ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం | MP Is Very Happy With Social Services | Sakshi
Sakshi News home page

ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం

Published Wed, Jun 6 2018 2:52 PM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

MP Is Very Happy With Social Services - Sakshi

దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తున్న రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి  

సాక్షి,నెల్లూరు రూరల్‌ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన చొరవతో రూరల్‌ నియోజకవర్గంలో 68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేసినట్లు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. స్థానిక కొండాయపాళెం రోడ్డులోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ నిధులతో సమకూర్చిన ఐదు బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మేకపాటి చొరవతో సాధ్యమైందన్నారు. ఒక్కో ట్రైసైకిల్‌ విలువ రూ.37 వేలు ఉంటుందని, ఇందులో ఎంపీ గ్రాంట్‌ కింద రూ.12 వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రూ.25 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సహకారాలతో 500 మంది దివ్యాంగులకు చేయూత నిచ్చామన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 


విలువలకు కట్టుబడిన ఎంపీ మేకపాటి 
దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆహ్వానించామని, అయితే తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీగా రాజీనామా చేశానని, స్పీకర్‌ ఆమోదించినా, ఆమోదించకున్నా తాను ఎంపీని కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానిని వెంటనే జరపించాలని ఎంపీ కోరినట్లు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకమని కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement