Rajamohan Reddy Mekapati
-
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
చీకటి రాజకీయాలు.. రాష్ట్రాన్ని విడగొట్టిన బాబు..
సాక్షి, గుంటూరు : ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు రకరకాల కుయుక్తులు పన్నుతారని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల లిస్టులో అక్రమాలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. చంద్రబాబుని సహించే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసిన వ్యక్తి చంద్రబాబే అని ఎంపీ విమర్శలు గుప్పించారు. అంతేకాక కాంగ్రెస్ నేత చిదంబరంతో చీకటి చర్యలు జరిపి బాబు రాష్ట్రాన్ని విడగొట్టారని మేకపాటి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా జీవనాడి.. దాన్ని సాధించకుండా బాబు తన స్వార్థానికి బలి చేశారని విమర్శించారు. రాజకీయ స్వార్థం, లొసుగులు, ఆర్థిక నేరాల వల్ల హోదాను సీఎం అడ్డుకున్నారని ఎంపీ మేకపాటి ధ్వజమెత్తారు. ‘కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తునే ఆశించారు. మేము ప్రత్యేక హోదా కోసం మా ఎంపీ పదవులకు రాజీనామా చేశాం. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ జగన్‌లోని ధైర్యం, ఔదార్యం, సంకల్పబలాన్ని నేను దగ్గరగా చూశాను. అందుకే మొదటి నుంచి నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. -
ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం
సాక్షి,నెల్లూరు రూరల్ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన చొరవతో రూరల్ నియోజకవర్గంలో 68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేసినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. స్థానిక కొండాయపాళెం రోడ్డులోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ నిధులతో సమకూర్చిన ఐదు బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మేకపాటి చొరవతో సాధ్యమైందన్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ రూ.37 వేలు ఉంటుందని, ఇందులో ఎంపీ గ్రాంట్ కింద రూ.12 వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రూ.25 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సహకారాలతో 500 మంది దివ్యాంగులకు చేయూత నిచ్చామన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువలకు కట్టుబడిన ఎంపీ మేకపాటి దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆహ్వానించామని, అయితే తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీగా రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించినా, ఆమోదించకున్నా తాను ఎంపీని కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానిని వెంటనే జరపించాలని ఎంపీ కోరినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. -
గర్జించిన సింహపురి
ప్రత్యేక హోదా నినాదంతో సింహపురి గర్జించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా హోదా నినాదం వినిపించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనవాహినితో సింహపురి జనసంద్రంగా మారింది. అన్ని దారులు.. అందరి అడుగులు ఒకే వైపు.. ఉదయం 9 గంటలకే వీఆర్సీ గ్రౌండ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో నిండిపోయింది. భారీగా తరలివచ్చిన నేతలతోపాటు పోటెత్తిన జిల్లా ప్రజల సాక్షిగా వంచనపై గర్జన దీక్ష సాగింది. ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు హోదా విషయంలో ప్రజలను వంచించిన తీరును నేతలు వివరించారు. కొందరు నేతలైతే సామాన్యులకూ అర్థమయ్యే రీతిలో పిట్ట కథలు ద్వారా తెలియజేశారు. మొత్తం మీద శనివారం నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష గ్రాండ్ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులో శనివారం వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభకు అశేష జనవాహిని తరలివచ్చి హోదా నినాదాన్ని మరింత బలంగా వినిపించింది. ఉదయం 9 గంటలకే భానుడు ప్రతాపంతో ఎండతీవ్రత అధికంగా ఉన్నా లెక్కచేయకుండా పార్టీ నాయకులు ఎన్నికలకు కొద్ది నెలల ముందే సమరోత్సాహంతో తరలివచ్చారు. చివరకు సాయంత్రం 5 గంటలకు సభ ముగిసే సమయానికి ముందు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అయినప్పటికీ పార్టీ నేతలు సభ ముగిసే వరకు వర్షంలోనే నేతల ప్రసంగాలను విన్నారు. ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, రీజినల్ కో–ఆర్టినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు దీక్షా వేదిక ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్ష ప్రారంభించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు ప్రసంగాలు ప్రారంభించారు. ఉదయం 9.15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ శ్రేణులు మొత్తం 50 మంది సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాల్సిన ఆవశ్యకతను, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హోదా కోసం పడుతున్న కష్టాన్ని గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలను హోదా విషయంలో టీడీపీ, బీజెపీ ప్రభుత్వాలు ప్రజలను వంచించిన తీరును నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు. బాబు తీరుపై నిప్పులు చేరిగిన ఎంపీ మేకపాటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఒక నీచుడు, రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న తీరును తీవ్ర ఉద్వేగంగా చెప్పారు. సభలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తర్వాత మాట్లాడిన నేతలు ఎక్కువ మంది మేకపాటి మాటలను ఉదహరించి ప్రసంగించటం విశేషం. అలాగే మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ కె.వీరభద్రస్వామి తమ ప్రసంగాల్లో చంద్రబాబు చేస్తున్న కుట్రలు, చంద్రబాబు నాయుడు కుర్చీ లాక్కునే వైనాన్ని పిట్ట కథల ద్వారా వివరించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని దోచుకున్న వైనాన్ని నిరుద్యోగుల నుంచి రైతుల వరకు అందర్నీ మోసం చేసిన వైనాన్ని నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు. సుదీర్ఘ ప్రసంగాలు అయినప్పటికీ నేతలు తమదైన శైలిలో ప్రసంగించటంతో సభికుల్లో ఉత్సాహం, హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నల్లచొక్కాలతో నిరసన పార్టీ పిలుపు మేరకు పార్టీ ముఖ్య నేతలే కాకుండా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా నల్లచొక్కాలు ధరించి గర్జన దీక్షకు తరలివచ్చారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా విజయనగరం మొదలుకుని, అనంతపురం వరకు నేతలు సభకు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. నేతలందరూ నల్లచొక్కాలనే ధరించి దీక్షలో పాల్గొని హోదాపై జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఢిల్లీ పాలకులకు కనువిప్పు కలిగేలా ప్రజలను వంచించిన చంద్రబాబుకు జీవిత కాలం గుర్తుండేలా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన క్రమంలో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సభ ప్రారంభానికి ముందు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు భారీ ర్యాలీగా సభకు తరలివచ్చారు. మండుటెండలో ప్రారంభం.. జోరు వానలో ముగింపు దీక్ష ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఉదయం 9 గంటలకే ఎండతీవ్రత అధికంగా ఉంది. మండుటెండను కూడా లెక్కచేయకుండా వేలాది అశేష జనావాహిని సభకు తరలివచ్చింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాతవారణం బాగా హాట్‌గా ఉన్నప్పటికీ ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలుల వచ్చి వెంటనే నాలుగు గంటల నుంచి వర్షం మొదలైంది. జోరువానలోనే సభ సాగింది. వర్షం పడి నేతలు కొందరు తడిసినప్పటికీ సభను యథాతథంగా కొనసాగించి ప్రసంగించారు. హాజరైన ప్రజలు, కార్యకర్తలు కూడా వర్షంలోనే ప్రసంగాలు ఆసాంతం విన్నారు. మొత్తం మీద ఎండలో ప్రారంభమైన దీక్ష వర్షంతో ముగిసింది. -
హోదా సాధన కోసం..
నెల్లూరు రూరల్: నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన వంచనపై గర్జన.. ప్రత్యేక హోదా నిరసన దీక్షకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన దీక్షలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి. ఈ సభలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అనంతపురం ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కురుముట్ల శ్రీనివాస్, చింతల రామచంద్రారెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, విశ్వసరాయి కళావతి, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, గౌరు చరిత, దేశాయి తిప్పారెడ్డి, జంకే వెంకటేశ్వర్లు, గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పి.సునీల్‌కుమార్, కోన రఘుపతి, ఎస్.రఘురామిరెడ్డి, మేక వెంకటప్రతాప అప్పారావు, గుడివాడ అమర్నాథ్రెడ్డి, కొక్కిలగడ్డ రక్షణనిధి, బాపట్ల కోన రఘుపతి, నరసరావుపేట ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, కొలుసు పార్థసారధి, తమ్మినేని సీతారాం, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని రాంగోపాల్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబూరావు, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నాయకుడు డాక్టర్ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా క్రిష్ణమూర్తి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పెద్దకూరపాడు సమన్వయకర్త, నాయకులు కె.మనోహర్‌నాయుడు, కె.క్రిస్టియా(తాడికొండ), గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి అతుకూరు ఆంజనేయులు, మైలవరం సమన్వయకర్త జోగి రమేష్, పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జగ్గయ్యపేట సమన్వయకర్త సామినేని ఉదయభాను, అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షురాలు వరుదు కల్యాణి, హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్ అహ్మద్, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నందిగం సురేష్, కందుకూరు సమన్వయకర్త తూమాటి మాధవరావు, తూర్పుగోదావరి అధ్యక్షుడు కురసాల కన్నబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, గూడూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోడూరు కల్పలతారెడ్డి, నెల్లూరు జెడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష, మొయిళ్ల గౌరి, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, పెర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మేరిగ మురళి, రంగన్న మీసాల, సినీ నటులు విజయచందర్, పృధ్వీ పార్టీ కార్యకర్తలు -
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు తగదు
నెల్లూరు(సెంట్రల్): ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అకారణంగా కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగడం తగదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉంటాయని అనుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వకర్తలతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై ఎటువంటి కేసులు పెట్టినా చట్టం ద్వారా ఎదుర్కొంటామన్నారు. కొందరు తమ ఎమ్మెల్యేలు పెద్ద పొరపాటు చేసినట్లు భూతద్దంలో పెట్టి చూపించి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎన్ని తప్పులు చేసినా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోని టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో రెండుసార్లు నోటీసులు అతనికి ఇచ్చారన్నారు. చట్టంపై గౌరవంగా విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు. ఇటీవల ఏడాది పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తుంటే కేసులు, చార్జిషీట్లు అంటూ వేధించడం సబబు కాదన్నారు. వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కొత్తగా పెట్టినట్లు ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై పెట్టిన అక్రమ కేసులను చట్టం ద్వారా ఎదుర్కొంటామన్నారు. నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన విషయాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బెట్టింగ్ కేసులో ఏ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ రామకృష్ణ చెప్పారన్నారు. తరువాత తమకు నోటీసులు జారీ చేశారన్నారు. చట్టంపై గౌరవంతో రెండు సార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యానని గుర్తు చేశారు. ఏడాది తరువాత గతేడాది కేసులో సంబంధం ఉందంటూ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. తాను క్రికెట్ బుకీ కృష్ణసింగ్‌తో విజయవాడ హోటల్లో, కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉన్నట్లు సీసీ పుటేజీ ఆధారాలు ఉన్నాయని తనపై పోలీసులు చార్జిషీట్ వేయడం జరిగిందన్నారు. కడప, విజయవాడకే కాకుండా దేశంలో ఎక్కడైనా హోటల్లో కృష్ణసింగ్‌ను తాను కలిసినట్లు ఆధారాలు చూపితే గంటలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇటీవల నెల్లూరులో హత్యలు చేసిన ఓ సీరియల్ కిల్లర్ చంద్రబాబుతో ఫొటో కూడా దిగి ఉన్నారన్నారు. ఆ మాత్రన చంద్రబాబుకు, ఆ హత్యలకు సంబంధం ఉందా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగేలా పోలీసులు పత్రికలకు లీకులు ఇవ్వడం సరికాదన్నారు. దమ్ముంటే సీసీ పుటేజ్‌ను బయటపెట్టాలన్నారు. సమావేశంలో నగర, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరలు, పాల్గొన్నారు. -
కేంద్ర సర్కార్‌పై అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు కూడా ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇదే తొలి అవిశ్వాస తీర్మానం కావడం గమనార్హం. వాస్తవానికి మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఏప్రిల్ 6న తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలను కుదిస్తారన్న వార్తల నేపథ్యంలో కార్యాచరణలో స్వల్ప మార్పులు జరిగాయి. ఐదు రోజులు ముందుగానే.. అంటే ఈ నెల 16వ తేదీన తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌తో చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసు అందజేశారు. ‘‘లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని చాప్టర్ 17లో గల 198(బి) నిబంధన కింద నేను ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16న ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇస్తున్నాను. ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16 నాటి సభా కార్యకలాపాల సవరించిన జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తున్నాను. తీర్మానం: ఈ సభ మంత్రి మండలిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది’’ అని నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతునప్పటికీ సానుకూలంగా స్పందించనందున కేంద్రంపై మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. ఇప్పటికే నోటీసు ఇచ్చాం. దీనిని బిజినెస్ లిస్ట్‌లో చేర్చాలి. ప్రత్యేక హోదాతోపాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ప్రధాన హామీలను సైతం కేంద్రం విస్మరించింది. అందువల్ల మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం’’ అని మేకపాటి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవండి అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను, ఎంపీలను, నేతలను కలిశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతూ ఆయా పార్టీల అధ్యక్షులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన మూడు పేజీల లేఖను అందజేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఏఐఏడీఎంకే నేత తంబిదురై, సీపీఎం నేత సీతారాం ఏచూరి, బీజేడీ పక్ష నేత భర్తృహరి మెహతాబ్, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్, టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి, టీడీపీ పక్ష నేత తోట నర్సింహం, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్‌సింగ్ మాన్ తదితరులను కలసి మద్దతు కోరారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్లో మాట్లాడారు. మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీపీఐ నేతలతో ఫోన్లో సంప్రదించినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. తమ పార్టీ నాయకత్వంతో చర్చించి సమాచారం అందిస్తామని వారు చెప్పారని, అందరూ సానుకూలంగా స్పందించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఆందోళన అంతకుముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. విభజన హామీలపై టీడీపీ సభ్యులు, ఇతర అంశాలపై టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. కనీస బాధ్యతగా టీడీపీ మద్దతివ్వాలి అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్సీపీ స్పష్టీకరణ కేంద్రంపై తాము ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి రాష్ట్రం నుంచి కనీస బాధ్యతగా టీడీపీ మద్దతు ఇస్తే, దేశంలోని ఇతర పార్టీలు కూడా ముందుకొస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీలు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై గురువారం లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరిగే పరిస్థితి లేకపోవడంతో ముందుగా చెప్పినట్టు ఈ నెల 21న కాకుండా 16వ తేదీనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు చెప్పారు. తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాక కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలన్నారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను లోక్‌సభలో వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు అందించామన్నారు. పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతోపాటు చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే కోరుతున్నామని లోక్‌సభ స్పీకర్‌కు స్పష్టం చేశామని పేర్కొన్నారు. మా ధర్మాన్ని నిర్వర్తించాం..: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టికి పెట్టుకొని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ధర్మాన్ని నిర్వర్తించామన్నారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ గురువారం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్టీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు విప్ జారీ చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఇలా సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. దానిపై నమ్మకం కోల్పోయామని భావించినప్పుడు ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మాన కోసం నోటీసు ఇవ్వొచ్చు. లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇస్తారు. ఈ తీర్మానాన్ని సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును స్పీకర్ పరిశీలించాక.. సభ్యుల మద్దతుందని సభ్యుడు చెప్పిన తర్వాత.. ఆ 50 మంది లేచి నిలబడాలి. స్పీకర్ సంతృప్తి చెందితే.. చర్చకు స్వీకరిస్తారు. నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ రోజు సభ క్రమపద్ధతిలో ఉండాలి. లేకుంటే తరువాతి రోజుకు ఆ సభ్యుడు మరోసారి నోటీసివ్వాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపడితే.. అది ముగిశాక ఓటింగ్ నిర్వహిస్తారు. తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. -
‘చంద్రబాబు వైఖరి అర్థం కావడం లేదు’
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయన్ని తెలియజేసేందుకు ఢిల్లీ వెళ్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నెల 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపడుతున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడుతామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై ఎంపీ మేకపాటి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి చంద్రబాబు చాలా అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి తమకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని మండిపడ్డారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ వరకు పార్లమెంట్లో పోరాడుతామని ఆయన తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం కూడా పెడతామని స్పష్టం చేశారు. దీనికి ఎవరు సహకరిస్తారో.. ఎవరు సహకరించరో చూస్తామని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో నిలదీస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసేంతవరకు అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ మేకపాటి ధ్వజమెత్తారు. -
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎంపీ మేకపాటి
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. బాబు పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే పెద్ద అవినీతిపరుడు చంద్రబాబు అని ఎంపీ మేకపాటి నిప్పులు చెరిగారు. కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో చంద్రబాబుకి బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఏం అవసరం ఉండి వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రధాని నరేంద్రమోదీ కూడా నమ్మడం మానేశారని, అందుకే బాబు కొత్త డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 5 వరకు పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఎంపీలం రాజీనామా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఉక్కుమనిషి అని, ఆయన పోరాటాన్ని ఆపరని ఎంపీ మేకపాటి తెలిపారు. -
రామాయపట్నం వైపే కేంద్రం మొగ్గు..!
కావలి: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో అనూహ్యమైన అభివృద్ధి, అపారమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కలిగే రామాయపట్నం తీరం వద్ద భారీ ఓడ రేవు, నౌకాశ్రయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. మూడేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి సత్ఫలితాలు రానున్న సంకేతాలు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్లో పోర్ట్ కమ్ షిప్ యార్డ్ నిర్మాణ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు నిలదీశారు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి దీనిపై విజ్ఞాపనలను అందజేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేరుగా దీనిపై సత్వరమే చర్యలు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని నితిన్ గడ్కరీకి లేఖలు రాశారు. కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ముందడుగేసి రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి దీని ఆవశ్యతను ప్రజలకు తెలియజేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసింది. ఈ క్రమంలో పోర్ట్ కమ్ షిప్ యార్డ్ కమిటీ చైర్మన్‌గా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి సారథ్యంలో కావలి నుంచి రామాయపట్నం వరకు 25 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. 2016 సెప్టెంబర్ మూడున నిర్వహించిన పాదయాత్రలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘దుగరాజపట్నం’పై ఆది నుంచి గందరగోళం కేంద్ర ప్రభుత్వం 2011లో దేశంలో బంగాళాఖాతం ఒడ్డున రెండు భారీ ఓడరేవులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో సాగర్ సముద్ర తీరాన్ని ఆ రాష్ట్రం ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదే ఏడాదిలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మాత్రం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం తీర ప్రాంతాలను ఆయా ప్రాంత నాయకులు తెరపైకి తీసుకొ చ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణా నికి ప్రదేశం ఎంపికలో వివాదం తత్తిం ది. దీనిపై నిపుణుల కమిటీ రామాయపట్నం తీరం భారీ పోర్టు కమ్ షిప్ యార్డుకు అన్ని రకాలుగా సానుకూలమని నివేదికలిచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఓ లేఖను అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందజేయడంతో బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఆ వ్యవహారం మరుగున పడిపోయింది. షార్ అభ్యంతరాలు 2015 జూలైలో కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని, తొలి విడతలో రూ.6,091 కోట్లను ఖర్చు పెట్టాలని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యల్లేవని ప్రకటించారు. అయితే 2017లో కేంద్ర ప్రభుత్వం దుగరాజపట్నంలో పోర్టు కమ్ షిప్‌యార్డ్ నిర్మాణం కుదరదని, షార్ అభ్యంతరాలు పెడుతోందని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. మరో ప్రత్యామ్నాయ ప్రదేశం చూపాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిపుణులు అందజేసిన నివేదికలను ప్రాతిపదికగా చేసుకొని రామాయపట్నం వద్ద పోర్ట్ కమ్ షిప్ యార్డ్ నిర్మాణానికి ఆమోదిస్తూ కేంద్రానికి లేఖ రాయడమే మిగిలి ఉంది. మరోవైపు భారీ నౌకాశ్రయాన్ని నిర్మిస్తామని.. ప్రదేశాన్ని చూపమని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తే, దానికి సమీపంలో ఉన్న కావలి పట్టణానికి మహర్దశ పట్టనుంది. -
జగన్ సీఎం కావడం తథ్యం
సీతారామపురం: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ప్రజాప్రతినిధులతో కలిసి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తమ సమస్యలు విన్నవించుకుంటూ సీఎం అయి తమ బాధలు తీర్చాలని చెబుతున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా ముంచారన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా తన ఎంపీలతో పార్లమెంట్లో కపట నాటకం ఆడుతూ కేంద్రంలో తన మంత్రులను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన టీడీపీకి త్వరలోనే తగిన శాస్తి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, ఎంపీపీ కల్లూరి జనార్దన్‌రెడ్డి, మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ అల్లూరురాజు, ఎంపీటీసీ పద్మావతి, సర్పంచ్ పి.మాల్యాద్రి, ఎం.రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆంధ్రుల హక్కులను తాకట్టుపెట్టారు
నెల్లూరు సిటీ: ఆంధ్రుల హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద సీఎం చంద్రబాబు తాకట్టుపెట్టారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్‌మోపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎంపీ మేకపాటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేకహోదా, దుగ్గరాజుపట్నంపోర్టు, కడప ఉక్కుఫ్యాక్టరీతో పాటు అనేక అంశాలను విశ్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తప్పిదాల కారణంగా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో స్వర్ణయుగంగా నడిచిందన్నారు. సమయానికి వర్షాలు రావడం, పంటలు సజావుగా పండటం ద్వారా రాష్ట్ర ప్రజులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన నాలుగేళ్లలో వర్షాలు సక్రమంగా పడిన పరిస్థితి లేదన్నారు. -
రాష్ట్రంలో అవినీతి పాలన
అనుమసముద్రంపేట: రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏఎస్‌పేట మండలంలోని పందిపాడులో రూ.4.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో సువర్ణపాలన సాగిందని, అలాంటి పరిపాలన మళ్లీ రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని చెప్పారు. కుల, మతం లేకుండా వైఎస్సార్ గొప్ప మానవతావాదిగా పరిపాలించారని, అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎమ్మెల్యేలను గౌరవించకుండా అర్హత లేని వారిని అందలమెక్కించారని ఆరోపించారు. వైఎస్సార్ పాలనను చూసి ఇప్పటికైనా చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్ హయాంలో 70 లక్షల గృహాలను ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పించారని, అర్హులైన పేదలకు పింఛన్లను ఇప్పించిన అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం కొంత మంది వృద్ధులకు అర్హత లేదంటూ పింఛన్లను కుదిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని, రానున్న 2019 ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. మెట్ట ప్రాంత గ్రామాల్లో సాగు, తాగునీరు సమస్యగా మారిందని, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవినీతి మంత్రులతో నిండిన అసెంబ్లీకి వెళ్లలేకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పార్టీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, పార్టీ మహిళా కన్వీనర్ బోయళ్ల పద్మజారెడ్డి, గ్రామ సర్పంచ్ సుబ్బారెడ్డి, అనుమసముద్రం సర్పంచ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
మీ ముందుకొస్తున్న జగన్‌ను ఆశీర్వదించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు మంటగలుపుతున్నారని.. ఆయన కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు వస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. జగన్ పాదయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజాతో కలసి ఆయన మీడియాకు వెల్లడించారు. 150 రోజులకు పైగా జరిగే పాదయాత్రలో వైఎస్ జగన్ 3,000 కిలోమీటర్లు నడుస్తారని చెప్పారు. 120 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. మిగిలిన 55 నియోజకవర్గాల్లో ఆ తర్వాత జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. టీడీపీకి ఎంత పట్టున్న గ్రామంలోనైనా సరే వైఎస్సార్సీపీ జెండా ఎగిరేలా ప్రణాళికలు రూపొందించాలని సూచనలు వచ్చినట్లు తెలిపారు. కాగా, త్వరలో ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగబోతున్నందున.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. దొంగ ఓట్లు చేర్పించుకోవడంలో టీడీపీ నాయకులు సిద్ధహస్తులు కనుక.. అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఇదిలాఉండగా, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న తపనతో వైఎస్ జగన్ ఉన్నారని.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్ కూడా రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారని మేకపాటి అన్నారు. దేశం మొత్తం మెచ్చేలా వైఎస్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికలను డబ్బుమయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పుడే రాజీనామా..: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పటికిప్పుడే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ మేకపాటి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ అంటే.. దాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు రాజీనామాలు చేస్తే ప్రయోజనమేమిటని ఆయన ప్రశ్నించారు. రోజా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకునేందుకు.. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. -
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
► నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళుదాం ► నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(సెంట్రల్) : సీఎం చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేర్చకపోవడమే ఇందుకు నిదర్శనమని నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెబుదామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఓ కల్యాణమండపంలో బుధవారం నిర్వహించిన నెల్లూరు సిటీ నియోజకవర్గ నవరత్నాల సభలో ఎంపీ ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ కుటుంబం చేసేవే చెబుతుందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో అధికారంలోకి వచ్చే ముందు ఉచి త విద్యుత్, పెన్షన్ పెంపు పథకాలను చెప్పారన్నారు. అధికారంలోకి రాగానే తొలుతగా అవి రెండుచేసి చూపించారన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చెప్పిన పథకాలను అ«ధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేస్తారన్నారు. కష్టపడి పనిచేద్దాం సిటీ ఎమ్మెల్యే పి.అనిల్కుయార్ మా ట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం ప్రతిఒక్కరం కష్టపడి పనిచేద్దామన్నారు. నంద్యాలలో రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభాలకు గురిచేసి గెలిచారన్నారు. దానిని ఎవరూ గెలుపుగా భావించడం లేదన్నారు. లోకేష్ కాబోయో ముఖ్య మంత్రి అని చెప్పే టీడీపీ నాయకులు ఎందుకు ఆయన్ను నంద్యాలలో ప్రచా రానికి తీసుకునిపోలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొన్ని చానళ్లు పనిగట్టుకుని అబద్దాలు ప్రచా రం చేస్తున్నాయన్నారు. ఇరవై ఏళ్లు శిక్ష పడ్డ డేరా బాబాకు గురువు చంద్రబాబు అని చెప్పారు. తనకు ఉన్నది నిజాయితీ అన్నారు. ఎవరి వద్ద రూ పాయి ఆశించకుండా పనిస్తున్నట్లు తెలిపారు. తనపై కొన్ని పత్రికలు, కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. నోటీసులు ఇచ్చో, పత్రికల్లో అబద్దపు కథనాలు రాసో తనను దెబ్బకొట్టలేవన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు హుస్సేన్, కార్పొరేటర్లు ఓబిలి రవి చం ద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, వేలూరు సుధారాణి, దేవరకొండ అశోక్, నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, మునీర్ సిద్దిక్, కొణిదల సుధీర్, దార్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
'ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాదే'
-
'ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాదే'
నెల్లూరు: ఎన్నికల ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉపఎన్నిక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నంద్యాలలో వైఎస్ఆర్సీపీదే విజయం అని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి విజయం కాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక హడావిడి నెలకొన్న విసయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
దేశం గర్వించదగ్గ మేధావి అంబేడ్కర్
- వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి - పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు సాక్షి, హైదరాబాద్: భారతదేశం నిజంగా గర్వించదగ్గ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత భేదాలు లేని సమసమాజం కోసం ఆ మహానీయుడు రాజ్యాంగ రచన చేశారని గుర్తు చేశారు. దండలు వేయడం కాదు... దళితుల గుండెలు గెలవాలి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఆయన విగ్రహాన్ని పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుతో అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తోందని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాలకు దండలు వేస్తే సరిపోదని, దళితుల గుండెలను గెలవాలని హితవు పలికారు. అంబేడ్కర్ భావజాలాన్ని విస్తరించాలనే ఆకాంక్ష ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. -
2019లో గెలుపు మనదే
ఎంపీ మేకపాటి ధీమా ⇒ వైఎస్ అడుగుజాడల్లో నడిస్తే ప్రజలు ఆదరిస్తారు ⇒ వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలి ⇒ ఘనంగా వైఎస్సార్సీసీ ఆవిర్భావ వేడుకలు సాక్షి, హైదరాబాద్: ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిస్తే ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి పోరాడితే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రక అవసరం. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ఏపీలో ప్రజాస్వామ్యం మంట గలిసిపోతుంది’’ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ వైపు నుంచి ఒక్క చిన్న పొరబాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీని స్థాపించి ఆరేళ్లు పూర్తయి 7వ వసంతంలోకి అడుగుపెడు తున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘వాస్తవానికి 2014లోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సి ఉండగా, కొన్ని స్వీయ పొరపాట్లకుతోడు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయి టీడీపీకి ఓట్లేశారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని కచ్చితంగా ఆదరిస్తారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్సీపీ తరపున అభినందిస్తున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండేవారు ప్రజాస్వామికంగా వ్యవహరించాలి. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నాం. వైఎస్సార్సీపీలో యువకులే ఎక్కువగా ఉన్నారు కనుక పార్టీకి మున్ముందు మంచి భవిష్యత్తు ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత యువతపై ఉంది’’ అని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ గొప్ప పోరాట యోధుడు వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును తీర్చేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి ముందుకొచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప పోరాట యోధుడని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్ సారథ్యంలోని పార్టీలో ఉన్నందుకు అందరమూ గర్వపడుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి చెప్పారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తొలుత వైఎస్సార్సీపీ జెండాను మేకపాటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, మతీన్, బోయినపల్లి శ్రీనివాస రావు, ఇతర నేతలు బి.గురునాథ్‌రెడ్డి, అమృతాసాగర్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, డి.శ్రీధర్‌రెడ్డి, జి.మహేందర్‌రెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, విశ్వనాథాచారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ సీఎం అయ్యేంత వరకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామంటూ ఎమ్మెల్యే ఆర్కే రోజా నేతలు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇరు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించారు. -
భక్త జనసంద్రం
గొబ్బియాలో.. గొబ్బియాలో.. సంక్రాంతి పండగొచ్చే గొబ్బియాలో.. సంబరాలు తీసుకొచ్చే గొబ్బియాలో అంటూ మహిళల పాటలతో.. చిన్నారుల సరదా ఆటలతో పవిత్ర పినాకినీ నదీతీరంలో గొబ్బెమ్మ(గౌరమ్మ)ల పండగ సోమవారం వైభవంగా జరిగింది. సంస్కృతి, సంప్రదాయాలతో ముంగిళ్ల ముందు రంగవల్లులతో తీర్చిదిద్దిన గొబ్బెమ్మలను ఊరేగింపుగా తీసుకొచ్చి ‘ఏటిపండగ’ సందర్భంగా గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులతో పెన్నానదీ తీరం జనసంద్రంగా మారింది. నెల్లూరు(బృందావనం): బాలబాలికలు గాలిపటాలను ఎగురవేస్తూ, యువతీయువకుల కేరింతల కొడుతూ, మహిళల కోలాటాలు, టగ్‌ఆఫ్‌వార్, తదితర ఆటపాటలతో రంగనాయకులపేటలోని పెన్నానదీతీరం హోరెత్తింది. భక్తులు వేలాదిగా తరలి రావడంతో జనసంద్రంగా మా రింది. నెల్లూరు పవిత్ర పెన్నానది తీరంలో ఏటా నిర్వహించే గొబ్బెమ్మల పండగ (ఏటిపండగ) సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కోలాహలంగా సాగింది. ధనుర్మాస ప్రారంభంలో తమ ఇళ్లలో ఉంచి పూజించిన గౌరమ్మలు(గొబ్బెమ్మ)లను భక్తిశ్రద్ధలు, దీపహారతులతో పెన్నానదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఎమ్మెల్యే అనిల్ పర్యవేక్షణ విశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల్లూరు సిటీఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ వివిధ శాఖల అధికారులను సమన్వయపరుస్తూ భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఐదురోజుల క్రితమే ఎమ్మెల్యే అనిల్ దేవాదాయ, ధర్మాదాయ, విద్యుత్తు, పోలీసు, కార్పొరేషన్ తదితర శాఖలకు చెందిన అధికారు లను సమన్వయపరుస్తూ పలు పర్యాయాలు ఏర్పాట్లను పరిశీలించారు. కొలువైన దేవతామూర్తులు గొబ్బెమ్మల పండగను పురస్కరించుకుని దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో నగరంలోని, జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో శ్రీవిఘ్నేశ్వరుడు, నెల్లూరు గ్రామదేవత శ్రీఇరుకళల పరమేశ్వరి అమ్మవారు, శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి, శ్రీద్రౌపది సమేత శ్రీకృష్ణధర్మరాజస్వామి, మూలా పేట శ్రీభువనేశ్వరి సమేత శ్రీమూలస్థానేశ్వరస్వామి, జొన్నవాడ శ్రీకామాక్షీతాయి, నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాళు, శ్రీవేదగిరి లక్ష్మీనృసింహస్వామి, శ్రీమేలమరువత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారుతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులు కొలువుదీరారు. కొలువుదీరిన స్వామివార్లను వేలాదిగాభక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులు తీర్థప్రసాదాలు ఏర్పాటుచేశారు. జనసంద్రం పతంగులు ఎగురవేస్తూ చిన్నారులు, గొబ్బెమ్మలను నిమజ్జనం చేస్తూ మహిళలు, దేవతామూర్తులను దర్శిస్తూ భక్తులు.. ఆటపాటల్లో నిమగ్నమైన యువతీయువకులతో పవిత్ర పినాకినీ తీరం సోమవారం సాయం సంధ్యవేళ నుంచి జనసంద్రంగా మారింది. ఏటి పండగలో ప్రముఖులు నగరంలోని పెన్నానదితీరంలో నిర్వహించిన గొబ్బెమ్మల పండగలో రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, మేయర్ అబ్దుల్అజీజ్, మాజీ ఎమ్మె ల్యే ముంగమూరుశ్రీధరకృష్ణారెడ్డి, వివిధపార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు. సుఖసంతోషాలతో ఉండాలి : ఎంపీ మేకపాటి నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులను నెల్లూరు పెన్నానది తీరంలో సంక్రాంతి సందర్భంగా కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించడం సంతోషదాయకమన్నారు. ఆ దేవతామూర్తుల దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో జీవించాలన్నారు. సంప్రదాయ పండగ : నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ గొబ్బెమ్మల పండగ చక్కటి సంప్రదాయపండగని పేర్కొన్నారు. భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. మహద్భాగ్యం : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వదేవతలు నెల్లూరులో కొలువుదీరి ప్రజలకుదర్శనం కలిగించడం మహద్భాగ్యంగా పే ర్కొన్నారు. ప్రజలకు భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు. -
ట్యాపింగ్ పై ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులందాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ప్రజాప్రతినిధుల నుంచి ఏమైనా ఫిర్యాదులొచ్చాయా అని లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారం సమాధానమిచ్చారు. ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అవి హైకోర్టులో న్యాయవిచారణలో ఉన్నాయని మంత్రి వివరించారు. -
ప్రత్యామ్నాయాలు చూపకనే ఇబ్బందులు
- నల్లధనం వెలికితీతకు వైఎస్సార్సీపీ మద్దతు - నోట్ల రద్దుపై విపక్షాల భేటీలో పాల్గొన్న ఎంపీ మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం సాయంత్రం పార్లమెంటులోని కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో జరిగిన ఏడు విపక్ష పార్టీల భేటీలో వైఎస్సార్సీపీ తరఫున మేకపాటి పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న అవస్థలు వెంటనే తొలగించాల్సిన అవసరముందని విపక్ష పార్టీలు అభిప్రాయపడినట్లు తెలిపారు. ‘నల్లధనం వెలికితీతకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని ఈ సమావేశంలో స్పష్టం చేశాం. ప్రభుత్వం ఉన్నపలంగా సామాన్యుడికి తెచ్చిన ఇబ్బందులపైన మాత్రమే వ్యతిరేకంగా ఉన్నామని చెప్పాం. ఉన్న కరెన్సీలో 86 శాతం పెద్ద నోట్లే ఉన్నారుు. అకస్మాత్తుగా వాటిని రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిజాయితీగా సంపాదించుకున్నవాళ్లు కూడా డబ్బును మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తీర్చేలా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిన అవసరం ఉంది. ముందే తగిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. సామాన్యులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ విధానం..’ అని మేకపాటి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాయే ప్రధాన ఎజెండా : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రధాన ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని మేకపాటి తెలిపారు. రాష్ట్ర విభజన చేసినప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, చట్టంలో పొందుపరిచిన ఇతర హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనేదే పార్టీ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబడతామన్నారు. హామీలు అమలుచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాన మంత్రి మీద ఉందని స్పష్టం చేశారు. -
ప్రత్యేక హోదా రాష్ట్రానికి వరం
ప్యాకేజీతో హోదాను తుంగలో తొక్కారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చంద్రబాబు పోకడలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విడవలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వరం లాంటిదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విడవలూరులో శనివారం నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడంతో చంద్రబాబు విఫలమయ్యాడు. హోదాను తన స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ వేసి గొంగళిలా అక్కడే ఉంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ కలగానే మిగిలిందన్నారు. రాష్ట్ర విజభన సమయంలో ఇచ్చిన హామీలను మరుగున పరచారన్నారు. వీటిని వెలుగులోకి తీసుకువస్తున్న వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాను రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో బయటపడుతుందన్నారు. ఇటీవల కొందరు నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు వైఎస్సార్సీపీకి 112 సీట్లు, టీడీపీ 63 సీట్లు వస్తాయని చెప్పడం జరిగిందన్నారు. చంద్రబాబు ఎలక్షన్ రిగ్గింగ్‌లో గొప్ప మేధావని, రకరకాల ఎత్తుగడలు వేసి ప్రజలను మోసం చేయగల వ్యక్తి అని చెప్పారు.ఽ గత ఎన్నికల్లో ఆకాశమే హద్దుగా వాగ్దానాలను చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడకే ముప్పు ఉందని, శక్తికి మించి వాగ్దానాలను చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఇలా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అడిగితే ప్రతిపక్షాలను టీడీపీ వారు విమర్శించడం దారుణమన్నారు. త్వరలోనే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నాయకులు బెజవాడ గోవర్దన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య, నలబోలు సుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులరెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు వెంకట సుబ్బారెడ్డి, బాలశంకర్‌రెడ్డి, మాతూరు శ్రీనివాసులరెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు. -
హోదాతోనే రాష్ట్రాభివృద్ది
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అనుమసముద్రంపేట : ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌పేట మండలంలోని పొనుగోడు గ్రామంలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం అన్నీ విధాలుగా అభివృద్ధి చెందేందుకు హోదా ముఖ్యమన్నారు. హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గతంలో పొనుగోడులో పర్యటించినప్పుడు స్థానికులు నీటి సమస్యను తన దృష్టికి తెచ్చారని దీంతో ప్లాంట్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఇచ్చిన మారాజు సుబ్బయ్యను అభినందించారు. ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచే సిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను దగ్గరగా చూసి పరిష్కరించేందుకు వీలు కలుగుతోందన్నారు. సర్పంచ్ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మహిళా కన్వీనర్ బోయిళ్ల పద్మజారెడ్డి, ప్రముఖ ఇంజనీరు బోయిళ్ల చెంచురెడ్డి, అనుమసముద్రం, రాజవోలు సర్పంచులు పులిమి వెంకటరమేష్‌రెడ్డి, లక్ష్మీదేవి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సింహపురి రైలు వేళల్లో మార్పు
అక్టోబరు 1 నుంచి అమలు ఫలించిన ఎంపీ మేకపాటి కృషి నెల్లూరు(సెంట్రల్): జిల్లా ప్రయాణికుల సాక్యర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధుల వినతుల మేరకు సింహపురి రైలు వేళలను మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో సింహపురి గూడూరులో రాత్రి 10.10 గంటలకు బయలుదేరేది. నెల్లూరుకు రాత్రి 11 గంటలకు చేరుకునేది. సికింద్రాబాదుకు మరుసటి రోజు మధ్యాహానానికి చేరుకుంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల వినతుల మేరకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి, జీఎంను పలుమార్లు సింహపురి వేళలను మార్చాలని కోరుతూ వచ్చారు. ఇటీవల నెల్లూరుకు వచ్చిన రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సైతం సింహపురి వేళల మార్పు విషయాన్ని ఎంపీ మరోమారు గుర్తు చేశారు. దీంతో ఎట్టకేలకు సింహపురి వేళల్లో మార్పులను తీసుకువచ్చారు. మార్చిన వేళల ప్రకారం గూడూరులో రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. నెల్లూరుకు 7.18 గంటలకు, కావలికి 7.55, ఒంగోలుకు 8.40, చీరాలకు 9.30, విజయవాడకు 11.10కు చేరుకుంటుంది. విజయవాడలో 11.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాదుకు మరుసటి రోజు వేకువన 5.40 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాదు– గూడూరు రైలు వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అక్టోబరు 1 నుంచి మారిన వేళలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. -
8 నుంచి గడప గడపకు వైఎస్సార్సీపీ
► నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ► పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు గుర్తింపు ► కార్డులు అందజేత నెల్లూరు(సెంట్రల్): గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్సీపీని పటిష్టం చేసేందుకు, ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేసిన మోసాలను ఎండగట్టేందుకు జూలై 8వ తేదీ నుంచి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, అనుబంధ సంఘాల నాయకులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్ట పరిచేందుకు గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు అమలు చేయకపోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిలాంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో టీడీప అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాని చెప్పిన చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా విషయంలో తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కాపుల సామాజిక సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రూప్‌కుమార్ యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, బీసీ విభాగం అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధి కామరాజుతో పాటు పలువురు నాయకులకు ఎంపీ గుర్తింపు కార్డులు అందజేశారు. -
నేడు ఎంపీ మేకపాటి రాక
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురువారం నెల్లూరుకు రానున్నట్లు ఎంపీ కార్యాలయ సభ్యులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజు ఆత్మకూరులో మాచనూరు సర్పంచ్ కటారి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని, చికపాడులో ఇటీవల చనిపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని, బట్టేపాడులో తూమాటి దయాకర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అదే రోజు రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళతారని పేర్కొన్నారు. -
రైల్వే సమస్యలను పరిష్కరించండి
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే జోనల్ మేనేజర్ రవీంద్రగుప్తాను కోరారు. హైదరాబాద్‌లోని రైల్వే జోనల్‌మేనేజర్‌తో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ ముఖ్యంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వేళలతో ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు. అక్టోబర్‌లోపు సింహపురి వేళల్లో మార్పులు తీసుకొస్తే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లకు దక్షిణంవైపు రైల్వేకు సంబంధించి దాదాపుగా ఎకరా స్థలం ఉందన్నారు. ఈ ప్రదేశంలో రైల్వే మల్టిప్లెక్స్ కట్టిస్తే రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. నెల్లూరు ప్రదాన రైల్వే స్టేషన్‌తో పాటు దక్షిణ స్టేషన్, పడుగుపాడు, వేదాయపాళెం, కావలి, బిట్రగుంట, ఉలవపాడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు అవసరమైన పలు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. నెల్లూరు-తిరుపతి, నెల్లూరు-చెన్నైకి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెము రైళ్లను పెంచితే ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు నుంచి సుదూర ప్రాంతాలకు వ్యాపారులు, విద్యార్థులు ప్రయాణాలు సాగిస్తున్నారన్నారు. వీరి కోసం నెల్లూరు స్టేషన్లో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపితే రైల్వేకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్పందించిన జోనల్ మేనేజర్ జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు. -
పోలయ్య కుటుంబసభ్యులకు పరామర్శ
కావలి: ఇటీవల మృతి చెందిన పట్టణానికి చెందిన ఆరో వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఏడుంబాక పోలయ్య కుటుంబసభ్యులను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. పోలయ్య నివాసంలో చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేన్సర్ బాధిత బాలుడికి ఆర్థిక సాయం కేన్సర్‌తో బాధపడుతున్న మద్దూరుపాడుకు చెందిన పీ కళ్యాణ్ కుమార్ అనే బాలుడికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.25వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీ మేకపాటి పీఎం రి లీఫ్ ఫండ్ నుంచి వైద్యం కోసం రూ.25వేలు చెక్ మంజూరు చేయించి అందజేసారు. -
