United Andhra movement
-
విశాలాంధ్ర మహాసభ ఏఐసిసి కార్యాలయ ముట్టడి
న్యూఢిల్లీ: విశాలాంధ్ర మహాసభ సభ్యులు, కార్యకర్తలు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడ వారు పెద్ద ఎత్తు ఆందోళన చేస్తున్నారు. ఇంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడూ ఇక్కడ నిర్వహించలేదని చెబుతున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా తెలుగుతల్లికి మల్లెపూదండ... పాట పాడుతూ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రెండో రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయి. -
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మంత్రి శత్రుచర్ల విజయమరాజుకు ఘోరపరాభవం జరిగింది. కొత్తూరు గ్రామంలో ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. మంత్రిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మంత్రి సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ముందుకు కదలనివ్వలేదు. పోలీసుల జోక్యంతో మంత్రి బయటపడ్డారు. -
జగన్ సమైక్య దీక్షకు పెరుగుతున్న మద్దతు
హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేస్తున్న 'సమైక్య దీక్ష'కు మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయం ఎదుట జగన్ చేపట్టిన ఆమరణదీక్ష మూడవ రోజుకు చేరింది. రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు శిబిరం వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షకు మద్దతు తెలుపుతూ మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ రోజు ఐటి ఉద్యోగులు శిబిరం వద్దకు వచ్చి జగన్ దీక్షకు మద్దతు తెలిపారు. సమైక్యత కోసం నిజాయితీగా పోరాడే ఏకైక రాజకీయ నేతగా జగన్ నిలిచారు. సమైక్యవాదులకు అండగా దీక్ష చేపట్టారు. జగన్ సమైక్య దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు సీమాంధ్ర అంతటా దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ దీక్షకు రాష్టవ్యాప్తంగా సమైక్యవాదులు మద్దతు తెలుపుతున్నారు. విజయవాడలో వంగవీటి రాధ జగన్ దీక్షకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. జగన్‌కు మద్దతుగా ఎన్నిరోజులైనా దీక్ష చేస్తానని రాధ చెప్పారు. -
విభజన నిర్ణయాన్ని ఎందుకు చించరు?: సీమాంధ్ర నేతలు
హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ, ప్రధాని మంత్రి, కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్నే చించేశారని, తెలంగాణ విభజన నిర్ణయాన్ని ఎందుకు చించరని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రితో వారు గంటకుపైగా సమావేశమయ్యారు. అంతకు ముందు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై చర్చలు జరిపారు. సీఎంతో జరిగిన సమావేశంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ నోట్ వస్తుందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందని తాను అనుకోవడంలేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని చెప్పారు. అందరం ఒకే అభిప్రాయంతో ముందుకు వెళదామన్నారు. మీ అభిప్రాయాలను అధిష్టానినికి వివరిస్తానని చెప్పారు. మరోసారి మన అభిప్రాయాలను గట్టిగా వినిపిద్దామన్నారు. అధిష్టానం మన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. రెండు సార్లు అత్యధిక మెజార్టీతో ఎంపి స్థానాలను ఇచ్చాం, మనమెందుకు ఢిల్లీ వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఢిల్లీలో సాయంత్రం ఏం జరుగుతుందో చూసిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామని సిఎం చెప్పారు. -
ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోదు: ఎంపి అనంత
అనంతపురం: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. సీమాంధ్ర నేతల ఒత్తిడితో కేంద్రం వెనక్కి తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపి వెంకట్రామి రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉద్యమ తీవ్రత ఉధృతంగా ఉంది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాలలో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి కూడా అధికంగా ఉంది. -
రాష్ట్రాన్ని విడదీయమని కోరిందే చంద్రబాబు: బొత్స
ఢిల్లీ: రాష్ట్రాన్ని విడదీయమని కోరిందే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టారో బాబు చెప్పాలన్నారు. విభజనపై మొదటిగా లేఖఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు తెలంగాణకు అనుకూలంగా ఆయన లేఖలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్‌తో ఆయన దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విడదీయమని చంద్రబాబు లేఖ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 2009లో తీసుకున్న నిర్ణయం విషయంలో కొందరు వెనక్కు వెళ్లారని చెప్పారు. ద్వంద వైఖరులు ఉన్నాయని తెలిపారు. రక్షణ మంత్రి ఆంటోనీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల మనోభావాలను నేరుగా తెలుసుకోవాలని కమిటీలో సభ్యుడైన దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే తేదీ ఏమీ చెప్పలేదన్నారు. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్‌లు త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. సీమాంధ్ర నేతలు రోజుకోరకంగా మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. ఒకరిద్దరు రాజీనామా చేసినంత మాత్రాన ఫలితం ఉండదని, అందరూ కలిసి రాజీనామా చేస్తేనే అధిష్టానం వెనక్కు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించడంలో తప్పులేదన్నారు. మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యల్లో కూడా తప్పు లేదన్నారు. విభజన సమస్యలపై ఆలోచించాలని చెప్పారు. విలేకరులు తెలంగాణ ప్రక్రియ విషయం ప్రస్తావించగా అధిష్టానాన్నే అడగండని అన్నారు. సీమాంధ్రలో ఆందోళన వల్ల ఆర్టీసి నష్టపోతోందన్నారు. -
ఏపీఎన్జీఓలతో పిఎస్ చర్చలు విఫలం
హైదరాబాద్: ఏపీఎన్జీఓ నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(పిఎస్) పీకే మహంతి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించాలని మహంతి ఉద్యోగులను కోరారు. సమ్మె విరమించేదిలేదని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఏపీఎన్జీఓలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు, ఎంత కాలమైనా సమ్మె కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు ఏపీఎన్జీఓలు నిన్ననే ప్రకటించారు. -
జిల్లాలో 61వ రోజూ ఆందోళనలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమకారులు 61 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కూడా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాస్తారోకోలు, మానవహారాలు, రిలే దీక్షలు, ప్రదర్శనలతో నిరసన తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఎన్ఎన్ఎన్ స్కేటింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు చర్చి సెంటర్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై స్కేటింగ్ విన్యాసాలు ప్రదర్శించి రాష్ట్ర సమైక్యత కోసం నినదించారు. మార్కెట్ యార్డు వద్ద సిబ్బంది చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. అద్దంకి పట్టణంలో సమైక్యవాదుల రిలే దీక్షలు 42వ రోజు కొనసాగాయి. వీరికి రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు సంఘీభావం తెలిపారు. కొరిశపాడు మండలం రావినూతలలో ఇంజినీరింగ్ విద్యార్థులు రిలే దీక్షలకు కూర్చున్నారు. చీరాలలో సమైక్యాంధ్ర నిరసనలు మార్మోగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ యూత్‌ఫోర్స్ సభ్యులు వాడరేవులోని సముద్రతీరంలో జలదీక్ష నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పర్చూరులో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు 56వ రోజుకు చేరాయి. మార్టూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు భారీ మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. అలాగే కర్నూలులో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు జేఏసీ నాయకులు భారీగా తరలివెళ్లారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొమరోలులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కనిగిరి పట్టణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దేవాంగనగర్ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. అంతకు ముందు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సాధన కళాశాల విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గార్లపేట బస్టాండ్‌లో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేసి, సర్వమత వేషధారణలతో నిరసన తెలిపారు. అలాగే హెచ్‌ఎంపాడులో ఆటో కార్మికులు ర్యాలీగా వచ్చి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు. వంటా- వార్పు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు 14వ రోజు రిలేదీక్ష చేపట్టారు. అలాగే టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామూరులో వికలాంగులు రిలే దీక్షలకు కూర్చున్నారు. మార్కాపురం పట్టణంలో క్రిస్టియన్ యూత్‌ఫోర్స్ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోరుతూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొదిలిలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేశారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆకులు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దోర్నాల పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. -
హైదరాబాద్‌లో జగన్ సమైక్యశంఖారావం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో సమైక్యాంధ్ర ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది. సమైక్యవాదులు ఊహించినట్లే యువతనే జగన్ వారికి అండగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పూరించనున్నారు. భాగ్యనగరంలో సమైక్యవాదం వినిపించనున్నారు. యువకెరటం జగన్ విడుదల రోజునే సమైక్యవాదులు ఎన్నో ఆశలతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రాన్ని విభజించవద్దని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తూ ఉద్యమంలో పాల్గొంటున్న నేపధ్యంలో జగన్ విడుదలవడం సమైక్యవాదులకు ఎంతో సంతోషం కలిగించింది. దాంతో జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొని వారు హైదరాబాద్ తరలివచ్చారు. సమైక్యవాదులు ఎదురు చూసినట్లే, వారి ఆశలను నిజం చేస్తూ హైదరాబాద్‌లోనే భారీ ఎత్తున సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగన్ ఈరోజు ప్రకటించారు. రాజధానిలోనే సమైక్యవాదం వినిపిస్తామని చెప్పారు. అంతకు ముందు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను సమావేశపరచాలని కోరారు. సమైక్యవాద ఉద్యమానికి బలం చేకూరే విధంగా ఆయన ముందడుగు వేస్తున్నారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబరు 15-20 తేదీల మధ్యలో సమైక్య శంఖారావం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణపై క్యాబినెట్ నోట్ తయారు కాకముందే ఇక్కడ శాసనసభను సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని కూడా ఆయన కోరారు. అలా చేస్తే ఇక్కడ జరిగే అన్యాయం దేశ ప్రజలకు తెలుస్తుందని, కేంద్రం కూడా విభజన విషయంలో వెనక్కు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని సవివరంగా తెలియజేశారు. అందులో ప్రధానమైనది నీటి సమస్య అని తెలిపారు. రాష్ట్రం విడిపోతే 11జిల్లాల ప్రజలు నిత్యం తన్నుకుని, కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం సమిష్టిగా ఉన్నప్పుడే సాగునీరు పంచుకోగలం అని స్సష్టం చేశారు. ప్రస్తుతం అత్యధికంగా ఆదాయం లభించే హైదరాబాద్ విడిపోతే అభివృద్ధి కుంటుపడిపోతుందని హెచ్చరించారు. సమైక్యం అంటే రాయలసీమ, కోస్తానే కాదని తెలంగాణ కూడా అని స్పష్టం చేశారు. తకు తెలంగాణ, రాయలసీమ, కోస్తా కావాలని జగన్ చెప్పారు. తెలంగాణలో కూడా సమైక్యవాదులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ప్రతి సోదరుడికీ తాను చెబుతున్నానని, ప్రతి ఒక్కరినీ అభివృద్ధి పథంవైపు నడిపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తాను చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. హోం మంత్రికి ఇచ్చిన లేఖను ఒక్కసారి చూడమని చెప్పారు. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదనీయ పరిష్కారం చూపమని అడిగినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ మారాలి, నిజాయితో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని అన్నారు. సమైక్యవాదానికి మద్దతు పలకడం వద్ద టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి నష్టం జరుగుతుందో తనకూ అదే నష్టం జరుగుతుందని చెప్పారు. నష్టం జరుగుతందని ఓట్లూ,సీట్లూ పోతాయని, మౌనంగా ఉండలేం అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్రం విడిపోకుండా ఉండటం ముఖ్యం అని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఎవరు ఏ లేఖ తెచ్చినా ఒక పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి సంతకం తాను పెడతానని చెప్పారు. ప్రజల మనసుల్లో కలిసి ఉండాలనే భావన గాఢంగా ఉందన్నారు. దానిని ఎవ్వరూ తీసేయలేరని చెప్పారు. సమైక్య శంఖారావం పేరిట త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీ అధ్యక్షుడు నిజాయితా ఈ విధంగా పిలువు ఇవ్వడం సమైక్యవాదులకు ఆనందం కలిగించింది. ఉద్యమానికి ఊపిచ్చినట్లు అయింది. ఈ ఆయన మాట్లాడిన మాటలకు రాష్ట్రం నలుమూలల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆయన ప్రకటన సమైక్యవాదులలో ఉత్సాహం నింపింది. -
అక్టోబర్ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని
హైదరాబాద్: అక్టోబర్ 3న సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. ఆ వ్యాఖ్యలు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. తన రాజకీయ జీవితంలో ప్రజల నుంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇదని మంత్రి పితాని అన్నారు. -
అందరూ కలసికట్టుగా విభజనను అడ్డుకోవాలి: జగన్ పిలుపు
హైదరాబాద్: రాష్ట్రాన్ని విడదీయటానికి చేస్తున్న కుట్రలను తెలుగు ప్రజలంతా కలిసి అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. లోటస్ పాండ్‌లో ఈరోజు తనను కలిసిన సమైక్యాంధ్ర అడ్వకేట్స్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జగన్ ప్రసంగ పాఠం: రాయలసీమ, కోస్తాఆంధ్ర, తెలంగాణ అన్నిప్రాంతాలు సమైక్యంగా ఉండాలని మనం అడుగుతున్నాం. పెద్దదిగా ఉంటేనే రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. 60 శాతం మంది ప్రజలు మాకు అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కారు. ఆ అన్యాయం పార్టీలకు, కేంద్రానికి కనిపించడంలేదా? రాష్ట్రాన్ని విభజిస్తే పది జిల్లాలలో తన్నుకునే పరిస్థితి వస్తుంది. న్యాయం చేయలేనప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరికీ ఆమోదం కాకపోయినా విభజన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజాయితీగా విభజనను అడ్డుకోవాలి. ఓట్లు, సీట్లు పోతాయని మౌనంగా ఉండటం మంచిదికాదు. విభజనను ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రెండు రాష్ట్రాలుగా విడగొడితే నీళ్లు ఎలా ఇస్తారు? నాగార్జున సాగర్, శ్రీశైలంకు నీల్లు ఎలా వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు ఎవరు ఇస్తారు? రాష్ట్రం ఒకటిగా ఉంటేనే నీటి సమస్య రాదు. చదువుకున్న ప్రతి కుర్రవాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడు. రాష్ట్ర ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచే వస్తోంది. అదే ఆగిపోతే జీతాలు ఎలా ఇస్తారు? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని జెఏసీ ద్వారా లేఖ రాయండి, నేను తొలి సంతకం పెడతాను అని చెప్పాను. అందరం కలిస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. పంపకాల్లో తండ్రి పిల్లలకు న్యాయం చేయాలి. న్యాయం చేయలేనప్పుడు యథావిథిగా వదిలివేయాలి. సిపిఎం, ఎంఐఎం, వైఎస్ఆర్ సిపి మూడు పార్టీలు సమైక్యాంధ్ర కోరుతున్నాయి. మిగిలిన పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో నిజాయితీ లోపించింది. ప్రతి సమైక్యవాది, జెఏసి సభ్యుడు టిడిపిని అడగండి. ఆ తరువాత టిడిపిని కూడా జేఏసిలోకి రానివ్వండి. -
టీడీపీకి సమైక్య సెగ
సాక్షి, కాకినాడ : బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు- తెలంగాణ ఇచ్చేయండంటూ ఎడాపెడా లేఖలిచ్చిన తెలుగుదేశం పార్టీ మహోధృతంగా ఎగసిన సమైక్య ఉద్యమంతో చతికిలపడింది. అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం కారణంగా అడుగడుగునా సమైక్యసెగలు తగులుతుండడంతో పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అగ్రనేతలు సైతం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం లేదు. నాలుగు డబ్బులు ఖర్చుపెట్టి ఏదైనా ఆందోళనా కార్యక్రమం చేద్దామన్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరే పరిస్థితి లేదనే ఆవేదనతో సమైక్య ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకొని మోసేందుకు సాహసించలేకపోతున్నారు. దీంతో నాయకులంతా దాదాపుగా ఉద్యమకారులకు సంఘీభావం తెలిపేందుకే పరిమితమవుతున్నారు. జిల్లాలో పార్టీపరంగా అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నా అవి కూడా మొక్కుబడిగానే సాగుతున్నాయి. బాబు ఇచ్చిన లేఖల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందన్న అభిప్రాయం ఉద్యమకారుల్లోనే కాక సామాన్యుల్లో సైతం బలంగా నాటుకు పోవడంతో ఎక్కడకెళ్లినాటీడీపీ నేతలకు సమైక్యసెగలు తప్పడంలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప ఇటీవల ముమ్మిడివరంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కాగా పోలీసుల సహాయంతో బయట పడాల్సి వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలకూ తరచూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో కొద్దిమంది నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు సెగ తగలని జేఏసీ శిబిరాలకు వెళ్లి మొక్కుబడిగా సంఘీభావం తెలుపుతుంటే మరికొంతమంది ఉద్యమ ఛాయలకే రావడం లేదు. ఈ పరిస్థితి పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోను చేస్తోంది. పత్తా లేని యనమల ఉద్యమం మొదలైన నెల రోజుల వరకు జిల్లా ముఖం చూడని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చివరకు ఉత్తుత్తి రాజీనామాతో జిల్లాలో అడుగు పెట్టినా ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇక పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్మీట్లకు పరిమితమవడం తప్ప పార్టీ పరంగా ఇప్పటి వరకు ఒక్క ఆందోళనా కార్యక్రమం చేపట్టిన దాఖలా లేదు. గత పది రోజులుగా జేఏసీ శిబిరాల వైపు కూడా కన్నెత్తి చూడలేదు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ కూడా ఉద్యమంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. గత పది రోజులుగా ఆయన కూడా ఉద్యమ ఛాయలకు రాలేదు. పార్టీ ఎమ్మెల్యేలు చందన రమేష్, పెందుర్తి వెంకటేష్, పర్వత చిట్టిబాబు ఎవరైనా పిలిస్తే వెళ్లి ఫొటోలకు ఫోజులివ్వడమే తప్ప పార్టీపరంగా చెప్పుకోతగ్గ ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదనే చెప్పాలి. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు స్థానికంగా పొలిటికల్ జేఏసీలో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నా ఆ ఘనత అంతా జేఏసీ ఖాతాలోకి వెళ్లిపోతుందనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు ఇతర ముఖ్యనేతలంతా ఈ ఉద్యమం వల్ల తమ పార్టీకి అనుకున్నంత కలిసి రావడం లేదనే సాకుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఒకపక్క ప్రారంభం నుంచీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు తమ అధినేత జగన్మోహన్రెడ్డి బెయిల్‌పై బయటకు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని పూర్తిగా తమ భుజస్కంధాలపై వేసుకొని ముందుకెళ్లేందుకు సిద్ధమవుతుండడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఏదేమైనా ఈ ఉద్యమం జిల్లాలో టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకం చే స్తుందనే దిగులు ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది -
జగన్‌పై కేసు నిలువదని గతంలోనే చెప్పా: గాదె
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిపై కేసు నిలవదని తాను గతంలోనే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌కు బెయిల్ రావడం సంతోషం అన్నారు. మెరిట్స్ ఆధారంగానే బెయిల్ వచ్చినట్లు చెప్పారు. ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఏమీలేదన్నారు. క్విడ్‌ప్రోకో కేసులో ఆధారాలు లేవని, కేసు నిలువదని గతంలోనే చెప్పానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదని, ఏనాడు ప్రత్యేక వాదాన్ని ప్రోత్సహించలేదని చెప్పారు. జగన్ కూడ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్లమెంట్లో ప్లర్డ్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతున్న జగన్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని గాదె చెప్పారు. -
జిల్లా అంతటా మూతపడ్డ విద్యాసంస్థలు
సాక్షి, కాకినాడ : రెండు నెలలు కావస్తున్నా జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లె వరకు సమైక్య ఉద్యమం మహోధృతంగా సాగుతూనే ఉంది. జనం అణుమాత్రం సడలని సమరదీక్షతో విభజన నిర్ణయంపై నిరసన కత్తులు దూస్తూనే ఉన్నారు. 55వ రోజైన సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. కాకినాడలో జిల్లా రవాణాశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది వాహనాలతో రవాణాశాఖ కార్యాలయం నుంచి జగన్నాథపురం వంతెన వరకు మహార్యాలీ జరిగింది. 100కు పైగా మినీ గూడ్స్ ఆటోలు, 300పైగా పాఠశాల బస్సులు, - మిగతా 2లోఠ 300 బైక్‌లు, 300కుపైగా కార్లతో ర్యాలీ సాగింది. జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. న్యాయశాఖ ఉద్యోగులు జిల్లాల పేర్ల మీద తయారు చేసిన కుండలను నెత్తిపై పెట్టుకొని, ఎడ్లబండ్లపై వినూత్న నిరసన చేశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిబ్బంది సీమాంధ్ర మంత్రుల మాస్క్‌లు ధరించి చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. తాళ్లరేవు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేసిన కరాటే, తైక్వాండో విన్యాసాలు అబ్బుర పరిచాయి. సర్పవరం జంక్షన్లో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. మలికిపురంలో సమైక్య శంఖారావం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మలికిపురంలో నిర్వహించిన సమైక్య శంఖారావంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్డీఓ పి.సంపత్‌కుమార్ మాట్లాడుతూ విభజనతో దేశ స్థిరత్వానికే ముప్పు వాటిల్లుతుందన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన గర్జనలో విద్యార్థులు వినూత్నరీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాజానగరం గాంధీబొమ్మ సెంటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు, శ్రీకృష్ణ దేవరాయల వేషధారణల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. కరపలో నిర్వహించిన విద్యార్థిగర్జనలో 500 మీటర్లపొడవైన జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. కొత్తపేటలో వందలాదిమంది కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేసి రోడ్డు మీద మోకాళ్లపై నిల్చొని మానవహారం చేశారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై విద్యార్థులు మహార్యాలీ, మానవ హారాలతో హోరెత్తించారు. ముమ్మిడివరంలో వేలాది మంది ప్రైవేటు పాఠశాలల చిన్నారులు ర్యాలీ చేశారు. రామచంద్రపురం, ద్రాక్షారామలలో వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ప్రైవేటు పాఠశాలల సిబ్బంది ర్యాలీ చేశారు. కాజులూరులో విద్యార్థులు రెండుకిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి, 300 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. అంబాజీపేటలో రోడ్లపైనే క్షవరాలు అంబాజీపేటలో నాయీబ్రాహ్మణులు రోడ్లపైనే క్షవరాలు చేసి నిరసన తెలిపారు. మామిడికుదురులో ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు రోడ్లపై పడుకొని పిడికిళ్లు బిగించి నిరసన తెలిపారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఉద్యమానికి 55 రోజులని సూచిస్తూ 55 ఆకృతిలో నిల్చొన్నారు. పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు మంత్రుల మాస్క్‌లతో రోడ్డుపైనే ప్రజావైద్యశాల నిర్వహించి నిరసన తెలిపారు. సోనియా జపం వీడి రాజీనామలు చేస్తే కానీ జబ్బు తగ్గదని చాటారు. సామర్లకోటలో జేఏసీ ప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి రహదారిపై ఉన్న గోతుల్లోని మురుగు నీరు తోడి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బైకు ర్యాలీ చేశారు. జాతీయ దళిత ఐక్యసమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడు దొమ్మేటి సుధాకర్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో వంటావార్పు చేశారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో 40 ట్రాక్టర్లతో సుమారు 500మంది రైతులు ప్రదర్శనగా కోరుకొండ వరకు వచ్చి ధర్నా చేశారు. భూగర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో 50 లారీలతో ర్యాలీ చేశారు. వందలాది మంది ఉపాధ్యాయులు నల్లదుస్తులు ధరించి నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని గోదావరి గట్టున రిలయన్స్ మార్ట్ వద్దనున్న ఏపీ ఎన్జీఓ కార్యాలయం నుంచి కంబాల చెరువు జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. క్షమాపణ చెప్పిన హాస్టల్ వార్డెన్ పిఠాపురం సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్న నల్గొండకు చెందిన పి.రాజ్యలక్ష్మి హాస్టల్ ఆవరణలో ఉన్న తెలుగుతల్లి బొమ్మకు సున్నం పూయించారు. గత కొంతకాలంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నప్పటికీ ఆమె అవకాశమివ్వలేదు. సోమవారం ఉదయం తెలుగుతల్లి బొమ్మకు సున్నం పూయించినట్టు తెలియడంతో జేఏసీ ప్రతినిధులు హాస్టల్‌కు వెళ్లి ఆమెను నిలదీశారు. కొత్త పెయింటింగ్స్ వేయించేందుకు అన్ని బొమ్మలతో పాటు తెలుగుతల్లి బొమ్మకు కూడా సున్నం పూశారని ఆమె చెప్పినప్పటికీ సమైక్యవాదులు ఊరుకోలేదు. దాంతో ఆమె క్షమాపణ చెప్పి, తెలుగుతల్లి బొమ్మపై ఉన్న రంగును తొలగించి పాలాభిషేకం చేసి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేసింది. మరోవైపు సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జరగనున్న జిల్లా బంద్ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. కాకినాడ పోర్టులో కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి. -
మమ్మల్ని వివాదాల్లోకి లాగవద్దు: ప్రజాప్రతినిధుల సతీమణులు
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు, వారి కుటుంబ సభ్యులు తమ స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను మొదలుకొని దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు అందరినీ కలుస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరుతున్నారు. వినతి పత్రాలు ఇస్తున్నారు. వారు నిన్న రాష్ట్రపతితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలిశారు. ఈ బృందంలో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ, కావూరి సాంబశివరావు భార్య హేమలత, కూతురు శ్రీవాణి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్ భార్య మోక్షప్రసూన, పార్థసారధి భార్య కమలాలక్ష్మి, తోట నర్సింహం భార్య వాణి, కన్నా లక్ష్మీనారాయణ భార్య విజయ, శత్రుచర్ల విజయరామరాజు భార్య శశికళ, పితాని సత్యనారాయణ భార్య అనంత లక్ష్మి, మాజీ మంత్రులు ఆర్.చెంగారెడ్డి భార్య ఇందిర, మారెప్ప భార్య వేదవాణి, మాజీ విప్ సామినేని ఉదయభాను భార్య విమలాభాను, మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోదరి సుచరిత, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి భార్య శ్రీదేవి తదితరులు ఉన్నారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తమను వివాదాల్లోకి లాగొవద్దని కోరారు. పార్టీలకు అతీతంగా మహిళలంతా సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్ర సమైక్యత కోసం వెయ్యి గ్రామాల ఏకగ్రీవ తీర్మానం
అనంతపురం: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని జిల్లాలోని ఒక వెయ్యి మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. సర్పంచ్‌లు ఆ తీర్మానం కాపీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు పంపారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యఉద్యమాలు 54వ రోజుకు చేరాయి. రాష్ట్ర విభజన ప్రకటించిన రోజు నుంచి ఈ జిల్లాలో సమైక్యవాదులు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఆ రోజు నుంచి ఉద్యమాన్ని రోజురోజుకు ఉధృతం చేస్తూ కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏపీఎన్జీవో, రెవిన్యూ, ఆర్టీసీ కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. 1000 ఆర్టీసీ బస్సులు గత 54 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా ఆర్టీసీకీ 40 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ(జెఎన్టియు) విద్యార్ధులు, ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. -
అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్
హైదరాబాద్: సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశ ముగింపు సందర్భంగా ఆమె ప్రసంగించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్రరాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సహా టీడీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామని పిలుపు ఇచ్చారు. ఓట్లు, సీట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటాలు చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలే ఆ పని చేస్తాయన్నారు. సమైక్య ఉద్యమాన్ని కార్యకర్తలు, నేతలు, అభిమానులు బాగా చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉద్దృతం చేద్దామని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు తన లేఖను వెనక్కు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెద్దామని చెప్పారు. ప్రజలందరి బాగు కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ పాటుపడుతుందన్నారు. మనమంతా కలిసి వైఎస్ఆర్ కలలుకన్న సువర్ణయుగం సాధిద్దామని చెప్పారు. వైఎస్ విజయమ్మ అధ్యక్షత వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నేతలు హాజరయ్యారు. -
'అన్ని సదుపాయాలున్న హైదరాబాద్‌ను వదలమంటే ఎలా?'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర నష్టపోతుందని వివరించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ను యూటి చేస్తే ఇరుప్రాంతాలు నష్టపోతాయని చెప్పామన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితంకావని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ ఉన్నాయని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం ఏది కావాలన్నా రాజధానికే రావలసిన పరిస్థితి ప్రస్తుతం ఉందని తెలిపారు. ఇప్పుడు మెట్రో రైలు కూడా వస్తోంది. ఇన్ని సదుపాయాలున్న హైదరాబాద్ వదిలి వెళ్లిపొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. వీరు గత నెలలో కూడా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. -
ఇది మరో డ్రామానా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి 50 రోజులు గడిచిన తరువాత ఎట్టకేలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. మరో పక్క ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజీనామాలు చేయకుండా ఉండాలని అంటున్నారు. వారి మాటలలో స్పష్టత లోపించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది జులై 30న రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమం ఊపందుకుంది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేశారు. ఉద్యమం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత అండలేకుండా ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ తరువాత ఎన్జీఓలు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు మొదలు పెట్టారు. దాంతో ఉద్యమం ఉధృతమైంది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎదోఒకటి చెబుతూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రకటించడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలలో కలకలం మొదలైంది. వాస్తవానికి షిండే మొదటి నుంచి విభజన ప్రక్రియ ఆగదని చెబుతూనే ఉన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్లు ఈ నెల 3న ప్రకటించారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యం జరగదని కూడా చెప్పారు. ఆ ప్రకారంగా 20 రోజులు కూడా కాక ముందే నోట్ సిద్దమైనట్లు ప్రకటించారు. హైదరాబాద్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా షిండే చెప్పారు. అయితే రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాదని చెప్పారు. నోట్‌ను పరిశీలించిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు పంపుతామన్నారు. షిండే ప్రకటనతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులలో కదలిక వచ్చింది. నోట్‌పై మంత్రి మండలి చర్చిస్తే పరిస్థితి విషమించుతుందన్న ఆందోళన వారిలో మొదలైంది. అందరితో చర్చలు జరిపి సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని భావించారు. కాని ఇప్పుడు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్ర ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేయడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారందరూ కలిసి ఈరోజు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా లేఖపై సంతకాలు కూడా చేశారు. ఆ లేఖను పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించాడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 24న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఎంపి లగడపాటి మాట్లాడుతూ అంతిమ విజయం సమైక్యవాదానిదేనన్నారు. సమైక్యాంధ్ర మినహా హైదరాబాబ్ కేంద్ర పాలిత ప్రాంతం గానీ, మరే ఇతర ప్రత్యామ్నాయానికి తాము అంగీకరించం అని చెప్పారు. విభజన దిశగా ఒక్క అడుగు ముందుకేసినా తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ వద్ద మొండికేసుకొని కూర్చుంటామన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇవ్వకుండా ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదులేనన్నారు. శిలాశాసనానికి చోటులేదు-ప్రజా శాసనానికే చోటు అన్నారు. తమని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని, పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. తెలంగాణ అంశంలో కేంద్రం ముందుకెళ్లదని భరోసా కల్పిస్తేనే రాజీనామా ప్రతిపాదన విరమించుకుంటామని చెప్పారు. షిండే కేబినెట్ నోట్ నిజమని తేలితే రాజీనామా చేస్తామని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన లగడపాటి చివరగా పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి తాము ఉండి తీరాలన్నారు. లగడపాటి చూస్తే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులు తమ రాజీనామా పత్రాలు స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం అంతా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఉత్తుత్తి రాజీనామా ప్రకటనలుగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిని మరో డ్రామాగా పలువురు భావిస్తున్నారు. -
అర్ధరాత్రి నుంచి సీమ ఇరిగేషన్ అధికారుల సమ్మె
హైదరాబాద్: సమైక్యవాద ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇరిగేషన్ అధికారులు కూడా సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే ఉధృతమైన ఈ ప్రజా ఉద్యమంలో ఎన్జీఓలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో ఈ అర్ధరాత్రి నుంచి ఇరిగేషన్ అధికారుల సమ్మె చేయనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్లకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చినట్లు రాయలసీమ జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు చెప్పారు. -
విభజనకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం
కడప: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లాలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. రాజంపేటలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమానికి ఎమ్మెల్యేలు అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వైఎస్ఆర్ సిపి నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కనువిప్పు కలిగేలా ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు. -
20న ప్రజాప్రతినిధుల ధర్నా: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 20న వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధుల ధర్నా నిర్వహిస్తున్నట్లు శాసనసభలో ఆ పార్టీ ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి చెప్పారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి అసెంబ్లీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర జరుపుతామని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్,టీడీపీ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అందరూ రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆంటోనీ కమిటీ మీ దగ్గరకు వస్తుందని, రాష్ట్రం ఎలా విడిపోతుందో అప్పుడు చూద్దాం అని ఆమె అన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు పదవులు వీడాలి, ప్రజాభీష్టాన్ని గౌరవించాలన్నారు. తమ లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని టీటీడీపీ నేతలు అంటున్నారు. సీమాంధ్రలో మాత్రం విభజనకు వ్యతిరేకం అంటున్నారు. తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో మరోవిధంగా వ్యవహరించడం మీ విధానమా? అని అడిగారు. చంద్రబాబూ.. అసలు మీ పార్టీ వైఖరేంటి? అని ప్రశ్నించారు. ఇల్లు గడవకపోయినా సీమాంధ్ర ప్రజలు రోడ్డపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజల ఆవేశాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. తన విధానాలతో చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ.. మీ అనుభవమంతా ఏమైంది? అని అడిగారు. మీ అనుభవమంతా కుట్రలు చేయడానికి ఉపయోగపడుతుందని విమర్శించారు. మీ అనుభవమంతా ఉపయోగించి విభజన ఆపండని శోభానాగిరెడ్డి కోరారు. -
23,24 తేదీల్లో ఢిల్లీలో సచివాలయ ఉద్యోగుల దీక్ష
గుంటూరు: సమైక్య రాష్ట్రం కోసం ఈ నెల 23,24 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ చెప్పారు. 300 మంది సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగం తగ్గిందని చెప్పారు. విభజన వల్ల దేశం వినాశనం అవుతుందన్న ఇందిరాగాంధీ మాటను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్టిచ్చుకోవడంలేదన్నారు. -
పదవులు తప్ప ఏ త్యాగానికైనా సిద్ధమట!
రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలు సమావేశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం గురించి తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్రం విభజిస్తున్నారన్న సూచనలు రాగానే రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామాలు చేశారు. ఆ తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయ్మ, ఎంపి రాజమోహన రెడ్డి కూడా రాజీనామాలు చేశారు. ఉద్యమానికి ఊతంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఒక పక్క చర్చలతో కాలం వెళ్లదీస్తుంటే, సీమాంధ్రలో మాత్రం రాజకీయ నేతలతో సంబంధంలేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలంటూ సమైక్య రాష్ట్ర ఉద్యమకారులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. వినూత్న రీతుల్లో ప్రతి రోజూ నిరసనలు తెలుపుతూ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచుతున్నారు. వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌస్‌లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి, జే.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కెవిపి రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఎస్.పి.వై.రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొనడం ఇష్టంలేక మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే ఉన్న బొత్స ఝాన్సీ బయటకు వెళ్లారు. అయితే ఆ తరువాత సమావేశం ముగియడానికి పది నిమిషాలు ముందు తిరిగి వచ్చారు. మంత్రులు కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్, హర్షకుమార్, సబ్బం హరి, రత్నాబాయి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి,టి. సుబ్బరామిరెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సమావేశంలో యథావిధిగా దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. చివరకు సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. అయితే పదవులకు మాత్రం రాజీనామాలు చేసేదిలేదని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం వారు చెప్పిన విషయాల సారాంశం: మాకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. ఈ విషయం అధిష్టానానికి చెప్పదలుచుకున్నాం. మరోసారి మేం అధిష్టానం పెద్దలను కలుస్తాం. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని కోరతాం. మేం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతతో విభజనపై కేంద్రం పునరాలోచనలో పడింది. సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇరుప్రాంతాల్లోనూ ఆంటోని కమిటీ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తాం. కేసిఆర్ చనిపోతాడన్న భయంతో 2009లో కేంద్రం విభజన ప్రకటన చేసింది. కేసీఆర్ ఆడింది నాటకమని డిసెంబర్ 9 ప్రకటనకు ముందే మేం చెప్పాం. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండవు. జూలై 30 ప్రకటనతో మరిన్ని సమస్యలు వస్తాయని అధిష్ఠానానికి ముక్తకంఠంతో ముందే చెప్పాం. 2009లాగే 2013లోనూ కేంద్రం నిర్ణయం వెనక్కువెళ్తుంది. సమావేశంలో వారు అనేక విషయాలు చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అధిష్టానాన్ని కలవాలని తీర్మానించారు. చర్చించిన అన్ని విషయాలలో ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ రాజీనామాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల రాజీనామాను సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు వారు సమాధానాన్ని దాటవేశారు. పదవులకు రాజీనామాలు చేయడం తప్ప వారు ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అదీ వారి చిత్తశుద్ధి. -
మాకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం : కావూరి
హైదరాబాద్: తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం ఆంటోని కమిటీని నియమిచిందని చెప్పారు. సీమాంధ్రలో అన్ని వర్గాలు ఏకమై సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయన్నారు. ఒక్క రాజకీయ నేత లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆంటోనీ కమిటీనీ కోరతామని చెప్పారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీకీ స్పష్టం చేస్తామన్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని త్వరలోనే హైకమాండ్‌ను కలుస్తామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. -
సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఎన్ని రోజులైనా ఉద్యమిస్తాం
సాక్షి, కర్నూలు: సమైక్యవాదుల అడుగులతో విభజనవాదుల గుండెలదురుతున్నాయి. శుక్రవారం ఉద్యమ తీవ్రత పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. కార్యకలాపాలను స్తంభింపజేసి తాళాలు వేశారు. విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కొనసాగుతోంది. ఈ కారణంగా పలుచోట్ల విద్యుత్ సమస్యలు తలెత్తి ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు. రోడ్లు భవనాల శాఖ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం నుంచి సి.క్యాంప్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరయ్య సర్కిల్లో మానవహారం నిర్మించి రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు స్థానిక విజ్ఞాన మందిరం ఆంధ్రాబ్యాంక్, బి.క్యాంప్ పోస్టాఫీసు, ఏపీఎస్ఎఫ్సీ, సివిల్ సప్లై కార్యాలయాలను మూయించారు. బళ్లారి చౌరస్తాలోని శ్రీరామ హనుమాన్ స్వామి దేవాలయం ఎదుట ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఏపీ స్పెషల్ పోలీసు రెండో పటాలం రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ఆవరణలో రిలే దీక్షలు చేపట్టిన వారికి ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. అల్లుడు అవినీతికి కొమ్ముకాస్తూ.. కుమారుడిని ప్రధానిని చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే సోనియాగాంధీ విభజనకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఆదోని పట్టణమంతా గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొన్నా.. సమైక్యవాదులు ఉద్యమాన్ని ఏమాత్రం సడలనివ్వలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ అధ్యాపకులు, విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆళ్లగడ్డలోనూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆలూరులో మాల దాసరి కులస్తులతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి టెలికం, ఎస్బీఐ, ఏపీజీబీ బ్యాంకులను మూసివేయించారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు దీక్షలకు మద్దతు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో మంత్రి ఏరాసు ఇంటిని ముట్టడించారు. డోన్‌లో జ్యోతిమిత్ర మండలి ఆధ్వర్యంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. ఏపీఎన్జీఓలు ర్యాలీ నిర్వహించి బ్యాంకులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను స్తంభింపజేశారు. వెల్దుర్తిలో కళాకారులు సింహగర్జన చేపట్టారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. గార్డెన్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా జలమండలి ఎదుట నీటిపారుదల శాఖ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు మంత్రి టీజీ సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు బుట్టా రంగయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆయనకు ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, టీడీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. -
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మె
హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో వారు జరిపిన చర్చల ఫలితంగా నిరవధిక సమ్మెను వాయిదావేసుకున్నారు. 72 గంటలు మాత్రమే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో చర్చలు ముగిసిన అనంతరం సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల నేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరవధిక సమ్మెను విరమించమని సిఎం కోరినట్లు తెలిపారు. తాము కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి నిరవధిక సమ్మెను విరమించుకున్నట్లు తెలిపారు. 72 గంటల సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సమ్మె నుంచి అత్యవసర సర్వీసులు మినహాయించినట్లు కూడా వారు తెలిపారు. తమ కోరిక సమైక్యాంధ్ర ప్రదేశ్ అని తెలిపారు. తెలంగాణ జిల్లాలలో కూడా సమైక్యాంధ్ర కోరుకునేవారు ఉన్నట్లు చెప్పారు. అయితే వారు భయపడి బయటకు రాలేకపోతున్నారన్నారు. -
కేంద్ర నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించాలో తెలుసు:జెడి శీలం
న్యూఢిల్లీ: సమైక్యరాష్ట్రం కోసం తాము రాజీనామాలు చేయవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేడి శీలం అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించాలో తమకు తెలుసని చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు ఆమోదం పొందుతుందని మంత్రి అన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూనే తమ పదవులకు రాజీనామాలు చేయని విషయం తెలిసిందే. -
ముఖ్యమంత్రి కిరణ్‌పై ఎమ్మెల్యే శ్రీకాంత్ ప్రశ్నల వర్షం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనకు మీరు ఒక కారణం కాదని చెప్పగలరా? అధిష్టానం పెద్దలతో ప్యాకేజీ గురించి చర్చించిన మాట వాస్తవమా? కాదా? పదవిని వదిలిపెట్టుకోవడం ఇష్టంలేక మీరు మౌనంగా ఉన్నారా?లేదా? పదవిలో కొనసాగడం కోసం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవమా? కాదా? సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీసి కార్మికుల జీవితాల గురించి ఆలోచన చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిపై ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పెద్దల లాబీతో సోనియా గాంధీ నియమించిన ముఖ్యమంత్రి అధికార దాహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. ఈ డమ్మీ ముఖ్యమంత్రి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. పదవీ కాంక్షతో డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి ముఖ్యమంత్రి కూడా ఒక కారణం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నారన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కైయ్యారన్నారు. విభజన విషయంలో తన వాదన స్పష్టం చేయకుండా చంద్రబాబు బస్సు యాత్ర చేయడం ఏమిటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. -
లక్షల గళాల సమైక్య నినాదం
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదనకు సీమాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. సమైక్యాంధ్ర కోసం ఈరోజు సీమాంధ్రలో లక్షల గళాలు నినదించాయి. ఉద్యమాలతో సీమాంధ్ర హోరెత్తుతోంది. ఆడా-మగా తేడా లేదు. పేదాధనిక భేదం లేదు. కులమతాలకు తావు లేదు. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుడా జనం జనం చేయి చేయి, గళం గళం కలిపారు. ఊరూ వాడ ఏకమయ్యారు. సీమాంధ్ర సమరాంధ్రగా మారింది. పల్లెలు సింహగర్జన చేస్తుంటే, పట్టణాలు లక్ష గళాలతో గర్జిస్తున్నాయి. సమైక్యత అనే ఒకే ఒక్క లక్ష్యం అందరినీ ఒక్కటి చేసింది. సమైక్యాంధ్ర నినాదం ఢిల్లీ వరకు వినిపించేలా పొలికేక పెట్టారు. ఉద్యమం మహోద్యమం అయ్యింది. లక్షలాది గొంతులు సమైక్యాంధ్ర సాధించి తీరుతామని నినదించాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జనం పోరాట పథంలో కదం తొక్కుతున్నారు. ఏడుచోట్ల లక్షల మంది ప్రజలు - రోడ్లమీదకు వచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్ చేశారు. తూర్పుగోదారి జిల్లా కాకినాడలో లక్ష జనగళ సారఘోష పేరుతో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు జిల్లా తెనాలి, నెల్లూరు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్ష గళఘోష, కడప జిల్లా ప్రొద్దుటూరులో పొలికేక పేరుతో లక్షలగళాలు నినదించాయి. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు..... ఇలా ప్రతి వర్గానికి చెందిన వారు ల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లక్షగళ సమైక్యాశంకారావం నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలతో పాటు అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని సమైక్యస్వరం వినిపించారు. వైఎస్సార్ సీపీ నేత ఆళ్లనాని తదితరులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజనను సహించేది లేదంటూ ఏలూరువాసులు కదం తొక్కుతున్నారు. కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. కాకినాడలో లక్ష గళ సమైక్య సాగర ఘోష నిర్వహించారు. కాకినాడ జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంతమందితో సమైక్య నినాదాన్ని వినిపించింది. సర్వమత ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో టీచర్లు కూడా భాగస్వామ్యం కావడంతో రోడ్డుపైనే టీచర్స్ డే జరుపుకున్నారు. విద్యార్థులు గురువుల ఆశీర్వాదం తీసుకొని సమైక్య స్వరం వినిపించారు. ఎండను సైతం లెక్కచేయక పిల్లలు, వృద్ధులు, వికలాంగులు సైతం ఈ సాగర ఘోషలో పాలుపంచుకున్నారు కడప జిల్లాలో ఉద్యమ కెరటాలు ఎగసిపడుతున్నాయి. పొద్దుటురులో పొలికేక విజయవంతమైంది. సుమారు లక్ష మంది పొలికేకలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఎక్కడ ఉన్నా తమ పొలికేక వినపడుతుందని మహిళలు చెప్పారు. ప్రొద్దుటూరు పొలికేక పెట్టింది. ఢిల్లీకి వినిపించేలా నినదించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా లక్షమందితో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. రాష్ట్ర విభజనపై సింహపురివాసులు సింహాల్లా గర్జించారు. తెలుగుజాతిని చీల్చొద్దంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని.. సమైక్యాంధ్ర లక్ష గళ సింహగర్జనను నిర్వహించారు. విభజనపై తమ నిరసన వ్యక్తం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దద్దరిల్లింది. లక్ష గళ సింహగర్జన కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. లక్షల మంది జై సమైక్యాంధ్రా అంటూ గర్జించారు. ప్రాణాలు అర్పించైనా సమైక్యాంధ్రాను కాపాడుకుంటామని గర్జించారు. ఈ లక్షగళార్చనకు అన్నివర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. లక్షల మంది రోడ్డు మీదకు వచ్చి సమైక్యాంధ్ర అంటూ నినదించడంతో తాడిపత్రి దద్దరిల్లింది. తాడిపత్రి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద లక్ష గళ ఘోష నిర్వహించారు. తాడిపత్రికి చుట్టూ ఉన్న పలు గ్రామాల నుంచి ర్యాలీలుగా జనం తరలివచ్చారు. వారి సమైక్యాంధ్ర నినాదాలతో దిక్కులు పెక్కటిల్లాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో నిర్వహించిన లక్ష గళ ఘోషకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దిక్కులు పెక్కటిల్లేలా సమైక్యవాదం వినిపించి ఉద్యమ సత్తాను చాటారు. చల్లపల్లి సమైక్య నినాదాలు మార్మోగాయి. తెలుగు తల్లిని ముక్కలు చేయవద్దంటూ సమైక్యవాదులు గొంతెత్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు, సామాన్య ప్రజలు అందరూ ఒక్కటయ్యారు. సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా చాటిచెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో లక్షగళార్చన నిర్వహించారు. విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లిని ముక్కలు చేయాలని ఎవరు ప్రయత్నాలు చేసినా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. లక్షల మంది జనం జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు. ఆటపాటలతో విద్యార్ధులు సమైక్యగళం వినిపించారు. ఉద్యోగులు, వ్యాపారులు భిన్నరంగాల వారు తరలివచ్చి సమైక్యవాణి వినిపించారు. విభజించి పాలించు అనే విదేశీ సిద్ధాంతం అమలు చేస్తే మరో స్వతంత్ర పోరాటం తప్పదన్నారు. ఉదమ్యాన్ని అణిచేయాలనుకుంటే విప్లవమవుతుందని హెచ్చరించారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నినాదం ఒక్కటే. అదే సమైక్యాంధ్ర. -
విభజనపై హైకమాండ్ తర్జన భర్జన: మంత్రి పితాని
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతోందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సమైక్యరాష్ట్ర ఉద్యమ తీవ్రతను హైకమాడ్ గమనిస్తోందని చెప్పారు. విభజన ప్రక్రియ వేగవంతం అవుతుందన్న కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో ఆందోళన పెరిగిందన్నారు. ఉద్యమ తీవ్రతను తగ్గించి, ఇబ్బందులను తొలగించి సమస్యను పరిష్కరించాలని చూస్తుందని పేర్కొన్నారు. ఇరు పక్షాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి సామరస్య వాతావరణం తీసుకురావడంపై అధిష్టానం దృష్టి సారించిందని చెప్పారు. విభజనకు అసెంబ్లీలో తీర్మానం రాజ్యంగ పరంగా తప్పని సరి అన్నారు. అప్పుడు ప్రాంతాలవారిగా ఎమ్మెల్యేలు తమ ప్రజల అభీష్టం మేరకే వ్యవహారిస్తారని చెప్పారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారా లేదా అనేది కేంద్రమే చెప్పాలన్నారు. ఏపీ ఎన్జీవోల సభకు పిలిస్తే వెళ్లడంపై ఆలోచిస్తామని చెప్పారు. ఏపీఎన్జీవోల సభను తెలంగాణవాదులు వ్యతిరేకించడం బాధాకరం అన్నారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడం వెనుక సీఎం హస్తం లేదని మంత్రి పితాని చెప్పారు. ఏపీఎన్జీవోల సభతో తలెత్తే పరిణామాలను అనుమతిచ్చినవారే చూసుకుంటారన్నారు. -
కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి
కర్నూలు: కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి చేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు,కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల దీక్షాశిబిరాన్ని ఉపాధ్యాయలు ధ్వంసం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రవాదులు డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంపై టమోటాలు విసిరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. -
12 నుంచి విద్యుత్ జెఎసి నిరవధిక సమ్మె
విశాఖపట్నం: సమైక్యాంధ్ర కోసం ఈ నెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు విద్యుత్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలోని ఉద్యోగులందరికీ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో వర్క్ టు రూల్ పాటించాలని, 5వ తేదీన సామూహిక సెలవులు పెట్టాలని విద్యుత్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల ఉద్యోగులు, ఉత్తరాంధ్ర ఉద్యోగులంతా ఈ నెల 7వ తేదీన ఛలో విశాఖ చేపట్టాలని 10వ తేదీన అధికారులకు సహకరించ వద్దని పిలుపు ఇచ్చారు. 11వ తేదీన మొబైల్ సిమ్ కార్డులను యాజమాన్యానికి అప్పగించాలని అప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోతే నిరవధిక సమ్మెలోకి దిగాలోని విద్యుత్ జేఏసీ ప్రతినిధి కెఎన్వి రామారావు ప్రకటించారు. గత నెల రోజులుగా విద్యుత్ ఉద్యోగులంతా ఆందోళన కార్యక్రమాల్లో నిరవధికంగా పాల్గొంటున్నారని వారంతా మరింత బాధ్యతగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ఆయన కోరారు. -
కాలువలో ఈతకొడుతూ రాష్ట్ర విభజనకు నిరసన
గుంటూరు: తెనాలి స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు విన్నూతన పద్దతిలో రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. తెనాలి మండలం జాగర్లముడి బకింగ్హమ్ కాలువలో స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు ఈత కొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ సభ్యులు తెనాలిలో ఆర్టీసి బస్సును తాళ్లతో లాగారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రోజు నుంచి గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. తెనాలిలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామా చేయాలని నిన్న తెనాలిలోని ఆయన ఇంటిని ముట్టడించిన విషయం తెలసిందే. -
జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఆందోళన పర్వం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై 32వ రోజుకు చేరుకున్నా.. ఉద్యమకారులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు దిగిరాకపోతే వారికి భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగుల సమ్మెతో శనివారం 19వ రోజూ ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉద్యమంలో భాగంగా ఒంగోలు నగరంలో జీవీఎస్ అండ్ జీపీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమాన్ని డీఆర్వో రాధాకృష్ణమూర్తి, కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు ప్రారంభించారు. అద్దంకిలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. పట్టణంలోని చైతన్య పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు విభిన్న వేషధారణలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మేదరమెట్ల- నార్కెట్‌పల్లి రహదారిపై విద్యార్థులు కుంగ్ ఫూ, కరాటే ప్రదర్శించారు. బాలికలు సమైక్య నృత్యం ప్రదర్శించి మానవహారం నిర్వహించారు. సోనియా, వీహెచ్, కే సీఆర్ తదితర 10 మంది నాయకుల తలలతో కూడిన విభజన భూతం దిష్టిబొమ్మను విద్యార్థులు కోడిగుడ్లు, టమోటాలతో కొట్టి నిరసన తెలిపారు. బంగ్లా రోడ్లో జరుగుతున్న ఏపీటీఎఫ్ రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరాయి. బంగ్లా రోడ్లో ప్రైవేటు పాఠశాలల యజమానుల దీక్షలు 12వ రోజు జరిగాయి. చీరాలలో అన్ని కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు భారీ స్థాయిలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇంకొల్లులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. చినగంజాంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వికలాంగులు ర్యాలీ నిర్వహించిన అనంతరం నిరాహార దీక్ష చేపట్టారు. దర్శిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. కందుకూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్లో చేపట్టిన ఉద్యోగుల రిలే దీక్షలు శనివారంతో ముగించారు. దీక్షలో దాదాపు 100 మందికిపైగా కూర్చున్నారు. అలాగే ఆర్యవైశ్యులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు డిపోలో వంటా-వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల నిరసన: కనిగిరిలో శాలివాహనులు, రంగస్థల కళాకారులు, ఆటో కార్మికులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్థానిక పామూరు బస్టాండ్‌లో మానవహారం చేసి, కుండలు, తొట్లు తయారు చేయగా, రంగస్థల కళాకారులు పద్యాలు పాడి నిరసన ప్రదర్శనలు చేశారు. వైఎస్ఆర్ టీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. అలాగే విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు 9వ రోజు రిలే దీక్షలో కూర్చున్నారు. మార్కాపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపట్టిన దీక్షలు 8వ రోజుకు చేరాయి. అలాగే ఏపీటీసీఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తర్లుపాడులో ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 11వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపిలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆటా-పాటా కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. -
ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి, కడప : జిల్లాలో ఎక్కడచూసినా సమైక్య ఉద్యమమే. ఎవరి నోట విన్నా సమైక్య నినాదమే. కేంద్రం దిగి వచ్చేవరకు పట్టువీడేది లేదంటూ ఉద్యోగులు, అధికారులు సమైక్య ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల ఆమరణ దీక్షలు ఉద్యమానికి మరింత ఊపు తెస్తున్నాయి. 28 రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులవుతున్నారు. ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కలెక్టరేట్ వద్ద సోమవారం వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తనయుడు భూపేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, కిశోర్‌కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఉద్యోగులు, నాయకులు, ప్రజలు తరలి వచ్చి వీరికి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి,జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి తదితరులు దీక్షలకు మద్దతు తెలిపారు. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, పశుసంవర్ధకశాఖ, ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ సిబ్బంది భారీర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా భారీర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికారులు డీసీఈబీ హాలులో ఏజేసీసుదర్శన్రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సమావేశమై ఉద్యమ కార్యచరణనురూపొందించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని తీర్మానించారు. దీంతోపాటు ఈనెల 31వ తేదీన రెండు లక్షల మందితో సమైక్య గర్జన సభ నిర్వహించాలని ప్రణాళిక రచించారు. మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కాగాడాల ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి, బాలకృష్ణయాదవ్ దీక్షలు నాల్గవరోజు పూర్తయ్యాయి. ఈ దీక్షలకు టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, మాజీమంత్రి బ్రహ్మయ్య, పుత్తా నరసింహారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగులో బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వంటా వార్పు చేపట్టారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీ ఉద్యోగులు రోడ్లపైనే ప్రార్థనలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో గాండ్ల, తెలిక సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు, భారీ ర్యాలీ నిర్వహించారు. అర్కటవేముల గ్రామస్తులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. మెడికల్ రెప్స్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పులివెందులలో వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ బంద్ నిర్వహించారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయ జేఏసీ, విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ దీక్షలకు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాయచోటిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర జెండాను డాక్టర్ బయారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలియజేశారు. నియోజకవర్గంలోని పశు వైద్యులు, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు రోడ్లను ఊడ్చి తమ నిరసన తెలియజేశారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సమైక్య జెండాను ఎగురవేశారు. జేఏసీ నాయకులు సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. మైదుకూరులో మధ్యాహ్నం వరకు బంద్ కొనసాగింది. ఉపాధ్యాయులు, అన్నలూరు గ్రామ ప్రజలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో అన్ని వర్గాల వారు భారీ ర్యాలీ నిర్వహించారు.మానవహారంగా ఏర్పడ్డారు. బంద్ పాటించడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, మెడికల్ సిబ్బంది దీక్షలు కొనసాగాయి. రాజంపేటలో రెవెన్యూ, న్యాయవాదుల రిలే దీక్షలు సాగాయి. సాయంత్రం న్యాయవాదులు కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. -
లక్ష్యం చేరేవరకూ.. ఆగదు సమరం
సాక్షి, రాజమండ్రి : ‘రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. విడిపోయిన అన్నదమ్ముల్లా కాదు.. కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలి’- సమైక్య ఉద్యమంలో అందరిదీ ఇదే మాట. సమైక్య రాష్ట్ర పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న ఉద్యమం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా ప్రజ్వరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యమం 24వ రోజైన శుక్రవారం కూడా అదే స్థాయిలో కొనసాగింది. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ శాఖ ఉద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపక పోవడంతో 16 మంది ఉపాధ్యాయులు యూటీఎఫ్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో లంకా సత్తిబాబు(27) అనే ఆటో డ్రైవర్ శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తిబాబు రాష్ట్రం విడిపోతుందని మానసిక వ్యధకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్నేహితులు తెలిపారు. రాజమండ్రిలో.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు తుడిచారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డగించారు. సమీపంలోని ఉద్యోగ జేఏసీ నిరాహార దీక్షలకు మద్దతు పలికేందు ఆ శిబిరం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగా పెట్టబోయే పార్టీ విధి విధానాలు తెలపాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో నిరవధిక రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శిబిరానికి వచ్చి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగువారిని ముక్కలు చేసేందుకు కుట్రలు పన్నుతున్న సోనియాగాంధీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. బార్ అసోసియేషన్, జేఏసీ ఫెడరేషన్, మున్సిపల్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, వాపారస్తుల జేఏసీలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ది రాజమండ్రి టైల్స్, శానిటరీ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలో ర్యాలీ చేసి కోటగుమ్మం చేరుకుని వర్తక సంఘం జేఏసీ చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. ఆంధ్రకేసరి యువజన సంక్షేమ సంఘం, గ్రంధి రామచంద్రరావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పాల్‌చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కశాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలో కడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడవ రోజుకు చే రాయి. రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. బొమ్మూరులో వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షా శిబిరం వద్ద వీర్రాజు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని పార్టీ నేతలు నిరసన తెలిపారు. బొమ్మూరులో పార్టీ నాయకుడు నక్కా రాజబాబు, వేమగిరిలో రావిపాటి రామచంద్రరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాతేరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. ఏపీ ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కాకినాడలో... న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. వి.ఎస్. లక్ష్మి కళాశాల, బీఈడీ కళాశాలల విద్యార్థులు నగరంలో ర్యాలీ చేసి భాసుగుడి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. నర్సింగ్ విద్యార్థి అనూరాధ తెలుగుతల్లి వేషధారిణిగా ర్యాలీలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. పీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జెడ్పీ సెంటర్లో ర్యాలీ చేసి అనంతరం రాస్తారోకో చేపట్టారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు చీపుర్లు చేత పట్టుకుని రోడ్లు తుడిచారు. జేఎన్టీయూకే వద్ద విద్యార్థులు, కలెక్టరేట్ వద్ద వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ జేఏసీ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆ శాఖ సిబ్బంది, డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ప్రభుత్వ డ్రైవర్లు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు కోర్టుల వద్ద, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం జగన్నాథపురంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరంలో పాఠశాల విద్యార్థులు రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు. రమణయ్యపేటలో వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. మాధవపట్నం చైతన్య కళాశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు రిలే దీక్షలు కొనసాగించారు. కోనసీమలో.. కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలతో సాగిన ర్యాలీ పట్టణాన్ని వాహనాలతో నింపేసింది. అమలాపురం పట్టణ శెట్టిబలిజ యువత అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సమైక్య వాదులు పట్టణంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల సెంటర్లో వంటావార్పూ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, నియోజక వర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు సంఘీభావం వ్యక్తం చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు సంఘీభావం తెలిపారు. కోనసీమకు చెందిన మత్స్యకారులు వందల సంఖ్యలో అమలాపురం తరలి వచ్చి గడియార స్తంభం సెంటర్లో మానవహారంగా ఏర్పడి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అల్లవరం మండలం ఓడలరేవులో వర్తక సంఘం వంటా వార్పూ చేపట్టింది. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి గ్రామం నుంచి అమలాపురం వరకూ యువకులు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. ఎన్.కొత్తపల్లి గ్రామంలో పంచాయతీల పాలకవర్గం, గొల్లవిల్లిలో రేషన్ డీలర్లు ర్యాలీలు చేశారు. దీక్షలు భగ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా గత ఐదురోజులుగా ఆ పార్టీ నేతలు పెయ్యల చిట్టిబాబు, మిండి గోవిందరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు ముమ్మిడివరంలో చేస్తున్న దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేసి వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించి ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష భగ్నానికి నిరసనగా ముమ్మిడివరంలో విద్యార్థులు, జేఏసీ నేతలు, మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తపేటలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేసి పాతబస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. న్యాయశాఖ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పాత బస్టాండ్ వరకూ ర్యాలీ చేశారు. చేపలు, మాంస విక్రయదారులు దుకాణాలు బంద్ చేసి పాత బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ చేశారు. రావులపాలెంలో జేఏసీ సభ్యులు, సమైక్యాంధ్ర వాదులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో వికలాంగులు పాల్గొన్నారు. వారికి రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ సంఘీభావం తెలిపారు. పెదపట్నంలంకలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఆరు ప్రాధమిక పాఠశాలలను స్థానికులు నిరవధికంగా మూసి వేయించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వెలువడే వరకూ పాఠశాలలు తెరవరాదని అల్టిమేటం జారీ చేశారు. అంబాజీపేటలో వ్యాపారులు, రైతులు అరటిగెలలను సైకిళ్లకు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద సమైక్యవాదులు రాస్తారోకో చేసి వంటా వార్పు నిర్వహించారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల పంచాయతీ వీఆర్వోలు గుడిమిలంక వంతెన వద్ద రాస్తారోకో చేశారు. పిఠాపురంలో బంద్ జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. పట్టణంలోకి వచ్చే రహదారులు మూసివేసి సైకిళ్లు కూడా తిరగనివ్వలేదు. శుక్రవారం పిలుపునిచ్చిన బంద్ సంపూర్ణంగా సాగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, జేఏసీ సభ్యులు వేర్వేరుగా ర్యాలీలు చేశారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సంఘీభావం తెలిపారు. తునిలో జేఏసీ, ఎన్జీఓలు, వెఎస్సార్ కాంగ్రెస్ వేర్వేరుగా చేపడుతున్న రిలే దీక్షలకు పార్టీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. శోభారాణి సంఘీభావం తెలిపారు. మెట్టలో మారుమోగిన సమైక్య నాదం విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రాస్తారోకో చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీ చేసి బాలాజీ చెరువు సెంటర్లో మానవహారం గా ఏర్పడారు. జగ్గంపేటలో విద్యార్థులు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. వైద్య సిబ్బంది పీహెచ్సీ ఆవరణలో వంటా వార్పూ చేసి సహపంక్తి భోజనాలు చేశారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మండపేటలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మోకాళ్లపై నిలబడి కలువపువ్వు సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. రామచంద్రపురంలో బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగులు మోటారుసైకిల్ ర్యాలీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు బస్సులతో ప్రదర్శన చేశాయి. ఏజెన్సీ ప్రాంతంలో కూడా సమైక్య నాదం బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో అడ్డతీగలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రంపచోడవరంలో సమైక్య ర్యాలీ చేశారు. అంబేద్కర్ సెంటర్లో గెజిటెడ్ అధికారులు దీక్షలు చేపట్టారు. -
సెప్టెంబర్ 1న జరగవలసిన 'టెట్' వాయిదా
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేసినట్లు విద్యాశాఖ తెలిపింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ 1న నిర్వహించవలసిన ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలుపుతామని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమ ప్రభావం సీమాంధ్ర జిల్లాల్లోని పాఠశాలలపై ఉండగా, ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగుతుండటంతో టెట్ వాయిదావేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల 47 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. -
అది విభజన కమిటీయే!
రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు. ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది. -
అది విభజన కమిటీయే!
రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు. ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది. -
అది విభజన కమిటీయే!
రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు. ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది. -
వైఎస్ఆర్సీపీ దీక్షకు అయ్యన్నపాత్రుని మద్దతు
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా నర్సీపట్నంలో ఆ పార్టీ సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షాశిబరాన్ని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సందర్శించారు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోంది. విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా విశాఖపట్నంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో వంశీకృష్ణ యాదవ్, పక్కి దివాకర్ పాల్గొన్నారు. రాజకీయ జేఏసీ నేత రామారావు, విద్యార్ధి జేఏసీ నేత కిషోర్‌కుమార్, జర్నలిస్టుల సమితి అధ్యక్షుడు వి.వి.రమణమూర్తి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా తగరపువలస గోస్థని నదీతీరంలో వైఎస్ఆర్ సీపీ నేత అక్రమాని విజయనిర్మల సారథ్యంలో సమైక్యవాదులు వరినాట్లు నాటారు. -
దీక్షలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మద్దతు
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వారికి సంఘీభావం తెలిపారు. కొన్ని చోట్ల పోలీసులు వారి దీక్షలను భగ్నం చేస్తున్నారు. దేవరపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు తలారి వెంకట్రావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ సీపీ నేత విష్ణు చేపట్టిన ఆమరణ దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విష్ణు దీక్షకు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చింతలపుడిలో దీక్ష చేస్తున్న జర్నలిస్టుల జెఎసికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ పేరుతో, టీడీపీ బస్సుయాత్ర పేరుతో ప్రజలను వంచిస్తున్నారన్నారు. చంద్రబాబు బస్సు యాత్ర తెలంగాణ కోసమా? సమైక్యాంధ్ర కోసమా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా జీలుగుమిల్లులో వైఎస్ఆర్ సీపీ నేతల ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేస్తున్నారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా మాదేపల్లిలో చేస్తున్న నిరసన దీక్షలో పీవీరావు పాల్గొన్నారు. ఉండి జేఏసీ ఆధ్వర్యంలలో మహిళలు,ఉపాధ్యాయులు మౌన ప్రదర్శన నిర్వహించి, దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు, వైఎస్ఆర్ సిపి నేత పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. -
మొదటి రోజు కౌన్సిలింగ్‌కు 5,742 మంది హాజరు
హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి రోజు 5,742 మంది విద్యార్థులు హాజరయినట్లు ఎంసెట్ (అడ్మిషన్స్) క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ తెలిపారు. ఏయూ పరిధిలో 1624 మంది, ఏస్వీయూ పరిధిలో 272 మంది, ఓయూ పరిధిలో 3,846 మంది హాజరైనట్లు ఆయన వివరించారు. 56 హెల్ప్‌లైన్ కేంద్రాలలో 37 కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. 19 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరగలేదని రఘునాథ్ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సెలింగ్ సరిగా జరగలేదు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు ఎక్కడా కౌన్సెలింగ్ సజావుగా సాగలేదు. పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ఇప్పటికే సమ్మె చేస్తుండటంతో వారంతా కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. మరికొన్ని చోట్ల ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి ప్రయత్నించినా జేఏసీ నాయకులు, విద్యార్థులు అడ్డుకోవడంతో ఏమాత్రం ముందుకు సాగలేదు. అందువల్లనే సీమాంధ్రలో తక్కువ మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించగలిగారు. -
కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం బాధాకరం: ఎంపి మేకపాటి
నెల్లూరు : సీడబ్ల్యూసీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించడం విచారకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎంపీ సీట్లను తెచ్చుకునేందుకు రాష్ట్ర విభజనకు సిద్దమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్రం రెండు ముక్కలు కావడం బాధాకరమన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కారణంగా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందన్నారు. ఆంతరింగక భద్రత కొరవడుతుందని మేకపాటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో కొత్తగా ఏర్పాటైన మూడు చిన్న రాష్ట్రాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపారన్నారు. రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అందువల్లే తెలంగాణలోనైనా ఎంపీ సీట్లు సంపాదించుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందని విమర్శించారు. -
కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనను:మంత్రి టిజి
కర్నూల్ : రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా ప్రాజెక్టులు పెండింగులో పెట్టి, తెలంగాణకు అనుకూలంగా జీవో 72 విడుదల చేయడం సీమాంధ్రా ప్రజలకు అన్యాయం చేయడమేనని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. జీవో 72 కు సంబందించి స్పష్టత వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొననని చెప్పారు. ఏన్జీవోలపై తాను చేసిన వ్యాక్యలను మీడియా వక్రికరించిందన్నారు. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర సమైక్య పరిరక్షణ కమిటి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. -
మరింత జోరెక్కిన సమైక్య పోరు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరు మరింత పెరి గింది. ఉద్యమకారులు శనివారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నా రు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం రోడ్లపై క్రీడాకారులతో కలిసి ఆటలాడారు. శ్రీకాకుళంలో క్రీడాకారులు, వివిధ క్రీడాసంఘాల ప్రతినిదులు క్రీడా పరికరాలు, క్రీడాజ్యోతితో ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు. డే అండ్ నైట్, వైఎస్ఆర్ కూడళ్లలో మానవహారం చేపట్టారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ క్రీడాకారులతో కలిసి రోడ్డుపై ఆటలు ఆడి ఉద్యమకారుల్లో నూతనోత్తేజం నింపారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అధ్యాపకులు రోడ్డుపై పాఠాలు బోధించారు. స్టేషనరీ అండ్ ప్రింటర్స్ అసోషియేష న్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహిచారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు. అక్కడకు వచ్చినవారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆటో రిక్షా యూనియన్ సభ్యులు వందలాది ఆటోలతో ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డే అండ్ నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి జంక్షన్, పాత బస్టాండ్ మీదుగా వైఎస్ఆర్ కూడలికి చేరుకుని అక్కడ ఆటోలతో హరం నిర్వహించారు. ఆదిత్య పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది భ్యారీ ర్యాలీ నిర్వహిం చారు. గురజాడ విద్యాసంస్థల విద్యార్థులు బైక్ ర్యాలీ చేశారు. రెవెన్యూ, జిల్లా పరిషత్, పురపాలక సంఘం, విద్యుత్ శాఖల ఉద్యోగులు, వైద్యఆరోగ్య శాఖ మినిస్టీరియల్ సిబ్బంది, న్యాయవాదుల, ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. పాలకొండలో ప్రైవేట్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ సంఘం సభ్యులు ర్యాలీ చేశారు. ఏలాం కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. డిగ్రీ కళాశాల అధ్యాపకు లు, విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీ చేసి పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యాంధ్ర కలిగే లాభాలు, రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాల గురించి అధ్యాపకులు రహదారిపైనే విద్యార్థులకు అవగాహన కల్పిం చారు. పీఆర్టీయూ సభ్యులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నా రు. సీతంపేట మండలం చినబగ్గలో ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించి ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. వీరఘట్టం మండలం నడుకూరులో విద్యార్థులు నిరసన కార్యక మం నిర్వహించారు. చలివేంద్రి గ్రామస్తులు రోడ్డుపై వంటావార్పు చేశారు. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో మహిళలు పాల్గొన్నారు. ఉర్లాంలో హైస్కూల్ విద్యార్థులు రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పోలాకి మం డలం ప్రియాగ్రహారం, తలసముద్రం గ్రామాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జలుమూరు మండలం జలుమూరు, హుస్సేనుపురాల్లో ర్యాలీలు జరిపి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సారవకోట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఆకారంలో నిల్చొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ బస్సు యాత్ర సాగింది. ఆమదాలవలసలో పౌరసరఫరాల డిపోల డీలర్లు ర్యాలీ నిర్వహిం చారు. రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు, తలయారీలు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పాలపోలమ్మ మత్సకార సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోని యా, కేసీఆర్‌లను దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద యువకులు వంటావార్పు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు విధుల ను బహిష్కరించారు. జ్యుడీషియల్ ఉద్యోగులు భోజన విరా మ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు, బూర్జలో టైలర్లు రోడ్డుపై కుట్టుమిషన్లు పెట్టి నిరసన తెలిపా రు. పొందూరు మండలం నరసాపురం, సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి, షళంత్రి గ్రామాల్లో సమైక్యవాదులు ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇచ్ఛాపురంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగా యి. వీరికి జర్నలిస్టులు, విద్యార్థులు సంఘీభావం తెలిపి మౌనప్రదర్శన నిర్వహించారు. కంచిలి మండలం తలతంపరలో బంద్ నిర్వహించి ర్యాలీ జరిపారు. సోంపేటలో లగేజీ ఆటో కార్మికులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. టీడీపీ నేతలు నిరాహారదీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. పలాస-కాశీబుగ్గలో విద్యార్థులు, కార్మికులు భారీ ర్యాలీ లు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీనివాసలాడ్జి కూడలి వద్ద మానవహారాలు చేపట్టారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. పలాస మండలం గోపాలపురం పాత జాతీయ రహదారిని విద్యార్థు లు దిగ్బంధించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వజ్రపుకొత్తూరులో గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. పాతపట్నంలో శనివారం నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
2 బృందాలుగా ఢీల్లీ వెళ్లనున్న సీమాంధ్ర ప్రతినిధులు
హైదరాబాద్: రెండు బృందాలుగా ఢిల్లీ వెళ్లాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో వారి సమావేశం ముగిసింది. ఈ నెల 19,20 తేదీల్లో ఆంటోని కమిటీకి తమ వాదనలు వినిపించాలని తీర్మానించారు. సమైక్య రాష్ట్రం మినహా మరో ప్రత్నామ్యాయం లేదన్న నిర్ణయానికి వారొచ్చారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. రాజీనామా దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు తర్వాత ఆంటోని కమిటీని సీమాంధ్రలో పర్యటించాలని కోరనున్నట్లు వారు చెప్పారు. -
ట్రెజరీ, ఫైనాన్స్ శాఖల ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి ప్రయత్నిస్తోంది. వారి సమ్మెను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా(ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది. రాష్ట్రాన్ని విభజించవద్దని ఈ నెల 13 నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జిఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పనిచేయకపోతే జీతంలేదు:177 జీఓ ప్రయోగం
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం జీవో 177ని ప్రయోగించింది. దీని ప్రకారం నో వర్క్ నో పే అమల్లోకి వస్తుందని తెలిపింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు చోటు లేదని, ఎలాంటి ఆందోళనకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. సచివాలయం, కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఒక సర్క్యులర్ ద్వారా తెలిపింది. జీవో 177 ప్రకారం కేవలం విధులు నిర్వర్తించిన వారికే వేతనం ఇస్తామని తెలిపింది. కార్యాలయాలకు వచ్చి సంతకం పెట్టి పని చేయకుండా ఉండే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం
హైదరాబాద్: సిఎం క్యాంప్ ఆఫీస్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చుతున్న నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు భవిష్యత్‌లో చేపట్టవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారి వాదనలను వినేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ముందు వినిపించవలసిన వాదనలు గురించి చర్చిస్తారు. -
ఢిల్లీ పెద్దలు దిగి రావలసిందే..
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ బలపడుతోంది. 17వ రోజైన శుక్రవారం వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాల నిరసన కొనసాగగా వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు ప్రారంభించింది. ఉద్యోగులు నాలుగవ రోజు కూడా విధుల బహిష్కరించి నిరసన ర్యాలీలు చేశారు. ప్రధాన కూడళ్లలో మానవహారాలుగా ఏర్పడి సమైక్యాంధ్ర కోసం నినదించారు. ఆర్టీసీ ఉద్యోగులు డిపోల వద్ద నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఒక్క బస్సును కూడా డిపోల నుంచి బయటకు రానివ్వలేదు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు శాఖల ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు విధులు బహిష్కరించారు. కాగా మంత్రి తోట నరసింహం సతీమణి వాణి కాకినాడలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శుక్రవారం తెల్లవారుజామున కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ దీక్ష విరమించమని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ యువనేతలు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతం, సాల్మన్‌రాజు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో యువకులు చేపట్టిన నిరవధిక దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, రామచంద్రపురంలో ఆర్యవైశ్య సంఘం నాయకుడు గ్రంధి వెంకట రాజు చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. వెఎస్సార్ కాంగ్రెస్ నేత కాపగంటి కామేశ్వరరావు చేపట్టిన 48 గంటల దీక్ష రెండో రోజుకు చేరుకుంది. కాగా ఈ నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతుగా రాజమండ్రిలోని 50 డివిజన్లలో రిలే దీక్షలు ప్రారంభిస్తామని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. సమైక్య నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ కాకినాడలో కలెక్టరేట్ సమైక్యవాదుల నినాదాలతో దద్దరిల్లింది. అక్కడ ఉద్యోగ సంఘాల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రామారావుపేటలోని తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు పాలాభిషేకం చేశారు. పంచాయతీ ఉద్యోగులు డీపీఓ కార్యాలయం నుంచి భానుగుడి మీదుగా కలెక్టరేట్‌కు వరకూ కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దగ్ధం చేశారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ గరగల నృత్యాలతో ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ ఆద్వర్యంలో జెడ్పీసెంటర్‌లో రిలే దీక్షలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకూ ర్యాలీ చేసి అక్కడ మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జేఎన్టీయూకే విద్యార్థులు నగర వీధుల్లో ర్యాలీ చేశారు. సర్పవరం జంక్షన్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముస్లింలు నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్, తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. కాకినాడ పోర్టు నుంచి ట్రాలీలారీల నిర్వాహకులు సమైక్యాంధ్రకు మద్దతుగాా వాహనాలతో ర్యాలీ చేశారు. రమణయ్యపేటలో పంచాయతీల శానిటరీ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు సర్పవరం జంక్షన్ నుంచి రాజమండ్రి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. పెద్దాపురం సామర్లకోట మీదుగా యాత్ర సాగింది. పెద్దాపురం బార్ అసోసియేషన్ సభ్యులు యాత్రకు స్వాగతం పలికి పట్టణంలో చేపట్టిన ప్రదర్శనలో పాల్గొన్నారు. అమలాపురం డివిజన్ బార్ అసోసియేషన్ల సభ్యులు అమలాపురం నుంచి రావులపాలెం వరకూ మోటార్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఎంపీడీఓల డప్పు విన్యాసాలు పంచాయతీ రాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. గడియార స్తంభం సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. డివిజన్లోని మండలాల ఎంపీడీఓలు డప్పులు వాయిస్తూ వినూత్నంగా సమైక్య నినాదాలు చేశారు. వీరి ర్యాలీని మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. టీడీపీ నేతలు గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చిన్నరాజప్పల ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజక వర్గ స్థాయి ర్యాలీ చేశారు. పలు మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేసి, గడియార స్తంభం సెంటర్ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అదే చోట జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యమించిన వివిధ సంఘాలు ఏలేశ్వరంలో ఆటోవర్కర్లు, ఓనర్లు ఆటోలతో ర్యాలీ జరిపి, బాలాజీచౌక్‌లో మానవహారంగా ఏర్పడి సోనియా గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రతిపాడులో కూరగాయల వ్యాపారుల సంఘం ఆధ్వర్యలో ర్యాలీ జరిగింది. గోకవరంలో లారీల యజమానులు లారీలతో ర్యాలీ చేశారు. గండేపల్లి మండలం మల్లేపల్లి నుంచి మురారి వరకూ స్థానిక యువకులు సైకిల్ ర్యాలీ చేశారు. సీతానగరంలో తాపీమేస్త్రీల సంఘం, కోరుకొండలో శ్రీరంగపట్నం సరస్వతీ విద్యానికేతన్ విద్యార్థులు సమైక్య పతాకాలు చేతపుచ్చుకుని ర్యాలీ చేశారు. పెదపూడి మండలం గొల్లలమామిడాడలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద సమైక్యవాదులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. అనపర్తిలో ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. బిక్కవోలులో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రామచంద్రపురంలో సమైక్యాంధ్ర జేఏసీ, బాడీ బిల్డర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. రంపచోడవరంలో స్థానిక యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. సాయంత్రం జేఏసీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. కలిసి ఉంటేనే కలదు సత్తా.. కాగా రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో బస్సుయాత్రలు చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ‘ఆంధ్రా మనదే, తెలంగాణ మనదే, రాయల సీమ మనదే. మూడు ప్రాంతాలు కలిస్తేనే రాష్ట్రానికి శక్తి’ అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రిలో ఉదయం వి.ఎల్.పురం సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్, శ్యామలా సెంటర్ల మీదుగా లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్ విగ్రహాన్ని చేరుకోవడంతో తొలిరోజు ముగిసింది. అమలాపురం పార్లమెంటు నియోజక వర్గ యాత్రను అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, చర్చిలో ప్రార్థనలు జరిపి ప్రారంభించారు. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలుల మీదుగా మామిడికుదురు చేరుకోవడంతో తొలిరోజు యాత్ర ముగిసింది. వరలక్ష్మీ మాతా.. సోనియా మనసు మార్చు! రాజమండ్రిలో మున్సిపల్, విద్యుత్తు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన పట్ల యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి మారు మనసు కలగాలని ధవళేశ్వరంలో సమైక్య వాదులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవుల్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన నిరాహార దీక్షల శిబిరంలో వికలాంగులు పాల్గొన్నారు. మారుతీ సెంటర్ వర్తక సంఘం, ఒకేషనల్ కళాశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో శవయాత్ర చేపట్టారు. అంబాజీపేట మండలం ముక్కామలలో రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో గంగిరెద్దుల విన్యాసాలతో సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అంబాజీపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు. అయినవిల్లి మండలం సిరిపల్లి చర్చిలో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. మలికిపురంలో కేబుల్ ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురంలలో జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షా శిబిరాలకు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు మద్దతు తెలిపారు. సామర్లకోటలో జేఏసీ, ఎన్జీవోలు సంయుక్తంగా తహశీల్దారు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష శిబిరం చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక ర్తనిరసన ప్రదర్శన చేశారు. తునిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ర్యాలీచేసి గొల్లఅప్పారావు సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. -
'6 కోట్ల మంది అభీష్టానికి వ్యతిరేకం ఈ నిర్ణయం'
హైదారబాద్: ఆరు కోట్ల మంది అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఏపీ ఎన్జీవో భవన్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. 6 కోట్ల మంది తప్పుబడుతున్నా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం దారుణం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ ఎన్జీవోలు చాలా నిబద్ధతో ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యమానికి పౌరసమాజం నుంచి మరింత మద్దతు కావాలని కోరారు. తెలంగాణవాదుల ప్రశ్నలన్నింటికీ హైదరాబాద్ బహిరంగ సభ సమాధానం కాబోతుందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తామని చెప్పారు. 1969, 72 ఉద్యమాల తర్వాత రాష్ట్రాన్ని విభజించేది లేదని పార్లమెంట్ స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. పార్లమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించడం సమంజసం కాదన్నారు. గుంటూరులో రేపు అన్ని ఉద్యోగ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ నిర్ణయిస్తామని అశోక్‌బాబు చెప్పారు. -
సమైక్యాంధ్ర సింహాగర్జన విజయవంతం
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. విద్యార్థి జేఏసీ సారథ్యం వహించిన ఈ సభకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అన్ని విభాగాల జెఎసి నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, విజయ్ ప్రసాద్, విజయ్ కుమార్, రమేష్ బాబు, వెంకట్రామయ్య గైర్హాజరయ్యారు. -
బిల్లు పెడితే కోర్టుకెళతాం:నాన్ పొలిటికల్ జెఎసి
విశాఖపట్నం: పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు ప్రవేశ పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాన్ పొలిటికల్ జేఏసీ నేత కర్రి ఆదిబాబు చెప్పారు. సుప్రీం కోర్టులో కచ్చితంగా స్టే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తే న్యాయస్థానంసైతం ఊరుకోదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం విశాఖలో ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
'ఎంపిలను నియంత్రించాలనుకోవడం సరికాదు'
విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మండిపడ్డారు. విభజన విషయంలో ఎంపీలను నియంత్రించాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్, సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్‌పటేల్ నిర్ణయాలను అమలు చేస్తే, కాంగ్రెస్ భూ స్థాపితం కావడం ఖాయం అని హెచ్చరించారు. జనం ఉద్యమం చేస్తుంటే చిరంజీవి కేరళలో పర్యటించడం తెలుగుజాతిని అవమానించినట్లేనన్నారు. తెలంగాణ విభజనపై తమకేమీ ముందస్తు సమాచారం లేదని హరి చెప్పారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చరిత్ర చూసైనా సోనియా గాంధీ తీరు మార్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. తాను రాజీనామా చేసిన తరువాత పార్లమెంట్లో సంతకం పెట్టలేదని చెప్పారు. విమానం టికెట్ క్లెయిమ్ చేయలేదని తెలిపారు. -
విభజనకు కారకుడు చంద్రబాబు: కొడాలి నాని
హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన బ్లాంక్ చెక్ లాంటి లేఖతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించే ధైర్యం చేసిందన్నారు. 2009 డిసెంబరు 9న తెలంగాణకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసిన తరువాత చంద్రబాబు తమతో రాజీనామా చేయించినట్లు చెపారు. రెండు చోట్ల పార్టీ ఉండాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావో చెప్పాలని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. విభజనపై వైఎస్ఆర్ సిపి మొదట్నుంచి చెబుతున్న అంశాన్నే చంద్రబాబు ఇప్పుడు కాపీ కొట్టారన్నారు. చంద్రబాబు కాపీ రాయుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజనపై చంద్రబాబు అఖిలపక్షానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా? అని నాని ప్రశ్నించారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు లక్షల కోట్లు కావాలన్నది నిజం కాదా? అని అడిగారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో వెన్నుముక లేని వ్యక్తులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లు బతికుంటే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెన్నులో వణుకు పుట్టేదని చెప్పారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు రాజీనామాలు చేసి తమ వైఖరి స్పష్టం చేయాలని నాని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే మిగిలినవారు కూడా రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటించేవారు కాదన్నారు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాగోలా దెబ్బకొట్టాలని చంద్రబాబు టిఆర్ఎస్తో జతకట్టి తెలంగాణ ఇచ్చివేయమని 2008లో లేఖ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరంలేదని లేఖ ఇచ్చారన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెబుతుంటారని, అది పచ్చి అబద్ధం అన్నారు. వాస్తవానికి వైఎస్ఆరే అభివృద్ధి చేశారని చెప్పారు. -
తొలిరోజు సమ్మెవిజయవంతం: అశోక్ బాబు
హైదరాబాద్: ఎపి ఎన్జీఓల తొలిరోజు సమ్మె విజయవంతమైనట్లు ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు చెప్పారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర అంతటా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. సమ్మె విజయవంతమైనట్లు అన్ని జిల్లాల నుంచి తమకు సమాచారం అందినట్లు చెప్పారు. సమ్మెకు సహకరించిన ఉద్యోగులకు ఆయన దన్యవాదాలు తెలిపారు. సమ్మెలో పాల్గొనేవారు, తమకు సహకరించే వారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు చేయవద్దని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాము ఇక్కడ సమ్మె చేయడానికి వీలులేదని, తమని విజయవాడ వెళ్లమని, తిరుపతి వెళ్లమని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మీకు ఎంత అవసరమో, రాష్ట్రం కలిసి ఉండటం తమకు అంత అవసరం అన్నారు. తాము రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. శాంతియుత వాతావరణం ఉంటేనే చర్చలలో పాల్గొంటామని చెప్పారు. -
సమ్మెకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటుంది. కొంతమంది సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలే సమైక్యత కోసం పోరాడుతున్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చురుకుగా పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెకు కూడా వారు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర కోసం 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నాయి. సీమాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు రేపు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. 13 జిల్లాల్లో జిల్లా స్థాయి జేఏసీల ఏర్పాటుతోపాటు సీమాంధ్ర స్థాయి జేఏసీని కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలలో జెఏసిలు ఏర్పడ్డాయి. మిగిలిన జిల్లాలలో ఈరోజు ఏర్పడే అవకాశం ఉంది. ఏపీఎన్జీవోలతో పాటు సమ్మెలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వారికి సీమాంధ్ర విభాగాలు లేకపోవడం, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ జేఏసీలు తీసుకునే నిర్ణయాలకు సర్వీసు రూల్స్పరంగా తగిన రక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆలోచనలోపడ్డాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు రాజీనామా చేశారు. 13 జిల్లాల ప్రతినిధులతో బుధవారం హైదరాబాద్‌లో జరిగే కీలక సమావేశంలో సీమాంధ్ర స్థాయి ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
'రాజకీయ నిరుద్యోగుల వల్లే రాష్ట్ర విభజన'
నెల్లూరు: రాజకీయ నిరుద్యోగుల వల్లే రాష్ట్ర విభజన సమస్య వచ్చిపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి అన్నారు. ఏపీ ఎన్జీవోల నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు నేతలు ఉత్తుత్తి రాజీనామాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేకపాటి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఏపి ఎన్జీఓలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈరోజు నుంచి వారు సమ్మె మొదలు పెట్టారు. వారి సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. -
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై సీఎం సమీక్ష
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యవసర సేవలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. తిరుమల యాత్రికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉండాలన్న డిమాండ్ తో ఏపి ఎన్జీఓలు ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే. -
365 అడుగుల జాతీయ జండాతో భారీర్యాలీ
గుంటూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. గుంటూరులో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జనం అధిక సంఖ్యలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. చిలుకలూరి పేట ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమక్యాంధ్రకు మద్దతుగా 365 అడుగుల జాతీయ జండాతో పట్టణంలో ర్యాలీ జరిపారు. మాచర్లలో వైఎస్ఆర్ సీపీ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
సకలం బంద్
సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఎన్జీఓల సమ్మె సకల జనుల సమ్మెగా మారింది. 13 రోజులుగా జరుగుతున్న ఉద్యమం నిరవధిక సమ్మెగా రూపాంతరం చెందింది. సోమవారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి, ఉద్యోగసంఘాలతో పాటు మొత్తం 71 శాఖలకు సంబంధించిన 70 వేల మందికి పైగా ఉద్యోగులు సకలజనుల సమ్మె చేపట్టారు. బంద్ ప్రభావం సోమవారం నాడే కనిపించింది. సమ్మె ప్రభావం చాలా రోజులు ఉండవచ్చనే ప్రచారంతో వ్యాపారులు నిత్యావసరాల ధరలను నింగినంటించారు. నిన్న మొన్నటివరకూ రూ.30 ఉన్న టమోట రూ. 80 నుంచి వంద వరకూ పలికింది. రూ. 40 ఉన్న మిర్చి కేజీ 90 నుంచి రూ.100 వరకు అమ్మగా కిలో రూ.40 ఉన్న క్యారెట్ రూ.70కి చేరింది. ఇక బెండ, దొండ రూ. 60 నుంచి రూ.70 వరకూ పలికాయి. మంగళవారం నుంచి కూరగాయలు దొరకవంటూ వ్యాపారులు సొమ్ము చేసు కున్నారు. బంద్ ప్రభావంతో కూరగాయలు దొరకవన్న భయంతో అడిగినంత ఇచ్చి వినియోగదారులు కొనాల్సి వచ్చింది. సామాన్యులు ఈ ధరలు పెట్టి కూరగాయలు కొన లేక విలవిలలాడారు. మరోవైపు జేఏసీల పిలుపుమేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పెట్రోలు బంక్‌లను 24 గంటల పాటు మూసి వేస్తుండటంతో పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే పెట్రోల్ లేదంటూ బంకుల యజమానులు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. ఆర్టీసీలో ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు బంద్‌లో పాల్గొంటుండటంతో బస్సులు నిలిచిపోనున్నాయి. వీఆర్వో మొదలుకుని తహశీల్దార్ వరకూ అందరూ సమ్మె బాట పట్టనుండటంతో రెవెన్యూ కార్యాలయాలు దాదాపు మూతపడనున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచే కలెక్టరేట్ బోసిపోయింది. కిక్కిరిసిన ఏసీ మార్కెట్ నెల్లూరు(పొగతోట): సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కూరగాయల వ్యాపారులు మంగళవారం బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం నెల్లూరులోని ఏసీ మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడింది. సకలజనుల సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ధరలు పెరిగిపోతాయనే ఆందోళనతో నెల్లూరు నగర వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు మార్కెట్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో కూరగాయల ధరలు చుక్కలనంటాయి. మళ్లీ పెరిగిన ఉల్లి గూడూరు: ఉల్లి ధర అమాంతంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే రూ.60 నుంచి రూ.80కి చేరింది. ఉద్యమం పేరు తో ఉల్లిని నల్లబజారుకు తరలించడంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రచారం జరుగుతోంది. -
సేవలు బంద్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నాయి. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. 52 ప్రభుత్వ 55వేల మంది సమ్మెలో పాల్గొననున్నారు. ఉపాధ్యాయులు 13, 14 తేదీల్లో మాస్ క్యాజువల్ లీవు పెట్టి ఉద్యమంలో పాల్గొంటారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిరవధిక సమ్మెను పర్యవేక్షిస్తోంది. సమైక్యాంధ్ర సాధనకు చేపట్టనున్న సమ్మెలో గెజిటెడ్ అధికారులు కూడా పాల్పంచుకుంటున్నారు. కర్నూలులోని జనరల్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటన్నింటిని సమ్మె పరిధిలోకి తీసుకొచ్చారు. పశువైద్య సేవలు కూడా స్తంభించనున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచే ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటుండటంతో పాలన వ్యవహారాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇక నిరవధిక సమ్మెతో పాలన సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. తాగునీరు, శానిటేషన్ వంటి అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, గనుల శాఖ ముఖ్యమైనవి. ఈ శాఖలు కూడా సమ్మెలోకి వస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది. నిరవధిక సమ్మెలో భాగంగా ప్రతిరోజు కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోను ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్లను ముట్టడించి పరిసరాలను శుభ్రం చేయడానికి నిర్ణయించారు. సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు జిల్లా అధికారుల సంఘం నేతలు ఆనంద్‌నాయక్, వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమ్మెలో పాల్గొంటుండటంతో సేవలు స్తంభించనున్నాయి. వైద్యులు అత్యవసర సేవలకే పరిమితం కానున్నారు. అదేవిధంగా మూడు రోజుల పాటు పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగా బంద్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సమ్మెకు సహకరించండి నిరవధిక సమ్మెకు సహకరించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగల్రెడ్డి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ సోమవారం రాత్రి కలెక్టర్‌ను కోరారు. జిల్లా అధికారులంతా సహకరించాలని విన్నవించారు. 108 సిబ్బంది కొంతకాలంగా సమ్మెలో ఉన్నందున పారామెడికల్ సిబ్బందిని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నారని.. వారు కూడా మంగళవారం నుంచి సమ్మెలో వెళ్తున్నారని కలెక్టర్‌కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. జేఏసీ కార్యదర్శి శ్రీరాములు, నగర అధ్యక్షుడు లక్ష్మన్న, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు కలెక్టర్‌ను కలిశారు. -
సమ్మె వల్ల సమస్యలు: మంత్రి ఆనం
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెవల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మంత్రుల బృందంతో ఏపీ ఎన్జీవో నేతల చర్చలు ముగిసిన తరువాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించడం సరికాదని మంత్రి అన్నారు. సమ్మె వాయిదా వేసుకోవడం కుదరదని ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పిన విషయం తెలిసిందే. ఏపి ఎన్జీఓలు ఈ రోజు అర్ధ రాత్రి నుంచి సమ్మె చేయనున్నారు. -
విభజన జరిగితే నీటి కోసం యుద్ధమే: భూమా
కర్నూలు: ఇప్పటికే రాష్ట్రానికి జల వివాదాలు ఉన్నాయని వైఎస్ఆర్ సిపి నేత భూమా నాగిరెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ప్రకటన తర్వాత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమస్యలు అడగటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. ఆళ్ళగడ్డలోని 18వ నెంబరు జాతీయ రహదారిని సమైక్యవాదులు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేయనున్నారు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి వారికి మద్దతు ప్రకటించారు. -
మున్సిపోల్స్‌కు బ్రేక్..?
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పరిపాలన శాఖ ఉద్యోగులు విధులకు దూరం కానుండడంతో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితే చెప్పకనే కనిపిస్తోంది. దీంతో ముఖ్యనేతలు కాస్త ఊపిరి పీల్చుకుం టుండగా....ఆశావహుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ పూర్తిస్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా ఇటీవలే నెల్లిమర్ల, జరజాపుపేట మేజర్ పంచాయతీలు నగర పంచాయతీగా మార్పు చెందాయి. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా రూపకల్పన తుది ఘట్టానికి చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల పోలింగ్ కేంద్రాల నిబంధనలపై మున్సిపల్ కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటికే జరగాల్సి ఉంది. కానీ అది ఈ నెల మూడో వారానికి వాయిదా పడింది. అంతేకాకుండా చైర్మన్ అభ్యర్థుల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇన్ని అవాంతరాల నడుమ ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అనుమానమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 2 లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనే కోర్టు ఆదేశాలు కూడా అమలయ్యేటట్లు కనిపించడం లేదు. ముఖ్యనేతల్లో ఉపశమనం మున్సిపల్ ఎన్నికలు వాయిదాపడే సూచనలు కనిపిస్తుండడంతో ఆయా రాజకీయ పార్టీల ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికలు తాత్కాలికం గా ఆగితే బాగుండుననే యోచనలో వారంతా ఇప్పటికే ఉన్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు కావడంతో ఎన్నికల నగదు, మద్యం సర్దుబాటు చేయలేక ఇక్కట్లు పడిన నేతలకు మున్సిపల్ ఎన్నికల ఖర్చు మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మళ్లీ సాధారణ ఎన్నికల్లో తామేం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆశావహుల్లో నిరుత్సాహం వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ప్రకటనతో అన్ని పార్టీల్లోని అశావహులు పోటీల తీరుపై నిన్నటి వరకు లెక్కల్లో మునిగితేలారు. చైర్మన్ అభ్యర్థులు గా ఉండాలనుకునే వారైతే ముఖ్యనేతలలో సంబంధం లేకుండా ఓసీ అయితే ఒక గ్రూప్ ప్యానల్, ఓసీ మహిళ అయితే మరో గ్రూప్ప్యానల్, బీసీ, బీసీ మహిళ అయితే మరో గ్రూపు ప్యానల్‌గా ఏర్పాట్లు చేసేసుకున్నారు. వార్డుల్లో కులా ల వారీగా గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. -
అన్ని వర్గాల శ్వాస..సమైక్యమే...
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. విజయనగరం పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాం ధ్రకు మద్దతుగా వినూత్న తరహాలో క్వారీ లారీలతో నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ జంక్షన్ నుంచి బయలుదేరిన నిరసన ర్యాలీ జేఎన్టీయూకే ఇంజినీరింగ్ క్యాంపస్ జంక్షన్ వరకు సాగింది. అనంతరం అక్కడ విజయనగరం-సాలూరు జాతీయ రహదారిపై వంటా వార్పు చేశారు. సమై క్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియా, దిగ్విజయ్, మంత్రి బొత్సల మాస్కులు ధరించిన వ్యక్తులను హోమం వద్ద కూర్చుండబెట్టి వారికి పట్టిన వేర్పాటు వాద భూతం వదలాలంటూ పూజ లు జరిపించారు. వివిధ మత్స్యకార సంఘా ల ఆధ్వర్యంలో 500 మంది మత్స్యకారులు జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి జిల్లా కేం ద్రానికి తరలివచ్చి పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో తమ వృత్తిలో భాగంగా రోడ్డుపై వలలు వేసి చేపలు పట్టడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల సమస్య ఏర్పడుతుందని తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని వాపోయారు. నిరసనలో భాగంగా బాలాజీ జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్‌ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వీటీ అగ్రహారం ైవె జంక్షన్ వద్ద జాతీయ రహ దారిని దిగ్బంధించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిలుపుమేరకు అధిక సంఖ్యలో క్రీడాకారులు ప్రధాన కూడళ్లలో క్రీడలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోట జంక్షన్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ మోటార్ ర్యాలీ సైకిల్ ర్యాలీ నిర్వహించగా...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి..అంత్యక్రియలు చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగగా పలువురు పార్టీ నాయకులు, కార్య కర్తలు రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో గల స్పోర్ట్స్ స్పిరిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు బైక్ ర్యాలీ చేసి కోట జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ అద్దె వాహనాల యజమానులు, వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో వాహనాలతో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్లలో ఆర్ఓబీ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం-పాలకొండ రహదారిపై ముగ్గులపోటీ నిర్వహించారు. ఎస్‌కోటలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త వేచలపు వెంకట చినరామునాయుడు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, బొత్స దిష్టిబొమ్మలతో శవయాత్ర చేశారు. అనంతరం దేవీ జంక్షన్లో దిష్టిబొమ్మలను దహనం చేశారు. అలాగే వైఎస్ ఆర్సీపీ మద్దతుదారు సర్పంచ్‌లు, నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శ్రీదేవి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేవి జంక్షన్‌లోనే వంటవార్పు జరిగింది. సమైక్యాంధ్ర కోసం బొబ్బిలిలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిం చారు. సాలూరులో బోసుబొమ్మ కూడలిలో తోపుడుబళ్లతో ధర్నా చేపట్టగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించి సమైక్యవాదానికి మద్దతు పలికారు. కురుపాం నియో జకవర్గంలోని గరుగుబిల్లిలో సమైక్యాం ధ్రకు మద్దతుగా వెఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. -
సమ్మె సైరన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉద్యమ పిడికిలి బిగుస్తోంది. సమైక్య సమ్మెకు సైరన్ మోగింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలు సమ్మెలోకి వెళ్లనుండటంతో ప్రభుత్వ కార్యకలాపాలతోపాటు పలు సేవల రంగాలు స్తంభించిపోనున్నాయి. సమ్మెల్లో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వాడవాడలా హోరెత్తుతున్న ఉద్యమనాదం ఉద్యోగ సంఘాల సమ్మెతో పతాకస్థాయికి చేరనుంది. ఇప్పటికే గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కుల, మత, వర్ణ, వర్గ విభేదాలకు అతీతంగా విద్యార్ధులు, యువకులు, మహిళలు, వృద్ధులు సమైక్య ఉద్యమం సాగిస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయినా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ స్పం దించకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 12(సోమవారం) అర్ధరాత్రి నుంచి సమ్మెకు ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలకు చెందిన 20వేలకుపైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) ప్రకటించింది. సేవలకు విఘాతం ప్రధానంగా రెవెన్యూ, మండలపరిషత్, ఇరిగేషన్, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖలు పూర్తిగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో రెండు, మూడు మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా మంగళవారం నుంచి వివిధ రకాల ప్రభుత్వ సేవలకు దూరం కానున్నాయి. ప్రభుత్వ పాలన పూర్తిగా పడకేస్తుంది. మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు సమ్మె చేయనుండటంతో పాఠశాలలు మూతపడనున్నాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామపరిపాలన స్తంభిస్తుంది. ట్రజరీ ఉద్యోగుల సమ్మె వల్ల వివిధ రకాల బిల్లులు, ఉద్యోగుల జీతాలు నిలిచిపోతాయి. నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖల సమ్మె వల్ల వ్యవసాయ రంగం ఇబ్బంది పడుతుంది. అయితే సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు అంటున్నారు. సమ్మెలో పాల్గొనే శాఖలు ఉపాధ్యాయులు రెవెన్యూ శాఖ వైద్య, ఆరోగ్యశాఖ మినిస్టీరియల్ సిబ్బంది మండల పరిషత్ జిల్లా పరిషత్ నీటిపారుదల శాఖ పే అండ్ అకౌంట్స్ రిజిస్ట్రేషన్స్ ఖజానా శాఖ వాణిజ్య పన్నులు, ఆర్టీసీ విద్యుత్ మున్సిపాలిటీ పశువైద్యం వ్యవసాయం ఉద్యానవన శాఖ -
రగులుతున్న నిరసన జ్వాలలు
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్య నిరసన జ్వాలలు రోజురోజుకూ రగులుతున్నాయి. ఆదివారం సెలవు అయినా..ఉద్యమం ఊపు తగ్గలేదు. పర్చూరులో గొట్టిపాటి భరత్, మరో ముగ్గురు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగింది. ఆర్యవైశ్య సంఘ నాయకులు పర్చూరులో భారీగా ర్యాలీ నిర్వహించి రాష్ట్ర విచ్ఛిన్నాన్ని నిరసిస్తూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ మండల నాయకులు చేపట్టిన రిలే దీక్షను జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు పదవుల కోసం రాష్ట్ర సమగ్రతకు ముప్పు వాటిల్లుతున్నా మౌనంగా ఉంటున్నారని, అటువంటి వారికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మరో వైపు జిల్లా కోర్టు వద్ద పసుపులేటి వెంకటేశ్వరరావు, ఎం.కృష్ణారావు, పీ.నాగేశ్వరరావు అనే న్యాయవాదులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పైనీడి సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులంతా విధులకు గైర్హాజరు కావాలని తీర్మానించారన్నారు. 17వ తేదీ తరువాత రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక జేఏసీలతో కలిసి పోరాటం ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి ఆదివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ కార్యాలయం ముందు చేపట్టిన ఈ దీక్షను కనిగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముక్కు కాశిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా వైఎస్సార్ సీపీ మాత్రమే ముందుకు వచ్చిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మలు సైతం తమ పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేశారన్నారు. కానీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వారికి బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరో వైపు విద్యార్థులంతా భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించి మానవహారం చేశారు. హనుమంతునిపాడులో ప్రజలే స్వచ్ఛందంగా గ్రామంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అద్దంకి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా ఒక జేఏసీగా ఏర్పడి అద్దంకి బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించారు. జే.పంగులూరులో బస్టాండు సెంటర్ వద్ద అంబేద్కర్ యూత్ఫోర్సు మానవహారం నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చే శారు. కంభంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కందులాపురం సెంటర్లో ధర్నా నిర్వహించారు. -
సమ్మె సైరన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమభేరి మోగించనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీఓలు ఇచ్చిన అల్టిమేటంను సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఖాతరు చేయలేదు. ఈ నెల 12లోపు తమ పదవులను త్యజించేందుకు సుముఖత చూపలేదు. ఫలితం...ఉద్యోగులు సమ్మెకు దిగాల్సిన అనివార్యత ఏర్పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోనుంది. సమ్మె బాటలో... జిల్లాలో దాదాపు 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 7 వేల మంది ఎన్జీఓలు, 2 వేలమంది పంచాయతీరాజ్ సిబ్బంది, 2,200 మంది రెవెన్యూ సిబ్బంది, దాదాపు వెయ్యిమంది క్లాస్ ఫోర్ సిబ్బంది, 2,400 మంది ప్రభుత్వ డ్రైవర్లతోపాటు మున్సిపల్ ఉద్యోగులు, సాక్షి ప్రతినిధి, ఒంగోలుఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమభేరి మోగించనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీఓలు ఇచ్చిన అల్టిమేటంను సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఖాతరు చేయలేదు. ఈ నెల 12లోపు తమ పదవులను త్యజించేందుకు సుముఖత చూపలేదు. ఫలితం...ఉద్యోగులు సమ్మెకు దిగాల్సిన అనివార్యత ఏర్పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోనుంది. సమ్మె బాటలో... జిల్లాలో దాదాపు 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 7 వేల మంది ఎన్జీఓలు, 2 వేలమంది పంచాయతీరాజ్ సిబ్బంది, 2,200 మంది రెవెన్యూ సిబ్బంది, దాదాపు వెయ్యిమంది క్లాస్ ఫోర్ సిబ్బంది, 2,400 మంది ప్రభుత్వ డ్రైవర్లతోపాటు మున్సిపల్ ఉద్యోగులు, -
సమ్మెలో పాల్గొననున్న డిప్లొమో ఇంజినీర్లు
విజయవాడ: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న డిప్లొమో ఇంజినీర్లు సమైక్యాంధ్ర కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫ్యాక్స్ ద్వారా సమ్మె నోటీసు పంపారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రతినిధులు ఆదివారం ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఏఈ రియాజ్ అహ్మద్‌ను ఎన్నుకున్నారు. -
ఆమరణదీక్ష చేస్తున్న నిత్యానంద రెడ్డి అరెస్ట్
కడప: వైఎస్ఆర్ జిల్లా కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ పిసి సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతనిని రిమ్స్‌కు తరలించారు. సమైక్యాంధ్ర కోసం కడప కలెక్టరేట్ వద్ద నిత్యానంద రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష ఆరవ రోజుకు చేరింది. నిత్యానంద రెడ్డి దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. -
రేణిగుంటలో ఆమరణదీక్ష భగ్నం
చిత్తూరు: రేణిగుంటలో సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు చేపట్టిన ఆమరణదీక్షను భగ్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి చిత్తూరు జిల్లాలో ఉధ్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు 11వ రోజు కూడా జిల్లాలో బస్సులను తిరగనివ్వడంలేదు. తిరుపతిలో సమైక్యవాదులు బంద్‌లు, రాస్తారోకో, వాహనాలు తగులబెట్టడం, దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం లాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓరియంటల్ కాలేజీ ఎదుట సకల జనుల సామూహిక దీక్షలు చేపట్టారు. ప్రజావేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వక్తలు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి వెనుక అందరి కృషి ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ను విడగొడితే భవిష్యత్ తరాలవారికి ఏం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ఆలోచించాలని ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. -
భీమవరంలో మహాధర్నా
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో సమైక్యాంధ్రవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహధర్నానిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5 వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హజరయ్యారు. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘరామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాతపాటి సర్వాజ్ పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని, సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. -
తొమ్మిదో రోజూ హోరెత్తిన సమైక్య నిరసనలు
ఓ వీధిలో పదిమంది కలుస్తున్నారు. ఆ మరునాటి ఉదయూన్నే సమైక్యాంధ్ర ఉద్యమం చేయూలనుకుంటున్నారు. తమకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే అరుునా తలో వందా రెండొందల చొప్పున చందాలు వేసుకుంటున్నారు. ప్ల కార్డులు లేదా బ్యానర్లు తయూరు చేరుుంచుకుంటున్నారు. రిక్షా, మైకు మాట్లాడుకుని ‘జై సమైక్యాంధ్ర’ నినాదం అందుకుంటున్నారు. రోడ్డెక్కేసరికి ఆ పదిమంది కాస్తా వందలాదిగా అవుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. వారిలో ఎవరూ నాయకులు కాదు. ఏరోజూ మైకులో మాట్లాడి ఎరుగరు. అరుునా.. వారే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. బిందువులన్నీ సింధువైనట్టుగా.. చలిచీమలన్నీ ఏకమై మహాసర్పం పీడ విరగడ చేసినట్టుగా.. గడ్డిపూచలన్నీ తాడులా మారి మదించిన ఏనుగు పీచమణిచిన చందంగా ఉద్యమ సెగను ప్రజ్వలింప చేస్తూ ఢిల్లీకి వినిపించేలా పొలికేక పెడుతున్నారు. సాక్షి, ఏలూరు :రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ జిల్లా వాసులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక మరో నలుగురి గుండెలు ఆగిపోయూరుు. ఉండి గ్రామంలోని చుక్కాల వీరన్న నగర్‌కు చెందిన కిలారి విష్ణు(32) గుండె ఆగి మరణించాడు. మొగల్తూరులో సవర నాగరాజు (29) మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. హైదరాబాద్‌లో వడ్రంగి పని చేసుకునే నాగరాజు ఇటీవల గ్రామానికి వచ్చాడు. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఉద్యమాలు వెల్లువెత్తినా రాష్ట్ర విభజన చేసి తీరతామని ఢిల్లీ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో తనకు జీవనోపాధి పోతుందనే ఆందోళనకు గురైన నాగరాజు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయూడు. చింతలపూడికి చెందిన గుంజి చుక్కమ్మ (45), లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామానికి చెందిన ఇందూరు సత్యనారాయణ గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. ఉద్యమ ఝరి.. హేలాపురి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం ఉద్యమాలతో దద్దరిల్లుతోంది. నేషనల్ మజ్దూర్ యూని యన్ సీమాంధ్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ముందు నష్టపోయేది ఆర్టీసీయేనని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడుకోవడం కోసం ఈ నెల 12నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామన్నారు. నగరంలో కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. వ్యాపారులు, గుమాస్తాలు మెడలో కూరగాయల దండలు వేసుకుని వైఎంహెచ్ఏ హాలు వద్దకు చేరుకున్నారు. అక్కడ తెలుగుతల్లి విగ్రహానికి, పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, వసంత మహల్ సెంటర్లో పొట్టిశ్రీరాముల విగ్రహానికి, జూట్‌మిల్లు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహాలకు కూరగాయలతో చేసిన దండలు వేశారు. 150 కిలోల టమాటలను తీసుకువచ్చి పంపిణీ చేశారు. రిటైల్ వర్తకులు కొందరు పోలీసుల బూట్లను చొక్కాలతో తుడిచి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నగర శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మౌనప్రదర్శన నిర్వహించారు. మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహం కళ్ల్లకు నల్ల రిబ్బన్ కట్టి మౌన వేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి, వంటావార్పు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై కబడ్డీ ఆడారు. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో ప్రైవేట్ స్కూల్ యూజమాన్యాల రిలే నిరాహార దీక్షలు గురువారం 5వ రోజు, వసంత మహల్ సెంటర్లో గాయత్రి పురోహితుల సంఘం, న్యాయవాదులు, వ్యాపారులు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. అడుగడుగునా నిరసనలే జిల్లాలో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నారుు. తణుకులో సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వీరభద్రపురం సెంటర్లో వంటావార్పు చేశారు. వేల్పూరు రోడ్డుపై వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు బైక్ ర్యాలీ చేశారు. చాగల్లులో ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. డ్వాక్రా సంఘాలు, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. నందమూరులో విద్యార్థులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. సీతంపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కొవ్వూరు మెయిన్ రోడ్డులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు, న్యాయవాదులు క్షీరాభిషేకాలు చేశారు. తాళ్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జై సమైక్యాంధ్ర ఆకృతిలో కూర్చుని నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు ర్యాలీ జరిపారు. సమైక్యాంధ్ర సాధించే వరకు ఉద్యమం ఆగదని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ అన్నారు. జోరువానలో రోడ్‌పై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. నిడదవోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మునిపల్లిలో వైఎస్సార్ సీపీ కన్వీనర్ రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారు. కొయ్యలగూడెంలో రిలే నిరాహార దీక్షలు, టి.నరసాపురం మండలంలో నిరసన ర్యాలీలు జరిగాయి. పాలకొల్లులో వేలాదిగా తరలివచ్చిన డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో ఉద్యమాలు భారీ ఎత్తున జరిగారుు. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, ఆంధ్రా మేధావుల ఫోరం చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఉద్యమ వేడి చల్లారలేదు. మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతి జేఏసీ కన్వీనర్‌గా శ్రీకాంత్‌రెడ్డి
చిత్తూరు: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఎపి ఎన్జిఓ సంఘాలే కాకుండా ఇతర ప్రజా సంఘాలు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి జేఏసీ ఆవిర్భావించింది. 325 ప్రజాసంఘాల కలయికతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ వి. శ్రీకాంత్ రెడ్డిని జేఏసీ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణను రేపు నిర్ణయిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన రోజు నుంచి చిత్తూరు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో బంద్‌లు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలు తగులబెట్టడం, వాహనాలు దగ్ధం చేయడం వంటి సంఘటనలో ఇక్కడ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు 325 ప్రజాసంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ(జెఎసి)గా ఏర్పడ్డాయి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో వీరు ముందుకు సాగుతున్నారు. -
నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి
ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో తాను నిస్సహాయుడినని, ఎవరైనా ఏమైనా అనుకోండని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కావూరి స్పందన తీరు ఈ విధంగా ఉంది. తెలంగాణ ప్రకటన తర్వాత తాను మాట్లాడ లేదన్న అపవాదు ఉంటే ఉండనీయండి అని అన్నారు. తనకు స్పష్టత ఉందని, తనకు విశ్వసనీయత ఉందని కావూరి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన తరువాత కావూరి ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరులోని ఆయన నివాసంపై దాడి కూడా చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తరువాత కావూరి సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో చల్లబడిపోయినట్లు విమర్శ ఉంది. -
జనం... జనం.. ప్రభంజనం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నీటిృబొట్టు.. బొట్టు.. కలిసి ప్రవాహమైనట్టు జనం.. జనం.. ప్రభంజనమై సమైక్యాంధ్రోద్యమంలోకి కదిలివస్తున్నారు. కాంగ్రెస్ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పెనలా తరలివస్తున్నారు. ఉద్యమమై ఉరికివస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, మహిళలు, వ్యాపారులు ఇలా ఒకరేమిటి సహస్రవృత్తుల సమస్త జనులు భుజం భుజం కలిపి కదం తొక్కుతూ పదం పాడుతూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.ఆందోళనకారులంతా కలెక్టరేట్ వైపునకు దూసుకువస్తున్నారు. ఏడవ రోజైన మంగళవారం కూడా కలెక్టరేట్ ప్రాంతం జన జాతరలా మారింది. సోనియా.. క్విట్ ఇండియా : రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి బరి తెగించిన కాంగ్రెస్ అధినేత్రి ‘సోనియా.. క్విట్ ఇండియా’ అంటూ ఉపాధ్యాయులు నినదించారు. పిల్లలకు పాఠాలే కాదు- స్వార్థ రాజకీయాలకు గుణపాఠాలు సైతం చెప్పగలమన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండవ రోజుకు చేరాయి. వివిధ సంఘాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయులు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నేతలు ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోకపోతే అధికార పీఠాలను కదిలించే స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉద్యమం ఉరకలెత్తడంతో జడిసిన నాటి బ్రిటీష్ ప్రభుత్వమే బెంగాల్ విభజనను ఉపసంహరించుకుందన్నారు. బెర్లిన్ గోడ కుప్పకూలడానికి సమైక్యతావాదానికున్న బలమే కారణమని విశ్లేషించారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం వల్లే హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు.బీజేపీ మద్దతుతో విభజన బిల్లు పార్లమెంటులో నెగ్గుతుందని చెబుతున్నారన్నారు. ఇందుకు విరుగుడుగా సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలన్నారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కాకుండా గవర్నర్‌కు సమర్పించడం ద్వారా తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాదని భయపడాల్సిన అవసరం లేదని, తామే చందాలు పోగుచేసి గెలిపించుకుంటామని స్పష్టంచేశారు. దిష్టిబొమ్మలతో నిత్యాగ్నిహోమం ప్రదర్శనగా వస్తున్న వివిధ వర్గాల ప్రజలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. దహనాలతో రహదారులు మసిబారుతుండగా, ఆకాశం దట్టమైన పొగలతో నిండిపోతోంది. దిష్టిబొమ్మలు, మానవహారాలు, ప్రదర్శనలు, పిండ ప్రదానాలు ఇలా తమకు తోచిన రీతిలో ప్రజలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మేము సైతం.. మేము సైతం ఉద్యమానికి సమిధనొక్కటి ఆహుతిస్తాము... మేము సైతం సమైక్యోద్యమ బావుటాలై పైకి లేస్తామంటూ ఆర్తీ హోం ఉపాధ్యాయ సంఘం, యోగి వేమన విశ్వ విద్యాలయ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, కడప నగర వ్యాపారుల సంఘం, డ్వాక్రా మహిళలు, కనక మహాలక్ష్మి విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు, గురుకుల్ విద్యాపీఠ్ విద్యార్థులు, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు, కడప జిల్లా ఎలక్ట్రానిక్ యజమానుల సమాఖ్య, వైద్య, ఆరోగ్య శాఖ తదితరులుదీక్షలకు సంఘీభావం ప్రకటించారు. -
‘సమైక్య’ జ్వాలలు
సాక్షి, అనంతపురం : జిల్లాలో ‘సమైక్య’ జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఏడో రోజైన మంగళవారం కూడా బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జేఎన్టీయూ(ఏ)లో పీజీ సెట్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం పీజీ సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. అనంతరం రైల్వేస్టేషన్ చేరుకుని రైల్‌రోకో చేపట్టారు. కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మచ్చారామలింగారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కేబుల్ ఆపరేటర్లు అన్ని ఎంటర్టైన్మెంట్ చానెళ్ల ప్రసారాలను నిలిపేసి... నగరంలో ర్యాలీ చేపట్టారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర జేఏసీ రాయలసీమ కన్వీనర్ బీసీ నాగరాజు ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ సర్కిల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ట్రాన్స్‌కో, ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించి... స్థానిక సప్తగిరి సర్కిల్లో సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీఏ కన్సల్టెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనియా, రాహుల్, మన్మోహన్ , దిగ్విజయ్, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ముఖచిత్రాలతో రూపొందించిన ‘రాజకీయ రాక్షసి’ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. స్థానిక ఆర్టీఏ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన వారు.. సప్తగిరి సర్కిల్లో ‘రాజకీయ రాక్షసి’ ఫ్లెక్సీని దహనం చేశారు. ట్రావెల్స్ అసోసియేషన్, మేదర సంఘం, ఇతర కులసంఘాల ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డులో వంటావార్పు చేపట్టారు. కొత్తూరు కూరగాయల మార్కెట్ వ్యాపారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. టవర్‌క్లాక్ సర్కిల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ట్రాక్టర్లు, ఐషర్ వాహనాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్లు రోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ నెల 12 నుంచి చేపట్టే నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. ఎస్కేయూలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. మూడుపూటలా రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. తాడిపత్రిలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరంలోనే పెద్దపప్పూరు మండలం అమళ్లదిన్నెకు చెందిన వ్యవసాయ కూలీ కుళ్లాయప్ప పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాడిపత్రిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముదిగుబ్బలో రైల్‌రోకో చేశారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు హోరెత్తాయి. గుంతకల్లులో జాక్టో దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలో ఉద్యమకారులు ఎక్కడికక్కడ రోడ్లపై వంటావార్పు చేపట్టారు. గుత్తిలో సమైక్యవాదులు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. వంటా-వార్పు చేపట్టి.. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూపురంలో డాక్టర్లు, జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఏపీ ట్రాన్స్‌కో, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు, నాయీబ్రాహ్మణులు భారీ ప్రదర్శనలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హిందూపురం మెప్మా ప్రాజెక్ట్ అధికారిగా విజయభాస్కర్ అలియాస్ భాస్కర్ రాయల్ చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ పట్టణ మహిళా సమైక్య సంఘాల సభ్యులు వేలాదిమంది మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. కదిరిలో వంటా వార్పు, చెక్కభజనలు, కోలాటాలు, దీక్షలు, నిరసస ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. ట్రాన్స్‌కో, మున్సిపల్ ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పట్టణ మహిళా సంఘాల సభ్యులు స్థానిక ఇందిరాగాంధీ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీసర్కిల్లో మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర విభజనతో మనస్తాపానికి గురైన మహేశ్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర, అగళి, అమరాపురం, రొళ్ల మండలాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లోని ప్రతి మండలంలోనూ నిరసనలు మిన్నంటాయి. రాయదుర్గంలో మెడికల్‌షాపులు కూడా బంద్ చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు, కేబుల్ ఆపరేటర్లు ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. ఇద్దరు మునిసిపల్ ఉద్యోగులు శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, బజారు నిద్ర చేపట్టారు. కణేకల్లు, కనగానపల్లిలో వంటావార్పు నిర్వహించారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. రామగిరి, రాప్తాడు, శింగనమల మండలాల్లో నిరసన ర్యాలీలు హోరెత్తాయి. శింగనమలలో రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. గార్లదిన్నెలో వైద్య సిబ్బంది విధులు బహిష్కరించారు. సోనియాగాంధీకి మంచిబుద్ధి ప్రసాదించాలని ఉరవకొండలోని చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.