ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
అనుమసముద్రంపేట: వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న మెట్టప్రాంత అభివృద్ధే తమ ధ్యేయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మం డలంలోని గుడిపాడు చెరువు వద్ద జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి మంగళవారం ఆయన సోమశిల ఉత్తర కాలువ ద్వారా వస్తున్న నీటిని చెరువులోకి వదిలారు. ఉత్తరకాలువ ద్వారా సాగునీటిని గుడిపాడు చెరువుకు వదిలేందుకు వచ్చిన ఎంపీ మేకపాటి, బొమ్మిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డిలకు గుడిపాడు రైతులు ఘనస్వాగతం పలికారు. చెరువులోతట్టులో ఉన్న ఉత్తర కాలువ వద్దకు తీసుకెళ్లారు.
తూము వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిం చారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నాయకుడు కన్నబాబు కొబ్బరికాయలు కొట్టి నీటిని విడుదల చేశారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ మండలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం నుంచి ఉత్తరకాలువ ద్వారా ఈ ఏడాది గుడిపాడు చెరువు వరకు సాగునీరు ఇవ్వాలని తలచామన్నారు.
ప్రాజెక్ట్‌కు నీళ్లు రావడంతో గుడిపాడు చెరువు వరకు సరఫరా చేసే అవకాశం కలిగిందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఉత్తర కాలువ జలాల కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు ప్రస్తుతం కొంత మేరకు నెరవేర్చగలిగామన్నారు. మిగిలిన గ్రామాల పొలాలకూ భవిష్యత్‌లో నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
చౌటభీమవరం చెరువు వద్ద లిఫ్టు ఇరిగేషన్ ద్వారా చెరువుకు నీళ్లు ఇవ్వాలని అధికారులకు తెలిపామన్నారు. జెడ్పీటీసీ కుదారి హజరత్తమ్మ, గుడిపాడు సర్పంచ్ సుజాత, సొసైటీ డెరైక్టర్లు రమణారెడ్డి, పిచ్చిరెడ్డి, వాటర్‌షెడ్ మాజీ అధ్యక్షుడు దామెర హజరత్తయ్య, ఎంపీటీసీ దేవరాల హజరత్త య్య, వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లారె డ్డి సతీష్‌రెడ్డి, టి.దయాకర్‌రెడ్డి, ఇం దూరు శేషారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, సుబ్బరామిరెడ్డి, పఠాన్ ఖాదర్, వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, రమణారెడ్డి,మండల కో-ఆప్షన్ సభ్యుడు రియాజ్‌అహ్మద్ టీడీపీ నాయకులు రమేష్‌రెడ్డి, మాల్యాద్రి నాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మెట్ట ప్రాంత అభివృద్ధే ధ్యేయం
Published Wed, Nov 5 2014 1:58 AM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM
Advertisement
Advertisement