సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
గుంటూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. గుంటూరులో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జనం అధిక సంఖ్యలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
చిలుకలూరి పేట ఏపీ ఎన్‌జీవో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమక్యాంధ్రకు మద్దతుగా 365 అడుగుల జాతీయ జండాతో పట్టణంలో ర్యాలీ జరిపారు.
మాచర్లలో వైఎస్‌ఆర్ సీపీ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు.