physically challenged persons
-
దివ్యాంగులపై ప్రత్యేక అభిమానం
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి దివ్యాంగులంటే ప్రత్యేక అభిమానం. ఇటీవల మర్రిపాడులో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈర్లపాడుకు చెందిన దివ్యాంగుడు రవిచంద్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్దకు వచ్చి తన సమస్యను విన్నవించడంతో వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అతనితో కలిసి సెల్ఫీ తీసుకుని దివ్యాంగులపై తనకు అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి: (అజాత శత్రువు) -
ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం
సాక్షి,నెల్లూరు రూరల్ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన చొరవతో రూరల్ నియోజకవర్గంలో 68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేసినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. స్థానిక కొండాయపాళెం రోడ్డులోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ నిధులతో సమకూర్చిన ఐదు బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మేకపాటి చొరవతో సాధ్యమైందన్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ రూ.37 వేలు ఉంటుందని, ఇందులో ఎంపీ గ్రాంట్ కింద రూ.12 వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రూ.25 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సహకారాలతో 500 మంది దివ్యాంగులకు చేయూత నిచ్చామన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువలకు కట్టుబడిన ఎంపీ మేకపాటి దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆహ్వానించామని, అయితే తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీగా రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించినా, ఆమోదించకున్నా తాను ఎంపీని కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానిని వెంటనే జరపించాలని ఎంపీ కోరినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. -
వారిని బదిలీ చేయొద్దు
వికలాంగ సంతానం ఉన్న ఉద్యోగులపై కేంద్రం న్యూఢిల్లీ: విక లాంగ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సాధారణ బదిలీల నుంచి మినహాయిం చాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, అనుబంధ విభాగాలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వికలాంగులైన పిల్లలకు చికిత్స లేదా మరే ఇతర వైద్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకే ఆ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొంది. బదిలీపై వెళ్లేందుకు నిరాకరించిన పక్షంలో.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ ఆ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తేవొద్దని స్పష్టంచేసింది. సాధారణంగా వికలాంగులైన పిల్లలకు దీర్ఘకాలిక చికిత్సలు అవసరం అవుతుంటాయని, ఉన్నట్టుండి బదిలీ చేస్తే ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఉద్యోగులు గతంలోనే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి పీకే మిశ్రా నియమితులయ్యారు. మిశ్రా 1972వ బ్యాచ్ గుజరాత్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. 2001-04 మధ్య మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.