నెల్లూరు : సీడబ్ల్యూసీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించడం విచారకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం
సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎంపీ సీట్లను తెచ్చుకునేందుకు రాష్ట్ర విభజనకు సిద్దమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్రం రెండు ముక్కలు కావడం బాధాకరమన్నారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటు కారణంగా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందన్నారు. ఆంతరింగక భద్రత కొరవడుతుందని మేకపాటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో కొత్తగా ఏర్పాటైన మూడు చిన్న రాష్ట్రాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపారన్నారు. రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అందువల్లే తెలంగాణలోనైనా ఎంపీ సీట్లు సంపాదించుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం బాధాకరం: ఎంపి మేకపాటి
Published Sun, Aug 18 2013 8:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement