pk mishra
-
మంకీపాక్స్‌పై WHO హెచ్చరికలు.. అప్రమత్తమైన కేంద్రం
కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవర పెడుతున్న మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ (ఎంపాక్స్)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మంకీ పాక్స్ ఆఫ్రికా నుంచి పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చేరడంతో మోదీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్ట్18) మంకీ పాక్స్‌పై ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పీకే మిశ్రా జారీ చేశారు. మంకీ పాక్స్‌ను ఎదుర్కొనే అంశంతో పాటు ముందుగానే రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు.మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్యఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్య 18,737కి చేరింది. ఈ ఒక్క వారంలోనే 1200 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లాడ్-1తో పాటు అన్నీ రకాల వైరస్‌లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 545 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 97 శాతం కేసులు, మరణాల కేసులో కాంగోలో నమోదవుతుండగా..ఈ ఒక్క వారంలో 202 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా..మరణాల రేటు 8.2శాతంగా ఉంది. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39కేసులు నిర్ధారణయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్థాన్లలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి.డబ్ల్యూహెచ్ఓ అత్యవసర స్థితిమంకీపాక్స్ విజృంభణ వేళ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే అంతర్జాతీయంగా ఆందోళనలతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తొలిదశలో ఆ కమిటీ సిఫార్స్‌లను ప్రచురిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఎన్జీవోలతో కలిసి టీకా ఉత్పత్తులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు దక్షిణాఫ్రికాలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ దేశాల ప్రతినిధులు ఖండంలో కోరలు చాస్తున్న ఎంపాక్స్‌పై చర్చించారు. డబ్ల్యూహెచ్ఓతో పాటు పలు దేశాలు వ్యాధి నియంత్రణా సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములు, మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్ధించారు. ప్రభావ దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు. -
ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ పీకే మిశ్రాను కొనసాగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మిశ్రా పునరి్నయామకం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచి్చందని తెలిపింది. వీరితోపాటు, అమిత్ ఖరే, తరుణ్ కపూర్లను ప్రధానమంత్రి సలహాదారులుగా జూన్ 10 నుంచి వచ్చే రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో మళ్లీ కొనసాగించాలని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. -
సుప్రీంకు ‘సాగు చట్టాల’పై నివేదిక
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను మార్చి 19వ తేదీన సీల్డ్ కవర్లో అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ విషయాన్ని కమిటీలోని సభ్యుడు పి.కె.మిశ్రా బుధవారం బయటపెట్టారు. మూడు కొత్త సాగు చట్టాల అమలుపై జనవరి 11న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీటిని అమలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మార్చి 19న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశామని పి.కె.మిశ్రా పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను న్యాయస్థానమే నిర్దేశిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు కమిటీ రైతు సంఘాలు, నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, మార్కెటింగ్ బోర్డులు తదితర భాగస్వామ్య పక్షాలతో 12 దఫాలు చర్చలు జరిపి, పలుమార్లు అంతర్గతంగా సమావేశమై నివేదికను రూపొందించింది. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయెల్ అన్నదాతల ప్రయోజనాలను కాపాడడం కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం తేల్చిచెప్పారు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కొత్త చట్టాల గురించి రైతులు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. వీటివల్ల మండీ వ్యవస్థకు ఎలాంటి నష్టం ఉండదన్న సంగతి రైతులకు తెలిసిందన్నారు. పార్లమెంట్ దాకా పాదయాత్ర కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మున్ముందు మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను దాదాపు ఖరారు చేసినట్లు మోర్చా నేతలు బుధవారం తెలియజేశారు. మే నెలలో పార్లమెంట్ వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర తేదీని ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ యాత్రలో రైతులతోపాటు మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు సైతం పాల్గొంటారని, వారంతా తమ పోరాటానికి మద్దతిస్తున్నారని రైతు సంఘం నాయకుడు గుర్నామ్‌సింగ్ చాదునీ చెప్పారు. పార్లమెంట్ వరకూ శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘జనవరి 26’ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమన్నారు. -
కాలుష్యాన్ని పర్యవేక్షించనున్న కేబినెట్ కార్యదర్శి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు ఆదివారం ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ, హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలతో కలిసి రోజువారీ కాలుష్య పరిస్థితులను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా.. మండిపోతున్న వ్యర్థాలు, నిర్మాణ పనుల కార్యకలాపాలు, పారిశ్రామిక, వాహనాల కాలుష్యంపై సమీక్షించారు. కాగా, కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 9 నుంచి ఒంటి గంట మధ్యలో 37 విమానాలను జైపూర్, అమృత్సర్, లక్నో, ముంబైలకు మళ్లించారు. -
వారంలో ఐఏఎస్‌ల పంపిణీ!
⇒ 15 రోజుల్లోగా అధికారుల నుంచి ‘స్వాపింగ్’కు దరఖాస్తుల స్వీకరణ ⇒ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది జాబితా ప్రకారమే పంపిణీ ⇒ఢిల్లీలో ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయం ⇒భేటీకి హాజరైన ప్రత్యూష్ సిన్హా, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. మరో వారం రోజుల్లో అధికారులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఉత్తర్వుల తర్వాత పక్షం రోజుల్లోగా అధికారుల నుంచి పరస్పర మార్పిడి(స్వాపింగ్)కి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వివరించాయి. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కొఠారీ పాల్గొన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇదివరకు ప్రకటించిన ముసాయిదా తుది జాబితా ప్రకారమే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఒకే బ్యాచ్‌లో ఉన్న అధికారులకేగాకుండా సీనియారిటీ ఆధారంగా మిగతావారికి కూడా స్వాపింగ్‌కు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు భేటీలో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది ముసాయిదా పంపిణీ జాబితాపై పలువురు అధికారులు ఇప్పటికే క్యాట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యర్శి పూనం మాలకొండయ్య, బీపీ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీలో పనిచేస్తున్న అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించారు. ఏపీలో ఉన్న శాంతికుమారి, వి.కరుణ తెలంగాణకు రావాలని కోరుకుంటున్నారు. ఈ అధికారులు స్వాపింగ్తో వారు కోరుకున్న రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. స్వాపింగ్ పూర్తయ్యాక అధికారులకు శాశ్వతంగా ఆ రాష్ట్ర కేడర్ కేటాయించాలని నిర్ణయించారు. -
వారిని బదిలీ చేయొద్దు
వికలాంగ సంతానం ఉన్న ఉద్యోగులపై కేంద్రం న్యూఢిల్లీ: విక లాంగ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సాధారణ బదిలీల నుంచి మినహాయిం చాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, అనుబంధ విభాగాలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వికలాంగులైన పిల్లలకు చికిత్స లేదా మరే ఇతర వైద్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకే ఆ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొంది. బదిలీపై వెళ్లేందుకు నిరాకరించిన పక్షంలో.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ ఆ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తేవొద్దని స్పష్టంచేసింది. సాధారణంగా వికలాంగులైన పిల్లలకు దీర్ఘకాలిక చికిత్సలు అవసరం అవుతుంటాయని, ఉన్నట్టుండి బదిలీ చేస్తే ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఉద్యోగులు గతంలోనే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి పీకే మిశ్రా నియమితులయ్యారు. మిశ్రా 1972వ బ్యాచ్ గుజరాత్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. 2001-04 మధ్య మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.