
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ పీకే మిశ్రాను కొనసాగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మిశ్రా పునరి్నయామకం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచి్చందని తెలిపింది.
వీరితోపాటు, అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌లను ప్రధానమంత్రి సలహాదారులుగా జూన్ 10 నుంచి వచ్చే రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో మళ్లీ కొనసాగించాలని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది.