గిట్టుబాటు ధర వచ్చేలా ప్రశ్నిస్తాం | we will question central governement in parliament | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర వచ్చేలా ప్రశ్నిస్తాం

Published Wed, Jul 15 2015 3:18 PM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

we will question central governement in parliament

నెల్లూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి వాటి ధరలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని, పార్లమెంటులో ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.

చంద్రబాబు చేతగాని తనంవల్లే పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుందని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పనితీరును ప్రజలు గుర్తించారని తెలిపారు. మరోపక్క, తొక్కిసలాటకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement