ex ias officer
-
‘హిందువులను మోసం చేశారు, చంద్రబాబు, పవన్ రాజీనామా చేయాలి’
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని,. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది.తాజాగా లడ్డూ వివాదంపై మాజీ ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఘాటుగా స్పందించారు. శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను దెబ్బేతీసే విధంగా, టీటీడీ దేవస్థానంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచేలా ప్రయత్నించినందుకు ఇద్దరు బాధ్యులేనని పేర్కొన్నారు. హిందూవులను తమ అబద్దాలతో, మోసం చేసినందుకు పశ్చాతాపంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.Both @ncbn & @PawanKalyan have cheated Hindus by making misleading statements on lord Venkateshwara Prasadam.Both are responsible for creating a negative perception on #TTDevasthanams run temple & our faith.As repentance for their lies & cheating Hindus, they should resign.— PVS Sarma (@pvssarma) September 30, 2024 -
ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ పీకే మిశ్రాను కొనసాగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మిశ్రా పునరి్నయామకం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచి్చందని తెలిపింది. వీరితోపాటు, అమిత్ ఖరే, తరుణ్ కపూర్లను ప్రధానమంత్రి సలహాదారులుగా జూన్ 10 నుంచి వచ్చే రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో మళ్లీ కొనసాగించాలని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. -
ప్రధాని మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్లు లేఖ
తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 93 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తాము ఏ పార్టీ సభ్యులం కాదని, తమకు కేవలం రాజ్యాంగం మీద నమ్మకం ఉందని వారందరూ ఆ లేఖలో పేర్కొన్నారు. ''అభివృద్ధి పేరుతో లక్షద్వీప్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్రమైన ఆందోళన చెందుతూ ఈ లేఖ రాస్తున్నాం. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో లక్షద్వీప్ వాసుల నీతి, ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో ప్రతి అంశం కూడా లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధంగా ఉండడంతో పాటు ఏకపక్ష విధానంగా కొనసాగింది. ముసాయిదాను రూపొందించే సమయంలో లక్షద్వీప్ ప్రజలను కానీ, అక్కడి సమాజాన్ని కానీ సంప్రదించలేదు'' అంటూ మాజీ ఐఏఎస్లు పేర్కొన్నారు. చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. లక్షద్వీపంలో అలజడి! -
కొవ్వొత్తులు ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఇవ్వండి
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్నం నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 60 శాతం కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 వేల మందితో నిర్వహిస్తున్న 40 వేల కొవ్వొత్తుల ప్రదర్శనపై ఆయన విరుచుకుపడ్డారు. అక్కడ ప్రదర్శన నిర్వహించే బదులు కరెంటు లేనిచోట వాటిని పంచిపెడితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలో విద్యుత్ సరఫరాను వారం రోజుల్లోనే పునరుద్ధరించేశామని, ప్రకృతి విలయాన్ని టెక్నాలజీతో అడ్డుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కూడా ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా చెట్లు తొలగించుకున్నారు తప్ప, సర్కారు ప్రకటించిన 200 పొక్లెయిన్లు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అంటున్నారు.