![Adala Prabhakar Reddy As YSRCP Coordinator Nellore Rural - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/2/sajjala12.jpg.webp?itok=L82oDJS4)
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల
ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని
బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు.
చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment