మోడీ ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్ర
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ మాజీ చీఫ్ నృపేంద్ర మిశ్రను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆయన నియామకం బుధవారం నుంచే అమలులోకి వస్తుంది.
మిశ్ర నిక్కచ్చిగా, నిజాయితీగా వ్యవహరించే అధికారిగా, గంటల పాటు కష్టపడి పనిచేసే వ్యక్తిగా పేరొందారు. ఆయన సరళీకృత ఆర్ధిక విధానాలను, గట్టి నిర్ణయాలను సమర్థించే వ్యక్తి. ఆయన రాకతో విధానాల్లో కీలక మార్పులుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.
మిశ్ర 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. ఆయన మాజీ టెలికాం మంత్రి రాజా హయాంలో చేసిన 2 జీ స్పెక్ట్ర్రమ్ కేటాయింపులను గట్టిగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయన 2 జీ విచారణ సమయంలో సాక్ష్యం కూడా ఇచ్చారు.