వారిని బదిలీ చేయొద్దు | no transfers to families of physically challenged persons | Sakshi
Sakshi News home page

వారిని బదిలీ చేయొద్దు

Published Wed, Jun 11 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

no transfers to families of physically challenged persons

వికలాంగ సంతానం ఉన్న ఉద్యోగులపై కేంద్రం
 
 న్యూఢిల్లీ: విక లాంగ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సాధారణ బదిలీల నుంచి మినహాయిం చాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, అనుబంధ విభాగాలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వికలాంగులైన పిల్లలకు చికిత్స లేదా మరే ఇతర వైద్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకే ఆ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొంది. బదిలీపై వెళ్లేందుకు నిరాకరించిన పక్షంలో.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ ఆ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తేవొద్దని స్పష్టంచేసింది. సాధారణంగా వికలాంగులైన పిల్లలకు దీర్ఘకాలిక చికిత్సలు అవసరం అవుతుంటాయని, ఉన్నట్టుండి బదిలీ చేస్తే ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఉద్యోగులు గతంలోనే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.  


 ప్రధాని అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా


 న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి పీకే మిశ్రా నియమితులయ్యారు. మిశ్రా 1972వ బ్యాచ్ గుజరాత్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. 2001-04 మధ్య మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement