకు బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్ష ణ కల్పించాలని ఓ ప్రేమజంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన అన్నలదాసు మణికంఠ గురజాలలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకున్నాడు. అదే గ్రామానికి చెందిన చలవాది సాయినందినితో ఇంటర్మీడియట్ నుంచి స్నేహం ఉంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తమ పెళ్లికి బంధువులు అంగీకరించరనే ఉద్దేశంతో మంగళవారం ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. -
బాలుడిని చంపిన పిన్ని విశాఖ ఆస్పత్రికి..
సాక్షి, చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం ఏడేళ్ల బాలుడు కరీముల్లాను స్వయానా అతని పిన్ని ఆషా దారుణంగా కత్తితో కోసి హతమార్చిన సంఘటన తెలిసిందే. సంఘటన జరిగి 36 గంటలు గడిచినా నిందితురాలు ఆషా ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు ప్రాథమికంగా ఆమె మానసిక పరిస్థితికి సంబంధించి కొన్ని పరీక్షలను నిర్వహించారు. (దారుణం: రక్తం రుచిచూస్తూ.. పేగులు మెడలో) ఆయా పరీక్షల ఆధారంగా ఆషాకు నరాలకు సంబంధించిన కొన్ని బలహీనతలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి పెరిగి విచక్షణ కోల్పోయిందని, ఆ సమయంలోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాలను సోమవారం చిలకలూరిపేట కోర్టులో న్యాయమూర్తికి పోలీసులు నివేదించారు. వివరాలను పరిశీలించి ఆషాను వైజాగ్‌లోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించి మరిన్ని పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను సోమవారం రాత్రి పోలీసులు వైద్యుల సాయంతో వైజాగ్‌కు తరలించారు. -
దారుణం: రక్తం రుచిచూస్తూ.. పేగులు మెడలో
సాక్షి, యడ్లపాడు/చిలకలూరిపేటటౌన్: ఓ యువతి సైకోలా మారి, అక్క కొడుకును దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం రుచి చూడడం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని ముప్పసాని సుబ్బారావు ఇంటి పై అంతస్తులో నాలుగు నెలల క్రితం షేక్ సలాం, ఆషా దంపతులు అద్దెకు దిగారు. భర్త సమీపంలోని ఓ నూలుమిల్లులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఆబిద్, షమ్రి ఇద్దరు సంతానం. నరసరావుపేటలో ఉంటున్న ఆషా అక్క ఫాతిమా, ఫరిద్‌బాషా దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో తన పిల్లలు కరిమున్, కరిముల్లా, ఖాజాతో కలిసి చెల్లెలి ఇంటికి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ, చిన్న అల్లుడు సలాం కలిసి పనిమీద బాపట్లకు వెళ్లారు. అల్లరి చేశాడని.. పట్టరాని కోపంతో.. మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అక్క కొడుకు కరిముల్లా అల్లరి చేశాడని ఆషా చీపురు కట్టతో కొట్టింది. అంతటితో ఆగక పట్టరాని కోపంతో వంటింట్లో నుంచి చాకు తీసుకొచ్చి బాలుడి చేతిని గాయపరిచింది. భీతిల్లిన కరిముల్లా కాపాడండంటూ పెద్దగా కేకలు వేశాడు. అక్కడే ఆడుకుంటున్న కరిముల్లా సోదరి కరీమున్ ప్రాణభయంతో తనతోపాటు మిగిలిన ముగ్గురు పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ బిగించింది. కేకలు విన్న ఇంటి యజమాని భార్య మెట్లెక్కి పైకి రావడాన్ని గమనించిన ఆషా.. చాకును చూపించి చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె భయంతో కిందికి వచ్చి భర్తకు చెప్పింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా ఇరుగుపొరుగును పిలిచి ఘటనాస్థలికి వెళ్లేసరికి బాబు గొంతును కోసి అక్కడి నుంచి పొత్తి కడుపు వరకు పూర్తిస్థాయిలో కోసి పేగుల్ని బయటకు తీయడాన్ని చూసి జనంలో వణుకు మొదలైంది. ఈలోగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆశా వద్ద ఉన్న చాకును అతి కష్టం మీద లాక్కుని ఆమెను ఇంటి బయటికి తీసుకురావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎ.భాస్కర్ ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటి గడియ తీసి లోపల కన్నీరు కారుస్తూ బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న నలుగురు పిల్లలను సమీపంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తకు అప్పగించారు. బాలుడి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు... జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్న ఆషా తల్లిదండ్రులు, అక్క ఫాతిమా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దారుణ పరిస్థితుల్లో మృతి చెందిన తన బిడ్డను చూసుకుని ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. తన బిడ్డ చనిపోయాడని ఫాతిమా, తన బిడ్డ ఉన్నట్టుండి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టింది, వీరిద్దరి భవిష్యత్తు ఏమిటని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్న తల్లి ఖాదర్‌బీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. (దారుణం: లారీతో తొక్కి చంపేశాడు..) తన ప్రాణంతో పాటు మరో ముగ్గురికి ఊపిరి... ఫాతిమా సంతానంలో ముగ్గురిలో కరిముల్లా, కరిమున్ కవలలు. ఖాజా మూడో సంతానం. పిన్ని తన అన్న కరిముల్లాను చాకుతో చేతిపై కోయడాన్ని గమనించగానే తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకున్న కరిమున్.. తనతో ఆడుకుంటున్న ముగ్గురి పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ పెట్టి వారి ప్రాణాలను ఎంతో ధైర్యంగా కాపాడింది. ఆషా కరిముల్లాను చంపిన తర్వాత కసితీరక తలుపులు గడియలు తీయాలని పలుమార్లు బాదినా భయపడకుండా గడియను కరిమున్ తీయలేదు. కరిమున్ ధైర్యం చూపి పిల్లలను కాపాడడాన్ని ఊరంతా మెచ్చుకుంటున్నారు. -
పేదలకు నిత్యావసరాలు పంపిణి
-
టీడీపీ గూండాలు నన్ను టార్గెట్ చేశారు: రజని
-
ఎమ్మెల్యే విడదల రజని మరిది కారుపై దాడి
సాక్షి, గుంటూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో... ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే కారులో ఉన్నారని భావించి ఈ ఘటనకు పాల్పడ్డారు. కారులో ఎమ్మెల్యేకు బదులు మీరెందుకు ఉన్నారంటూ మాపై దాడి చేశారు. చిలకలూరిపేటలో మా పుల్లారావు కాకుండా మీరెలా గెలుస్తారని బెదిరించారు. మీ ఎమ్మెల్యే ఎలా తిరుగుతుందో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకుల దాడిలో మా కారు పూర్తిగా ధ్వంసం అయింది. దాడికి పాల్పడవారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’ అని తెలిపారు. కాపలా కాసి దాడులు చేస్తారా? టీడీపీ గూండాలను తనను టార్గెట్ చేశారని ఎమ్మెల్యే విడదల రజని ఆరోపించారు. 200మందికి పైగా ఒకేసారి దాడి చేశారని, రాళ్లు, రాడ్లతో కారును ధ్వంసం చేశారన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాపలా కాసి దాడులు చేయడం కాదని, దమ్ముంటే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజాక్షేత్రంలో గెలవాలని ఎమ్మెల్యే రజని సవాల్ విసిరారు. -
ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై రాళ్లదాడి
-
టీడీపీ వర్గీయుల దాష్టీకం
యడ్లపాడు(చిలకలూరిపేట): అధికారం కోల్పోయినా టీడీపీ వర్గీయుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒక రైతుకు చెందిన మిరప తోటలో గడ్డి మందు చల్లిన ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు వల్లెపు చక్రవర్తి గ్రామంలో మూడు ఎకరాల కౌలు భూమిలో పత్తి, మిరప సాగు చేస్తున్నాడు.ఈ క్రమంలో టీడీపీకి చెందిన వల్లెపు చిన వెంకటేశ్వర్లు వర్గీయులు తమ పొలాల మధ్య ఉన్న భూమిని చక్రవర్తికి కౌలుకు ఇవ్వవద్దని భూ యజమాని కృష్ణారావుపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. అయితే చక్రవర్తి సకాలంలో కౌలు చెల్లిస్తుండటంతో ఆయనకే కృష్ణారావు తన భూమిని కౌలుకిచ్చాడు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు చక్రవర్తికి చెందిన ఎకరంన్నర మిరప తోటలో గడ్డి మందు చల్లడంతో కాపునకు వస్తున్న మొక్కలు మాడిపోయాయి. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నట్లు చక్రవర్తి, ఆయన భార్య నాగమణి కన్నీటిపర్యంతమయ్యారు. తన పంటను నాశనం చేసిన వల్లెపు చిన వెంకటేశ్వర్లు, వల్లెపు పోల్‌రాజుయణ, మల్లెల గోపీ తదితరులపై చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
గుంటూరు జిల్లాలో విషాదం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన ఆది లక్ష్మీ ఈ రోజే కొత్తగా గ్యాస్ సిలిండర్‌ను కొనుక్కొచ్చారు. గ్యాస్ పొయ్యిని సిలిండెర్‌కు కలెక్షన్ ఇచ్చేందుకు పక్కింటి దివ్యను పిలిచారు. గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటన రేకుల షెడ్డు పేలి దివ్య, ఆదిలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు.ఇంట్లో ఉన్న మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆమెతో వివాహేతర సంబంధం కోసం ఇద్దరి ఘర్షణ!
సాక్షి, చిలకలూరిపేట: వివాహిత మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకొన్న ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. మండలంలోని మురికిపూడి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ భర్తను వదలి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆ మహిళతో ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాబావలి (29) మురికిపూడిలో బిస్మిల్లా చికెన్ సెంటర్ పేరుతో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం ఇదే మహిళతో బాబావలికి కూడా పరిచయం ఏర్పడింది. ఇతనితో కూడా ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై బాబావలికి, వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తికి తెలిసి గత కొద్ది రోజులుగా ఘర్షణ పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల కిందట ఇద్దరూ మద్యం తాగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబావలిని అడ్డు తొలగించుకోవాలని వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తి నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మంగళవారం రాత్రి జాతీయ రహదారి సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో బాబావలితో కలిసి అతిగా మద్యం తాగారు. బాబావలి స్వగ్రామమైన పోలూరుకు వెళ్లకుండా మురికిపూడిలోని మాంసం దుకాణానికి చేరుకుని షట్టర్ వేసుకుని నిద్రించాడు. అదే సమయంలో వేమవరం యువకుడు మహిళ ఇంటికి వెళ్లి బాబావలితో సంబంధం వదులుకోవాలని హెచ్చరించాడు. తన మాట వినని పక్షంలో బాబావలిని హత్యచేస్తానని మహిళను బెదిరించాడు. అనంతరం మద్యం మత్తులోనే చికిన్ దుకాణానికి చేరుకొని షట్టర్ పైకి లాగి మద్యం మత్తులో నిద్రిస్తున్న బాబావలిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలు గడిచినా దుకాణం తీయలేదని బాబావలి బంధువులు షట్టర్ తీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ జి.అనీల్‌కుమార్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు
నాదెండ్ల(చిలకలూరిపేట): గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. తూబాడు మాజీ సర్పంచి నర్రా మేరయ్యకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు శ్రీరామయ్య భార్య వెంకటేశ్వరమ్మ సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన షేక్ శ్రీను ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో భర్తతో పాటు బంధువులూ అక్కడకు చేరుకుని షేక్ శ్రీనుకు దేహశుద్ధి చేశారు. అయితే అతని బంధువైన ఆర్ఎంపీ, టీడీపీ వర్గీయుడు షేక్ మీరావలి తన వర్గీయులను తీసుకొచ్చి వైఎస్సార్ సీపీ శ్రేణులపై కర్రలతో దాడికి తెగబడ్డాడు. తమపై దాడి జరిగిందంటూ టీడీపీ వర్గీయులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పోలీసులు వచ్చి మాజీ సర్పంచి ఉషోదయ స్వప్నమేరి నివాసం తలుపులు పగులగొట్టి అక్కడున్న పదిమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. నర్రా అంకమ్మరావు, సిరిబోయిన గోపిరాజు, నర్రా సాంబశివరావు, రాఘవ రమేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు...
చిలకలూరిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విగత జీవులుగా మారిన ఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగవెంకటేశ్వరరావు (30) కుటుంబ సభ్యులతో కలసి మొక్కు తీర్చుకునేందుకు జూన్ 28వ తేదీన తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామానికి కారులో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వైపుగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగ వెంకటేశ్వరరావుతో పాటు అతని భార్య తిరుమల సూర్యభవాని (25), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్ (5), బావమరిది కటికిరెడ్డి అనోద్‌కుమార్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న బంధువులు తిరుమల దుర్గా మణికంఠ, గోకరకొండ సాయికిరణ్, గుమ్మళ్ల సాయిదుర్గా తులసి, గుమ్మళ్ల సాయిదుర్గా శైలజ, టి.అనంతలక్ష్మి, ఏడాదిన్నర బాలుడు టి.తేజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన నాగ వెంకటేశ్వరరావు, గాయపడిన దుర్గా మణికంఠ అన్నదమ్ములు. ఇరువురికి డ్రైవింగ్ రావటంతో ఒకరి తరువాత ఒకరు వాహనం నడుపుకొంటూ వచ్చారు. ప్రమాద సమయంలో నాగ వెంకటేశ్వరరావు వాహనం నడుపుతున్నట్లు గాయపడిన వారు తెలిపారు. నిద్రమత్తులో అతివేగంగా వాహనం నడపటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గాయపడిన ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జీసీ రాజరత్నం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అమర్‌నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్ర్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీరు తిరుమల దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు.. రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో మొత్తం 11 మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పార్టీ మారినందుకు మంత్రి వేధింపులు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయని నాయకులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అప్పుడే వేధింపులు మొదలుపెట్టారు. పోలీస్, మార్కెటింగ్ శాఖ అధికారులను ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. చిలకలూరిపేట టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన మల్లెల రాజేష్‌నాయుడు నెల రోజుల క్రితం వైఎస్సార్ సీపీలో చేరటంతో ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. పట్టణంలో తనకంటూ ప్రత్యేక వర్గం కలిగిన రాజేష్‌నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజినికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఫలితంగా తన గెలుపు అవకాశాలు తగ్గిపోవడంతో మంత్రి పుల్లారావు ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహిస్తున్న రాజేష్ ఇకపై ఆ వ్యాపారం చేయకూడదంటూ మార్కెటింగ్ శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న తరుణంలో మంత్రి పుల్లారావు అధికారులపై ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని.. ఎటువంటి కారణాలు చూపకుండానే అధికారులు తాను చేస్తున్న వ్యాపారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని రాజేష్‌నాయుడు ఎన్నికల అధికారులకు, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో గ్లోబల్ మర్చంటైజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాజేష్‌నాయుడు చాలాకాలంగా పశువుల కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి అమ్మకంపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెస్ చెల్లిస్తున్నారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి సువార్త ఆయన కార్యాలయానికి ఫోన్‌చేసి, శనివారం సంతలో పశువుల క్రయ, విక్రయాలు చేయకూడదని ఆదేశించారు. తమ సంస్థ ఎందుకు వ్యాపారం నిలిపివేయాలో కారణాలు చెప్పాలని, దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలని రాజేష్ కోరారు. అవేమీ తనకు తెలియదని, వ్యాపారం నిర్వహించకూడదని ఆమె హెచ్చరించారు. దీంతో రాజేష్ జిల్లా అధికారులకు, ఎన్నికల ప్రధానాధికారికి, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. మంత్రి పుల్లారావు తనపై వేధింపులకు దిగుతున్నారని, వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ ప్రధాన కార్యదర్శి సువార్తను ‘సాక్షి’ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పటివరకు ఆయన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను అడిగామన్నారు. రాజేష్‌నాయుడు మాట్లాడుతూ.. తన కార్యాలయ ఉద్యోగి భూపతిని ఆమె కార్యాలయానికి పిలిపించుకుని వ్యాపారం చేయొద్దని ఆదేశించారన్నారు. శనివారం సంతలో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. -
ముసుగులో పొత్తు ఎందుకు యాక్టర్?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు, ఆయన పాట్నర్ యాక్టర్ (పవన్ కళ్యాణ్) కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎవరికి చెబితే ఆ యాక్టర్ వారికే టికెట్లు ఇస్తున్నారని, ముసుగు కప్పుకుని టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి కూడా డిపాజిట్లు రావని తెలిసి టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి ఎంటో చెప్పకుండా.. చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో మహిళలకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలలేదని, మహిళలకు కనీసం రక్షణ కూడా కరువైందని అన్నారు. డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా చిలకలూరి పేట బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజినీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘సుధీర్ఘ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు పాలన ఏవిధంగా ఉందో చూశాను. అన్ని వర్గాల ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. స్థానిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పేదల సొమ్మును దోచుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించారు. ఐదేళ్ల కాలంలో రూ.600 కోట్లు దోచుకున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి.. నిలువునా ముంచారు. మహిళలు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు పాలనతో మోసపోయిన ప్రతిఒక్కరికి మాట ఇస్తున్న మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం. అలా చేయకపోతే ఓట్లు అడగం.. 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు అండగా ఉంటాం. పావలా వడ్డీకే రుణాల ఇస్తాం. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు 75వేల ఆర్థిక సహాయం చేస్తాం. చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలోకి మద్యంషాపులను తీసుకొచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు విడతల్లో మద్యం పూర్గిగా నిషేధిస్తాం. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను. ఆర్థికంగా వెనుకబడినవారు పిల్లల్ని చదించలేని పరిస్థితి. వారందరికీ నేను ఉన్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత పిల్లల్ని బడికి పంపిస్తే చాలు ఏడాదికి 15వేలు అందిస్తాం. ఆర్థికంగా చదువుకునే స్తోమత లేనివారిని ఇంజనీరింగ్, డాక్టర్ చదవులను చదవిస్తాం. వారందరి కుటుంబంలో చిరునవ్వు చూడటటే నా లక్ష్యం. మరో ఇరవై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అబద్ధాలతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. లా అండ్ఆర్డర్ ఎక్కడా? ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారు. హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మా బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు. ఆయనే చంపించి హత్యను చిత్రీకరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాపాడుకోవడానికి చంద్రబాబు కుట్రలు అనేక చేస్తున్నారు. ఆయన మోసాలను ప్రజలందరూ గమనించాలి. ఎన్నికల ముందు ఆయనిచ్చే మూడు వేలు తీసుకోని మరోసారి మోసపోవద్దు. చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ పనిచేయదు. ప్రభుత్వ అధికారిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేయి చేసుకున్నా చర్యలు తీసుకోరు. రిషితేశ్వరి అనే యువతి హత్య జరిగినా కనీసం విచారణ కూడా చేపట్టరు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలను రక్షణ లేకుండా పోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెడతాం. మహిళ రక్షణకు కఠిన చట్టాలను తీసుకొస్తాం’’ అని పేర్కొన్నారు. -
చిలకలూరిపేట: విజయాన్ని జగనన్నకు కానుక ఇస్తాం..
సాక్షి, చిలకలూరిపేట: మంత్రి ప్రతిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి విడదల రజినీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విడుదల రజనీ ప్రసంగిస్తూ మంత్రి పుల్లారావు, ఆయన సతీమణి నియోజకవర్గంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఇలాంటి నాయకులు తమకు అవసరం లేదని అన్నారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని కేబుల్ నెట్‌వర్క్‌ను కూడా నిలిపివేశారని ఆమె మండిపడ్డారు. జననేత వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి చిలకలూరిపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారని, చిలకలూరిపేటలో విజయం సాధించి జగనన్నకు కానుకగా ఇస్తామని ఆమె అన్నారు. చిలకలూరిపేటలో ఒక బీసీ మహిళ అయిన తనకు అవకాశం కల్పించినందుకు ఆమె వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చిలకలూరిపేట జనసంద్రమైంది. రహదారులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. -
వరవరరావుపై ఒక్క కేసూ నిలువలేదు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విరసం నేత వరవరరావు, మరో నలుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు పలు అభియోగాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న భారీ అభియోగంతోపాటు నేపాల్, మణిపూర్‌ల నుంచి నక్సలైట్లకు ఆయుధాలను సరఫరా చేయడంలో సహకరిస్తున్నారని, అర్బన్ మావోయిస్టుల కార్యకలాపాలకు నిధులిస్తున్నారన్నది ఇతర అభియోగాలు. ప్రస్తుతం వీరంత గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం 78 ఏళ్ల వరవరరావు గత 48 ఏళ్ల కాలంలో దాదాపు 25 కేసులను ఎదుర్కొన్నారు. ఏ ఒక్క కేసుల్లోనూ ఆయన దోషిగా తేలలేదు. ఆయనపై అన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఒక్క 2005 సంవత్సరంలోనే వరవరరావుపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. చిలకలూరిపేట, అచ్చంపేట పోలీసు స్టేషన్లపై నక్సలైట్ల దాడి, ఒంగోలు వద్ద ఓ సీనియర్ పోలీసు అధికారి కాన్వాయ్‌పై నక్సలైట్ల దాడి, బాలానగర్‌లో ఓ పోలీసు కాల్చివేత సంఘటనల నేపథ్యంలో వరవరరావుపై ఈ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించిన చిలుకలూరి పేట పోలీసు స్టేషన్‌పై దాడికి నక్సలైట్లను వరవర రావు రెచ్చగొట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి డైరెక్షన్ ఇచ్చారని, ఇందులో ఇతర విరసం సభ్యుల పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ఆరోపణ. పోలీసు స్టేషన్ పేల్చివేతకు నక్సలైట్లకు సెల్‌ఫోన్ ద్వారా డైరెక్షన్ ఇచ్చినట్లు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారి స్వయంగా ఆరోపణలు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై దాడిని కూడా వరవరరావు ప్రోత్సహించారని మరో కేసు దాఖలు చేశారు. ముగ్గురు పౌరుల మరణానికి దారితీసిన ఒంగోలు సమీపంలో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి వరవరరావుతోపాటు మరో విరసం నేత కళ్యాణ్‌రావు బాధ్యులని నేరారోపణలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లను విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న వరవరరావు ఇంట్లో జరిగిన రహస్య సమావేశంలో తాము పాల్గొన్నట్లు ఆ ఇద్దరు నక్సలైట్లు వెల్లడించారు. వరవరరావు కుట్ర కారణంగానే కానిస్టేబుల్‌ను కాల్చివేసిందనేది మరో కేసు. ఈ కేసుల్లోని లొసుగులను మీడియా పట్టుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో పోలీసులు విచారణకు ముందే మూడు కేసులను ఉప సంహరించుకున్నారు. ఒంగోలులో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మాత్రం వరవరరావుపై కొన్నేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఆ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. హత్యలకు, హత్యాయత్నాలకు ప్రోత్సహించారని, రెచ్చగొట్టారంటూ అంతకుముందు దాఖలైన నాలుగు కేసులు కూడా కోర్టు ముందు నిలబలేక పోయాయి. ఆయుధాల సరఫరా కేసులు ఆయుధాల డీలర్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయుధాల చట్టం–1959, పేలుడు పదార్థాల చట్టం–1908, కింద వరవర రావుపై దాదాపు తొమ్మిది కేసులను దాఖలు చేశారు. 1985లో ఆర్ఎస్యూ విద్యార్థి లాకప్ మరణానికి నిరసనగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయడం కోసం వరవరరావు స్వయంగా బాంబులు పంచారన్నది కూడా ఓ కేసు. 1974 నాటి సికిందరాబాద్ కుట్ర కేసు, 1986 నాటి నామ్‌నగర్ కుట్ర కేసు వీటిలో ప్రధానమైనవి. హత్య, హత్యాయత్నాలు, దోపిడీలను ప్రోత్సహించడం, కుట్ర పన్నడంతోపాటు దేశద్రోహం అభియోగాలను కూడా ఆయనపై మోపారు. వీటిలో ఏ ఒక్క కేసు కూడా కోర్టు ముందు నిలబడలేదు. దాదాపు ఇప్పుడు కూడా ఆయనపై ఇలాంటి కేసులనే పుణె పోలీసులు దాఖలు చేశారు. మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్నారన్నది కాస్త కొత్త కేసు. 1998లో కాలేజీ అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసి, పింఛను డబ్బులతో బతుకుతున్న వరవరరావు, మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రశ్న. ఇదివరకటిలా ఈ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా విడుదలవుతారని వారు ఆశిస్తున్నారు. -
చిలకలూరిపేటలో భారీ అగ్నిప్రమాదం
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒంటిగంట సమయం లో ఒక్కసారిగా పాత కలప దుకాణం లో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో పక్క షాపులకు కూడా వ్యాపించటం తో చిలకలూరి పేటలో హైటెన్షన్ నెలకొంది. మంటలు వ్యాపించిన తొమ్మిది షాపుల్లోను భారీగా కలప నిల్వ ఉండటం తో మంటలు ఎగసి పడ్డాయి. దీనికి తోడు గాలి కూడా తీవ్రంగా ఉండటంతో పరిస్ధితి భయంకరంగా మారింది. మంటల్ని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది అష్ట కష్టాలు పడ్డారు. నాలుగు ఫైరింజన్లు తో పాటు స్డానికంగా ఉన్న వాటర్ ట్యాంకు తో మూడు గంటల పాటు కష్టపడితే కాని మంటలు అదుపులోకి రాలేదు. మంటల తీవ్రతకు షాపుల చుట్టు పక్కలవారు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ప్రమాదం లో దాదాపు కోటి వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియటం లేదు. -
ఫేస్బుక్ లైవ్‌లో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య
సాక్షి, చిలకలూరిపేట టౌన్: పక్షవాతంతో మంచం పట్టిన తన తండ్రిని అధికారపార్టీ నాయకులు పట్టించుకోవట్లేదని మనస్తాపం చెందిన టీడీపీ యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి.. చిలకలూరిపేటలోని తూర్పు దళితవాడకు చెందిన టీడీపీ నాయకుడు యడ్ల దాసు అలియాస్ జింగిరి రెండేళ్లక్రితం పక్షవాతంతో మంచం పట్టాడు. అప్పట్నుంచీ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు మేరిబాబు, విజయ్ కుమారులు. ఎంటెక్ చేసిన మేరిబాటు స్థానిక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. దాసు భార్య ఎస్తేరు రోజువారీ కూలీ పనులకు వెళుతోంది. వీరిద్దరూ సంపాదించిన డబ్బులు దాసు వైద్యఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు విజయ్ ఇంటర్ పూర్తవగానే టవర్ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భర్త వైద్య చికిత్సకయ్యే ఖర్చు తడిసిమోపెడవడంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎస్తేరు స్థానిక టీడీపీ నాయకులను కలసి.. చికిత్సకయ్యే ఖర్చును మంత్రి ద్వారా ఇప్పించేలా చూడాలని ఎన్నోసార్లు వేడుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇదుగో అదుగో అంటూ టీడీపీ నాయకులు కాలయాపన చేశారు తప్ప పట్టించుకోలేదు. పార్టీ వైపు నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సాయం అందలేదు. ఈ పరిస్థితుల్లో తండ్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడం, కుటుంబమంతా కష్టపడినా వైద్యఖర్చులకు కూడా సరిపోకపోవడంతో విజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం చీరాలలోని రామాపురం బీచ్‌కు పురుగు మందు డబ్బా తీసుకెళ్లిన విజయ్ అక్కడే ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి టీడీపీ తమకు ఏ సహాయం చేయలేదని, అయినవాళ్లే అంతా అన్యాయం చేశారని, ప్రభుత్వం ఏర్పడినా ఉద్యోగాలు రావని ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ పురుగుమందు తాగాడు. తన మరణంతోనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి.. మంచంలో ఉన్న తన తండ్రిని బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. పురుగు మందు తాగి పడిపోయిన విజయ్‌ని గమనించిన స్థానికులు గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. -
‘లోకేశ్ అడిగితే నా సీటిచ్చేస్తా’
సాక్షి, చిలకలూరిపేట టౌన్: మంత్రి నారా లోకేశ్ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వటానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవటం తమ అదృష్టంగా భావిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు నిర్వహించటానికి ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. -
ఆత్మవిశ్వాసంతో అందలం
చిలకలూరిపేట: పుట్టింది పేద కుటుంబం..తండ్రి సా«ధారణ ఫొటోగ్రాఫర్..ఎన్నో ఆర్థిక ఇబ్బందులు..ఎడ్యుకేషన్ లోన్‌పై ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఎందరో సామాన్య విద్యార్థులు యువకులకు ఆదర్శంగా నిలిచాడు చిలకలూరిపేట పట్టణానికి చెందిన చందోలు విజయనాగమణికంఠ. ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ఆదివారం ఒక అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆయన సాక్షితో అనుభవాలను పంచుకున్నారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపిక 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై ప్రిలిమ్స్‌లో అవలీలగా విజయం సాధించాను. మేము సిద్ధమైన తీరుకు భిన్నంగా అప్పటి వరకు కొనసాగుతున్న ప్యాట్రన్‌ను మార్చడంతో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయా. దీంతో నిరాశ అలుముకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. సివిల్స్‌కు సిద్ధమైన అనుభవంతో ఎస్బీఐ పీవో, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, సెంట్రల్ పారామిలటరీ ఫోర్సు పరీక్షల్లో విజయం సాధించా. సెంట్రల్ పారా మిలటరీ ఫోర్సులో డీఎస్పీ కేడర్ ఉద్యోగం లభించినా, చదువుకునే అవకాశం ఉండదని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేడర్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి శిక్షణలో చేరా. ఈ శిక్షణ కారణంగా 2014లో సివిల్స్‌కు హాజరు కాలేకపోయాను. 2015లో ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా ఎఫ్ఆర్వో ఉద్యోగ శిక్షణ కారణంగా మెయిన్స్‌కు హాజరు కాలేదు. మూడో ప్రయత్నంగా 2017లో ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను. డెహ్రడూన్‌లో శిక్షణ పొందుతున్నాను. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్ శిక్షణకు ముందు కొంత సమయం ఖాళీ ఉండటంతో తిరిగి సివిల్స్ పరీక్ష రాసి 2018 ఏప్రిల్ 27న ప్రకటించిన ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నాకు ఐపీఎస్, ఐఏఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తే చాలనుకున్నాను. ఏది సాధించినా ఎలా ప్రజలకు సేవ చేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సివిల్స్‌కు మరో రెండు అవకాశాలు ఉన్నా ఐపీఎస్ పట్ల సంతృప్తి ఉండటంతో మరోసారి రాయదల్చుకోలేదు. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందించడమే లక్ష్యం. ఆత్మవిశ్వాసంతో మెలగాలి సాధారణ, నిరుపేద కుటుంబాలకు చెందినవారు తాము సివిల్స్‌లో విజయం సాధించలేమని నిరాశ పడుతుంటారు. ఆ భావన సరికాదు. ఎవరికైనా పట్టుదల, కృషి ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మంగాచారి, శారదదేవితో పాటు నన్ను నిరంతరం ప్రోత్సహించి ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు సహకరించిన చిలకలూరిపేట డీఆర్ఎన్ఎస్సీవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్యవైశ్య విద్యానిధి సంఘ కన్వీనర్ పొట్టి శ్రీరాములుకు జీవితాంతం రుణపడి ఉంటాను. రైల్వే ఉద్యోగం చేస్తూనే సన్నద్ధం నాన్న మంగాచారి సాధారణ ఫోటోగ్రాఫర్. అమ్మ శారదాదేవి గృహిణి. అన్న మధుబాబు డిగ్రీ చదివి ఉద్యోగం లభించక పోవడంతో ఫొటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఇంటర్ వరకు ప్రకాశం జిల్లా మార్టూరులో చదువుకున్నాను. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(కంప్యూటర్ సైన్సు) 2010లో పూర్తి చేశాను. ఎంటెక్ చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం లభించినా ఏడాది తర్వాత చేరమన్నారు. బీటెక్ చదివే రోజుల్లో కొందరు సీనియర్లు కళాశాల లైబ్రరీలోని ప్రత్యేక విభాగంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండేవాళ్లు. అప్పుడే నేనూ అవ్వాలన్న ఆకాంక్ష మొదలైంది. మనసులో సివిల్స్‌పై బలమైన కోరిక ఉన్నా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉండటం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2011లో రైల్వే మెయిల్ సర్వీసులో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగం లభించడంతో అందులో చేరాను. పోస్టింగ్ ఏలూరులో లభించింది. డ్యూటీ సాయంత్రం 5 గంటల నుంచి మర్నాడు తెల్లవారు 5 గంటల వరకు రోజుమార్చి రోజు ఉండేది. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకున్నా రోజుమార్చి రోజు డ్యూటీ కావడంతో చదువుకునేందుకు సమయం దొరికేది. గ్రంథాలయమే తొలిగురువు ఏలూరులోని జిల్లా గ్రంథాలయానికి వెళ్లేవాణ్ని. అక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్అయ్యే కొందరు నిరుద్యోగులు క్యారేజీలలో అన్నం కట్టుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలు, మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లు చదువుతుండేవారు. వారిని చూసి నేను ఎక్కువ సమయం చదివేందుకు కేటాయించడం ప్రారంభించాను. అక్కడ ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు చేరుకున్నాను. నేను పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సివిల్స్ పరీక్షలు తెలుగులో రాసే అవకాశం ఉన్నా మెటీరియల్ లభ్యత ఇతర అవకాశాలు ఆంగ్లంలో ఎక్కువగా ఉండటంతో అందులోనే ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నా రూంలో టీవీ కూడా లేకపోవడంతో చిన్న ట్రాన్సిస్టర్‌ను తెచ్చుకుని ఆల్ఇండియా రేడియోలో ఇంగ్లిష్ వార్తలు వినేవాణ్ని. అర్థం కాకపోయినా డిక్షనరీ తెచ్చుకుని పదేపదే ఇంగ్లిష్ మ్యాగజైన్లు చదివి ఆంగ్లంపై పట్టు సాధించా. 2012లో డాక్టర్ కొణిజేటి రోశయ్య ఐఏఎస్ అకాడమీలో చేరాను. వారు 10 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు. -
ఆయన రాష్ట్ర మంత్రి.. భార్య స్థానిక మంత్రి!
సాక్షి, గుంటూరు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని, అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే హత్యలకు సైతం వెనుకాడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలుకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగసభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి పుల్లారావు అక్రమాలను ఎండగట్టారు. పుల్లారావు హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని, తనను ప్రశ్నించిన వారిని హత్య చేయించేందుకు వెనుకాడటం లేదన్నారు. మంత్రి అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తే శంకర్ అనే విలేకరిని హత్యచేయించారని ఆరోపించారు. మరో విలేకరి సురేంద్రపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని చెప్పారు. పుల్లారావు భార్య స్థానికంగా మంత్రిగా చెలామణి అవుతున్నారని తెలిపారు. చిలుకలూరిపేటలో మంత్రి పుల్లారావు అరాచకాలకు అంతే లేదన్నారు. పుల్లారావుతో పాటు ఆయన భార్య కూడా తానేం మంత్రి హోదాకు తక్కువ కాదన్నట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. చివరకు ఇక్కడ టపాసులు అమ్మాలన్నా పుల్లారావుకు కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మంత్రి పుల్లారావుకు రోజులు దగ్గర పడ్డాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్థానికల ప్రజలనుద్దేశించి వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖర్ ప్రసంగించారు. -
అక్రమ దందా
పేదల ఇళ్లను అడ్డుపెట్టుకుని కాసుల పంట పండించుకుంటున్నారు.. మౌలిక వసతుల కోసం మంజూరైన నిధులు బొక్కేయాలని చూస్తున్నారు.. ప్రారంభోత్సవం పేరుతో అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేటలో గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమార్కుల దందాపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట: గృహకల్ప ఇళ్లలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూడు లేని పేద, దిగువ మధ్యతరగతి వారి కోసం నిర్మించిన గృహాలూ వారి దోపిడీకి వరప్రదాయనిగా మారాయి. మరోవైపు తాగునీరు, పక్కా రోడ్లు వంటి మౌలిక వసతులు సమకూర్చకుండానే గృహసముదాయానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి ప్రారంభోత్సవం నిర్వహించటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇళ్లు పూర్తయినా... 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం సమీపంలో ఎన్ఆర్టీ రోడ్డు పక్కన సొంత ఇళ్లు లేని వారి కోసం రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా అపార్ట్మెంట్ల తరహాలో మూడు బ్లాకులుగా 72 గృహాల నిర్మాణం ప్రారంభించారు. లబ్ధిదారు వాటాగా రూ.8250, ప్రభుత్వ సబ్సిడీ రూ.10 వేలు, బ్యాంకు రుణం రూ.74,250గా నిర్ణయించి ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అయితే తలుపుల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అదే ప్రాంగణంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు జీ ప్లస్ 2 ప్రాతిపదికన ఎనిమిది బ్లాకులుగా 192 గృహాలు నిర్మించేందుకు అనుమతి లభించింది. వాటిని పేద, దిగువ మధ్యతరగతి ఆర్యవైశ్యులకు కేటాయించారు. అయితే బ్యాంకు రుణాలు అన్ని ఇళ్లకూ లభించకపోవటంతో ఒక్కో బ్లాకుకు 24 ఇళ్ల చొప్పున 120 ఇళ్ల నిర్మాణం శ్లాబుల వరకు పూర్తయి ఆగిపోయింది. మరో 72 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. వీటిలో ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.28 లక్షలుగా నిర్ణయించగా లబ్ధిదారు వాటాగా మొత్తం 192 మంది రూ.20 వేల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని అప్పటి ప్రభుత్వమే కేటాయించింది. వైఎస్సార్ మరణంతో గృహ నిర్మాణం మధ్యలో నిలిచిపోవటంతో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ జీ ప్లస్ 2 లబ్ధిదారులు కలిసి బాపూజీ పౌరసేవా కేంద్రంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, పాలకుల చుట్టూ అనేక పర్యాయాలు తిరిగారు. అనంతరం రూ.3.85 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో రాజీవ్ గృహకల్ప 72 ఇళ్లు, ఇందిరమ్మ జీ ప్లస్ 2కు సంబంధించిన 120 ఇళ్లు వెరసి మొత్తం 192 ఇళ్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి ఇవ్వాల్సి ఉంది. వసూళ్ల పర్వం ఇలా... లబ్ధిదారులే ఒక సంఘంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి కోసం కృషి చేయగా, నిధులు మంజూరైన అనంతరం లబ్ధిదారు కూడా కాని టీడీపీ పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, మంత్రికి అనుంగు అనుచరుడైన వెల్లంపల్లి రవిశంకర్ అధ్యక్షుడు గృహ సముదాయం పేరును ఆదర్శ గృహకల్ప, ప్రత్తిపాటి నగర్‌గా మార్చేశారు. గృహ ప్రవేశాలకు ఖర్చులు అవుతాయంటూ 192 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున చెల్లించాలని చెప్పారు. సొమ్ము ఎందుకు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు ప్రశ్నించటంతో ఒక్కొక్కరు రూ.2500 చొప్పున చెల్లించాలని అందరికీ ఫోన్ మెసేజ్‌లు పెట్టి మరీ వసూలు చేశారు. బ్యాంకు రుణం ఇవ్వకపోయినా... జీ ప్లస్ 2 గృహాలకు సంబంధించి 120లో 96 గృహాలకు మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. మిగిలిన 24 ఇళ్లకు రుణాలు మంజూరు కాలేదు. రుణాలు మంజూరైన 96 మంది వన్‌టైం సెటిల్మెంట్గా ఒక్కొక్కరు రూ.26 వేల చొప్పున ఆయా బ్యాంకులకు ఇప్పటికే చెల్లించేశారు. రుణం మంజూరుకాని 24 ఇళ్లు కూడా అంతకు ముందే శ్లాబు దశ వరకు పూర్తయి ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దీంతో 96 మంది లబ్ధిదారులు బ్యాంకుకు రూ.25 వేలు చెల్లించిన విధంగా తమకూ చెల్లించాలని ఆదర్శ గృహకల్ప అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న మంత్రి అనుచరుడైన టీడీపీ నాయకుడు వెల్లంపల్లి రవిశంకర్ డిమాండ్ చేస్తున్నాడని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తం 24 మంది వద్ద నుంచి రూ.6 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇలా అక్రమంగా వసూలు చేసిన డబ్బు ఎవరి కొంగున ముడిపడతాయన్నది జగమెరిగిన సత్యమేనని మండిపడుతున్నారు. మౌలిక వసతులేవీ? ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ గృహకల్పలో మౌలిక వసతులు సమకూరలేదు. మంచినీటి పైపులైన్ కూడా ఏర్పాటు చేయలేదు. పక్కా రోడ్లు నిర్మించలేదు. విద్యుత్ పనులు పూర్తికాలేదు. దీనిపై లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు కట్టమంటున్నారు జీ ప్లస్ 2 గృహ సముదాయంలో బ్యాంకు రుణం లేకుండా ఇల్లు వచ్చింది. బ్యాంకు రుణం తాలూకు డబ్బులు తమకు చెల్లించాల్సిందిగా వెల్లంపల్లి రవిశంకర్ అడుగుతున్నాడు. అసలు రుణం మంజూరుకాకుండా డబ్బులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వ శాఖల రసీదు ఉంటే కడతానన్నాను. – కొత్త వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు తాళాలు ఇవ్వలేదు ప్రారంభ ఖర్చులకని రూ.2500 అడిగారు. నేను మసాలా బండి వేసుకొని జీవనం వెళ్లదీస్తాను. డబ్బులు ఇవ్వలేనన్నాను. దీంతో రవిశంకర్ నాకు తాళాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బులు చెల్లిస్తేనే ప్లాటు తాళాలు ఇస్తామంటున్నారు. – కె.వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు డీడీ చెల్లించాం జీ ప్లస్ 2లో ఇంటి కోసం నా భార్య జయలక్ష్మి పేరున రూ.20 వేలు డీడీని 2008లో చెల్లించాం. మాకు అప్పట్లోనే ప్రభుత్వం స్థల కేటాయింపు పత్రం ఇచ్చింది. అయితే మాకు ప్లాటు రాలేదు. ఇళ్లు నిర్మించని 72 మంది జాబితాలో మా పేరు ఉంది. మా డబ్బు, ఇంటి స్థలం ఏమైనట్టు? – పోలిశెట్టి సాంబశివరావు, లబ్ధిదారుడు -
జనపథం - చిలకలూరి పేట బైపాస్ రోడ్
-
కత్తితో భార్య గొంతు కోశాడు
గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట కుమ్మరిపేటలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. మాణిక్యాలరావు అనే వ్యక్తి కుటుంబకలహాలతో భార్య శిఖా వనజాక్షి (40)ని కిరాతకంగా చంపాడు. నిద్రిస్తున్న వనజాక్షి గొంతుకోసి హత్యచేశాడు. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మాణిక్యాలరావు పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆసుపత్రి నిర్వాకంపై ఆందోళన
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళకు సరైన చికిత్స అందకపోవడంతో ఇద్దరు కవలలతో సహా మహిళ మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఈ దారుణం జరిగిందని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు సరైన చికిత్స అందించకుండా.. చివరి క్షణంలో వేరే ఆసుపత్రికి వెళ్లమని సూచించడంతోనే మార్గమధ్యలో ఆ మహిళ మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు. -
హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
చిలకలూరిపేట : పట్టణంలోని సీఆర్ క్లబ్లో ఇన్విటేషనల్ టెన్నిస్ పోటీలు ఆదివారం రెండోరోజు హోరాహోరీగా సాగాయి. 50 ఏళ్ల లోపు, 50ఏళ్లు పైబడి విభాగాల్లో నిర్వహిస్తున్నారు. గుంటూరు, ప్రకా«శం, కృష్ణాజిల్లాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొంటున్నాయి. పోటీలు అర్ధరాత్రి వరకూ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్ చిలకలూరిపేట
గుంటూరు స్పోర్ట్స్ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీల్లో చిలకలూరిపేటకు చెందిన అథ్లెటిక్స్ బాలికల జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలను గురువారం స్థానిక బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రారంభించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాలలో జరిగిన పోటీలలో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చి రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. డీఎస్డీవో బీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఆర్ స్టేడియంలో ఈనెల 3వ తేదీన బాక్సింగ్, ఖోఖో, 5వ తేదీన కబడ్డీ, హాకీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. 7వ తేదీన నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఫుట్‌బాల్, వాలీబాల్, తైక్వాండో పోటీలు జరుగుతాయన్నారు. విజేతలు వీరే.. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల జాబితాను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు ప్రకటించారు. అండర్–14 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వంద మీటర్ల పరుగులో ధన్‌రాజ్ (బాపట్ల), కె.ఉమేష్ (గుంటూరు తూర్పు) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 400మీటర్ల పరుగులో బి.పవన్‌కుమార్(చిలకలూరిపేట), సి.హెచ్.గోపి (వినుకొండ), లాంగ్‌జంప్‌లో కె.గోపివర్మ (బాపట్ల), బి.రాము (రేపల్లె), షాట్‌పుట్‌లో పృథ్విరాజ్ (వేమూరు), సైదు మస్తాన్‌వలి(వినుకొండ), బాలికల విభాగంలో వంద మీటర్ల పరుగులో కె.సీతమ్మ (పొన్నూరు), ఆర్.అంజలి (మాచర్ల), 400 మీటర్ల పరుగులో బీబీ ఫాతిమా (గుంటూరు తూర్పు), ఎ.నిఖిత (రేపల్లె), లాంగ్‌జంప్‌లో డి.శ్రావణి (గుంటూరు పశ్చిమ), ఎ.సాయిదుర్గ (బాపట్ల), షాట్‌పుట్‌లో బి.మానస (గుంటూరు పశ్చిమ), ఎల్.పూజ (వేమూరు), అండర్–17 బాలుర విభాగంలో వంద మీటర్ల పరుగులో జి.హర్షవర్ధన్ (గుంటూరు తూర్పు), ఆర్.సాంబిరెడ్డి (సత్తెనపల్లి), 400 మీటర్ల పరుగులో బి.శ్యామేల్ (బాపట్ల), షేక్ రసూల్ (నరసరావుపేట), లాంగ్‌జంప్‌లో ఎ.కోటేశ్వరరావు (గుంటూరు తూర్పు), జె.రమేష్ (గుంటూరు తూర్పు), ఎ.సాంబిరెడ్డి (చిలకలూరిపేట), వీరాంజనేయులు (వినుకొండ), బాలికల విభాగంలో వంద మీటర్ల పరుగులో బి.జ్యోతి (చిలకలూరిపేట), బి.రాజ్యలక్ష్మి (వేమూరు), 400 మీటర్ల పరుగులో జె.రాణి (ప్రత్తిపాడు), డి.లహరి (రేపల్లె), లాంగ్‌జంప్‌లో ఎన్.సౌజన్య (చిలకలూరిపేట), కె.సుప్రియ (వినుకొండ), షాట్‌పుట్ విభాగంలో కె.శాంతకుమారి (నరసరావుపేట), ఎం.నాగభార్గవి (పొన్నూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఎమ్మెల్సీ రామకృష్ణ ట్రోఫీ అందజేశారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
తాటిచెట్టే ఆధారంగా మృత్యువుతో పోరాటం
-
తాటిచెట్టే ఆధారంగా మృత్యువుతో పోరాటం
సాహసం చేసి కాపాడిన గ్రామ యువకులు చిలకలూరిపేట రూరల్: వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడు అందుబాటులోని తాటి చెట్టును ఆధారంగా చేసుకొని 8 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గంగన్న పాలెంలో గురువారం చోటు చేసుకుంది. వరద ధాటికి కోమటినేనివారిపాలెం ఎత్తిపోతల పథకంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చేవూరి కొండలు కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. కొండలు కుమారుడు వెంకటేశ్ గ్రామస్తుల సహాయంతో క్షేమంగా బయటపడ్డాడు. వాగు సమీపంలోనే ఎత్తిపోతల వద్ద ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు ఏర్పాటుచేసిన ప్రహరీ నీటి ప్రవాహానికి కొట్టుకుని రావడంతో కొండలు కుమారుడు వెంకటేశ్, సోదరుడి కుమార్తె వనజలను రెండు భుజాలపైకి ఎత్తుకుని, భార్య సుబ్బులును చేతితో పట్టుకుని రోడ్డుపైకి చేరేందుకు ప్రయత్నించాడు. నీటి ఉధృతికి నలుగురూ కొట్టుకుపోయారు. బ్రిడ్జికి కిలోమీటరు దూరంలో వెంకటేశ్ ఓ తాటిచెట్టును పట్టుకుని వేలాడడాన్ని చూసిన సమీప బంధువు పోలయ్య అతన్ని కాపాడేందుకు వెళ్లి చిక్కుకుపోయాడు. హెలికాప్టర్ నుంచి సాయం వస్తుందని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరికి గ్రామస్తులు తాళ్లు పట్టుకొని వారిద్దరినీ బయటికి తీసుకొచ్చారు. -
కోడిపందాలపై దాడులు: పలువురి అరెస్టు
గుంటూరు: గుంటూరు జిల్లాలో కోడిపందాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని చిలకలూరి పేట మండలం, బొప్పూడి లో జరుగుతున్న కోడిపందాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, 7 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
కూతుర్ని కాపాడబోయి తల్లీ మృత్యువాత
బావిలో పడిన చిన్నారి... చిలకలూరిపేటరూరల్: కన్న బిడ్డను కాపాడే ప్రయత్నంలో బిడ్డతోపాటు తల్లి కూడా మరణించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో మురికిపూడి గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల సమాచారం మేరకు.. మురికిపూడి గ్రామానికి చెందిన కొమ్మనబోయిన కోటయ్య, భార్య నాగమణి(26)కి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె చెంచులక్ష్మి నాలుగో తరగతి, ద్వితీయ కుమార్తె జానకి రెండో తరగతి చదువుతున్నారు. కోటయ్య దంపతులు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో నేలబావి నీటి ఆధారంగా ఆకుకూరలను సాగు చేస్తున్నారు. సోమవారం తల్లి నాగమణి మూడో కుమార్తె వెంకటరమణ(5)ను వెంటపెట్టుకొని సొంత వ్యవసాయ భూమిలో కలుపు తీసేందుకు వెళ్లారు. కుమార్తెను గట్టుపై కూర్చోపెట్టి తినేందుకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి తల్లి కలుపు తీస్తుంది. ఈ క్రమంలో కుమార్తె ఆటలాడుకుంటూ వెళ్లి కాలు జారి నేలబావిలో పడింది. చిన్నారి బావిలో పడిన సమయంలో శబ్దం రావటంతో గమనించిన తల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి బావిలోకి చూడగా, బిస్కెట్ ప్యాకెట్ పైన తేలియాడుతుంది. దీనిని గమనించిన నాగమణి కుమార్తెను కాపాడేందుకు తానూ దూకింది. సమీపంలోని పంట పొలాల్లో పనులు నిర్వహించుకునే కూలీలు గమనించి బావి వద్దకు చేరుకున్నారు. ఇదే సమయానికి బావిలోని నీళ్లపైకి బాలిక మృతదేహం తేలింది. అనంతరం తాళ్లు, గడకట్టెల సహాయంతో నాగమణి మృతదేహాన్ని పైకి తీశారు. మృతురాలు నాగమణి తండ్రి సూరబోయిన యలమంద ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ జిలానీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. పొలానికి వెళ్లద్దని చెప్పినా.. వచ్చావు తల్లి, చెల్లి మృతదేహాలు నేలపై పడి ఉండటాన్ని చూసిన ప్రథమ, ద్వితీయ కుమార్తెలు చెంచులక్ష్మి, జానకీ బోరున విలపించారు. తల్లి, చెల్లి మరణించటంతో పాఠశాలకు వెళ్లిన వీరు ఇద్దరిని తీసుకువచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అక్కా చెల్లెళ్లు తీవ్రంగా రోదించారు. వారి రోదనను చూసిన స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి. ఇద్దరినీ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అన్ని సౌకర్యాలు అందించే తల్లి, ఆటపాటలు ఆడేందుకు చెల్లి తోడుండేవారు. ఇకపై మాకు తోడు ఎవరూ అంటూ బిక్కముఖాలేశారు. ఈ రోజు పొలానికి వెళ్లవద్దని చెప్పినా.. వచ్చావు అంటూ మృతురాలు భర్త కోటయ్య రోదించిన తీరు గ్రామస్థులను కంటతడిపెట్టించింది. -
చిలకలూరిపేటలో విషాదం
గుంటూరు (చిలకలూరిపేట) : చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. బావిలో పడిన కూతురిని కాపాడబోయి తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన కొంగబోయిన నాగమణి(30) పొలంలో కలుపు తీయడానికి బయలుదేరుతూ ఆరేళ్ల కూతుర్ని కూడా వెంట తీసుకెళ్లింది. తల్లి పొలంలో కలుపు తీస్తుండగా ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నారి దగ్గరలో ఉన్న ఊట బావి దగ్గరకెళ్లింది. ప్రమాదవశాత్తూ బావిలో పడిపోవడంతో చిన్నారి కేకలు వేసింది. కేకలు విన్న తల్లి నాగమణి కూతురిని కాపాడాలనే ప్రయత్నంలో ఏమీ ఆలోచించకుండా బావిలో దూకేసింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకూతుళ్ల శవాలు బావిలో నుంచి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. -
నడిరోడ్డుపై యువతి దారుణహత్య
చిలకలూరిపేట (గుంటూరు) : గుంటూరు జిల్లాలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న యువతి విధులు ముగించుకొని బయటకువస్తున్న సమయంలో ఓ వ్యక్తి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుగాలి కాలనీలోని కళ్యాణి రెస్టారెంట్ ఎదుట జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుగాలి కాలనీకి చెందిన రమావత్ జైనీ బాయి(25)కి అదే కాలనీకి చెందిన బాలునాయక్(29)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోవడంతో.. కళ్యాణి రెస్టారెంట్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే రెస్టారెంట్లో పని చేస్తున్న వ్యక్తితో సహజీవనం చేస్తుండేది. కాగా జైనీబాయితో సహజీవనం చేస్తున్న సదరు వ్యక్తి నెల రోజుల కిందట ఆటో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమె మంగళవారం రెస్టారెంట్లో విధులు ముగించుకొని బయటకు వస్తుండగా.. ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా.. దాడి చేసిన వ్యక్తి గతంలో జైనీబాయితో సహజీవనం చేసిన వ్యక్తి సోదరుడు సామ్యూల్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.30 లక్షల నోట్లు కాలిపోయాయి
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 లక్షల నగదు కాలిపోయింది. 10 కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైళ్లు బూడిదయ్యాయి. స్టోర్ రూంలో విద్యుత్ షార్ట సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బోస్రోడ్డులోని ఈ బ్యాంకులో ఉదయం 11 గంటల సమయంలో స్టోర్ రూం నుంచి మంటలు, పొగ వచ్చాయి. దీంతో సిబ్బంది ఖాతాదారులు బయటకు పరుగులు తీశారు. బ్యాంకు మేనేజర్ జి.శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనం గోడ పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ స్టాంగ్ రూమ్‌లోకివెళ్లి పరిశీలించారు. లాకర్లు భద్రంగానే ఉన్నాయని ఖాతాదారులకు ఎటువంటి నష్టంలేదని ప్రకటించారు. స్థానిక పండరీపురం బ్రాంచిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంకు డీజీఎం గిరీష్‌కుమార్ మాట్లాడుతూ రైతుల పాసుపుస్తకాలు, తనఖా పెట్టిన బంగారానికి ఎటువంటి భయం లేదని తెలిపారు. లాకర్లను గురువారం ఉదయానికి పండరీపురం శాఖకు చేరుస్తామని, ఖాతాదారులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. ప్రమాదంలో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల నగదు కాలిపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాలో తేలిందన్నారు. -
ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం
గుంటూరు : గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్‌లో మంగళవారం అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంకు అధికారులు, సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జర్నలిస్టు శంకర్‌ను చంపిందెవరు..?
-
రాములోరి భూములపై కన్ను..
చిలకలూరిపేటరూరల్ : రాములోరి భూములపై అక్రమార్కుల కన్ను పడింది. స్వామివారి ధూప దీప నైవేద్యాల నిమిత్తం అందించిన భూమిని విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని నేపథ్యంలో జిల్లాలో భూములకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిపై అక్రమార్కులు కన్నేసినట్టు సమాచారం. దీనిలో భాగంగానే రాములోరి భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ వ్యవహారం అంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటి నుంచో ఈ భూమి సాగులో ఉన్నా 25 ఏళ్ల నుంచి దేవాదాయ శాఖకు కౌలు సొమ్ము జమ కావడం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే... చిలకలూరిపేటలోని బంగారపు కొట్ల బజారు వద్ద ఉన్న కోదండ రామాలయానికి పసుమర్రులో 1.62 ఎకరాల భూమి (సర్వే నంబర్ 762) ఉంది. ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నట్లు సబ్ రిజిస్టార్ కార్యాలయ రికార్డులు తెలుపుతున్నాయి. వీటికి భిన్నంగా రెవెన్యూ రికార్డులు, అడంగల్‌లో మరో పేరు ఉన్నట్టు తెలిసింది. స్వామివారి కల్యాణం...ఊరేగింపు.. పూర్వపు రోజుల్లో ఈ పంట భూమిలోనే శ్రీరామనవమి, స్వామివారి కల్యాణం నిర్వహించేవారు. దీని కోసం ఇక్కడ రాతితో కల్యాణ మండపం నిర్మించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించేందుకు ఈ పొలంలో నేలబావి తవ్వించారు. దశాబ్దాల కిందట మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించిన అనంతరం రాత్రి వేళ కాగడాలతో ఉత్సవ విగ్రహాలను ఊరేగించేవారని పలువురు పెద్దలు, రామభక్తులు తెలిపారు. ఈ భూమిని 25 ఏళ్ల కిందటి వరకు ట్రస్టీల వారసులు సాగు చేసుకున్నారు. అనంతరం కౌలుకు ఇవ్వసాగారు. అయితే కౌలుదారుడు కౌలు సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, పక్కకు వైదొలగమన్నా తప్పుకోకపోవడం వివాదంగా మారింది. తాను పక్కకు తప్పుకోలంటే భూమి అమ్మితే తనకూ కొంత మొత్తం ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు తెలిసింది. స్పందించని దేవాదాయ శాఖ ... దేవాదాయ శాఖకు చెందిన భూములను ప్రతి మూడేళ్లకు ఒకసారి బహిరంగ వేలం నిర్వహించి ముందుకు వచ్చిన రైతులకు కౌలుకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏకంగా 25 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తి భూమి సాగు చేస్తున్నా మిన్నకుండిపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఎకరా కౌలు రూ.12వేల చొప్పున స్వామివారి భూమి 1.62 ఎకరాలకు ఏడాదికి సుమారు రూ.19,440 రావాలి. ఇలా 25 ఏళ్లకు దాదాపు రూ. 4.86 లక్షల ఆదాయం రావాలి. వాటిని వసూలు చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని భక్తజనం ఆరోపిస్తోంది. ఇక ఆలయ భూములను రికార్డుల పరంగా చూస్తే ఆర్.ఎస్.ఆర్ ఫీల్డ్మ్యాప్లో ధర్మతోపు అని నమోదు చేశారు. ఇందుకు భిన్నంగా అడంగల్‌లో సర్వే నంబర్ 762లో 1.22 ఎకరాలు ఒకరి పేరు, 40 సెంట్ల భూమి మరొకరి పేరుతో ఉంది. దీని ఆధారంగా కొందరు వ్యక్తులు ఈ భూమిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో వైపు కోదండ రామస్వామి భూమిని గోవుల మేతకు కేటాయించాలని రామభక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అది రాములోరి భూమే.. సంబంధిత సర్వే నంబరులోని భూమి దేవాదాయ శాఖకు చెందిన రామాలయ భూమే.ఇప్పటివరకు కౌలు చెల్లించకపోవడంపై నోటీసులు జారీ చేస్తాం. అంతేగాక ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ఉన్నతాధికారులకు నివేదించి స్వామి వారి భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తా. - నాగిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి -
చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు మర్రి రాజశేఖర్ ఇంట్లో జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడులు వై వీ సుబ్బారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆర్ కే ముస్తఫా, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'జర్నలిస్ట్ హత్య కేసులో వేగంగా విచారణ'
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంవీఎన్ శంకర్ (53) హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు కోరారు. మంగళవారం జిల్లా ఎస్పీని ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రిపోర్టింగ్ పూర్తి చేసుకుని రాత్రి సమయంలో ఇంటికి చేరుకుంటుండగా ముగ్గురు ఆగంతకులు దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రికి తరలించగానే శంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలించడంపై వార్తలు రాసినందుకే మాఫియా గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొన్నారు. శంకర్ (53) హత్యను ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయూడబ్ల్యూజే), ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీఎన్‌ఈఎఫ్), ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించాయి. -
దుండగుల దాడిలో గాయపడ్డ పత్రికా విలేకరి మృతి
-
దుండగుల దాడిలో గాయపడ్డ పత్రికా విలేకరి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో ఓ దినపత్రిక విలేకరి శంకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దాడి ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్షణాల్లో..
చిలకలూరిపేట,న్యూస్‌లైన్ :అంతా క్షణాల్లో జరిగిపోయింది. రెప్పపాటులో 60 అడుగుల ఎత్తు గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మూడు నిండు జీవితాలను బలి తీసుకుంది. ఆటోల మరమ్మతుల కోసం షెడ్‌కు వచ్చి.. అప్పటిదాకా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న వారు ముగ్గురిపై షెడ్డు గోడ మృత్యుకెరటంలా విరుచుకు పడింది. శిథిలాల్లో సమాధి చేసింది. కొత్త ఆటో కొనుక్కుని చిన్నచిన్న మరమ్మతుల కోసం షెడ్‌కు వచ్చిన ఆటోవాలా ఒకరు...ఆటోలో పాతసామాన్లు అమ్ముకుని జీవించే వారొకరు..పొలం పనులు చేసుకుంటూ, ఖాళీ సమయంలో ఆటో తోలుకునే యువకుడొకరు.. ఇలా ముగ్గురి జీవితాలు మట్టిలో కలిసిపోయాయి. అల్లా మాకేంటి ఈ విషమపరీక్ష... ఆటోలో పాతసామాను అమ్ముకొని జీవిస్తున్న షేక్ నాగూర్‌వలికి భార్య జాన్‌బీ, ముగ్గురు ఆడపిల్లలు ఆషిరూన్‌బీ,సాహిరా, సానియా ఉన్నారు. పెద్ద కుమార్తె ఆషిరూన్‌బీ ఈ ఏడాది పదో తరగతిలోకి వచ్చింది. రెండో కుమార్తె ఆరోతరగతి, మూడో కుమార్తె సానియా నాల్గో తరగతి చదువుతున్నారు. నాగూర్వలి మృతిచెందిన సమాచారం తెలుసుకొన్న బంధుమిత్రులు ముందుగా ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాసుత్రికి చేరుకొని భోరున విలపించారు. అల్లా.. మాకేంటీ విషమపరీక్ష.. ముగ్గురు ఆడపిల్లల గతి ఏంకావాలి? అంటూ గోడకూలి ప్రమాదంలో మరణించిన బంధువుల ఆక్రందనలు, రోదనలతో ప్రభుత్వాసుపత్రి ప్రతిధ్వనించింది. మృతుడి నివాసమైన పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలో ఉన్న నివాసం వద్ద కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో తెచ్చిన రెండోరోజే..... ఈ ఘటనలో మృతి చెందిన షేక్ ఆదాం షఫీ(65)ది మరో విషాద సంఘటన. పట్టణంలోని రాగన్నపాలెంకు చెందిన ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రాత్రి ఆటోను కొనుగోలు చేసి మరమ్మతుల నిమిత్తం బుధవారం షెడ్‌కు తెచ్చాడు. షెడ్లో నాగూర్‌వలితో మాట్లాడుతుందగానే అకస్మాత్తుగా గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతలోకాలకు వెళ్లిపోయావా... గోవిందపురం(చిలకలూరిపేటరూరల్) : ఆంజనేయా ... అనంత లోకాలకు వెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు ... బంధుమిత్రులు ... గ్రామస్తులు కన్నీరు మున్నీరై విలపించారు. ఆటో మరమ్మతుల నిమిత్తం బుధవారం పట్టణంలోని మెకానిక్ షెడ్డు గోడకూలిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన వీరవల్లి వీరాంజనేయులు (23) గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా అంబులెన్స్ చుట్టూ బంధుమిత్రులు చేరి కన్నీరుమున్నీరై విలపించారు. గ్రామానికి చెందిన చిన్నకారు రైతు వీరవల్లి కోటేశ్వరరావు, భ్రమరాంబ దంపతుల రెండో కుమారుడైన వీరాంజనేయులు వ్యవసాయ పనులు నిర్వహిస్తూ ఖాళీ సమయాల్లో ఆటో నడుపుకుంటున్నాడు. త్వరలో వివాహం చేసి ఇంటివాడిని చేయాలనుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరిగిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది... ఓ ఆటో రిపేరుకు అవసరమైన విడిభాగం కోసం సమీపంలో ఉన్న ఆటోమొబైల్ దుకాణానికి వెళ్లా. ఒక్క సారిగా పెద్ద శబ్దంతో షెడ్లో ఉన్న వ్యక్తులు పరుగులు పెట్టడం కనిపిం చింది. వెంటనే షెడ్‌కు వెళ్లి చూస్తే భీతావహ వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. వెంటనే తేరుకొని స్థానికుల సహాయంతో పలువురుని రక్షించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపా. - బడేమియా,మెకానిక్ ఏం జరిగిందో అర్ధం కాలేదు ఆటో రిపేరుకోసం షెడ్‌కు వచ్చా. మాట్లాడుతుండగానే ఒక్కసారి గోడ పడిపోవడం కనిపించింది. ప్రాణభయంతో పెద్దగా అరుస్తూ పరుగులు తీశా. అప్పటికే గోడ తాలూకు శిథిల భాగాలు నాపై పడడంతో గాయపడ్డా. ప్రాణాలు దక్కించుకొన్నా. -పచ్చవ నాగేంద్రం, నాదెండ్ల, ఆటోడ్రైవర్ -
పేటలో బాలికపై యువకుడు అత్యాచారం
చిలకలూరిపేటలో వడ్డెర కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్‌పై ఓ యువకుడు అత్యాచారం చేసి పరారైయ్యాడు. దాంతో బాధితురాలు తల్లితండ్రులను ఆశ్రయించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన యువకుడి వివరాలను పోలీసులు బాలికను నుంచి సేకరించారు. అనంతరం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పేటకు స్వర్ణోత్సవ శోభ
కళాకారులకు నిలయమైన చిలకలూరిపేట ఒకప్పుడు జీపుల పరిశ్రమకు రాష్ట్రంలో పెట్టింది పేరు. తదనంతరం కాటన్, స్పిన్నింగ్ మిల్లులతో పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం జిల్లా రాజకీయాలు మొత్తం పేట చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ...ఈ మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు పేట వాసులే కావడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న పేట మున్సిపాలిటీ స్వర్ణోత్సవ సంబరాలు నూతనంగా ఎన్నిక కానున్న బడుగు వర్గాల మహిళ నేతృత్వంలో జరగనున్నాయి. - న్యూస్‌లైన్, చిలకలూరిపేట ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న జిల్లాలోని ఈ మున్సిపాలిటీ విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ పట్టణం. వ్యాపార, వాణిజ్య కేంద్రం. కవులు, కళాకారుల నిలయం. ప్రముఖ నాదస్వర విద్వాంసులు నాదబ్రహ్మ షేక్ చిన పీరు సాహెబ్, ఆయన తమ్ముడు, శిష్యుడు షేక్ చిన ఆదం సాహెబ్, ఆయన శిష్యుడు షేక్ చిన మౌలా సాహెబ్‌లు తమ అసమాన ప్రతిభతో పేటకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆదం సాహెబ్ విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆదంసాహెబ్ శిష్యుడు షేక్ చిన మౌలా సాహెబ్ వీరికి గుర్తింపుగానే గతంలో పేట ఆర్టీసీ డిపో బస్సులపై నాదస్వరం గుర్తు ఉండేది. జీపుల పరిశ్రమ ఒకప్పుడు ఇక్కడ కుటీర పరిశ్రమలా వర్ధిల్లింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి జీపులు తయారు చేయించుకునేవారు. ఇక్కడ పదుల సంఖ్యలో నాటక కళాపరిషత్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రముఖ నటీనటులంతా పేట వేదికలపై తమ అభినయ చాతుర్యాన్ని చూపిన వారే. అర్ధ శతాబ్దంలో 8 మంది ఏలికలు చిలకలూరిపేట మున్సిపాలిటీ ఆవిర్భవించి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు నిండుతాయి. పంచాయతీగా ఉన్న చిలకలూరిపేట 1964 జనవరి 30వ తేదీన మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1980 ఏప్రిల్ 28వ తేదీన సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 2001 మే 18 తేదీన గ్రేడ్-1 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ పొందింది. 1967లో తొలిసారి జరిగిన పురపాలక సంఘ ఎన్నికలలో చైర్మన్‌గా శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. పదవిలో ఉండగానే ఆయన మృతి చెందడంతో ఆయన స్థానంలో బచ్చు రామలింగం చైర్మన్ అయ్యారు. 1973 నుంచి 1981 వరకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగింది. 1981లో ఎన్నికలు నిర్వహించగా బీసీహెచ్ స్వామినాయక్ చైర్మన్ అయ్యారు. నాలుగేళ్లు పైబడి పదవి నిర్వహించాక ఏపీపీఎస్సీ గ్రూప్ సెలక్షన్ కావడంతో పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఉసర్తి నాగయ్య చైర్మన్ పదవి అలంకరించారు. 1987 నుంచి 1992 వరకు మాజేటి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా కొనసాగారు. 1995 నుంచి 2000 వరకు తవ్వా విజయలక్ష్మి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2000 నుంచి 2005 వరకు బింగి రామ్మూర్తి, 2005 నుంచి 2010 సెప్టెంబర్ వరకు జరపల కోటేశ్వరి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. వివిధ చైర్మన్ల హయాంలో జరిగిన అభివృద్ధి తొలి చైర్మన్ శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు,అనంతరం పదవి చేపట్టిన బచ్చు రామలింగంల హయాంలో పట్టణంలోని ప్రధాన రోడ్లు బీటీరోడ్లుగా మారాయి. స్వామినాయక్ హయాంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభమైంది. ఉసర్తి నాగయ్య హయాంలో వీధి దీపాలు, రోడ్లకు ప్రాధ్యాన్యం ఇచ్చారు. మాజేటి వెంకటేశ్వర్లు హయాంలో ఒకటవ వార్డులో మున్సిపల్ పాఠశాల ఏర్పాటైంది. ఇదే వార్డులో ఉన్న రిజర్వుడ్ స్థలానికి పార్కుగా అభివృద్ధి చేయడానికి ప్రహరీ ఏర్పాటు చేశారు. పండరీపురం బీఆర్ మున్సిపల్ పాఠశాలను హైస్కూల్‌గా రూపొందించారు. పలు కాలనీలలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటైంది. తవ్వా విజయలక్ష్మి హయాంలో రెండవ మంచినీటి చెరువు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఏఎంజీ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్‌డేవిడ్ జర్మనీ దేశస్తుడు డైక్మెన్ అందించిన రూ.3 కోట్ల నిధులతో పైపులైన్ వ్యవస్థ విస్తృతమైంది. పలు ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంకర్ల నిర్మాణం జరిగింది. అనంతరం బింగి రామ్మూర్తి హయాంలో ఎన్టీఆర్ కాలనీలో బింగి రామ్మూర్తి పార్కు ఏర్పాటైంది. గాంధీ పార్కు స్థలంలో మున్సిపల్ భవనాలు నిర్మించారు. జరపల కోటేశ్వరి హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేసిన రూ.3 కోట్ల వ్యయంతో నూతన మున్సిపల్ భవనం ఏర్పాటైంది. రూ.10 లక్షలతో గడియార స్తంభం పునర్నిర్మాణం చేశారు. చిలకలూరిపేట పట్టణ స్వరూపం జనాభా : 1,01,550 విస్తీర్ణం.. : 18.13 చదరపు కిలోమీటర్లు గృహాలు : 22వేలు ఓటర్లు : 70,685 వార్డులు : 34 చైర్మన్ పదవి : బీసీ మహిళ జనరల్ : 8 జనరల్ మహిళ : 9 బీసీ : 6 బీసీ మహిళ : 5 ఎస్సీ : 2 ఎస్సీ మహిళ : 2 ఎస్టీ : 1 ఎస్టీ మహిళ : 1 -
టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్: యడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఓటర్ల విచారణకు హాజరైన అధికారులను టీడీపీ నాయకులు అడ్డగించారు. ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. గ్రామంలోని నాలుగు పోలింగ్ బూత్‌లలో 171మంది ఓటర్లు స్థానికంగా నివాసం ఉండడం లేదని, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులు ఆర్ఐ నిర్మలాకృష్ణ, ఏఎస్వో చిన్నకోటేశ్వరరావు, వీఆర్వో జానీబాషా, పంచాయతీ కార్యద ర్శి శనివారం పంచాయతీ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులు.. ఆ ఓటర్లు వివిధ కారణాలతో మరో ప్రాంతంలో ఉంటున్నారని, ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. అందుకు అధికారులు వారికి అక్కడ ఓట్లు ఉన్నాయని ధ్రువీకరణ ఉందన్నారు. అయినా ఓట్లు తొలగించవద్దని ఆదేశించిన రీతిలో టీడీపీ వర్గీయులు పేర్కొనడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేమని ప్రశ్నించారు. అందుకు మీరెవరంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వ ర్గీయులు దౌర్జన్యం చేసి చొక్కాలు పట్టుకుని నెట్టివేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన శ్యామ్ చొక్కా చిరిగిపోవడంతోపాటు గాయపడ్డాడు. పరిస్థితిని కళ్లారా చూసిన అధికారులు మరోమారు ప్రశ్నించకుండా వెనుతిరిగి వెళ్లారు. విచారణ సమయంలో వీఆర్వో జానీబాషాపైనా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ పేరుతో తమను ఇబ్బంది పెడతావా అంటూ ఒక్క ఉదుటున అతనిపైకి రావడంతో కుర్చీలోంచి వీఆర్వో ముందుకు పడి కన్నీటి పర్యంతమయ్యాడు. గ్రామస్తులు సర్దిచెప్పాల్సివచ్చింది. టీడీపీ వర్గీయులకు ముందే సమాచారం.. డబుల్ ఎంట్రీ ఓట్లు తొలగించాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదుపై విచారణకు హాజరవుతున్నట్లు ముందుగా అధికారులు టీడీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనులు మానుకుని అధికారుల కోసం నిరీక్షించారు. విచారణ జరుగుతున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులకు తెలియకపోవడంతో గ్రామంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఫిర్యాదు స్వీకరించని పోలీసులు.. టీడీపీ వర్గీయులు దౌర్జన్యం చేయడంతో గాయపడిన వైఎస్సార్ సీపీకి చెందిన శ్యామ్ ఫిర్యాదు చేసేందుకు యడ్లపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. ఎస్ఐ వచ్చాక ఫిర్యాదు తీసుకుంటామని చెప్పడం గమనార్హం! అన్ని విషయాలపై విచారణ చేస్తాం.. తిమ్మాపురంలో ఓటర్ల విచారణకు వెళ్లిన సంబంధిత అధికారులు జరిగిన విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. గ్రామంలో జరిగిన గొడవలను వివరించారు. వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం ఏఎస్వో చెప్పారు కానీ సంబంధిత వీఆర్వో లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ అందించలేదు. అన్ని విషయాలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తాం. -రాగి రామాంజనేయులు, తహశీల్దార్, యడ్లపాడు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్ :పలు దొంగతనాలతో ప్రమేయం ఉన్న అంతర్ జిల్లా నేరస్తుడ్ని పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. 10 లక్షల విలువ చేసే బంగారు అభరాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. పొన్నూరు మండలం కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల మోహనరావు పలు దొంగతనాలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. 2013 జూన్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన మోహనరావు గుంటూరు నగరం, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన దొంగతనాల్లో ప్రధాన నిండితుడు. తలుపులు వేయకుండా నిద్రిస్తున్న ఇళ్లలోకి చాకచక్యంగా చొరబడి దొంగతనాలు చేయడంతో సిద్ధహస్తుడు. 11 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న మోహనరావును మంగళవారం ఏఎంజీ ఎదురు డొంక ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడి వద్ద 34 సవర్ల బంగారు అభరణాలు, 10 తులాల వెండి, రూ.20 వేల నగదు, వాచి, ఐ-ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిండితుడి అరెస్టులో సమర్థంగా వ్యవహరించిన అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు, ఎస్ఐలు రాధాకృష్ణ, అసన్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు ప్రక టించారు. స్థానికంగా దొంగ బంగారం కొనుగోలు చేసిన నగల వ్యాపారి రాచుమల్లు బద్రీనాథ్‌పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచుకొని తలుపులు తెరచి పడుకోవడం సరికాదని, అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల బదిలీలు పూర్తికావచ్చాయని, రెండురోజుల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో పోలీసుల బదిలీలు ఉంటాయన్నారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ డి.ప్రసాద్, అర్బన్ సీఐ జి.చెంచుబాబు తదితరులు ఉన్నారు. -
పేటలో మార్మోగిన సమైక్య నినాదం
చిలకలూరిపేట టౌన్, న్యూస్‌లైన్:పట్టణంలో సమైక్య నినాదం మార్మోగింది. విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చారు. తొలుత ఎన్ఆర్టీ సెంటర్లో మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుదాసు, ఏపీ ఎన్జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు, డిప్యూటీ తహశీల్దార్ నాంపల్లి నాగమల్లేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎన్ఆర్టీ సెంటర్ నుంచి బయలు దేరిన ర్యాలీ చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, గడియారస్తంభం సెంటర్, అడ్డరోడ్డు సెంటర్ మీదుగా తిరిగి ఎన్ఆర్టీ సెంటర్‌కు చెరుకుంది. ఎన్సీసీ విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. కళామందిర్ సెంటర్లో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఐదువేల మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఏపీఎన్జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ పలువురు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని విమర్శించారు. పంచాయతీ రాజ్ ఏఈ బి.మోహనరావు మాట్లాడుతూ సీమాంధ్రులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు మనకు కాకుండా పోతాయన్నారు. ఆర్టీసీ డిపోమేనేజర్ ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విభజనతో సీమాంధ్ర ఆర్టీసీకి అప్పులు, తెలంగాణ ఆర్టీసీకి ఆస్తులు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి.భక్తవత్సలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండా గోపి, ఏఎంజీ సంస్థ సీఏవో విజయకుమార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, డి.ధనలక్ష్మి, సాంబశివరావు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి చేబ్రోలు మహేష్, సూదా రమేష్‌బాబు, కృష్ణారావు, అస్లాం, స్థానిక జర్నలిస్టు నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్), న్యూస్‌లైన్: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతు న్న విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మద్దిరాల గ్రామంలోని ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని బావిలో విద్యార్థి ఇందుర్తి అఖిల్(17) మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం గుర్తించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లికి చెందిన అఖిల్ మరో నలుగురు విద్యార్థులతో కలిసి కళాశాలలోని వసతిగృహంలో ఉంటున్నాడు. ఈనెల 24న సహ విద్యార్థి తన సెల్‌ఫోన్ కనిపించడం లేదని అఖిల్‌ను అడగ్గా.. తెలియదని చెప్పడంతో గట్టిగా నిలదీశాడు. ఆ రోజు నుంచి అఖిల్ కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు బంధుమిత్రుల నివాసాల వద్ద విచారించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఆదివారం కళాశాల ఆవరణలోని బావి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో యాజమాన్యం గమనించగా.. బావిలో శవం తేలుతోంది. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడు కళాశాల విద్యార్థి అఖిల్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాలకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడంతో దారుణం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. తండ్రి లేని బిడ్డకు ఉన్నత విద్య అందించి అత్యున్నత శిఖరాలకు చేరుద్దామనుకున్న తరుణంలో విధి వక్రీకరించిందని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ టి.సంజీవ్‌కుమార్ పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఇచ్చిన పక్షంలో కేసు నమోదుచేసి విచారణ నిర్వహిస్తామని ఎస్ఐ జగదీష్ తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని కళాశాల ఆవరణలోనే ఉంచారు. సృహ తప్పి పడిపోయిన ప్రిన్సిపాల్ .. కళాశాల ఆవరణలోని బావిలో విద్యార్థి మృతదేహం ఉందన్న సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కేశవరావు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసిన వెంటనే సృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రిన్సిపాల్‌ను ప్రవేటు వైద్యశాలకు తరలించారు.