చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
► నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళుదాం
► నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్) : సీఎం చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేర్చకపోవడమే ఇందుకు నిదర్శనమని నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెబుదామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నెల్లూరులోని ఓ కల్యాణమండపంలో బుధవారం నిర్వహించిన నెల్లూరు సిటీ నియోజకవర్గ నవరత్నాల సభలో ఎంపీ ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ కుటుంబం చేసేవే చెబుతుందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో అధికారంలోకి వచ్చే ముందు ఉచి త విద్యుత్, పెన్షన్ పెంపు పథకాలను చెప్పారన్నారు. అధికారంలోకి రాగానే తొలుతగా అవి రెండుచేసి చూపించారన్నారు. ఇప్పుడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చెప్పిన పథకాలను అ«ధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేస్తారన్నారు.
కష్టపడి పనిచేద్దాం
సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుయార్ మా ట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం ప్రతిఒక్కరం కష్టపడి పనిచేద్దామన్నారు. నంద్యాలలో రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభాలకు గురిచేసి గెలిచారన్నారు. దానిని ఎవరూ గెలుపుగా భావించడం లేదన్నారు. లోకేష్ కాబోయో ముఖ్య మంత్రి అని చెప్పే టీడీపీ నాయకులు ఎందుకు ఆయన్ను నంద్యాలలో ప్రచా రానికి తీసుకునిపోలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కొన్ని చానళ్లు పనిగట్టుకుని అబద్దాలు ప్రచా రం చేస్తున్నాయన్నారు. ఇరవై ఏళ్లు శిక్ష పడ్డ డేరా బాబాకు గురువు చంద్రబాబు అని చెప్పారు.
తనకు ఉన్నది నిజాయితీ అన్నారు. ఎవరి వద్ద రూ పాయి ఆశించకుండా పనిస్తున్నట్లు తెలిపారు. తనపై కొన్ని పత్రికలు, కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. నోటీసులు ఇచ్చో, పత్రికల్లో అబద్దపు కథనాలు రాసో తనను దెబ్బకొట్టలేవన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు హుస్సేన్, కార్పొరేటర్లు ఓబిలి రవి చం ద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, వేలూరు సుధారాణి, దేవరకొండ అశోక్, నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, మునీర్ సిద్దిక్, కొణిదల సుధీర్, దార్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.