విజయకుమార్ స్ఫూర్తితో వైద్యం అందించాలి
నెల్లూరు ఎంపీ మేకపాటి నెల్లూరు(అర్బన్): ప్రజా ఉద్యమాలతో పాటు మంచి వైద్య సేవలందించి ప్రజా వైద్యుడు అనిపించుకున్న వ్యక్తి డాక్టర్ జి. విజయకుమార్ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. డాక్టర్ విజయకుమార్ ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలోని డాక్టర్ జీవీకే మెమోరియల్ ట్రస్ట్ నె ల్లూరు ఆసుపత్రిలో శనివారం సభ జరిగింది. డాక్టర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆసుపత్రి ట్రస్ట్ వారు ప్రవేశపెట్టిన కుటుంబ ఆ రోగ్య కార్డును ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విజయకుమార్ స్ఫూర్తితో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కోరారు. భారీ ర్యాలీ.. డాక్టర్ విజయకుమార్ అభిమానులు, ప్రజాఉద్యమాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ, మద్రాసు బ స్టాండ్, వీఆర్సీ మీదుగా తిరిగి నెల్లూరు ఆసుపత్రి వరకు సా గింది. సభకు అధ్యక్షత వహించిన నిజామాబాద్‌కు చెందిన సీనియర్ జనవిజ్ఞానవేదిక నాయకులు డాక్టర్ రామమోహన్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ జయకుమార్, వైద్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి, డాక్టర్ రామారావు, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు జె.కిశోర్‌బాబు, గాలి శ్రీనివాసులు, మాల్యాద్రి, నూనె నారాయణ పాల్గొన్నారు. -
పార్టీ మారితే వేటేయాలి
♦ ఫిరాయించిన వారి సభ్యత్వాన్ని గడువులోగా రద్దు చేయాలి ♦ అఖిలపక్ష సమావేశంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చట్టంలో లోపాలుంటే సవరించాలని వైఎస్సార్సీపీ కోరింది. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ఒక సభ్యుడు పార్టీ మారగానే అతడి సభ్యత్వం రద్దయ్యేలా పటిష్టమైన చట్టాలను అమల్లోకి తీసుకొస్తే ఫిరాయింపులను నిరోధించవచ్చని చెప్పారు. అఖిలపక్ష సమావేశం వివరాలను ఆయన ఏపీ భవన్ వద్ద విలేకరులకు వివరించారు. ‘‘అఖిలపక్ష సమావేశంలో ఎక్కువ మంది నేతలు దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు, మంచినీటి కొరత గురించి ప్రస్తావించారు. నేను ఏపీలోని కరువు, వర్షాభావ పరిస్థితులను వివరించాను. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే పథకం చేపట్టింది. ఇదే పథకాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని అమలు చేయాలి. వీటికోసం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాను’ అని మేకపాటి పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రజలు సహించరు.. ‘‘ఏపీలో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార పక్షం టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఫిరాయింపులను ఆపడానికి పటిష్టమైన చట్టాన్ని రూపొందించుకోవాలి. వైఎస్సార్సీపీ బీ-ఫారంపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? ఏపీలో రెవెన్యూ లోటు భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి రోజుకొకరిని అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రజలు సహించరు’’ అని ఎంపీ మేకపాటి వెల్లడించారు. -
రూ.42.5 లక్షల ఎంపీ నిధులతో తాగునీటి పథకాలు
► ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాస్వతంగా పరిష్కరించే నిమిత్తం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.42.50 లక్షల ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేశారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆత్మకూరు క్యాంప్ కార్యాలయంలో ఈ వివరాలను విలేకరులకు అందజేశారు. 1000లీ సామర్థ్యం గల ఆర్వో ప్లాంటును ఏర్పాటుచేయటం, ఇందుకు సంబంధించిన షెడ్డు బోర్ వెల్ మోటారు విద్యుత్ కనెక్షన్ కోసం మొత్తం రూ.ఆరు లక్షలు ఎంపీ లాడ్స్ నిధులను ఒక్కొక్క ప్లాంటుకు మంజూరుచేసినట్టు తెలిపారు. ఈ ప్లాంటులను అనంతసాగరం మండలంలోని అనంతసాగరం దిగువూరు, మంచాలపల్లి, గౌరవరం, కామిరెడ్డిపాడు, పడమటి కంభంపాడు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం దేపూరు, నల్లపరెడ్డిపల్లి, ఆరవీడు గ్రామాలకు కూడా ఈ వాటర్ ప్లాంటులను మంజూరు చేసారన్నారు. నిధులు మంజూరు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందూరు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి మర్రిపాడు : ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌ను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. మర్రిపాడులో తహసీల్దారు కార్యాలయం తనిఖీకి వచ్చిన జేసీ ఇంతియాజ్‌ను గురువారం ఎమ్మెల్యే కలిశారు. నియోజకవర్గంలో పలు సమస్యల గురించి జేసి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధాన్యానికి గిట్టుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అంతేకాకుండా మర్రిపాడు మండలంలో భూసమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ రికార్డులను పరిశీలించారు. ఈర్లపాడు భూములకు సంబంధించిన నివేదికలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నివేదిక తయారుచేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎంవీ కృష్ణారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, మందా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల్లో అర్హులకు అన్యాయం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు అర్హులకు అందడం లేదన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా వ్యవ హరించి పింఛన్లు, తదితర పథకాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జన్మభూమి కమిటీల పెత్తనం లేకుండా ఉత్తర్వులు వచ్చేలా పార్లమెంట్లో చర్చిస్తానన్నారు. జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని, అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించి శిలాఫలకంపై పేరు లేకుండా చేశారన్నారు. ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవాల్లో మాజీలను ఆహ్వానించి వారిపేర్లు శిలాఫలకంపై నమోదు చేయడం దారుణమన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య గ్రామాలను గుర్తిస్తే ఎంపీ ల్యాడ్స్ నిధులతో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఉపాధి పనుల కోసం రూ.1129 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదన్నారు. రోడ్లు లేని గ్రామాల జాబితా ఇస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న పాఠశాలల భవనాలు తర్వితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగాలని, పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఉపాధి ఎఫ్‌ఏలను తొలగించడంతో పనులు పర్యవేక్షణ సక్రమంగా జరగడంలేదన్నారు. ఇన్చార్జి కలెక్టర్ ఏ.మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతు సభ్యులు సూచించిన సూచనలను అమలు చేస్తామని, ప్రోటోకాల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రామిరెడ్డి, డ్వామా పీడీ హరిత, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వరసుందరం, ఆర్డబ్ల్యూఎస్, ఆర్వీఎం అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనంపై జీఓ చేయాలి: పింఛన్లు, పక్కాగృహాల విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైంది. అనర్హులను ఎంపిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటి పెత్తనం చెల్లదని పార్లమెంట్లో జీవో జారీ చేయించాలి. రూరల్ నియోజకవర్గంలో రూ.5 వేలు ఇస్తే అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు. అర్హులకు పథకాలు అందకపోతే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తాం. రూరల్ నియోజకవర్గం మోగల్లపాళెంలో స్టేడియం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరై నాలుగు నెలలు కావస్తున్న ఎందుకు ఖర్చు చేయాలేదు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రూ.1,600 కోట్లు వెనుక్కుపోయే ప్రమాదం ఉంది. - కొటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అర్హులకు అన్యాయం చేస్తున్నారు: పింఛన్ల మంజూరులో జన్మభూమి కమిటీలు అర్హులకు అన్యాయం చేస్తున్నారు. వికలాంగులకు కుడా ఇవ్వడం లేదు. ఇతనికి కూడా పింఛన్ అందలేదని సెల్ఫోన్లో వికలాంగుని పరిస్థితి చూపించారు. కావలి ప్రాంతంలో రెండు మంచినీటి పథకాల పనుల్లో జాప్యం జరుగుతోంది. నీటి లభ్యతున్న ప్రాంతంలో బోర్లు వేసి నీటిఎద్దడి ఉండే గ్రామాలకు సరఫరా చేయాలి. నిధుల మంజూరు, ఖర్చు వివరాలు అధికారపార్టీ నాయకులకు మాత్రమే ఇస్తున్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు అడుతున్నారు. ప్రారంభోత్సవాలకు పిలిచి అవమానపరుస్తున్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో నిర్మించాలి. -రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు: అర్హులకు పింఛన్లు అందలేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. జన్మభూమి కమిటీలు ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేస్తున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్‌కు కమిటీలు ఎంపిక చేసిన జాబితా సర్పంచ్ అధ్వర్యంలో సభ నిర్వహించి అందరికి తెలియజేయాలి. సర్పంచ్ సంతకం లేకుండా గ్రామ సభ నిర్వహిస్తున్నారు. తాగునీటి ఎద్దడి నివారించాలి. ప్రోటోకాల్ విషయంలో డీఆర్ఓ తప్పుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారు. - కిలివేటి సంజీవయ్య,సూళ్ళూరుపేట ఎమ్మెల్యే -
కుట్రలు చెల్లవ్
మేమంతా జగన్ సైన్యం ► టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన నేతలు ► జగన్ కోసం కదలివచ్చిన మహిళలు, రైతులు ► జనంలో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం ► వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తిన నెల్లూరు సాక్షి ప్రతినిధి,నెల్లూరు: మేమంతా జగన్ సైన్యమంటూ మరోసారి నిరూపించా రు. టీడీపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారంపై మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్ర లు చేసినా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు మరోసారి స్పష్టం చేశారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్లో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగసభ వైఎస్సార్సీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని జగన్మోహన్రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు తిప్పికొట్టారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నాయకులం కా దని జిల్లా నేతలు ప్రకటించారు. జగన్మోహన్రెడ్డి కోసం నెల్లూరురూరల్ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి జనం భారీ గా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి రావటంతో నగరంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాక్టర్లు, ఆటోలు, వాహనాల్లో భారీగా కస్తూరిదేవి గార్డెన్‌కు చేరుకున్న జనం జైజగన్ నినాదాలతో హోరెత్తించారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు పయనమైన జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా అపూర్వ స్వాగతం లభించింది. సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్ వారి నియోజకవర్గాల్లో ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా జిల్లా యువజన విభాగం, విద్యార్థి విభాగం అధ్యక్షులు రూప్‌కుమార్‌యాదవ్, శ్రావణ్‌కుమార్ బోదనం టోల్‌ప్లాజా వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికారు. అదేవిధంగా నెల్లూరు నగరపార్టీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో స్వాగతం పలికారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆనం విజయకుమార్‌రెడ్డి, కుమారుడు కార్తికేయరెడ్డి ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్పై ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నారు. యువనాయకుడు కార్తికేయరెడ్డి మాట్లాడుతూ.. 2019లో వైఎస్ జగన్ సీఎంను చేయటమే లక్ష్యమంటూ బహిరంగసభకు వచ్చిన యువత చేత నినాదాలు చేయించారు. ఆ చిరునవ్వు కోసం ఎంతదూరమైనా... వైఎస్ జగన్మోహన్రెడ్డిలో చెదరని చిరునవ్వును చూసి నాయకులు, ప్రజలు పులకించిపోయారు. ఆ చిరునవ్వు కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామని నాయకులు ప్రకటించారు. గత ఎన్నికల్లో జిల్లా ప్రజలు పార్టీకి ఎటువంటి బ్రహ్మరథం పట్టారో... అదే అభిమానం ఇప్పటికీ చూపుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రసంగించటంతో జనం పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. టీడీపీ అధినేత సూచనతో పచ్చరాతలు రాస్తున్న పత్రికలపై పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కారణంగా లబ్ధిపొందిన నేతలు టీడీపీ పంచనచేరి వైఎ స్సార్‌సీపీని విమర్శించటంపై ఆగ్రహంవ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి రోజు రోజుకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతున్నంత సేపు సభలో యువత జైజగన్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. నాటి నుంచి నేటి వరకు తాను ప్రజలు, దేవున్ని నమ్ముతాననటంతో ‘పులిబిడ్డ.. జగన్’ అంటూ నినాదాలు చేశారు. మొత్తంగా బుధవారం జగన్ పర్యటన శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపిం ది. సీఈసీ సభ్యులు చాలచెన్నయ్య, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురమల్లి పద్మనాభరెడ్డి, మేరిగ మురళి, నెల్లూరు నగర డిప్యుటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ పాల్గొన్నారు -
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
► పార్టీలో చేరనున్న ఆనం వర్గీయులు ► బహిరంగసభ, పార్టీ కార్యాలయం ప్రారంభం ► ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు నెల్లూరుకు రానున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి ఇటీవల జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయ న అనుచరులు, సన్నిహితులు బుధవారం కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మంగళవారం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షు డు జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఉదయం 10గంటలకు నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి, ఆయన అనుచరులు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించా రు. ఆ తర్వాత మాగంటలేవుట్‌లో నూతనంగా నిర్మించి పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. అనంతరం పినాకిని అతిథిగృహానికి చేరుకుంటా రు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారన్నారు. సమావేశం అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్‌కు పయనమవుతారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. -
ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేజర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్ల బిల్లుల ఆలస్యంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానన్నారు. శ్మశానవాటికల అభివృద్ధికి ఉపాధి కింద రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. పింఛన్ల పంపిణీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకపై నెలకొన్న గందరగోళానికి త్వరలో కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించనున్నట్లు చెప్పారు. జెడ్పీ నిధులతో జిల్లా అభివృద్ధి: -జడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి జిల్లా పరిషత్ నిధులతో జిల్లా అభివృద్ధి చేస్తామని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. విద్యాశాఖకు 75 శాతం నిధులు కేటాయించి పాఠశాలలు, హాస్టళ్లపై దృష్టి సారిస్తానన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి రూ.40 లక్షలతో ప్రతి స్కూల్‌కు ఓ కంప్యూటర్, బోధించేందుకు టీచర్‌ను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందేలా కృషి చేయాలన్నారు. రాబోయే వేసవిలో జిల్లాలో ఎక్కడ నీటి సమస్య ఉన్నా తన నిధులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో చేజర్ల ఎంపీపీ ధనలక్ష్మి, జెడ్పీటీసీ సల్మాషరీన్, ఎంపీడీఓ వాణి, తహశీల్దార్ రేవతి, వైఎస్సార్ సీపీ నాయకులు కొమ్మి సిద్దులు నాయుడు, తలపనేని జయంతులునాయుడు, రామమనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, శేఖర్‌రెడ్డి, సుబ్బానాయుడు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు పూర్తి సహకారం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కలిగిరి : గ్రామాల్లో అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కలిగిరి పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, స్థానిక సర్పంచ్ పాలూరి మాల్యాద్రిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడారు. రాష్ట్రంలో పాలన సజావుగా లేదని, జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడంతో ఆయన ప్రతిష్టకే భంగం కలుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం చేపడతామంటూ కొంత మంది భూములను దక్కించుకుంటున్నారని తాను సున్నితంగా విమర్శలు చేశాన ని, దీంతో తనపై ఓ చానల్లో అసత్య కథనాలను ప్రసారం చేసి తనపై విషం చిమ్మారని ఆరోపించారు. మర్రిపాడు మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని, తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆన్ని గ్రామాలకు మౌలిక వసతులను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తామెప్పుడూ వాస్తవాలనే మాట్లాడతామని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ పుణ్యమాని ఉత్తరకాలువ మంజూరైందని, ఈ ప్రాంతానికి ఉత్తర కాలువ ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజలకు న్యాయం చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలో రూ.50 లక్షలకు పైగా నిధులతో సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, తదితర అభివృద్ధి పనులను చేపట్టడాన్ని అభినందించారు. పారిశుధ్య మెరుగునకు ట్రాక్టర్, ట్రక్కును తన నిధుల నుంచి అందజేశానని వివరించారు. అనంతరం రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ నిధుల నుంచి రూ.మూడు కోట్లతో ఉదయగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపట్టానన్నారు. కలిగిరి మండలానికి సంబంధించి రూ.45 లక్షలను పాఠశాల, వసతి గృహాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యలకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు, ఉప సర్పంచ్ మోటుపల్లి వెంకటలక్ష్మి, స్థానిక నాయకులు బొల్లినేని వెంకటసత్యనారాయణ, బాపతి చెన్నారెడ్డి, అంకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంటు పవిత్రతను కాపాడండి
అఖిలపక్ష సమావేశంలో ఎంపీ మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేసి పార్లమెంటు పవిత్రతను కాపాడాలంటూ వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సజావుగా సాగాలని, అర్థవంతమైన చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు.అప్పట్లో హడావుడిగా రాష్ట్ర విభజన జరిగిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని వివరించారు. అయితే పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో.. ఏపీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతే
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతేనని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కోసం ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నసీం జైదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఎప్పటివరకు పెరుగుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని, ఇంకో 50 మందిని సర్దుబాటు చేయగలమని చెబుతూ ఇటీవల సీఎం చంద్రబాబు ఇతర పార్టీల నుంచి చాలా మందిని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ద్వారా స్పష్టత తీసుకుందామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిశాం. ఎన్నికల సంఘానికి కేంద్రం నుంచి సూచనలు ఏమైనా వచ్చాయేమోనని కలిశాం. వారు ఇదివరకే అటార్నీ జనరల్ అభిప్రాయం కూడా తీసుకున్నారని అనుకుంటున్నాను. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన వీలుపడదని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఎందుకిలా చెబుతున్నారో తెలియదు. ఇతర పార్టీల నుంచి, వైఎస్సార్సీపీ నుంచి కొందరిని తీసుకుందామనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది’’ అని మేకపాటి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల ఆందోళన వెనక వైఎస్సార్సీపీ ఉందన్న విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రస్తావించగా... ‘‘మంచి జరిగితే తమది, లేదంటే వైఎస్సార్సీపీదని నిందలు వేయడం పరిపాటిగా మారింది. ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయాలని అడిగారు’’ అని తెలిపారు. -
పెద్ద ఎత్తున సాయమందించాలి
-
పెద్ద ఎత్తున సాయమందించాలి
♦ భారీవర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి ♦ కేంద్రప్రభుత్వానికి వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి వినతి సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రమే ముందుకొచ్చి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో భారీవర్షాలవల్ల వాటిల్లిన నష్టంపై లోక్‌సభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘గడిచిన మూడేళ్లుగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు వచ్చినప్పుడు చెప్పుకోదగిన వర్షాలు పడలేదు. అంతేగాక తీవ్రమైన కరువు పరిస్థితుల్ని ఈ ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇటీవల వర్షాలు పడగానే తొలుత రైతులంతా సంతోషపడ్డారు. దురదృష్టవశాత్తూ కురిసిన భారీవర్షాలు తీవ్రనష్టాన్ని మిగిల్చిపోయాయి. చెన్నై పొరుగునే ఉన్న నెల్లూరూ ఇదేరీతిలో నష్టాలు చవిచూసింది. పంటలన్నీ ధ్వంసమయ్యాయి. ఒక్క నెల్లూరులోనే 25 వేల ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగవుతోంది. ఎకరాకు రూ.7 లక్షలవరకు రైతులు పెట్టుబడి పెట్టారు. అదంతా తుడిచిపెట్టుకుపోయింది. నష్టం రూ.1,500 కోట్లనుంచి రూ.1,700 కోట్లవరకు ఉంటుంది. అరటి, తమలపాకు తోటలు ధ్వంసమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రైతులు వేరుశనగ సాగు చేస్తే అదీ ధ్వంసమైంది. రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. పౌల్ట్రీ కూడా నష్టపోయింది.ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నవిషయం కేంద్రానికి తెలుసు. అందువల్ల రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి. కేంద్రబృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేయించి భారీఎత్తున సాయం చేయాలి’’ అని మేకపాటి కోరారు. వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ.. భారీవర్షాలవల్ల తిరుపతి నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారని వివరించారు. 25 లక్షలమందికి ఇక్కట్లు: తోట చర్చలో టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం మాట్లాడుతూ.. భారీ వర్షాలవల్ల ఏపీలో 2,273 గ్రామాల్లో 25 లక్షలమంది ఇక్కట్ల పాలయ్యారని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాలు నష్టపోయాయన్నారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వర్షాలవల్ల రూ.3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, తక్షణం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం ముందుకొచ్చి రాష్ట్రానికి సాయం చేయాలని బీజేపీ ఎంపీ కె.హరిబాబు విన్నవించారు. -
'అప్పుడే ఆయనకు ఘన నివాళి'
న్యూఢిల్లీ: అంబేద్కర్ ఆశయాలను అమలుచేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన లోక్ సభలో అంబేద్కర్ సేవలను ఉద్దేశించి మాట్లాడారు. దళితులు, ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంతా నడుంకట్టాలని చెప్పారు. కేవలం ఆయన విధానాలు పెడితే సరిపోదని, వాటిని తప్పక అమలు చేయాలని సభలో గుర్తు చేశారు. -
‘హోదా’పై చర్చ జరగాలని అడిగాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను వైఎస్సార్సీపీ మరోసారి కేంద్రం ముందు ఉంచింది. బుధవారం ఇక్కడ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అధ్యక్షతన పార్లమెంటులో జరిపిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి హోదా విషయంలో నాటి ప్రధాని హామీని ప్రస్తావించామని, వరద సాయంపై అడిగినట్లు మేకపాటి తెలిపారు. వెంకయ్య, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ ఇతర మంత్రులు, పలు పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మేకపాటి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి తీర్మానాన్ని స్వాగతించాం.. ‘అందరూ 26, 27 తేదీల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంటులో జరిగే ప్రత్యేక చర్చ విషయం అఖిలపక్షంలో చర్చించారు. ఉమ్మడి తీర్మానం ఉండాలన్నారు. దీన్ని వైఎస్సార్సీపీ స్వాగతించింది. అలాగే కొన్ని జిల్లాల్లో కరువు, తాజాగా అతివృష్టి, వరద పరిస్థితులు నెలకొన్నాయి.కేంద్రం అన్ని విధాలుగా సాయం చేయాలని అడిగాం. ఎంపీ ల్యాడ్స్ పెంచాలని కోరాం. పార్లమెంటు సమావేశాల్లోనూ సుదీర్ఘంగా మట్లాడతాం.’ అని మేకపాటి పేర్కొన్నారు. ‘హోదా’ హామీని ప్రస్తావించాం.. ‘రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా సహా అన్ని హామీలూ నిలబెట్టుకోవాలి. నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రస్తావించాం. ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లోటుబడ్జెట్‌ను పూడ్చుకోవచ్చు. దానిపై పట్టుపడతాం’ అన్నారు. మత అసహనం చర్చలో మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మేకపాటి స్పందిస్తూ.. అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. -
'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'
కోవూరు: గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కోవూరు మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు గురువారం రైతులను పరామర్శించారు. ఎనమడుగు గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న 300 ఎకరాల తమలపాకు తోటను నేతలు పరిశీలించారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టం పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రధాని అపవాదు మోయొద్దు
-
ప్రధాని అపవాదు మోయొద్దు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకుంటే మంచిదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ప్రధాని అనవసరంగా అపవాదు మోయొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ప్రధానిపై నమ్మకం ఉందని, దానిని కోల్పోవద్దని హితవు పలికారు. పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. -
వైఎస్సార్ 6వ వర్ధంతి నేడు
♦ ఘనంగా నిర్వహించాలని ఎంపీ మేకపాటి పిలుపు ♦ పార్టీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలు ♦ నివాళులర్పించనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల కోసం సీఎంగా వైఎస్ చేపట్టిన పథకాలు చిరస్మరణీయమైనవని చెప్పారు. అందుకే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా అశేషంగా అభిమానులున్నారని తెలిపారు. పేదలకు ఆహారభద్రత, ఆరోగ్య భద్రత, నివాస భద్రత వంటివి కల్పించిన ఘనత వైఎస్దేన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంతోపాటు అన్ని సదుపాయాలు కల్పించి వ్యవసాయాన్ని పండుగగా మార్చారని కొనియాడారు. మహానేత అధికారంలో ఉన్న ఐదేళ్లు అదృష్టం వల్ల వర్షాలు బాగా కురిసి రైతులు సంతోషంగా ఉన్నారని వివరించారు. ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒకేసారి 86 ప్రాజెక్టులు చేపట్టిన ఘనత వైఎస్‌దేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని తపించారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడి వర్థంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్ర కార్యాలయానికి వచ్చి వైఎస్‌కు నివాళులర్పిస్తారని చెప్పారు. అనంతరం పంజాగుట్టలో వైఎస్ విగ్ర హం వద్ద శ్రద్ధాంజలి ఘటించి అసెంబ్లీకి హాజరవుతారని వెల్లడించారు. ఇడుపులపాయకు జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. జగన్ బుధవారం రాత్రి అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి గురువారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
ప్రత్యేక బంద్ సంపూర్ణం
♦ వేకువనే బస్టాండ్‌లో బైఠాయించిన ఎంపీ మేకపాటి ♦ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ♦ అపాచి, నిప్పో పరిశ్రమలను మూయించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ♦ జాతీయరహదారిపై బైఠాయించిన ఎమ్మెల్యేలు, ప్రసన్న ♦ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన వైనం ♦ స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేత ♦ ముందురోజు సెలవులు ప్రకటించిన వ్యాపారస్తులు ♦ ఏడుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు ♦ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేసిన ఎమ్మెల్యే పాశం ♦ మద్దతు పలికిన సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రత్యేక బంద్‌కు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, వ్యాపార, వాణిజ్యసంఘాలు మద్దతు తెలియజేశాయి. బంద్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు అన్నివర్గాల వారు పూర్తి మద్దతు తెలియజేశారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వేకువజామునే ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోల్‌బంక్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్రావుల ఆధ్వర్యంలో కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో వెయ్యి బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయహల్ గేటు నుంచి ముత్తుకూరు, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ, గాంధీబొమ్మ, కనకమహల్, స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట, రంగనాయకులపేట, చిన్న, పెద్దబజారు, బారకాసు, జడ్పీసెంటర్ మీదుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేకహోదా నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 22 ప్రాంతాల్లో కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ధర్నాలు నిర్వహించారు. గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ వేకువజామున బస్టాండ్‌కు చేరుకుని బస్సులను ఆడ్డుకున్నారు. అనంతరం టవర్‌క్లాక్ కూడలి నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయటంతో స్టేషన్‌ముందు బైఠాయించారు. జాతీయరహదారులు దిగ్బంధం కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రసన్నకుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై బైఠాయించారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే గౌతంరెడ్డి ముంబై-నెల్లూరు రహదారి, ఆత్మకూ రు బస్టాండ్, సోమశిలరోడ్డు సెంటర్లో నాయకు లు, కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి వెంకటాచలం వద్ద హైవేపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమారెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య షార్కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. అపాచి, నిప్పో వంటి పెద్దపెద్ద పరిశ్రమలను సైతం మూయించారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బంద్‌లో బస్సులను అడ్డుకున్నందుకు పోలీసులు ఏడుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ విజయవంతమైంది. ఆర్టీసీకి రూ.33 లక్షలు నష్టం ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ సందర్భంగా ఆర్టీసీకి రూ.33 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పది బస్ డిపోల నుంచి వాహనాలు ఆగిపోయిన కారణంగా ఈ నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
రామాయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగేనా?
పోర్టు కోసం ఐదు వేల ఎకరాలను గుర్తించిన అధికారులు కావలి : బ్రిటీషుకాలంలో వెలుగు వెలిగిన ప్రకాశం జిల్లా రామాయపట్నం తీరంలో పోర్టు నిర్మాణం జరుగుతుందా అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేపడితే ప్రకాశం జిల్లాకన్నా ఎక్కువ భాగం లబ్ధి నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకు కలుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.7500 కోట్లతో పోర్టు నిర్మిస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. పది వేల ఎకరాలు అవసరం అవుతుందని కేంద్రం ప్రకటించగా రామాయపట్నం సముద్రతీరానికి పరిసర ప్రాంతాల్లోని సుమారు 5వేల ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్‌భూములను ప్రకాశం జిల్లా అధికారులు గుర్తించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కావలికి వచ్చిన ప్రతిసారీ రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు జిల్లాలోని దుగ్గరాజుపట్నంలో పోర్టు నిర్మాణం పూర్తయితే రామాయపట్నం పోర్టును మంజూరు చేస్తామని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేశారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతో దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తేలకుండా ఉంది. దీంతో రామాయపట్నం పోర్టు మంజూరుపై నీలి నీడలు అలముకున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీకి వినతి పత్రాలు అందించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేంద్రమంత్రులకు రామిరెడ్డి వివరించారు. కావలి నుంచి 15 కిలో మీటర్లు... నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉన్న రామాయపట్నం కావలి పట్టణం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. కందుకూరు నుంచి 34 కిలో మీటర్లు వరకు ఉంటుంది. రామాయపట్నం సమీపంలో ఉన్న ఉలవపాడు మండలం, గుడ్లూరుతోపాటు పలు మండలాలకు చెందిన వారు నిత్యం కావలికి వస్తుంటారు. పోర్టు నిర్మాణంతో ఉపాధి... రామాయపట్నంలో నిర్మించే పోర్టులో ఓడల మరమ్మతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని యూపీఏ ప్రభుత్వం తెలిపింది. రామాయపట్నంపోర్టు నిర్మాణం జరిగితే కొన్ని సంవత్సరాలుగా నిస్తేజంగా ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారానికి కూడా ఊపు వస్తుందని స్థానికులు అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కృషి రాజకీయాలకు అతీతంగా రామయపట్నంలో పోర్టు నిర్మాణంకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. పోర్టు నిర్మిస్తే కావలి ప్రాంతం అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కలుగుతుంది. పోర్టు మంజూరు చేసే విషయంపై కేంద్రమంత్రులను కలిసి పలుమార్లు విన్నవించాం. - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే షిప్‌యార్డు మంజూరు చేయాలి రామాయపట్నంలో పోర్టుతోపాటు షిప్‌యార్డు కేంద్రం మంజూరు చేయాలి. ఈ విషయంపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. రామయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. - కందుకూరి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
సీఎం తీరు మార్చుకోవాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : మాటలకు, చేతలకు పొంతన లేకుండా, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీని ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు తనతీరును మార్చుకోవాలని ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి హితవుపలికారు. నెల్లూరులోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష ఎమ్మెల్యేలు 67 మందికి ఎమ్మెల్యే నిధులను మంజూరుచేయకపోవడం శోచనీయం అన్నారు. బాబు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. అభివృద్ధి అంశంలో దివంగత సీఎం వైఎస్సార్ పాలనను చూసైనా తప్పులను సరి దిద్దుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పదిశాతం రుణాలు, 90 శాతం నిధులు మంజూరుకావడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమవంతు సాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేక హోదాకోసం ఈనెల 29న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సదుద్దేశంతో చేపట్టిన నీరు-చెట్టుకు హితోధికంగా తమవంతు సహాయసహకారాను అందజేస్తామని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో ఆ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి, కేవలం టీడీపీ కార్యకర్తలకు అప్పజెప్పడం అప్రజాస్వామికమన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం విచారకరం అన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి, మేరిగ మురళీధర్‌లు పాల్గొన్నారు. -
సానుకూలం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల నేతృత్వంలో ప్రకాశం జిల్లా నుంచి రైతు ప్రతినిధి బృందం గురు, శుక్రవారాల్లో కేంద్ర మంత్రులను కలిసి జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు రాష్ట్రానికి చెందిన మంత్రి వెంకయ్యనాయుడిని కూడా కలిసి చర్చించారు. నిర్మలా సీతారామన్ సుమారు గంట సేపు రైతుల బృందంలో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లో కేంద్రం నుంచి ఒక బృందాన్ని పంపిస్తామని, అ బృందం ఇచ్చిన సూచనల ఆధారంగా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. నిర్మలాసీతారామన్‌ను కలిసిన వారిలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉండగా, వెంకయ్యనాయుడిని కలిసిన సమయంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా హాజరయ్యారు. అనంతరం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షితో మాట్లాడుతూ మరోవారం రోజుల్లో పొగాకు రైతుల సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం తమకు కలిగిందన్నారు. కేంద్రమంత్రులు స్పందించిన తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
ఆలస్యం చేస్తే క్షమించరు...
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గళాన్ని గట్టిగా వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆపార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన మేకపాటి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, అప్పటి ప్రధాని లోక్ సభలో ఇచ్చిన హామీని, ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ వాగ్దానాన్ని అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు లోటు బడ్జెట్ ఉందని, కనీసం రాజధాని కూడా లేదని ఎంపీ మేకపాటి సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రాన్ని మళ్లీ జీరో నుంచి నిర్మించాల్సి ఉందని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, ఆలస్యం చేస్తే క్షమించరని మేకపాటి పేర్కొన్నారు. -
విపక్ష ఎంపీలకు గౌరవం ఇవ్వడం లేదు
లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మేకపాటి * ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతివ్వబోమని స్పష్టీకరణ * పొగాకు రేటు పెంచాలని కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎంపీలకు సరైన గౌరవం ఇవ్వడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమత్రా మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేస్తున్నారు కానీ, ఎంపీల పేర్లను పెట్టడంలేదని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ సుమిత్రా మహజన్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయడు సోమవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రొటోకాల్ విషయంపై ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష ఎంపీలకు గౌరవం ఇచ్చేలా రాష్ట్రాలు, జిల్లా కలెక్టర్లకు సలహా ఇవ్వాలని కోరారు. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో చనిపోయిన వారికే కాకుండా, పుష్కరాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చనిపోయినవారికి కూడా పార్లమెంటులో నివాళులర్పించాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం ఎంపీ మేకపాటి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులకు సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక బిల్లులను సమర్థించబోమన్నారు. భూసేకరణ బిల్లు విషయంలో మూడు అంశాలను వివరించామన్నారు. బాగా పంటలు పండే సారవంతమైన భూములను సేకరించడానికి తాము వ్యతిరేకమని, రైతుల ఆమోదయోగ్యం లేకుండా, సామాజిక ప్రభావం అంచనా వేయకుండా భూసేకరణ చేయకూడదని స్పష్టం చేశామని తెలిపారు. ఈ మూడు అంశాలను సవరిస్తే భూసేకరణ బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు. ముఖ్యమైన బిల్లుల విషయంలో ప్రజా ప్రయోజనాల మేరకు అంశాల వారీగా సమర్థిస్తామని, ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందునుంచి చెబుతున్నారన్నారు. ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పొగాకు సేకరణలో గతేడాది వచ్చిన రేటులో సగం రేటుకూడా రావడంలేదని, రేటు పెంచాలని మంత్రి వెంక య్య దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎంపీ ల్యాడ్ నిధుల విషయమై మాట్లాడుతూ .. నెల్లూరు జిల్లాలో సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామానికి రూ. 3 కోట్లు, కలెక్టరు రూ. 3 కోట్లు ఇచ్చారని, కానీ ఎంపీలకు ఇచ్చేది రూ. 5 కోట్లేనని, ఇప్పటికైనా ఎంపీల్యాడ్ కింద నిధులు పెంచాలని కోరామన్నారు. టీడీపీ నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఫ్లోర్ లీడర్ తోట నరసింహం అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. -
బాబువల్లే 27 మంది బలి
నెల్లూరు: రాజమండ్రి ఘటనలో మృతిచెందిన రాజేశ్వరి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. సీఎం చంద్రబాబునాయుడు అలసత్వం వల్లే 27 మంది ప్రాణాలు కోల్పోయారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క, నెల్లూరు పరమేశ్వరినగర్‌లో అగ్నిప్రమాద బాధితులకు నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆర్థికసాయం అందించారు. ఇక సమ్మెచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మద్దతు తెలిపారు. -
గిట్టుబాటు ధర వచ్చేలా ప్రశ్నిస్తాం
నెల్లూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి వాటి ధరలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని, పార్లమెంటులో ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు చేతగాని తనంవల్లే పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుందని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పనితీరును ప్రజలు గుర్తించారని తెలిపారు. మరోపక్క, తొక్కిసలాటకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. -
'కాసుబ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం'
-
మస్తాన్‌బాబుకు గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలి
లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ మేకపాటి న్యూఢిల్లీ: ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహణలో పేరు గడించిన మస్తాన్‌బాబుకు జాతీయ అవార్డు ప్రకటించాలి. తగిన గ్యాలంటరీ అవార్డుతో సత్కరించాలి. ఈ సూచనతో ఈ సభ ఏకీభవిస్తుందని ఆశిస్తున్నా’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. అలాగే గిన్నిస్ రికార్డులు సాధించిన ఆయనను ఏప్రభుత్వమూ గుర్తించలేదన్నారు. మస్తాన్ భౌతికకాయాన్ని స్వస్థలానికి చేర్చినందుకు కృతజ్ఞతలనీ, అయితే ఆయన కుటుంబ సభ్యులకు పక్కా ఇల్లు లేదనీ వారికి ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ సానుకూలత వ్యక్తం చేశారు. కాగా, మేకపాటి మరికొందరు ఎంపీలు పోలీస్‌స్టేషన్‌లో మౌలిక వసతులపై అడిగిన ప్రశ్నకు త్వరలో ఎంపీఎఫ్ కింద నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతీభాయ్ చౌదరి తెలిపారు. -
జిల్లాలో సాగునీటి కోసం రూ.400 కోట్లు
నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా జలదంకి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో చిన్నక్రాక వద్ద కావలి కాలువ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర మంత్రి నారాయణ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకటరామారావు, కురుగొండ్ల రామకృష్ణతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి రంగానికి ఎంత నిధులైనా కేటాయించేందుకు సిద్ధమన్నారు. కావలి కాలువను 49 కిలో మీటర్ల మేర ఆధునికీకరణను రూ.24 కోట్లతో నిర్వహిస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణకు అక్కడ నుంచి సోమశిలకు మళ్లించి సాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలు ఉండగా 70 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్‌లో ఒక్క ఎకరా ఎండకుండా నీటిని అందించే ఏర్పాట్లను చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ ఆధునికీకరణ పనులు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కాలువ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, రైతులు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 11,000 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల పెంచారన్నారు. చివరి పొలాలకు వరకు నీరు అందేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలి, ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రాంతాలు కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్నాయన్నారు. ఆయకట్టు రైతులు పడుతున్న కష్టాలను పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కావలి కాలువ సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తాను చేసిన దీక్షకు రైతులందరూ మద్దతుగా నిలిచారన్నారు. కావలి కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. అయితే ప్రస్తుతం 550 నుంచి 950 క్యూసెక్కులకు పెరిగే విధంగా కాలువ నిర్మాణం చేస్తున్నారని, దీనిని 1200 క్యూసెక్కుల పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను కాపాడాలన్నారు. సంగం బ్యారేజి వద్ద ఇసుక బస్తాల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, కావలి నియోజకవర్గంలో డీఎం చానల్, డీఆర్ చానల్‌ను పూర్తి చేయాలన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాట్లాడుతూ కావలి కాలువ ఆధునికీకరణ పనులకోసం తాను ఎంతగానో కష్టపడ్డానన్నారు. రెండుసార్లు భూమి పూజ భూమి పూజ కార్యక్రమాన్ని రెండు సార్లు నిర్వహించారు. రాహుకాలం వస్తున్నా రాష్ట్ర మంత్రులు రాకపోవడంతో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి, వెంకటగిరి ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ముందుగా భూమి పూజ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు వచ్చిన తర్వాత మళ్లీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ను కార్యక్రమం చివర్లో మాత్రమే ఆహ్వానించారు. నీరు చెట్టు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ, జలదంకి మండల నేత వంటేరు జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
పీవీ ఘాట్ ప్రతిపాదన పరిశీలనలో ఉంది
ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు మెమోరియల్ ఘాట్ నిర్మించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి ఎస్‌హెచ్ బాబుల్‌సుప్రియో తెలిపారు. న్యూఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ బంగళాలను స్మారక ప్రదేశాలుగా మార్చకూడదన్న నిబంధన కారణంగా మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ఉన్న నివాసాన్ని స్మారక ప్రదేశంగా మార్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్టు పేర్కొన్నారు. -
జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
ఘనంగా నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు నెల్లూరు (సెంట్రల్) : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రామ్ 108వ జయంతి సందర్భంగా వేదాయపాళెం సెంటర్లోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఎన్ని పదవులు చేపట్టినా అన్నింటికీ న్యాయం చేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ పట్టుదల, కృషితో దేశంలోనే అత్యున్నత స్థాయికి వచ్చారన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనవన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారన్నారు. అటువంటి మహనీయులు కలలు సాకారం చేద్దామన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ భారతదేశ ఉప ప్రధానిగా దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలసికట్టుగా ఉందామన్నారు. జాయింట్ కలెక్టరు ఇంతియాజ్, సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రసాద్‌రావు, ఐటిడీఏ పీఓ వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు సుధీర్‌బాబు, నాయకులు పురుషోత్తం యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నరసింహయ్య ముదిరాజ్, మురహరి, సునీల్, కెహరికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ నిరాశ పరిచింది: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో చేస్తారని ఆశించామని, అయితే బడ్జెట్ నిరాశపర్చిందని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకతో కలసి ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని.. ఉమ్మడి ఏపీకి సంబంధించి దాదాపు రూ.29 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘‘అవన్నీ ఈ బడ్జెట్లో చేరుస్తారనుకున్నాం. ఏపీకి ఆరునెలల్లోనే కొత్త రైల్వేజోన్ ఇస్తామని విభజన చట్టంలో ఉన్నా దాని ఊసే లేదు.’’ అని అన్నారు. -
'పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీనే అడిగింది'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని నెల్లూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీనే అడిగిందన్నారు. ఇప్పుడు బీజేపీతో పాటు టీడీపీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు క్షమించరన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలను లేవనెత్తుతామని మేకపాటి తెలిపారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకు వచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధీ ఇప్పడు మళ్లీ రాజకీయ లబ్ది కోసమే మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని.. అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కోటి సంతకాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ చేసే మంచి పనులకు తమ మద్దతు ఉంటుందన్నారు. -
రైతు సమస్యలపై శ్రద్ధచూపాలి
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు శ్రద్ధచూపాల్సిన అవసరం ఉందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశం స్థానిక స్త్రీశక్తి భవన్లో బుధవారం ఎంపీపీ సిద్ధం సుష్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు యూరియా కోసం జిల్లావ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. జనవరిలోనే పలు గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని, ఈ సమస్య వేసవికాలం నాటికి మరింతగా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. మూడేళ్లుగా వర్షాలు లేకపోవడంతో బొగ్గేరు ప్రవహించకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలకు సైతం నోచుకోలేదన్నారు. దీనిమూలంగా తాగునీటి కష్టాలు అధికమయ్యాయన్నారు. అధికారులు ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. తాము కూడా జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండగా విద్యుత్ రంగంలో మాత్రం ప్రగతి సాధించిందన్నారు. జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి జరుగుతుందన్నారు. రైతులకు 9 గంటల వరకు విద్యుత్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. అధికారులు రాజకీయాలకతీతంగా అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. పీఎం, సీఎంలు దత్తత, స్మార్ట్గ్రామాలను రూపొందించడం మంచి పరిణామమన్నారు. రెండు, మూడు లక్షలతో ఏర్పాటు కానున్న సుజల స్రవంతి కూడా అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు కృషిచేయాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి పరిచేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. జెడ్పీలోనూ నిధుల కొరత ఉంది: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి జిల్లా పరిషత్ సైతం లోటు బడ్జెట్లో ఉందని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేకంగా శ్రద్ధచూపుతానన్నారు. ఆత్మకూరు జెడ్పీటీసీసభ్యునిగా ఉన్నందునే జెడ్పీ చైర్మన్ అయ్యాయని, ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేశారనే అంశాన్ని ప్రతి ఒక్కరు అడుగుతారని, దీంతో ఈ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానన్నారు. యూరియా కొరత బాగా ఉంది: ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పదిరోజులుగా యూరియా కొరత ఉందని, దీనిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అందరం కలిసిమెలసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎంపీడీఓ నిర్మలాదేవి పాల్గొన్నారు. -
నెల్లూరు రైల్వే స్టేషన్‌కు ఏ1 హోదా ఇవ్వాలి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు (సెంట్రల్): నెల్లూరు రైల్వేస్టేషనును మోడల్‌గా తీర్చిదిద్ది ఏ1 హోదా కల్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. రైల్వే బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు శ్రీవాస్తవ విజయవాడలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌లు జిల్లాలోని రైల్వే సమస్యలపై మాట్లాడారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి దూరప్రాంతాలకు ప్రతిరోజు వేలమంది ప్రయాణాలు సాగిస్తుంటారన్నారు. ఈ రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషనుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా నెల్లూరు సమీపంలోని బిట్రగుంటలో రైల్వేశాఖకు సంబంధించిన స్థలం చాలా ఉందన్నారు. ఈ స్థలంలో రైల్వే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను వినియోగించుకుంటారన్నారు. కానీ గతంలో ఉన్న సమయాన్ని మార్చి ప్రస్తుతం చాలా లేటుగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు సమయం గతంలో ఉన్న మాదిరిగానే నడపాలని పేర్కొన్నారు. నడికుడి-కాళహస్తి రైల్వేలైన్ పనులను చేపట్టాలన్నారు. పుణ్యక్షేత్రాలను కలిపే విధంగా రైళ్లను నడపాలి: ఎంపీ వరప్రసాద్ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీలను కలుపుతూ రైలును నడపాలని ఎంపీ వరప్రసాద్ కోరారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో ప్రారంభించే ఆంధ్ర ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి ప్రారంభమై ఢిల్లీ వెళ్లే విధంగా చూడాలన్నారు. గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం నడుస్తుందన్నారు. అలాకాకుండా తిరుపతి నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమయ్యే విధంగా చూడాలన్నారు. గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ కాబట్టి ఆ రైల్వేస్టేషనులో అదనపు ప్లాట్‌ఫారాలు వేస్తే ప్రయాణికుల రద్దీ తగ్గుతుందన్నారు. అంతేకాకుండా గూడూరులో రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న రైల్వే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉండటంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. రేణిగుంట వద్ద లోకో షెడ్ ఏర్పాటుచేయాలని కోరారు. కాళహస్తి సమీపంలోని ఆకుర్తి, వెంకటగిరి సమీపంలోని పలుస్టేషన్లలో రైళ్లు ఆపనందు వల్ల కొన్నేళ్ల నుంచి అవి ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ స్టేషన్లలో రైళ్లు ఆపితే కొంతవరకు ఆయా ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వెంకటగిరి, గూడూరు ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా నిమ్మకాయలు ఎగుమతులు చేస్తుంటారని వీరికి ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తే ఎంతో ఉపయోగం అన్నారు. -
''విభజన సమయంలో హామీలు నెరవేర్చాలని కోరతాం''
-
అర్హులందరికీ న్యాయం చేస్తాం
సంగం: అర్హులైన పింఛన్‌దారులందరికీ న్యాయం చేస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని జెండాదిబ్బ, అన్నారెడ్డిపాళెం, దువ్వూరు, మక్తాపురం గ్రామాల్లో వారు బుధవారం విస్తృతంగా పర్యటించి గ్రామీణలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో వారు మాట్లాడుతూ అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన వారికి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేసేలా చర్యలు చేపడతామన్నారు. భూమిలేని నిరుపేదలకు భూమి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. తాము అండగా ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ సమస్యనైనా తమ దృష్టికి తేవాలని సూచించారు. గ్రామవీధుల్లో నడుస్తూ సమస్యలపై ఆరా తీశారు. అన్నారెడ్డిపాళెంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తామన్నా. గ్రంథాలయ మరమ్మతులకు నిధులు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. దువ్వూరులో పలువురు వృద్ధులు, వితంతువులు, దళితులు, గిరిజనులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మక్తాపురంలో ఇందిరమ్మ గృహాలు మంజూరు కాలేదని, ఎంతో కాలంగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథులే లేరని బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు నిలిపివేస్తున్నారని, పథకాన్ని పునరుద్ధరించగానే అర్హులకు ఇళ్లు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరుచేసిన రహదారులు వేసే ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్ రెడ్డి, సంగం జెడ్పీటీసీ దేవసహాయం, సంగం మండల ప్రచార కమిటీ కన్వీనర్ మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, దగ్గుమాటి మధుసూదన్ రెడ్డి, పులంగం శంకర్‌రెడ్డి, షేక్ మైమున్నీసా, రఘునాథరెడ్డి, జెక్కా సుబ్బారెడ్డి, యానాదిరెడ్డి, ఫణికుమార్‌రెడ్డి, మనోజ్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సూరి ఇందిరమ్మ, ఎంపీటీసీ సభ్యులు రంగయ్య, లక్ష్మీప్రసన్న, ముడి మల్లికార్జునరెడ్డి, శంకరయ్య, చిన్నా, మోహన్, దయాకర్ రెడ్డి, ఓబుల్, వెంకటేశ్వర్లు రెడ్డిపాల్గొన్నారు. -
కంపసముద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మరో రెండు గ్రామాలను పరిశీలిస్తున్నాం ఆత్మకూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన సంసాద్ ఆదర్శ గ్రామ యోజన (సాగీ) పథకంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నట్టు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పల్లెలను దత్తత తీసుకోవాలని పీఎం నరేంద్రమోదీ పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితో తాను కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకున్నానన్నారు. కంపసముద్రంలో తనతో పాటు తన సోదరుడైన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి చదువుకున్నట్టు ఎంపీ తెలిపారు. అంతేకాకుండా కంపసముద్రం రాజకీయంగా చరిత్ర కలిగిన గ్రామమన్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం సరైన నిర్ణయమే అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కావలి నియోజకవర్గంలో మరో గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామాన్ని ఎంపిక చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కోరానన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మరో గ్రామాన్ని కూడా ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు గ్రామాన్ని ఎంపిక చేయాల్సిందిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావును కోరానన్నారు. ఈ రెండు గ్రామాలను కూడా ఎంపిక చేస్తే నిధులను వెచ్చించి వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే
బుచ్చిరెడ్డిపాళెం: ప్రజలను మోసం చేసి గెలిచినంత మాత్రాన సరిపోదని, ఎన్నికల్లో ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరె డ్డిపాళెం, కోవూరు, కొడవలూరు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ధర్నాల్లో ఎంపీ మేకపాటి మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదన్నారు. ఆ విధంగా ఆ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫైళ్లపై సంతకాలు చేసి, నేటి వరకు అమలు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగ భృతి రూ.2వేలు, ఇంటికో ఉద్యోగం అంటూ వాగ్దానాలు గుప్పించి , నేడు ప్రజా జీవితంతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. అధికారం కోసం హామీలు ప్రకటించి, ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటినా వాటిని అమలుచేయక పోవడం సబబు కాదన్నారు. ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేయకూడదనే తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు రుణమాఫీ ప్రకటించలేదన్నారు. పలువురి ఆర్థిక శాస్త్రవే త్తలను సంప్రదించి, అమలు చేయలేమని నిర్ణయించిన తరువాతే రుణమాఫీ ప్రక టించలేదన్నారు. తాను మేధావినని, ఆర్థిక శాస్త్రవేత్తనని చెప్పుకునే చంద్రబాబు నాడు రుణమాఫీ ప్రకటించి, నేడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి ధాటికి తట్టుకోలేరన్న విషయం చంద్రబాబుకు తెలిసి కేవలం అధికారం కోసమే మోసపూరిత వాగ్దానాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబునాయుడు రోజుకో వాగ్దానం చేస్తున్నాడన్నారు. చేసిన వాగ్దానాలు మరచి రాజధాని పేరుతో ప్రజలకు రంగుల ప్రపంచాన్ని చూపుతున్నాడని ఆరోపించారు. ప్రజలకు ముందు ఎన్నికల్లో ప్రకటించిన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. చంద్రబాబు మోసగాడు : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రజలను మోసం చేసి సీఎం అయిన చంద్రబాబు మోసగాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చి ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. అన్ని రకాల వ్యాపారులు కోటీశ్వరులవుతున్న తరుణంలో అందరికీ తిండి పెట్టే ధాన్యం పండించే రైతన్నలు దిక్కులేని వారవుతున్నారన్నారు. చంద్రబాబునాయుడ్ని నమ్మినందుకు అన్నదాతలు బాధపడుతున్నారన్నారు. పేదలు కూడా ఉన్నత విద్య చదవాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఇదేం న్యాయమని అడిగితే విద్యార్థులని చూడకుండా పోలీసులచే చితకబాదించాడన్నారు. అన్ని వర్గాల ప్రజలు నమ్మి చంద్రబాబునాయుడికి ఓటేస్తే నేడు వారందరినీ విస్మరించి నయవంచకుడిగా మారాడన్నారు. దాదాపు 200 వాగ్దానాలు చేశాడని, ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేద న్నారు. ప్రజలను మోసం చేయాలని చూస్తే తిరగబడతారని, తిరగబడితే సీఎం కుర్చీ కూడా ఉండదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రకటించిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ శేషుశ్రీలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఎంపీ, జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు జయరామయ్య కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహరావు, కొండారెడ్డి, నాయకులు కలువ బాలశంకర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, షేక్ అల్లాబక్షు, షేక్ కరీముల్లా, బొంతా హరిబాబుయాదవ్, బిట్రగుంట నారాయణ, రవికుమార్, విద్యార్థి విభాగం నాయకుడు షేక్ కరీముల్లా, యామాల మోహన్, మాల్యాద్రియాదవ్ పాల్గొన్నారు. -
మెట్ట ప్రాంత అభివృద్ధే ధ్యేయం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అనుమసముద్రంపేట: వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న మెట్టప్రాంత అభివృద్ధే తమ ధ్యేయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మం డలంలోని గుడిపాడు చెరువు వద్ద జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి మంగళవారం ఆయన సోమశిల ఉత్తర కాలువ ద్వారా వస్తున్న నీటిని చెరువులోకి వదిలారు. ఉత్తరకాలువ ద్వారా సాగునీటిని గుడిపాడు చెరువుకు వదిలేందుకు వచ్చిన ఎంపీ మేకపాటి, బొమ్మిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డిలకు గుడిపాడు రైతులు ఘనస్వాగతం పలికారు. చెరువులోతట్టులో ఉన్న ఉత్తర కాలువ వద్దకు తీసుకెళ్లారు. తూము వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిం చారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నాయకుడు కన్నబాబు కొబ్బరికాయలు కొట్టి నీటిని విడుదల చేశారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ మండలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం నుంచి ఉత్తరకాలువ ద్వారా ఈ ఏడాది గుడిపాడు చెరువు వరకు సాగునీరు ఇవ్వాలని తలచామన్నారు. ప్రాజెక్ట్‌కు నీళ్లు రావడంతో గుడిపాడు చెరువు వరకు సరఫరా చేసే అవకాశం కలిగిందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఉత్తర కాలువ జలాల కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు ప్రస్తుతం కొంత మేరకు నెరవేర్చగలిగామన్నారు. మిగిలిన గ్రామాల పొలాలకూ భవిష్యత్‌లో నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. చౌటభీమవరం చెరువు వద్ద లిఫ్టు ఇరిగేషన్ ద్వారా చెరువుకు నీళ్లు ఇవ్వాలని అధికారులకు తెలిపామన్నారు. జెడ్పీటీసీ కుదారి హజరత్తమ్మ, గుడిపాడు సర్పంచ్ సుజాత, సొసైటీ డెరైక్టర్లు రమణారెడ్డి, పిచ్చిరెడ్డి, వాటర్‌షెడ్ మాజీ అధ్యక్షుడు దామెర హజరత్తయ్య, ఎంపీటీసీ దేవరాల హజరత్త య్య, వైఎస్సార్సీపీ నాయకులు అల్లారె డ్డి సతీష్‌రెడ్డి, టి.దయాకర్‌రెడ్డి, ఇం దూరు శేషారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, సుబ్బరామిరెడ్డి, పఠాన్ ఖాదర్, వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, రమణారెడ్డి,మండల కో-ఆప్షన్ సభ్యుడు రియాజ్‌అహ్మద్ టీడీపీ నాయకులు రమేష్‌రెడ్డి, మాల్యాద్రి నాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నేటి ధర్నాను విజయవంతం చేద్దాం
నెల్లూరు (సెంట్రల్): ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద బుధవారం నిర్వహించనున్న ధర్నాను ఐక్యంగా విజయవంతం చేద్దామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టి ఇప్పుడు పట్టించుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల పక్షాన చేస్నున్న ఈ ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావాలని ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. అధికారులు నిష్పక్షపాతంగావ్యవహరించాలి ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదని ఎంపీ అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయన్నారు. అధికారులు మాత్రం ఎవరికీ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ అండతో పనిచేస్తున్నట్లుగా ఉందన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి సంబంధించి కొన్ని కమిటీలను ఎంపీ రాజమోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్సీపీ జిల్లా క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని సర్వేపల్లికి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఆత్మకూరుకు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను సూళ్లూరుపేటకు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నెల్లూరు రూరల్‌కు, ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్‌యాదవ్‌ను నెల్లూరుసిటీ క్రమ శిక్షణా కమిటీలో నియమించారు. జిల్లా అధికార ప్రతినిధులు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), పొట్టేళ్ల శిరీష (వెంకటగిరి), బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి (నెల్లూరు రూరల్), వీరి చలపతి (కోవూరు), మల్లు సుధాకర్‌రెడ్డి (ఆత్మకూరు), నల్లపరెడ్డి రాజేంద్రకుమార్‌రెడ్డి (గూడూరు), పండిటి కామరాజు (కావలి), నాశిన నాగులు (గూడూరు), కట్టా సుధాకర్‌రెడ్డి (సూళ్లూరుపేట)లను నియమించారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం కొండా వెంకటేశ్వర్లు, ఎస్సీ విభాగం (ఆత్మకూరు), బండ్ల అనిత, మహిళా విభాగం (ఉదయగిరి), బాపట్ల వెంకటపతి , ఎస్టీ విభాగం (కావలి), సూరూ శ్రీనివాసులురెడ్డి , రైతు విభాగం (కోవూరు), గొల్లపూడి ప్రసన్న శ్రావణ్ కుమార్ , విద్యార్థి విభాగం (నెల్లూరు నగరం), సయ్యద్ హమ్జా హుస్సేన్ , మైనార్టీ విభాగం (నెల్లూరు నగరం), మందా బాబ్జి , ట్రేడ్ యూనియన్ (నెల్లూరు రూరల్), దాసరి భాస్కర్‌గౌడ్ , బీసీ విభాగం (సర్వేపల్లి), నెలబల్లి భాస్కర్‌రెడ్డి, సేవాదళ్ విభాగం (గూడూరు), చల్లా మోహన్ , వికలాంగుల విభాగం(గూడూరు), కిళిని అర్ముగం, మత్య్సకారుల విభాగం (సూళ్లూరుపేట), సింగంశెట్టి భాస్కరరావు, చేనేత విభాగం(వెంకటగిరి), చీమల రమేష్‌బాబు, సాంస్కృతిక విభాగం (కోవూరు), ముతుకుండు వెంకటరెడ్డి, ప్రచార విభాగం(ఉదయగిరి). ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
