ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
సాక్షి, గుంటూరు : ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు రకరకాల కుయుక్తులు పన్నుతారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల లిస్టులో అక్రమాలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. చంద్రబాబుని సహించే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసిన వ్యక్తి చంద్రబాబే అని ఎంపీ విమర్శలు గుప్పించారు. అంతేకాక కాంగ్రెస్ నేత చిదంబరంతో చీకటి చర్యలు జరిపి బాబు రాష్ట్రాన్ని విడగొట్టారని మేకపాటి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా జీవనాడి.. దాన్ని సాధించకుండా బాబు తన స్వార్థానికి బలి చేశారని విమర్శించారు. రాజకీయ స్వార్థం, లొసుగులు, ఆర్థిక నేరాల వల్ల హోదాను సీఎం అడ్డుకున్నారని ఎంపీ మేకపాటి ధ్వజమెత్తారు.
‘కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తునే ఆశించారు. మేము ప్రత్యేక హోదా కోసం మా ఎంపీ పదవులకు రాజీనామా చేశాం. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ జగన్‌లోని ధైర్యం, ఔదార్యం, సంకల్పబలాన్ని నేను దగ్గరగా చూశాను. అందుకే మొదటి నుంచి నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment