nellore rural
-
నెల్లూరు రూరల్ లో సీసీ రోడ్ల నిర్మాణం
-
ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్.. గట్టి ఎదురుదెబ్బ!
ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీకి ద్రోహం చేసి ఫిరాయించారు. మరికొందరిని కూడా వెంట తీసుకెళ్ళారు. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీ ఇన్చార్జ్ ఫిరాయించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట వెళ్లిన నేతలు ఒక్కొక్కరుగా తిరిగి వెనక్కు వస్తున్నారు. తన వెంటే ఉన్నారనుకుంటూ వెనక్కు తిరిగి చూసుకునేలోపే వారు జంప్ చేస్తున్నారట. అధికార పార్టీ పన్నిన వ్యూహంతో ఫిరాయించిన ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శ్రీధరరెడ్డి వ్యవహారం తేడాగా ఉండటంతో పార్టీ నేతలు కొందరు రెండోసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినా.. ఆయన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూరల్ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా అనేకసార్లు తన అనుచరులకు కూడా చెప్పారట. అయితే, మూడోసారి టికెట్ రాదని గ్రహించిన కోటంరెడ్డి.. టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. పార్టీ నుంచి బయటికి వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే వెంట 10 మంది కార్పొరేటర్లు, నెల్లూరు మేయర్ స్రవంతి ఉన్నారు. కోటంరెడ్డికి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జీగా నియమించడంతో.. పార్టీలోని ఓ వర్గం ఆయనని వ్యతిరేకిస్తూ వచ్చింది. మేయర్ స్రవంతికి కూడా ప్రాధాన్యత తగ్గింది. రూరల్ ప్రజలు కూడా ఎమ్మెల్యేని పట్టించుకోవటం మానేశారు. దీనికి తోడు ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి.. మేయర్ స్రవంతి దంపతులతో కొంత గ్యాప్ వచ్చింది. మేయర్‌కి ప్రాధాన్యత లేకుండా గిరిధర్ రెడ్డి ప్రతీ విషయంలోనూ అడ్డు తగిలే వారని మేయర్ అనుచరులు చెబుతున్నారు. దీంతో మేయర్ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యేను నమ్మి వెంట వచ్చిన మేయర్‌ను ఎమ్మెల్యే సోదరుడు ఇబ్బంది పెట్టారట. గిరిధర్‌రెడ్డి విషయాన్ని మేయర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే ఆయన తమ్ముడికే మద్దతు ఇవ్వడంతో మనస్తాపానికి గురైన మేయర్ సొంత పార్టీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యేతో ఉండే మరో 8 మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి టచ్‌లోకి వచ్చేశారట. పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెనక్కు వచ్చేస్తామని వేగుల ద్వారా సంకేతాలు పంపిస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. అదాల ప్రభాకర్ రెడ్డి మార్క్.. ప్రజల నాడి తెలిసిన నేతగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి, ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై వారు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొడుతూనే.. ఒక్కొక్కరినీ పార్టీలోకి తెస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళని ఆహ్వానిస్తూ.. వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యే వెనుక ఉన్న వారందరూ.. బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా వచ్చేస్తున్నారు. దానికి తోడు రూరల్ ఇంచార్జీ గా ఉన్న ఎంపీ ఆదాల ప్రతి డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులు.. ఆదాల చేసి చూపించడం జనాల్లోకి బాగా వెళుతోంది. కోటంరెడ్డికి వెన్నుపోటు తప్పదు.. వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజక వర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ కేడర్ కూడా నమ్ముతోంది. టీడీపీలో ఉండే అసంతృప్తులే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వెన్నుపోటు పొడవడం పక్కా అని పార్టీలో చర్చ నడుస్తోంది. దానికి తోడు చంద్రబాబు అరెస్ట్‌తో క్యాడర్లో నైరాశ్యం పెరిగిపోవడం.. చంద్రబాబు అవినీతి చేశాడని కార్యకర్తలు కూడా బలంగా నమ్ముతూ ఉండటంతో.. వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ యత్నం కేసు
నెల్లూరు (క్రైమ్): తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డికి శుక్రవారం ఫోన్ చేసి వైఎస్సార్సీపీని వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్ రెడ్డి నిరాకరించడంతో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్యతో కలిసి కార్పొరేటర్ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయపాలెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తెలిపారు. -
కోటంరెడ్డికి మంత్రి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసని, ఆనాడు జగన్మోహన్రెడ్డి స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కి ఉండేది కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాతిక్రేయ సమావేశం నిర్వహించగా.. దానికి కౌంటర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు కాకాణి. పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయం. కానీ, వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం సరికాదు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు, కోటంరెడ్డిని ట్యాప్ చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు కోటంరెడ్డి. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకు ముందుకు వెళ్లొచ్చు కదా అని కాకాణి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్నిరోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు.. ఏమైంది?. అది ఆడియో రికార్డ్ అని తెలుసు కాబట్టే అవమానించారని డ్రామాలు ఆడుతున్నావు అంటూ కోటంరెడ్డిపై మండిపడ్డారు మంత్రి కాకాణి. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్. కోటంరెడ్డి నువ్వు వీరవిధేయుడివి కాదు.. వేరే వాళ్లకు విధేయుడివి. సీఎం జగన్ టికెట్ ఇచ్చారు కాబట్టే.. ఎమ్మెల్యే అయ్యావు. ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం కాదా?. సీఎం జగన్ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం. ఆ ఒక్కటే లేకపోతే.. మనమంతా జీరోలం. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతోందని కాకాణి జోస్యం పలికారు. -
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. బుధవారం వైసీపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ‘‘కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటాం?. అయినా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లను కాదు’’ అని సజ్జల స్పందించారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వ్యాఖ్యానించారు. అలాగే.. అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్న సజ్జల.. కొంతమందిని ఎలా లాక్కోవాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రకాశం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడని మాజీమంత్రి, వైఎస్సార్పీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ లేదు.. పాడు లేదు.. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం డ్రామాలు ఆడుతున్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు బాలినేని. ఫోన్ ట్యాప్ అయితే ఎమ్మెల్యే ఆనం ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రేపో ఎల్లుండో నెల్లూరు రూరల్ కి కొత్త ఇంచార్జి నియామకం ఉంటుందని, వాళ్లిద్దరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైస్సార్సీపీ లో నాయకులకు కొదవలేదు.. ఒకరు పోతే పది మంది తయారవుతారని బాలినేని కామెంట్ చేశారు. -
కాలనీలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నానాటికీ విస్తరిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 20వ డివిజన్లోని ఇస్కాన్ సిటీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో రోడ్డు సమస్యను ఆయనకు స్థానికులు తెలియజేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణానికి మేయర్ స్రవంతితో కలిసి శంకుస్థాపనను చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. ఆయా కాలనీల అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ మహేష్, నేతలు శ్రీనివాసరావు, మల్లికార్జున్‌యాదవ్, ఖాదర్‌బాషా, రమణయ్య, రవి, వెంకటరమణయ్య, విఠల్, డేవిడ్‌రాజు, కవిత, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక -
మానవత్వం చాటుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
కోటంరెడ్డికి సీఎం జగన్ పరామర్శ.. పనితీరుపై ప్రశంసల వర్షం
నెల్లూరు(సెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నెల్లూరు అపోలో వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న శ్రీధర్‌రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం ఫోన్ చేసి కోటంరెడ్డితో పలు విషయాలు చర్చించారు. అసలేమి జరిగింది, వైద్యులు ఏమి చెప్పారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా.. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోటంరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రూరల్ నియోజకవర్గంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం విషయాలపై చర్చించారు. చదవండి: (మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే: సీఎం జగన్) మొదటి విడత ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తి చేశామని, త్వరలోనే రెండో విడత ప్రారంభిస్తానని ముఖ్యమంత్రికి కోటంరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలు అనుభవిస్తున్న ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉందని అన్ని సర్వేల్లో అత్యున్నత గ్రాఫ్ కనిపించిందని కోటంరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రానున్న ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఇదే విధంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముఖ్యమంత్రి చెప్పారు. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు కూలీల దుర్మరణం
నెల్లూరు(వేదాయపాళెం): పనులకు వెళ్తున్న కూలీల బతుకులను రోడ్డు ప్రమాదం మింగేసింది. ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడడంతో.. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. నెల్లూరు రూరల్ మండలం సజ్జాపురం గ్రామ సర్పంచ్ అప్పకూటి పెంచలయ్య గొల్లకందుకూరులో పొలం కౌలుకు తీసుకుని పుచ్చ పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు రావడంతో మంగళవారం ఉదయం తన సొంత ట్రాక్టర్లో సజ్జాపురానికి చెందిన 12 మంది కూలీలను తీసుకుని పొలానికి బయలు దేరాడు. గొల్లకందుకూరు సమీపానికి వచ్చేసరికి చేపల చెరువు కట్ట మీదుగా వెళ్తున్న ట్రాక్టర్.. అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఇంజిన్‌తో పాటు ట్రాలీ నీళ్లల్లోకి పల్టీ కొట్టింది. డ్రైవర్‌తో సహా ట్రాక్టర్‌లోని కొందరు ప్రమాదాన్ని ముందే గుర్తించి.. కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నీళ్లల్లో ట్రాలీ మీద పడటంతో పాక కృష్ణవేణి(26), కిలారి హైమావతి(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), సర్పంచ్ అప్పకూటి పెంచలయ్య (60), తాండ్ర వెంకరమణమ్మ(19) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని.. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే ప్రమాద విషయం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో.. సజ్జాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
శాకంబరిగా రాజరాజేశ్వరి దేవి
సాక్షి, నెల్లూరు : ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకారంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అమ్మవారు శ్రీవిద్యవంచ కల్పగణపతి అలంకారంలో ఫల, కాయగూరలతో భక్తులను కటాక్షించారు. రాహుకాల పూజలు, రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరిగా దర్శనమివ్వడంతో దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి సహస్రనామార్చనలు, చండీహోమం, ఖడ్గమాల స్తోత్రపారాయణం, తదితర పూజలను నిర్వహించారు. అనివెట్టి మండపాన్ని ఫల, కాయగూరలతో సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి సుమారు ఐదు టన్నులకుపైగా ఫల, కాయగూరలతో అమ్మవారిని, ఆలయాన్ని తీర్చిదిద్దారు. రాజరాజేశ్వరి అమ్మవారి భక్తబృందం ఆధ్వర్యంలో కోలాటాలు, నృత్య ప్రదర్శనలను వేడుకగా నిర్వహించారు. సుమారు మూడువేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శాకంబరి అలంకారానికి ఉభయకర్తలుగా కొలపర్తి వెంకట రమేష్‌కుమార్, సువర్ణలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. పట్టువస్త్రాల సమర్పణ శాకంబరి అలంకారం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఎమ్మెల్యే తరఫున రాజరాజేశ్వరి అమ్మవారు, దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సుందరేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలను అందజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, చెక్కా సాయిసునీల్, మురళీకృష్ణయాదవ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం
సాక్షి,నెల్లూరు రూరల్ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన చొరవతో రూరల్ నియోజకవర్గంలో 68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేసినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. స్థానిక కొండాయపాళెం రోడ్డులోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ నిధులతో సమకూర్చిన ఐదు బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మేకపాటి చొరవతో సాధ్యమైందన్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ రూ.37 వేలు ఉంటుందని, ఇందులో ఎంపీ గ్రాంట్ కింద రూ.12 వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రూ.25 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సహకారాలతో 500 మంది దివ్యాంగులకు చేయూత నిచ్చామన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువలకు కట్టుబడిన ఎంపీ మేకపాటి దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆహ్వానించామని, అయితే తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీగా రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించినా, ఆమోదించకున్నా తాను ఎంపీని కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానిని వెంటనే జరపించాలని ఎంపీ కోరినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. -
హాల్‌టికెట్ల హైడ్రామా
నెల్లూరు(విద్య) : నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. ఎనిమిది మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు కళాశాల భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపల్‌గా మాల్యాద్రిచౌదరి పనిచేస్తున్నారు. వాసవి, సాయికుమార్ అనే సీనియర్ ఇంటర్ విద్యార్థులు చంద్రశేఖర్, రాజేంద్రబాబు, వెంకటేష్, అభిలాష్, అజయ్‌కుమార్, రాజేంద్రలు అనే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు హాజరుతగ్గడంతో బోర్డు నిబంధనలను అనుసరించి హాల్‌టికెట్లు ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ తేల్చిచెప్పేశారు. వారిలో బైపీసీ జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఐదుగురు, ఎంపీసీ ఒకరు, సీనియర్ ఇంటర్లో ఎంపీసీ ఒకరు, బైపీసీ ఒకరు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు అటెండెన్స్ సరిపోకపోతే కాండోనేషన్ ఫీజు కట్టించుకొని పరీక్షలు రాయించవచ్చుననేది బోర్డు నిబంధన. సైన్స్ విద్యార్థులు ఖచ్చితంగా అటెండెన్స్ ఉండి తీరాల్సిందే. 60 నుంచి 70 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. అయితే ఈ కళాశాల విద్యార్థులకు 40 నుంచి 60 శాతం ఉండటంతో ప్రిన్సిపల్ వీరికి హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ విద్యాసంవత్సరాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఎంతమంది సర్దిచెప్పినా ప్రిన్సిపల్ ససేమిరా అనడంతో విద్యార్థులు ఏమీ చేయలేకపోయారు. కళాశాల భవనంపై చేరి నినాదాలు చేశారు. సెల్ఫ్ సెంటర్‌పై వివాదాలు... సౌత్‌మోపూరు కళాశాల సెల్ఫ్సెంటర్. అక్కడ చదివే విద్యార్థులు అక్కడే పరీక్షలు రాస్తారు. సుమారు 212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఏడాది పొడవునా విద్యార్థుల అటెండెన్స్ విషయం పట్టించుకోవాల్సిన ప్రిన్సిపల్ ఆ విషయాన్ని పరీక్షలప్పుడే పట్టుబట్టడంపై పలు వివాదాలకు తావిస్తోంది. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని ప్రిన్సిపల్ వాదిస్తున్నారు. ప్రిన్సిపల్ విద్యాసంవత్సరం మొత్తం మీద వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికుల వాదన. అయితే విద్యార్థుల వద్ద నుంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని వాటినే షోకాజ్ నోటీసులుగా చూపుతూ ప్రిన్సిపల్ వాదనకు దిగడం విడ్డూరమని గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీవీఈఓ బాబు జాకబ్ కళాశాలను సందర్శించారు. పూర్వాపరాలను ఆరా తీశారు. డీవీఈఓ చెప్పినా ప్రిన్సిపల్ ఒప్పుకోకపోవడంతో ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే పరీక్షా సమయం కాస్త అయిపోయింది. ఇక చేసేదిలేక ప్రిన్సిపల్‌ను కలెక్టర్‌కు వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వమన్నారు. కనీసం గురువారం జరిగే సెకండియర్ పరీక్షను రాసే ఇద్దరికన్నా అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అందరూ పేద విద్యార్థులే.. కళాశాలలో చదివే విద్యార్థుల ఆర్థిక నేపథ్యం అంతంతమాత్రమేనని సమాచారం. పుస్తకాలు, ఫీజులు కట్టాలంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కూలి పనులకు వెళ్లి వచ్చిన సంపాదనతో ఫీజులు కడతారనేది స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమం లో అనేక మంది దాతలు కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నారు. విద్యాసంవత్సరం అంతటిలో ఇంత పట్టుపట్టి ఉంటే వారు కళాశాలకు వచ్చి ఉండేవారని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు ఎలా పరీక్ష రాస్తారో చూస్తానంటూ జీఓను సాకుగా చూపడం పలువురు విస్మయానికి గురిచేసింది. అధికారు లు స్పందించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
‘పచ్చ’మోసం
నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామానికి చెందిన కొండా వెంకట్రామిరెడ్డి అనే రైతుకు 1.60 ఎకరాల భూమి ఉంది. అందులో పంట సాగు చేసుకునేందుకు బంగారు నగలు తాకట్టుపెట్టి రూ.72 వేలు తీసుకున్నారు. అయితే ఇతనికి సెంటు భూమి మాత్రమే ఉందంటూ.. రూ.761 రుణాన్ని జమచేసినట్లు పత్రంలో చూపించారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతుకు రెండెకరాల పొలం ఉంది. పంట సాగు చేసుకునేందుకు బ్యాంకు నుంచి రూ.22.400 రుణం పొందారు. అయితే ఇతనికి 9 సెంట్లు మాత్రమే పొలం ఉందని రూ. 200 జమచేస్తున్నట్లు చూపించారు. ఇదిలా ఉంటే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాసుపుస్తకం ఉండి.. రుణమాఫీకి అర్హత ఉన్న పెంచలయ్యపేరు జాబితాలోనే లేకుండా చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘పచ్చ’ బండారం బయటపడింది. రుణ విముక్తిపత్రం పేరుతో.. రుణ ఉపశమన పత్రాన్ని రైతులకు అందజేస్తున్నారు. అందులోనూ రైతుల వివరాలు తప్పుల తడకగా ముద్రించి ఉన్నారు. పత్రాన్ని అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టాక మొదటి సంతకాన్నే నీరుగార్చారని, ఆ సంతకానికి విలువలేకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శస్తున్నారు. హామీలను అమలు చేయలేక రకరకాల విచారణల పేరుతో వాయిదా వేస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెచ్చింది. అందులో భాగంగానే ఇటీవల మహాధర్నా చేపట్టింది. దిగొచ్చిన బాబు హడావుడిగా రుణమాఫీ విధాన ప్రకటన చేశారు. రూ.50వేల లోపు ఉన్న రుణాలన్నీ ఒకటేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమల్లోకి వచ్చేసరికి ఆ హామీని నీరుగార్చారు. రూ.50 వేల లోపు ఉన్న రైతులకు ఒకరికి రూ.10వేలు, ఇంకొకరికి రూ.9వేలు, మరొకరికి రూ.6వేల చొప్పున జమచేస్తున్నామని ప్రకటించారు. మిగిలిన మొత్తం నాలుగేళ్లలో మాఫీ చేస్తామని ప్రభుత్వం జారీ చేసిన పత్రాల్లో ముద్రించారు. అయితే దీనిపై కొందరు రైతులు అధికారులను నిలదీయగా.. వారు తెల్లమొహం వేయటం కనిపించింది. ప్రభుత్వం గురువారం పంపిణీ చేసిన పత్రాల్లో పైన ‘రుణ విముక్తి పత్రం’ అని ఉంది. అయితే లోపల అంతా రుణ ఉపశమన పత్రం అని ఉంది. పత్రాన్ని చదివిన రైతులు గందరగోళానికి గురవ్వటం కనిపించింది. ఇదంతా బాబు కనికట్టు విద్య అంటూ రైతులు గుసగుసలాడుకుంటూ వెళ్లటం కనిపించింది. రైతు సాధికారత సదస్సులు వెలవెల రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేయడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం సాధికారత సదస్సులను ప్రారంభించింది. జిల్లాలో గురువారం ప్రారంభించిన ఈ సదస్సులకు రైతుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో ఎక్కడా రైతు సాధికారత సదస్సు విజయవంతమైన దాఖలాలు కనిపించలేదు. ప్రభుత్వం ఇచ్చే పత్రాల కోసం సదస్సులకు రావటం కనిపించింది. పత్రాలు తీసుకున్న రైతులు సదస్సు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే ‘రైతు సాధికారత సదస్సు’కు రైతుల నుంచి స్పందన కరువైంది. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి పితృ వియోగం
నెల్లూరు : నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. కోటంరెడ్డి తండ్రి బేబిరెడ్డి (75) శనివారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బేబిరెడ్డి మృతి పట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. -
బీజేపీకి నెల్లూరు రూరల్ ఖరారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ఆత్మకూరు స్థానం తమకు దక్కుతుందని ఆశించిన బీజేపీకి అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు రూరల్ సీటు దక్కింది. రెండు పార్టీల మధ్య శనివారం హైదరాబాద్‌లో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఆత్మకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు లోక్‌సభ స్థానాల కోసం బీజేపీ నేతలు పట్టుబట్టారని తెలిసింది. తొలుత ఆత్మకూరుకు టీడీపీ, బీజేపీల మధ్య అంగీకారం కుదిరినా, బీజేపీ అంతర్గత వ్యవహారాల అవసరాల రీత్యా నెల్లూరు రూరల్ సీటు కూడా కావాలని పట్టుబట్టినట్లు సమాచారం. రెండు సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించక పోవడంతో తమకు నెల్లూరు రూరల్ ఇవ్వాలని బీజేపీ కోరింది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సరేననడంతో అనూహ్యంగా ఆత్మకూరుకు బదులు బీజేపీకి నెల్లూరు రూరల్ సీటు దక్కింది. ఈ స్థానం నుంచి పార్టీ నాయకుడు సురేష్‌రెడ్డిని పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే టీడీపీ నేతలు ఈ సీటు కూడా కాకుండా బీజేపీని సర్వేపల్లికి పంపాలనే ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దుర్మార్గంగా ఓటర్ల జాబితా తయారీ : కోటంరెడ్డి
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: రెండురోజుల కిందట జరిగిన కార్పొరేషన్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను దుర్మార్గంగా తయారు చేశారని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. అస్తవ్యస్త ఓటరు జాబితాను సార్వత్రిక ఎన్నికల నాటికి సరిదిద్దాలని మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లగా పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి ఆయన ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు తావులేకుండా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఉత్వర్వులిచ్చినా క్షేత్రస్థాయిలో గందరగోళంగా తయారు చేశారని మండిపడ్డారు. వార్డుల విభజనలో కూడా ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. ఒక డివిజన్లో 5 వేలు ఓట్లు, మరో డివిజన్లో 10 వేలు ఓట్లు చీల్చి ఇష్టానుసారం డివిజన్లను విభజించారని మండిపడ్డారు. బీసీలను ఓసీలుగా, ఓసీలను బీసీలుగా, ఎస్సీలుగా గణాంకాలు చేస్తూ లెక్కలేనన్ని అక్రమాలతో జాబితాలు తయారు చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో గందరగోళం వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో 40 శాతం మంది తమ హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఓటర్లు తమకు స్లిప్పులు అందలేదని ఫిర్యాదు చేస్తుంటే రాజకీయ పార్టీలు స్పందించి పంపిణీ చేసేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకుని కేసులు పెడతామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మే 7న సార్వత్రిక ఎన్నికల్లోనైనా ఇలాంటి ఘోరమైన పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని కోరారు. పొరపాట్లను సరిదిద్దకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అడ్డుకున్న పోలీసులు తప్పులు తడకగా తయారు చేసిన ఓటరు జాబితా విషయమై వైస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ నెల్లూరురూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలతో కలిసి ఆర్డీవోను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తమ అభ్యర్థులతో మాత్రమే కార్యాలయంలోకి వెళ్తామని, కేవలం వినతిపత్రం అందచేస్తామని కోటంరెడ్డి హామీ ఇవ్వడంతో పోలీసులు వారిని లోనికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వర్లు, నెల్లూరురూరల్ నియోజక వర్గంలోని ఆయా డివిజన్లకు సంబంధించి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. -
మోగిన సార్వత్రిక నగారా
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. జిల్లాలో నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి, ఉదయగిరి, కోవూరు (10) అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుంది. మే 7న ఎన్నికలు జరుగుతాయి. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే బూత్‌ల ఏర్పాటు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకంతో పాటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. మరోవైపు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేందుకు నేతలు వాడివేడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి ప్రచారంలో ముందంజలో ఉంది. వైఎస్సార్సీపీ నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేశారు. టీడీపీ విషయానికి వస్తే సగానికి పైగా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యలేక సతమతమవుతోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరుసి టీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారె డ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసలురెడ్డిలు బుధవారం నెల్లూరులో జరిగిన ప్రజాగర్జనలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన ముగ్గురిలో ఇద్దరికి ఎమ్మెల్యే సీటు,్ల ఆదాలకు నెల్లూరు ఎంపీ స్థానం కేటాయించడం దాదాపు ఖరారైంది. దీంతో మొదటి నుంచి పార్టీ జెండాలు మోసి టికెట్లపై ఆశలు పెంచుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీమంత్రి రమేష్‌రెడ్డి తదితర నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది అధినేతకు తలనొప్పిగా మారింది. దీంతో టీడీపీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పూర్తికాలేదు. కొన్ని నియోజక వర్గాల్లో సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. ఇక రాష్ట్ర విభజన పుణ్యమాని కాంగ్రెస్ ఉనికి జిల్లాలో ప్రశ్నార్థకమైంది. ఆనం సోదరులు మినహా ఆ పార్టీకి నేతలెవరూ మిగల్లేదు. ఇక రెండోశ్రేణి నేతలు ముందే పార్టీ నుంచి నిష్ర్కమించారు. ఆయా నియోజక వర్గాల్లో మిగిలిన ఒకరిద్దరు కిందిస్థాయి కార్యకర్తలకే పార్టీ టికెట్లు కట్టబెట్టేందుకు ఆనం సోదరులు సిద్ధమయ్యారు. మరో వైపు టీడీపీతో పొత్తు కుదిరితే ఒక్క స్థానంలో నైనా పోటీ చేద్దామని బీజేపీ ఎదురు చూస్తోంది. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అన్ని పార్టీల నేతలు ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. బుధవారం నుంచే మరింత హడావుడి మొదలైంది. అన్నిపార్టీల నేతలు సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కార్పొరేటర్లు, వార్డు సభ్యుల ఎంపికలో నేతలు తలమునకలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నికలు రావడం అన్ని పార్టీలకు ఇబ్బందిగా మారింది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉవ్విళ్లూరు తుండగా టీడీపీ, కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకూ నెల్లూరు కార్పొరేషన్లో హవా నడిపిన ఆనం సోదరులకు ఇప్పడు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. టీడీపీది సైతం నగరంలో ఇదే పరిస్థితి. మొత్తంగా అటు మున్సిపల్ ఎన్నికలు, ఇటు సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో కోలాహలం మొదలైంది. -
ఎన్నికల ముంగిట్లో ‘అధికార’ హవా
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : 2014 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. సందట్లో సడేమియా అన్నట్లు డివిజన్ స్థాయి పోలీస్ బాస్‌ల బదిలీల్లో అధికార పార్టీ నేతలు తమ పరపతి ఉపయో గించినట్లు తెలుస్తోంది. బదిలీల ప్రక్రియలో తలదూర్చి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోవడంలో కృతకృత్యులైనట్లు ఆరోపణలు విని పిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్, ఆత్మకూరు డీఎస్పీ లుగా తమకు అనుకూలమైన వారిని బదిలీ చేయించుకున్నట్లు తెలిస్తోంది. తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు వారి కనుసన్నల్లోనే జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఐదు పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. నెల్లూరు గ్రామీణం, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావడంతో వీరి బదిలీలు తప్పనిసరి అయితే ఆయా స్థానాల్లో అధికార పార్టీ ఒత్తిడి మేరకే పోస్టింగులు ఇచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ నియోజవర్గం నుంచి ఆనం వివేకానందరెడ్డి, ఆత్మకూరు నుంచి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసింది. ఆనం సోదరులు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నేరుగా పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించి అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రానున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం స ృష్టించి గెలవడానికే తమకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా బదిలీల్లో జిల్లాలో పోస్టింగ్‌లు దక్కించుకున్న డీ ఎస్పీల్లో ఇద్దరు జిల్లాకు సుపరిచితులే. నెల్లూరు రూరల్ డీఎస్పీగా నియమితులైన వీఎస్ రాంబాబు జిల్లాలో ఎస్ఐగా, సీఐగా, సీఐడీ డీఎస్పీగా పని చేశారు. దీంతో ఆయనకు అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన కొద్దికాలంగా నెల్లూరు రూరల్ డీఎస్పీగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు రూరల్, ఆత్మకూరు డీఎస్పీలుగా నియమితులవ్వడం వెనుక మంత్రి ఆనం హస్తం ఉన్నట్లు సమాచారం. బదిలీలా.. రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది డీఎస్పీలను బదిలీలు చేస్తూ గురువారం రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన నలుగురు డీఎస్పీలు ఉన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కె. బాలవెంకటేశ్వర రావును డీజీపీ కార్యాలయం వీఆర్‌కు, ఆయన స్థానంలో నెల్లూరు సీఐడీ డీఎస్పీగా పని చేస్తున్న వీఎస్ రాంబాబును నియమించారు. ఆత్మకూరు డీఎస్పీ రాజమహేంద్రనాయక్ను డీజీపీ కార్యాలయం వీఆర్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి సీఐడీ డీఎస్పీగా పని చేస్తున్న కె. మల్యాద్రిని నియమించారు. కావలి డీఎస్పీ పి. ఇందిరను డీజీపీ కార్యాలయం వీఆర్‌కు, డీజీపీ కార్యాలయం వీఆర్‌లో ఉన్న కె. మహేశ్వరరాజును కావలికి నియమించారు. నెల్లూరు సీఐడీలో పనిచేస్తున్న ఎన్. కృష్ణకిశోర్రెడ్డిని పుత్తూరు డీఎస్పీగా బదిలీ చేశారు. సీఐడీలో పనిచేస్తూ బదిలీ అయిన వీఎస్ రాంబాబు, కృష్ణకిశోర్‌రెడ్డి స్థానంలో ఎవరిని నియమించలేదు.