అహింసే గాంధీ మార్గం
ఇందుకూరుపేట/నెల్లూరు (సెంట్రల్) : ఇతిహాసాల్లోని అహింసా మార్గాన్ని జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శంగా తీసుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని విశ్లేషకులు చెబుతుంటారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్‌తో కలసి ఆదివారం నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ నుంచి పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ చైర్మన్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వందేగాంధేయం పాదయాత్రలో ఎంపీ 13 కిలోమీటర్లు (గాంధీ ఆశ్రమం వరకు) నడిచారు. అనంతరం ఆశ్రమంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆయుధం ధరించకుండా మహాసంగ్రామం జరిగిందన్నారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ప్రపచంలోనే అతి పెద్ద రెండో దేశమైన మనకు సత్యం, అహింసా మార్గాన గాంధీజీ స్వాతంత్య్రం తెచ్చారన్నారు. ఇది సామాన్య విషయం కాదన్నారు. గాంధీజీ చెప్పిన సత్యం, అహింసా మార్గాన్ని అనుసరిస్తే విజయం సాధించగలమని ఎంపీ అన్నారు. ప్రధాని మోడీ చెప్పిన స్వచ్ఛభారత్ గురించి గాంధీజీ ఎన్నడో పేర్కొన్నారన్నారు. కనీస అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడం విచారకరమన్నారు. అందుకే ప్రధాని మోడీ ఐదేళ్లలో రెండు లక్షల కోట్టు వెచ్చించైనా ప్రతి పేదకుటుంబానికి మరుగుదొడ్లు కల్పించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛభారత్ చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరు పారిశుధ్యంతోపాటు చెట్లు పెంపకాన్ని చేపట్టాలని కోరారు. రాజకీయంలో ఎక్కువగా కక్ష సాధింపుతో ఉంటారన్నారు. తాను మాత్రం ఎవరిపై పనికట్టుకొని చెడు చేయనన్నారు. తన దగ్గరకు వచ్చిన వారెవరైనా ఇతరులకు ఇబ్బందిలేని పని అయితే చేసి పెడతానన్నారు. ఇతరులకు వీలైనంత సహాయం చేసినప్పుడే జీవితం ధన్యమవుతుందని ఎంపీ పేర్కొన్నారు. స్ఫూర్తి కలిగించిన గజల్ గజల్ శ్రీనివాస్ అలపించిన గీతాలు స్ఫూర్తికలిగించాయి. అందరినీ ప్రేమతో పలకరించు..మరి ఈదారిన వస్తావో రావో...,ఉందో లేదో స్వర్గం నాపుణ్యం నా కిచ్చై..సర్వం నీకిస్తా..నాబాల్యం నాకిచ్చై తదితర గీతాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పూజ్యబాపూజీ నడయాడిన నేల,సత్యగ్రహ ఉద్యామాలకు ఊపిరొదిలిన పినాకిని సత్యగ్రహ ఆశ్రమాన్ని భావితరాలకు తెలియజేయలాన్న ఉద్దేశంతో శాంతి పాదయాత్ర చేపట్టామన్నారు. గాంధీ ఆశ్రమానికి క్యూలు కట్టే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. ఆశ్రమం నిర్వాహకులు శ్రీనివాస్‌కు మెమోంటో ఆందజేశారు. అనంతరం మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ ఆశ్రమానికి లక్ష విరాళం అందజేశారు. తొలుత శ్రీనివాస్, ఎంపీ రాజమోహన్‌రెడ్డి ఆశ్రమంలో రెండు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ కన్వీనర్ గణేశం కృష్ణారెడ్డి, ఏవీ సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, శివరామయ్య, గూడూరు లక్ష్మీ, నారాయణ, రవీంద్రరెడ్డి, సుబ్రహ్మణ్యం, డైట్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఆశ్రమ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రమైన వాతావరణం అవసరం
నెల్లూరురూరల్ : అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ క్రాంతినగర్, 38వ డివిజన్ పొట్టేపాళెంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఐదేళ్లలో అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. పేద కుటుంబాల్లోని పిల్లలందరూ చదువుకోవాలన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలెందరో మేధావులు అయ్యారన్నారు. ప్రస్తుత ప్రధాని కూడా ఒకప్పుడు పేదవాడేనని పేర్కొన్నారు. అర్హులకు ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చూస్తామన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. రైతు, డ్వాక్రా, రుణాల మాఫీ, యువకులకు నిరుద్యోగ భృతి హామీని సీఎం ఆచరణలో అమలు చేయాలన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. పొట్టేపాళెం హైస్కూల్లో అదనపు గదులు మంజూరు చేయాలని బొమ్మిరెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరడంతో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుంటే వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి తప్ప మిగతా సమయాల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు. అర్హులైన పింఛన్‌దారుల్లో ఒక్కరికి తొలగించినా సహించబోమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రి నారాయణ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పజల కష్టాలు తెలుసుకునేందుకు ఎల్లప్పుడు వారికి అం దుబాటులో ఉంటామన్నారు. పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉంటామన్నారు. అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. 37వ డివిజ న్లో కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, లేబూరు పరమేశ్వరరెడ్డి, ఏకసిరి ప్రశాంత్‌కిరణ్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటివెంకటేశ్వరరావు, నాయకులు బుర్రా వెంకటేశ్వర్లుగౌడ్, మహేష్ పాల్గొన్నారు. వాటర్‌ప్లాంట్ ప్రారంభం పొట్టేపాళెంలో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు లాంఛనప్రాయంగా ప్రారంభించారు. -
‘జన-ధన’తో పేదలకు లబ్ధి
నెల్లూరు(పొగతోట): ప్రధానమంత్రి జన-ధన యోజన పథకం ద్వారా నిరుపేదలకు లబ్ధి కలుగుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రధానమంత్రి జన-ధన యోజన పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు బ్యాంకింగ్ సేవలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గ్రామీణ నిరుపేదలు తమ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు. అప్పులు కట్టలేక ఆస్తులను కోల్పోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. జన-ధన యోజన పథకంతో నిరుపేద ప్రజలకు బ్యాంకుల్లో రుణాలు మంజూరవుతాయన్నారు. ఈ పథకాన్ని అద్భుతంగా రూపొందించారన్నారు. పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు అకౌంట్లు తెరుస్తారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అకౌంట్ ప్రారంభించిన ఖాతాదారులకు రూ.1.35 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుందన్నారు. ప్రజలతో త్వరగా బ్యాంకు అకౌంట్స్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధార్, రేషన్‌కార్డు ఉంటే అకౌంట్ ప్రారంభించవచ్చన్నారు. కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 60 ఏళ్లలో బ్యాంకులు అమలు చేసిన పథకాల్లో జన-ధనయోజన పథకం కీలకమైందన్నారు. మూడు నెలల్లో అందరితో ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎల్డీఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి జన-ధన యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారన్నారు. రెండు వేల జనాభా కలిగిన 221 గ్రామాల్లో బ్యాంక్ వ్యాపార ప్రతినిధులను నియమించామన్నారు. 1500ల లోపు జనాభా కలిగిన 895 గ్రామాల్లో బీసీలను నియమించి బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పధకంలో ఆరు స్థాయిలు ఉన్నాయన్నారు. అనంతరం అకౌంట్స్ ప్రారంభించిన ఖాతాదారులకు బ్యాంక్ బుక్స్, ఇన్సూరెన్స్ బాండ్లు, బీసీలకు కిట్స్ అందజేశారు. కార్యక్రమం ముగిసి అధికారులు వెళ్లిపోయిన తర్వాత నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిండికేట్ బ్యాంక్ డీజీఎం కె. శ్రీనివాసులు, నాబార్డు ఏజీఎం వివేకానంద, డీఎస్ఓ శాంతకుమారి, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వరరావు, వివిధ బ్యాంక్ అధికారులు, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం
నాయుడుపేట టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయుడుపేటలో శనివారం ఘనస్వాగతం లభించింది. పార్లమెంట్ సమావేశాల అనంతరం మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు స్థానిక గోమతి సెంటర్లో స్వాగతం పలికారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు సత్కరించారు. రాజమోహన్‌రెడ్డి వెంట ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్‌ను కూడా అభినందించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, అవి పరిష్కారమయ్యేందుకు పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మండల పరిధిలోని ఎన్నికల ఫలితాలపై నాయకులతో కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు సుందరరామిరెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, పోతిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నవీన్‌కుమార్‌నాయుడు, అన్నమనేని రామకృష్ణ, పాదర్తి హరనాథ్‌రెడ్డి, అత్తలపాళెం మధురెడ్డి, పేట చంద్రారెడ్డి, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గంధవల్లి సిద్ధయ్య, మైలారి నాగరాజు, జేష్టాది అంజనీ, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, ఆబోతుల బాబు, దుప్పల రవీంద్ర, షేక్ షబ్బీర్‌భాషా,జలదంకి రాజగోపాల్‌రెడ్డి,పట్టుకోట రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఘటనా స్థలాన్ని సందర్శించిన YSRCP బృందం
-
సమైక్య శంఖారావం సభకు తరలిరండి
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ శంఖారావం సభపై ప్రజల నుంచి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోందన్నారు. పార్టీలకతీతంగా ప్రజలతో పాటు వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు వచ్చేలా కృషి చేయాలని నేతలకు సూచించారు. శంఖారావం సభకు సంబంధించి తాను వైఎస్సార్, నెల్లూరు జిల్లాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. రాయలసీమలోని నాలుగుజిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి సభకు భారీగా జనం తరలిరానున్నారన్నారు. తెలుగు ప్రజల సమైక్యతను ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పేలా సభ సాగుతుందన్నారు. రాజకీయ కారణాలతోనే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. తెలంగాణలో 10 సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరికాదన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే ఒప్పుకునేది లేదంటూ తమ పార్టీ ఇచ్చిన లేఖలో స్పష్టం చేశామన్నారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ కాదని, ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నాయకులు డాక్టర్ బాలకొండయ్య, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంఖారావం వాణిని ఢిల్లీకి వినిపించాలి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం వాణిని ఢిల్లీకి వినిపించాలని వైఎస్సార్సీపీ పొలిటికల్ ఎఫైర్స్‌కమిటీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని తన అతిథిగృహంలో సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శంఖారావం సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా జరిగే సభకు సమైక్యవాదులంతా తరలిరావాలన్నారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వైఎస్సార్సీపీ తరపున విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా తెలుగు ప్రజలను విభజించాలనుకోవడం అన్యాయమన్నారు. కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని చంద్రబాబు కోరడం దారుణమన్నారు. పాలకులు కేవలం హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, మిగిలిన ప్రాంతాలపై శీతకన్ను వేశారని మేకపాటి మండిపడ్డారు. సమైక్య శంఖారావం సభను తెలంగాణవాదులు అడ్డుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. -
అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేం దుకు కృషి చేస్తామని ఎం పీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులు చేస్తున్న పోరు ఆదర్శనీయమన్నారు. అక్టోబర్ 2 నుంచి పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 13 జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్సీపీ లక్ష్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా, తెలుగు జాతి ప్రజల ఐక్యతే లక్ష్యంగా పోరాటంలో ముందుకు సాగుతామని చెప్పారు. -
'నాతోపాటు జగన్ రాజీనామాను ఆమోదించండి'
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాను ఆమోదించవలసింది ఆయన ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరనున్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ ఆగస్ట్ 10న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ అయిదును స్పీకర్ ఫార్మాట్లోనే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపినట్లు మేకపాటి తెలిపారు. నిర్బంధంలో ఉండి కూడా వైఎస్ జగన్ తన రాజీనామాను ఫాక్స్ చేశారన్నారు. అన్ని రోజులుగా స్పీకర్ మీరాకుమార్ స్పందిస్తారని అనుకున్నామని... అయితే వారు స్పందించనందునే...తాను స్పీకర్ వద్దకు వెళుతున్నానన్నారు. రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు. స్పీకర్ అపాయింట్మెంట్ అడిగామని, సాయంత్రంలోగా ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. విభనపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మేకపాటి వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పడుతోందని...విభజనపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని, ఒక పద్ధతి, ఒక విధానం లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారన్నారు. తనను గెలిపించిన ప్రజలకు బాబు ద్రోహం తలపెట్టారని, ఆయనలాంటి వ్యక్తుల మానసిక స్థితిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
'తెలంగాణ లేఖను బాబు వెనక్కి తీసుకోవాలి'
నెల్లూరు : తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబునాయుడు వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తన లేఖను వెనక్కి తీసుకున్న తర్వాతే సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్రను చేపట్టాలన్నారు. షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. ఉదయం పదిగంటలకు ఆత్మకూరులో సాయంత్రం నాలుగు గంటలకు కావలిలో బహిరంగ సభ జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే షర్మిల బస్సుయాత్ర 10వ తేదీ ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కనిగిరి, సాయంత్రం 4.00 గంటలకు మార్కాపురం బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం 11వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రవేశించి ఉదయం 10.00 గంటలకు వినుకొండ, సాయంత్రం 3.00 గంటలకు రేపల్లెలో జరిగే సభలో ఆమె మాట్లాడతారు. -
విజయమ్మ దీక్షకు బాసటగా.. ఐదో రోజుకు ఆమరణ దీక్షలు
కోవూరులో ప్రసన్నకుమార్, కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి, రాయదుర్గంలో భారతి, కడపలో అవినాష్, పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణ, తాడిపత్రిలో నర్సింహయ్య ఆమరణ దీక్షలు, కదిరిలో ఇస్మాయిల్ నిరశన, జంగారెడ్డిగూడెంలోఆదివిష్ణు ఆమరణ దీక్ష భగ్నం సాక్షి నెట్వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ, కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్ బాషా, నాగిరెడ్డి, కర్నూలులో మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు గురువారం నాటికి నాలుగురోజులు పూర్తయ్యాయి. జంగారెడ్డిగూడెంలో రాఘవరాజు ఆదివిష్ణు ఆమరణ నిరాహారదీక్షను గురువారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కదిరిలో పార్టీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ రెండోరోజు ఆమరణ దీక్ష కొనసాగించారు. రాయదుర్గంలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు భారతికి అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. కడప కలెక్టరేట్ ఎదుట దీక్షలకు జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీతోపాటు సీఈసీ సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్త నెలవెల సుబ్రమణ్యంలు సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, రాప్తాడులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఇదిలాఉండగా, విజయమ్మ దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని అన్నిజిల్లాల్లో రిలేదీక్షలు జరుగుతున్నాయి. పారీ నేతలు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షలతోపాటు, రిలే దీక్షలకు పెద్దఎత్తున మహిళలు, యువత తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు.