tobacco
-
మీకు ఆ అలవాట్లు ఉంటే జేబుకు చిల్లే.. నిర్మలమ్మ చేతిలో ట్యాక్స్ అస్త్రం
-
నష్టపోయి'నారు'
దేవరపల్లి: ధరలు పడిపోవడం, ఇతర ప్రాంతాల్లో రైతులు సొంతంగా నారు పెంచడంతో.. పొగాకు నారు వేసిన రైతులు, కౌలుదార్లు ఈ సీజన్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 23 వేల హెక్టార్లలో పొగాకు సాగుకు టుబాకో బోర్డు అనుమతి ఇచ్చింది.అయితే, గత ఏడాది పొగాకుకు రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి రైతులు బోర్డు అనుమతించిన దానికి మించి, ఇప్పటికే సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. ఇప్పటికే చాలా వరకూ నాట్లు దాదాపు పూర్తి కావడంతో పొగాకు నారు సీజన్ ముగిసింది. గత ఏడాది కాసుల పంట గత ఏడాది పొగాకు నారుకు చివరి దశలో ఊహించని డిమాండ్ ఏర్పడి, రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. నాట్ల ప్రారంభంలో ఎకరం నారు (6 వేల మొక్కలు) ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ పలికింది. ఇది గిట్టుబాటు కాక కొంత మంది రైతులు నష్టపోయారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను నారు రైతుల పాలిట వరంగా మారింది. వేసిన పొగాకు నాట్లు ఈ తుపాను ప్రభావంతో దెబ్బ తిన్నాయి. తుపాను అనంతరం రైతులు మళ్లీ నాట్లు వేయడంతో నారుకు ఎక్కడ లేని డిమాండూ ఏర్పడింది. దీంతో నారుమడులు కట్టిన కౌలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను అనంతరం ఎకరం నారు ధర ఏకంగా రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలికింది. ఈ ధర పొగాకు నారు చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఎకరం విస్తీర్ణంలో నారు మడులు కట్టిన రైతుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం వచ్చింది. అప్పటి వరకూ గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెట్టిన కౌలు దారులకు కాసుల పంట పండింది. ఆశ పడితే మొదటికే మోసం గత ఏడాది ధరలు చూసిన కౌలుదార్లు, రైతులు ఈసారి కూడా పొగాకు నారుకు మంచి ధరలు పలుకుతాయని ఆశ పడ్డారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో అధిక ధరలకు భూములను కౌలుకు తీసుకున్నారు. గత ఏడాది ఎకరం కౌలు రూ.40 వేలు కాగా, ఈ ఏడాది అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పలికింది. అయినా సరే తగ్గేదేలే.. అన్నట్లు కౌలుదార్లు పోటీ పడి మరీ భూములను కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఉత్తర తేలికపాటి నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని నాలుగు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో నారుమడులు కట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే, వాతావరణం అనుకూలించడంతో తక్కువ సమయంలోనే రైతులు పొగాకు నాట్లు పూర్తి చేశారు. నాట్ల ప్రారంభంలో నారు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 పలకగా, నవంబరులో అది రూ.1,500కు పడిపోయింది. అయినప్పటికీ నారు అడిగే నాథుడు లేక చాలా మంది రైతులు బోణీ కూడా చేయలేదు. ఎకరాకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవడంతో పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో కౌలుదార్లు, రైతులు మొదటికే మోసపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నారుమడులు కట్టిన రైతుల్లో 80 శాతం కౌలుదార్లే ఉన్నారు. వీరు భూములను కౌలుకు తీసుకుని, ఏటా నారుమడులు కట్టి, నారు విక్రయాలు జరుపుతారు. సాధారణంగా వీరి వద్ద నుంచి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల రైతులు నారు కొనుగోలు చేస్తూంటారు. ఈ ఏడాది అక్కడ కూడా రైతులు సొంతంగా మడులు కట్టి, నారు పెంచడంతో ఇక్కడి నారుకు డిమాండ్ తగ్గింది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పొగాకు నారు వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది నారు ధర చూసి బెంబేలెత్తిన పొగాకు రైతులు ఈ ఏడాది ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ అవసరాలకు సరిపడా సొంతంగా మడులు కట్టి నారు పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారు రైతులు ఈ సీజన్లో నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. పెట్టుబడులు కూడా రాలేదు నేను 60 సెంట్ల విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.40 వేలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు అయ్యింది. రెండేళ్లుగా నారు రేటు ఆశాజనకంగా లేదు. పొగాకు సాగుకు మించి నారుమడులు ఉండటంతో డిమాండ్ తగ్గింది. చాలా మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. – గెల్లా గోవిందరాజు, సుబ్బరాయపురం, కౌలు రైతు, దేవరపల్లి కోలుకోలేని దెబ్బ ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.30 లక్షలు అయ్యింది. ఎకరం నారు ధర రూ.1,500 పలికింది. అది కూడా అడిగిన నాథుడే లేడు. ఈ ఏడాదికి నారు సీజన్ ముగిసింది. ఎకరాకు రూ.2 లక్షల నష్టం వస్తోంది. నారు రైతులు నిండా మునిగారు. – సీహెచ్ వెంకటేశు, కౌలు రైతు, రామన్నపాలెం, దేవరపల్లి మండలం -
వివేచన హక్కుపై నిషేధమా?
మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్ కోసం స్టోవ్ (యూఎస్‌లోని వమాంట్ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్ సిగరెట్ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్’ (ప్రసిద్ధ బ్రిటిష్ కామెడీ సీరీస్)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు బ్రిటిష్ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్ చేస్తుంటుంది. ‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్ ఆఫీసర్ గుసగుసగా అంటాడు. ‘‘సిగరెట్ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్. ‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్ పొడవంత ఉన్నాయి.’’‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’ఆ డైలాగ్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! ‘యాక్’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్లో ఆమె మళ్లీ సిగరెట్ తాగినట్లు నాకు గుర్తు లేదు.ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టుఅందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది. నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్ ప్యాకెట్ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తిరుమల లడ్డులో పొగాకు. చంద్రబాబు పై భక్తులు ఫైర్
-
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్
ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘పొగ’బెడుతున్నా...పొమ్మనలేమా?
నగరానికి చెందిన ఒక బహుళజాతి సంస్థలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన యుక్తవయస్సు నుంచి ధూమపానం చేస్తున్నాడంటే... అతని ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పొగాకుపై ఖర్చు చేస్తున్నట్లే అర్థం. ఉత్సుకత, తోటివారి ఒత్తిడితో, కుటుంబ సభ్యుడు ఒకరు పొగతాగుతున్నట్లు చూసిన తర్వాతే అతనికి ధూమపానం అలవాటు ప్రారంభమైంది. సామాజిక అలవాటుగా మొదలై, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక విధానంగా పరిణామం చెందింది. ఆరోగ్య ప్రమాదాలు తెలిసినప్పటికీ, దాన్ని విడిచిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, కష్టపడినా దాన్ని అతను ఆపలేకపోయాడు. ఇది ఒకరికే ప్రత్యేకమైనది కాదు; ఇది దేశంలోని లక్షలాది మందికి సంబంధించింది.నియంత్రణలో సవాళ్లెన్నో...భారతదేశంలో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన జనాభా కారణంగా పొగాకు నియంత్రణ సంక్లిష్టమైన సవాలును విసురుతుంది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల వల్ల వ్యక్తులు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే అధిక పన్నులు అక్రమ పొగాకు వ్యాపారానికి కూడా ఆజ్యం పోస్తున్నాయి. మూడవదిగా చెపపుకోవాల్సింది పొగాకు వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అధికం అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత భారంగా మారుస్తుంది.పొగాకు వాడకంలో... రెండో స్థానం...ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.. 2018 నాటికి 16 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న 250 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. 2020 నాటికి 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 27% మంది పొగాకుకు బానిసలని తేలింది.. పొగాకు వినియోగదారులతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా, చట్టబద్ధంగా ఉత్పత్తి చేస్తున్న సిగరెట్లు మొత్తం పొగాకు వినియోగంలో 8% మాత్రమే ఉండగా, మిగిలిన 92% బీడీలు పొగాకు నమలడం వంటి చౌకైన ఉత్పత్తులను వినియోగానిదే కావడం గమనార్హం.ఆడవారిలోనూ పెరుగుతున్న వినియోగం...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–21 ప్రకారం... పురుషులు స్త్రీల మధ్య పొగాకు వినియోగంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ... మరోవైపు ఆడవారిలో సైతం పొగాకు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడి మారుతున్న సామాజిక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మగవారిలో ఇప్పటికీ పొగాకు వినియోగం గణనీయంగా ఉంది. పొగాకు వినియోగం ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉంది, వీరికి పొగాకు సంబంధిత హాని ఎక్కువగా ఉంటుంది. విషపూరిత పదార్థాలతో నిండి, ఫిల్టర్లు లేకపోవడం వల్ల బీడీలు సిగరెట్ కంటే ఎక్కువ హానికరమైనవి అయినప్పటికీ, బాగా వినియోగిస్తారు. . బీడీ ఉత్పత్తి మార్కెటింగ్ లపై పెద్దగా తనిఖీలకు అవకాశం లేదు. వీలు కల్పిస్తుంది. చౌకైన పొగాకు ఉత్పత్తుల విక్రయం పేదరికపు ఉచ్చును శాశ్వతం చేస్తుంది.ప్రత్యామ్నాయాలు లేక...మానలేక...యువకులలో (20–44 ఏళ్ల వయస్సులో) ధూమపానం ప్రాబల్యం ఆందోళనకరంగా ఉంది, ఇది శ్రామికశక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉందనేది మరవకూడదు. నికోటిన్ గమ్‌లు, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, హీట్–నాట్–బర్న్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల 45% మంది యువకులు ధూమపానం లేదా పొగాకు నమలడం మానుకోలేకపోతున్నారని గత ఏడాది ఒక సర్వే తేటతెల్లం చేసింది. ‘హ్యూమన్–సెంట్రిక్ అప్రోచ్ టు టుబాకో కంట్రోల్’ నివేదికలోని సమీక్షకు స్పందించిన వారిలో 66% మంది 20–25 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగించడం ప్రారంభించారని, వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుకున్నామని గుర్తించారు.ఇది చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!సమగ్రవిధానంతోనే పరిష్కారం...పొగాకు నివారణలో పొగాకు వినియోగానికి దోహదపడే సామాజిక సాంస్కృతిక కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకుపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పొగాకు సాగులో నిమగ్నమైన రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పన్ను ఆదాయాన్ని తగ్గిస్తుంది అక్రమ వ్యాపారాన్ని పెంచుతుంది. బదులుగా, విరమణ విద్య రెండింటిపై దృష్టి పెట్టి మరింత సమగ్ర విధానానికి మారాలి.అలాగే, 74% మంది ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వినియోగదారుల కుటుంబంలో పెద్దలు సైతం ధూమపానం అలవాటును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది, ఈ పరిస్థితుల్లో వారికి సుదీర్ఘమైన మద్దతు అవసరం. సైన్స్ ఆధారిత పరిష్కారాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యావేత్తలు కమ్యూనిటీ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా, భారతదేశం పొగాకు వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దానితో సంబంధం ఉన్న పేదరికం వ్యాధుల చక్రాన్ని అడ్డుకోవచ్చు. -
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. -
కేన్సర్ రిస్క్ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం కేన్సర్. కేన్సర్ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్‌కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా, మహిళలు బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ కేన్సర్ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్లు, రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్, సన్ రేస్, ఊబకాయం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. (ఎన్ఆర్ఐ మహిళకు బ్యాంకు మేనేజర్ టోకరా) ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం ♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు. ♦ పిల్లలకు హెపటైటిస్ బీ, హెచ్‌పీవీ వ్యాక్సిన్లు అందించడం ♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం. హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. ♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం ♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా దాన్ని పరిమితం చేసుకోవడం ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్ సోకి వున్నా, వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా కేన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం. -
‘పొగాకు నియంత్రణ’ అంతంతే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘పొగాకు నియంత్రణ చర్యలు’అంత సంతృప్తిగా లేవని కేంద్రం స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ, బహిరంగ ప్రదే శాల్లో పొగతాగడం నిషేధంపై 2003లో ‘కోట్తా’చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2020 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల చట్టం ఎలా అమలవుతుందనే దానిపై, ఇంకెలా చేయొచ్చన్న దానిపై పొగాకు వినియోగం, దాని నియంత్రణపై ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దాని ఆధారంగా ఓ నివేదిక రూపొందించింది. అమలుపై పాండిచ్చేరిలోని జిప్మర్, చండీగఢ్‌కు చెందిన పీజీఐఎంఈఆర్లు పరిశోధన చేశా యి. 2020 నవంబర్‌లో ఒకసారి, అక్టోబర్ 2021 తర్వాత ఒకసారి తెలంగాణ, పాండిచ్ఛేరి, మేఘాలయలో ఈ అధ్యయనం చేశారు. ఒక్కో రాష్ట్రంలో 9 జిల్లాల్లో పరిశీలించారు. అనంతరం వాటి ఫలితాలను ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజీఎంఆర్లో తాజాగా ప్రచురించారు. తెలంగాణలో 2020లో మొదటి విడతలో 2,029 మందిని సర్వే చేశారు. రెండో విడత 2021లో 1,097 మందిపై చేశారు. ‘పొగాకు నియంత్రణ చర్యలు తెలంగాణలో పెరిగాయి. అయితే కొన్నింటిలో మాత్రం తగ్గుదల ఉన్నట్టు నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి ప్రకటనల నిలుపుదలపై పురోగతి ఉందని’డాక్టర్ కిరణ్ మాదల (సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ) అభిప్రాయపడ్డారు. పొగాకు బాక్సులపై స్థానిక భాషలో హెచ్చరికలు ఏవీ? బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగ నియంత్రణ చర్యల్లో మాత్రమే తెలంగాణలో పురోగతి ఉంది. ఉత్పత్తిదారులను నియంత్రించడంలోనూ...హెచ్చరికల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపింది. ♦ పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌పై వార్నింగ్ సింబల్ విషయంలో మొదటి దశలో 75 శాతంగా ఉండగా, రెండో దశలో అది 83 శాతానికి పెరిగింది. ♦ పొగాకు ఉత్పత్తుల బాక్స్‌పై వార్నింగ్ సింబల్ 85 శాతం కవరయ్యేలా ఉండాలి. ఆ విషయంలో మొదటి విడతలో 75 శాతం ఉండగా, రెండో విడతలో 91 శాతంగా ఉంది. ♦ స్థానిక భాషలో ముద్రించే విషయంలో మొదటి విడత 45 శాతం ఉంటే, రెండో విడత 13 శాతానికి దిగజారింది. ♦ 18 ఏళ్లలోపు వారికి పొగాకు వాడకం, అమ్మకాలపై నిషేధం ఉండాలి. నిషేధం తీరు మొదటి విడతలో 95 శాతం ఉండగా, రెండో విడతలో 99 శాతం పెరిగింది. ♦ 18 ఏళ్లలోపు పిల్లలు పొగాకు ఉత్పత్తులను ఇతరులకు అమ్మటాన్ని నిరోధించడంలో తెలంగాణలో మొదటి విడతలో 97 శాతం ఉండగా, రెండో విడతలో అది ఏకంగా 100 శాతానికి చేరింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకం తగ్గింది తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అధ్యయనంలో మొదటి విడత 86.9 శాతం ఉండగా, రెండోసారి 98.5 శాతానికి పెరిగింది. ఆ మేరకు మార్పు కనిపించింది. ♦ బహిరంగ ప్రదేశాల్లో తాగొద్దన్న బోర్డులు పెట్టారు. మొదటి దశలో 45.2 శాతంగా ఉంటే, రెండో విడతలో 54.1 శాతానికి పెరిగింది. అయితే నిబంధనల ప్రకారం బోర్డులు పెట్టలేదని తేలింది. ♦ నిబంధనల ప్రకారం బోర్డులను ఏమేరకు పెట్టారో చూస్తే... మొదటి దశలో రెండు శాతం, రెండో దశలో 15 శాతానికి పెరిగింది. ♦ పొగాకు తాగొద్దని పెట్టే బోర్డుపై సంబంధిత అధికారి ఫోన్ నంబర్ పొందుపరచడం అనేది మొదటి దశలో 1.6 శాతం ఉంటే, రెండో దశలో 1.5 శాతానికి తగ్గింది. పొగాకు తాగకుండా ఉండే పరిస్థితులు కల్పించడంలో మొదటి దశలో 86.9 శాతం ఉండగా, రెండో దశలో 97.7 శాతానికి పెరిగింది. ♦ సగటున చూస్తే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అనేది మొదట విడత 53.9 శాతం నుంచి రెండో విడతలో 66 శాతానికి పెరిగింది. -
పొగాకుపైనా వితండవాదమేనా?
సాక్షి, అమరావతి: రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’కు నిత్యం ఒకటే ఎజెండా.. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడంలో రామోజీరావు వ్యవహారం కూడా ఇంతే. మోకాలికి, బోడి గుండుకు ముడివేసినట్టు ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి అంటగడతారు. తాజాగా పొగాకును ప్రభుత్వం పంటల బీమాలో చేర్చలేదని.. ఈ–క్రాప్‌లో నమోదు కూడా చేయలేదని ఒక అబద్ధపు కథనంతో ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. ‘పంటల బీమా లేదు.. ఈ–క్రాప్‌లో నమోదూ కాలేదు’ అంటూ ఒక విష కథనాన్ని సోమవారం ‘ఈనాడు’లో వండివార్చారు. దానిపై అసలు నిజాలు ఇవీ.. సాగు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి పొగాకు.. వాణిజ్య పంట..పైగా నార్కోటిక్ ప్లాంట్. ఇదేమీ ఆహార పంటో, ఉద్యాన పంటో కాదు. అయినా సరే పొగాకుకు పంటల బీమా ఎందుకు వర్తింప చేయడం లేదంటూ ‘ఈనాడు’ వితండవాదం చేస్తోంది. పోనీ గత చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పొగాకు రైతునైనా ఆదుకుందా అంటే అదీ లేదు. ఈ నాలుగున్నరేళ్లలో పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొని ‘ఈనాడు’ విషప్రచారానికి ఒడిగడుతోంది. రాష్ట్రంలో పొగాకు సాధారణ విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సాగవుతోంది. సాధారణంగా ఏటా ఎన్ని మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలో? ఆ మేరకు ఎన్ని ఎకరాల్లో పంటసాగు చేయాలో కేంద్ర పొగాకు బోరుŠడ్ నిర్ణయిస్తుంది. అనుమతికి మించి సాగు చేసినా, అదనపు ఉత్పత్తి సాధించినా అమ్ముకోవాలంటే బోర్డు అనుమతులు తప్పనిసరి. అనుమతించిన విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్‌లో 50 వేల టన్నులు, రబీలో లక్షన్నర టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వమే కొనుగోలు.. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమైన సంగతి తెలిసిందే. పొగాకు వాణిజ్య పంటయినప్పటికీ రైతులెవ్వరూ నష్టపోకూడదని చరిత్రలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లను చేపట్టింది. 2019–20 సీజన్లో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 1,29,31,590 కిలోలు కొనుగోలు చేసింది. సగటున కిలోకు రూ.81 చొప్పున 29,228 మంది రైతుల నుంచి రూ.128.65 కోట్లతో కొనుగోళ్లు చేపట్టింది. అత్యధికంగా 7.11 మిలియన్ కిలోల ఎన్వోజీ గ్రేడ్, 4.37 మిలియన్ కిలోల ఎఫ్–05 గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అంతేకాదు..ఈ నాలుగున్నరేళ్లలో వివిధ రకాల వైపరీత్యాల వేళ అన్ని రకాల రైతులతోపాటే పొగాకు రైతులకూ నష్టపరిహారం చెల్లిస్తూనే వచ్చింది. కొనసాగుతున్న ఈ–క్రాప్ నమోదు.. పొగాకు పంటకాలం.. 100–120 రోజులు. రబీ సీజన్లో అక్టోబర్‌లో సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే కాకుండా చాలా చోట్ల నవంబర్ నాటికి కూడా సాగు ప్రారంభం కాలేదు. సాధారణంగా ఏ పంటయినా సరే పంట వేసిన నెల తర్వాత ఈ–క్రాప్‌లో నమోదు చేసి ఫొటో అప్లోడ్ చేస్తారు. ఇలా ఏటా నమోదు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో సాగైన పొగాకు పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. అయితే పంట నమోదు మొదలు పెట్టిన కొద్ది కాలానికే వచ్చిన మిచాంగ్ తుపాన్‌తో నీట మునిగిన ప్రాంతాల్లో నమోదు చేయడం కొంత కష్టతరంగా మారింది. దీంతో ఈ పంట బుకింగ్‌కు మినహాయింపునిచ్చారు. కాగా ఈ–క్రాప్ నమోదనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం.. కాగా కరువు ప్రభావిత మండలాల్లో 1,600 ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఆ మేరకు పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇటీవల మిచాంగ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ప్రాథమికంగా 65 వేల ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల రూపకల్పన కోసం ఎన్యుమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ అంచనాలు కొలిక్కి వచ్చాక నిర్దేశించిన పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు ఇలా ఉంటే రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ‘ఈనాడు’ దుష్ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలోనే బీమా ఎక్కడా లేదు.. రాష్ట్రంలో రైతులు సాగు చేసే దాదాపు అన్ని ప్రధాన పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఖరీఫ్–2023లో 21 పంటలకు, రబీ–2023–24లో 17 పంటలకు బీమా వర్తింప చేస్తూ పూర్తి మార్గదర్శకాలతో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే పొగాకు పంట ఆహార భద్రతకు సంబంధించిన పంట కాదు...పైగా వీటి ఉత్పత్తుల వినియోగంతో దుష్పరిణామాల కారణంగా ఈ పంటకు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనూ మరెక్కడా బీమా లేదు. నార్కోటిక్ ప్లాంట్‌గా గుర్తించిన కారణంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంబీఎంవై) ద్వారా నోటిఫై చేసిన పంటల జాబితాలోనూ పొగాకుకు చోటు దక్కలేదు. గతంలో మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ బీమా పథకం ద్వారా నోటిఫై చేసిన దాఖలాలు కూడా లేవు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో పెనాల్టీ లేకుండా.. 2022–23లో 2.04 లక్షల హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు కేంద్ర పొగాకు బోర్డు అనుమతినిచ్చింది. అయితే మాండూస్ తుపాన్‌తో అన్ని పంటలు దెబ్బతినడంతో రైతులంతా రేటు బాగుందని పొగాకు సాగు చేశారు. ఫలితంగా 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతినిస్తుంది. అలాంటిది సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపడంతో పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆ మేరకు రైతులు పొగాకును అమ్ముకోగలిగారు. -
‘వర్జీనియా’కు రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో 55 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరాసరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడాది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది. -
ఏంటి బాబాయ్..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?
ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నా కొందరు తంబాకు అలవాటును మానుకోరు. దాన్ని నోట్లో పెట్టుకుంటే గానీ కొందరికి బుర్ర పనిచేయదు. ఇంట్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇలా.. ఎక్కడ ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక గోడ కనిపిస్తే చాలు ఉమ్మివేస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ అది ఏ ట్రైనో, బస్సో కాదండీ.. ఏకంగా విమానంలోనే.. వీడియోలో చూసిన విధంగా ఓ వృద్ధుడు విమానంలో ప్రయాణిస్తున్నాడు. నాలుక లాగేసిందో.. ఏమో..! గానీ విమానంలో ప్రయాణిస్తుండగానే తంబాకును జేబులో నుంచి తీశాడు. దాన్ని చేతిలో వేసుకునే నలిపి.. అమాంతం పెదవి కింది భాగంలో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. फ्लाइट में हो या ट्रेन में एक खिली खैनी बहुत जरूरी हैं 😂😅 pic.twitter.com/GknxrYtJwY — छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 26, 2023 వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'విమానంలోనే తంబాకు వేశావ్.. సరేగానీ ఎక్కడ ఉమ్మివేస్తావ్ బాబాయ్..!' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. వీరు మారరురా బాబు.. అంటూ మరో నెటిజన్ స్పందించాడు. నాలుక లాగేస్తుందా..? తాత అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.''నాకూ కొంచం పెట్టవా..' అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇదీ చదవండి: గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..? -
పొగాకు రైతు ఇంట సిరుల పంట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనీయా పొగాకు డిమాండ్ పెరగడంతో పొగాకు పంట ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది పొగాకు వేలంలో కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. బ్రైట్ గ్రేడ్, లోగ్రేడ్ అన్న తేడా లేకుండా అన్ని గ్రేడ్లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డుపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చి పొగాకు ముక్క (స్క్రాప్)ను వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కలి్పంచడం, అదనపు పొగాకు పంట అమ్మకాలపై జరిమానాలు రద్దు చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అయింది. భారీగా పెరిగిన ఉత్పత్తి .. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటిలో కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డిసి పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండగా, ఒంగోలు–1, ఒంగోలు–2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిని ఎస్బిఎస్ (సదరన్ బ్లాక్ సాయిల్), ఎస్ఎల్ఎస్ (సదరన్ లైట్ సాయిల్)గా విభజించారు. వీటిలో ఎస్బిఎస్ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్ఎల్ఎస్ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో 2022–23 పంట సీజన్‌కు సంబంధించి 89.35మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. పలు వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినట్లు అర్ధమవుతుంది. రికార్డు ధరలు ఈ ఏడాదే.. గత రెండేళ్ల నుంచి రికార్డు «పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా.. ఈ ఏడాదిలోనే మార్కెట్లో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఒంగోలు రీజియన్ పరిధిలో ఈ సీజన్లో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు అత్యధిక రూ. 288 పలికినా ప్రస్తుతం స్థిరంగా రూ. 280 ధర వస్తుంది. అయితే ఈ ఏడాది గ్రేడ్లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్లకు రేట్లు పెరగడంతో సరాసరి రేట్లు మొదటిసారి డబుల్ సెంచరీ దాటాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ 214.47గా నమోదైంది. అంటే క్వింటా పొగాకు సరాసరిన రూ 21,300 వరకు ధర రావడం గమనార్హం. రెండింతలైన బ్యారన్ కౌలు.. ఈ ఏడాది పొగాకు సాగులో వచి్చన లాభాలతో మరోసారి రైతులు పొగాకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొలాలు, బ్యారన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది. ఈ ఫొటోలోని పొగాకు రైతు పేరు రావూరు వెంగళరెడ్డి. ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ళకు చెందిన ఆయన గత 13 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాడు. రెండు బ్యారెన్లు పంట సాగు చేస్తే గతేడాది పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ క్రమంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకు సొంతంగా ఉన్న బ్యారెన్‌తో పాటు మర్రిపాడు మండలం డీసీపల్లిలో మరో ఆరు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇందుకోసం రూ.70 లక్షలు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. అంతకు ముందే అతనికి రూ. 70 లక్షల అప్పు ఉంది. అయితే ముందెన్నడూలేని విధంగా పొగాకు ధరలు పెరగడంతో గతంలో తనకున్న అప్పులన్నీ తీరి మరో పాతిక లక్షల రూపాయల ఆదాయం మిగిలిందని రైతు వెంగళరెడ్డి ఆనందంతో చెప్పాడు. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన ఈ రైతు పేరు గోపిరెడ్డి రమణారెడ్డి. 30 ఏళ్లకుపైగా పొగాకు సాగు చేస్తున్నాడు. మూడు దశాబ్దాలకుపైగా పొగాకు సాగు చేస్తున్నా కుటుంబ అవసరాలు తీర్చడానికే తప్ప ఆరి్థకంగా పెద్దగా ఆదాయం మిగలలేదు. ఈనేపథ్యంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకున్న ఒక్క బ్యారెన్‌తో పాటు మరో మూడు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు పంట సాగు చేశారు. ఈ ఏడాది వేలంలో ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని ఖర్చులు పోను రూ.60 లక్షలకుపైగా ఆదాయం మిగిలిందని సంతోషంగా చెప్పాడు. పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు మేలు చేసింది. మార్కెట్లో డిమాండ్ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్లో నేరుగా మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈ ప్రభావంతో 2021–22 సీజన్ నుంచి పొగాకు మార్కెట్లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి. ప్రస్తుతం 2022–23 సీజన్ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే బోర్డుపై ఒత్తిడి తేవడంతో అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీ ని రద్దు చేశారు. ఇప్పటి వరకు అదనపు పొగాకును అమ్ముకోవాలంటే 5శాతం ఫెనాల్టీ చొప్పున అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు బోర్డుకు చెల్లించాల్సి వచ్చేది. దీని వల్ల ఒక్కొక్క రైతుకు సరాసరిన రూ 40వేల నుంచి 60వేల వరకు లబ్ధి జరిగింది. ఇక స్క్రాప్(పొగాకు ముక్క)ను ఈ ఏడాది నేరుగా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు ముక్కను కూడా వ్యాపారులు కేజీ రూ 150 వరకు వెచి్చంచి కొనుగోలు చేశారు. -
నికోటిన్ పౌచ్‌లు తెలుసా!..దీంతో స్మోకింగ్ ఈజీగా మానేయగలరా?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ చాలామంది ఆ చెడు అలవాట్లకు స్వస్తీ పలకారు. ముఖ్యంగా యువత దీన్ని ఒక ట్రెండ్ లేదా ఫ్యాషన్‌గా భావిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం స్మోకింగ్ చేస్తున్నారు. పెద్దవాళ్ల కుంటపడకుండా జాగ్రత్తపడతూ వక్రమార్గంలో దీన్ని సేవిస్తున్నారు. అదోక వ్యసనంలా మారి..స్మోకింగ్ చేయకుండా ఉండలేని వారికోసం వచ్చిందే ఈ నికోటిన్ పౌచ్‌లు. ఏంటి పోగాకులో ఉండే నికోటిన్ ఇందులోనూ ఉంది కదా! ఆరోగ్యానికి హానికరమే కగా అనేగా మీ సందేహం. అయితే ఇది ఆరోగ్యానకి మంచిదేనట. ఎలాగంటే.. ఈ నికోటిన్ పౌచ్‌లు స్మోకింగ్ చేసే వాళ్లకి ఓ ప్రత్యామ్నాయం అనే చెప్పాలి. ఇది బాగా స్మోకింగ్కి అలవాటు పడ్డవాళ్లకి, స్మోకింగ్ మానేద్దామనుకునేవాళ్లకి మంచి సహాయకారి. ఇందులో నిర్జలీకరణ నికోటిన్ , స్వీటెనర్లు, సువాసనలతో కూడిన మొక్కల ఫైబర్లు ఉంటాయి. ఇది తింటే నోరు దుర్వాసన రాదు. ఇందులో హానికరమైన నికోటిన్ ఉండదు. పైగా ఈ పౌచ్‌లను నోటిలో పెట్టుకుని నమలడం వల్ల వారికి పొగ పీల్చిన ఫీలింగ్ వస్తుందే తప్ప ఏం కాదు. ఆ తర్వాత రాను రాను వారికి తెలియకుండానే స్మోకింగ్ మానేస్తారు. ఇవి 17వ శతాబ్దం నుంచే ఉన్నాయట. అప్పట్లోనే వాటికి మంచి ప్రజాధరణ ఉండేదట. ఇప్పుడు మళ్లీ వాటిని వివిధ ఫ్లేవర్లలో ఇంకాస్తా ఆరోగ్యప్రదాయినిగా తయారుచేస్తున్నారు. వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. అందరిముందు సేవించొచ్చు. కానీ ధుమపానం సేవించినట్లు అవతలివాళ్లకు తెలియదు. ఇక నోరు దుర్వాసన కూడా రాదు. ఇంకోపక్క మీకు స్మోక్చేసిన అనుభూతి మీకు దక్కడమే గాక ఆరోగ్యం కూడా పదిలంగానే ఉంటుంది. ఈ నికోటిన్ పౌచ్‌లో స్వీడన్ విశేష ప్రజాధరణ ఉంది. ధూమాపానం అనే వ్యవసనం నుంచి బయటపడటానికి సులవైన మార్గమే.కానీ ఆయా వ్యక్తుల దృఢంగా నిర్ణయించుకుంటే ఆ చెడు వ్యసనం నుంచి బయటపడగలరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస్తాయా?) -
3 కొత్త పొగాకు వంగడాల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీటీఆర్ఐ) ద్వారా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ గురువారం తెలిపారు. ఎఫ్‌సీఆర్–15 (సీటీఆర్ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది అధిక దిగుబడిని (హెక్టార్‌కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకమన్నారు. ఎఫ్సీజే–11 (సీటీఆర్ఐ నవీన) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకమన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 2,900 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ (ఎస్వీఆర్సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్లో సీటీఆర్‌ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు. -
గుడ్‌న్యూస్: దిగివచ్చిన కేంద్రం.. ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి
సాక్షి, అమరావతి/కొరిటెపాడు (గుంటూరు): పొగాకు రైతుకు శుభవార్త. రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి ఫలితంగా పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2022–23 సీజన్లో 81,635 హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు అనుమతిచ్చింది. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ కారణంగా సగానికిపైగా పొగాకు పంటతోపాటు శనగ, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 2021–22లో కిలో పొగాకు గరిష్ఠంగా రూ.210కు పైగా పలికింది. దీంతో పంటలు దెబ్బతిన్న పొగాకు రైతులతో పాటు ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయం లేక పొగాకు సాగుకు మొగ్గు చూపారు. ఫలితంగా అనుమతికి మించి 85,763.50 హెక్టార్లలో పొగాకు సాగైంది. దీనికితోడు వాతావరణం కాస్త అనుకూలించడంతో హెక్టార్‌కు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. చరిత్రలో ఇదే అత్యధిక దిగుబడి కావడం గమనార్హం. మరోవైపు గతేడాది పొగాకుకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. ప్రస్తుతం సగటున కిలో రూ.245 నుంచి రూ.281 వరకు పలుకుతున్నాయి. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనా ల్టి తో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. గతంలో కూడా ఇలా అనుమతి ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది రెండోసారి విత్తుకోవడం, పంటను కాపాడుకోవడానికి, అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది. అదనపు అ«దీకృత ఉత్పత్తికి పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖమంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు. కర్ణాటకలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట స్థానంలో రెండోసారి విత్తుకున్న సందర్భంలో పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదేరీతిలో రాష్ట్ర రైతులకు కూడా అనుమతినివ్వాలని సీఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాదేశాలతో పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు బృందం ఢిల్లీ వెళ్లి పలుమార్లు సంప్రదింపులు జరిపింది. పెనాల్టీ లేకుండా అదనపు అ«దీకృత పొగాకు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పొగాకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 2022–23 పొగాకు పంట కాలానికి సంబంధించి రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకును, రిజిస్టర్ కాని అనధికారిక పొగాకును బోర్డు వేలం కేంద్రాల్లో అపరాధ రుసుం లేకుండా అమ్ముకోవడానికి అనుమతిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ గెజిట్ విడుదల చేసిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం
-
అధికారుల సూచనలతో పొగాకు పంట.. నాలుగింతల లాభం
-
అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్, ఇటు లో గ్రేడ్ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు. ధరల పెరుగుదల ఇలా.. వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది. డిమాండ్ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వ్యాపారుల్లో పెరిగిన పోటీ... పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది. 70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్ కిలోల పొగాకు అదనంగా వచ్చింది. బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. – మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం పొగాకు సరాసరి ధరలు సంవత్సరం ధర (రూ) 2018–19 126 2019–20 124.55 2020–21 148.54 2021–22 172.49 2022–23 239.43 (వేలం ఇంకా కొనసాగుతోంది) 5182 హెక్టార్లలో అదనంగా సాగు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్ఎల్ఎస్)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు. -
జనం పాలిట ‘పగాకు’
సాక్షి, అమరావతి: పొగాకు మనుషుల పాలిట పగాకులా మారింది. విచ్చలవిడి ధూమపానం అనారోగ్య చీకట్లలోకి నెట్టేస్తుంటే.. పొగాకు గుట్కా, ఖైనీ మనుషుల ప్రాణాలను చిదిమేస్తున్నాయి. దేశంలో ప్రతి ఆరు కుటుంబాలకు ఒక కుటుంబంలోని ఒకరు అంతకంటే ఎక్కువ మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్టు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తులు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. దశాబ్దం క్రితం దేశంలో గుట్కాను నిషేధించినప్పటికీ పాన్‌మసాలా ముసుగులో అనేక కంపెనీలు ఇప్పటికీ వాటిని తయారు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ ప్రాంతంలో విరివిగా పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయని.. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యువాత పొగాకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను.. మరీముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల కంటే ఎక్కువ మంది పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మృత్యువాత పడుతున్నారు. భారత్‌లో అయితే ఏటా మరణాల సంఖ్య 14 లక్షలుగా ఉంటోంది. వారణాసిలో ఇటీవల క్యాన్సర్ బాధితుల డేటా సేకరించగా.. 55 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకంతో ముడిపడి ఉన్నాయని లాన్సెట్ నివేదిక పేర్కొంది. పర్యావరణానికి హానికరంగా.. పొగాకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణంపై కూడా ప్రతికూలత చూపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ఏటా పొగాకు పరిశ్రమ వల్ల 600 మిలియన్ల చెట్లు, 2 లక్షల హెక్టార్ల అటవీ నిర్మూలన, 22 బిలియన్ టన్నుల నీటిని, 84 మిలియన్ టన్నుల కార్బన్‌ను కోల్పోవాల్సి వస్తోంది. విమానయాన పరిశ్రమ విడుదల చేసే హానికర వాయువుల్లో ఐదవ వంతు పొగాకు పరిశ్రమ నుంచి విడుదలవుతున్నాయి. పొగాకు సాగులో పెద్ద మొత్తంలో పురుగు మందులు, ఎరువులు వాడకం నేల నాణ్యతను దెబ్బతీస్తూ.. జీవవైవిధ్యానికి ముప్పును తీసుకొస్తోంది. కాలి్చపడేసిన సిగరెట్ పీకలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి ఏళ్లు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగరెట్ ఖాళీ ప్యాకెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్లతో ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతోంది. ఏటా చైనా 2.6 బిలియన్లు, భారత్ 766 మిలియన్లు, బ్రెజిల్, జర్మనీలు 200 మిలియన్ల డాలర్లకుపైగా పొగాకు ఉత్పత్తుల చెత్తను శుభ్రం చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. పొగాకు ఉత్పత్తిలో మూడో స్థానం భారతదేశం పొగాకు ఉత్పత్తుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉంది. ఇతర దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో సిగరెట్, చుట్ట(స్మోక్డ్ టుబాకో) కంటే గుట్కా, ఖైనీ (స్మోక్లెస్ టుబాకో) వినియోగం అధికంగా ఉంటోంది. దేశ జనాభాలో దాదాపు 21 శాతం (199.4 మిలియన్) ప్రజలు స్మోక్లెస్ టుబాకోను, 10.7 శాతం మంది (99.5 మిలియన్లు) పొగాకు ఉత్పత్తులను (స్మోక్డ్ టుబాకో) వినియోగిస్తున్నారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్య ప్రమాదాలకు దారి తీస్తోంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం క్యాన్సర్ నిర్ధారణ తర్వాత కూడా ధూమపానం చేసిన రోగుల్లో గుండె జబ్బులు రెట్టింపు అవుతున్నాయని, ధూమపానం మానేసిన వారిలో స్ట్రోక్ ప్రమాదం చాలా తక్కువని పేర్కొంది. -
ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు వ్యతిరేక హెచ్చరికల ప్రకటనను ఇకపై ఓటీటీలో కూడా ప్రసారం చేయాలని ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ మేరకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేదిస్తూ 2004నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘పొగాకు వినియోగం క్యాన్సర్ కారకం’, ‘పొగాకు వినియోగం ప్రాణాంతకం’అని థియేటర్స్‌లో ప్రదర్శించినట్లే..ఇకపై ఓటీటీ కార్యక్రమాల్లోనూ కనీసం 30 సెకన్ల పాటు ప్రదర్శించాలని ఉత్తర్వూల్లో పేర్కొంది. అంతేకాదు ఈ హెచ్చరిక ప్రకటన ఓటీటీ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని ఆదేశించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరోగ్య, సమాచార ప్రసార శాఖ ప్రతినిధులు కఠిన చర్యలు తీసుకుంటారని కేంద్రం హెచ్చరించింది. దీంతో ఇప్పటి వరకు సినిమా థియేటర్లు, టీవీల్లో కనిపిస్తున్న ఈ పొగాకు వ్యతిరేక యాడ్స్ ఇక ఓటీటీల్లోకి కూడా రానున్నాయి. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఓటీటీల్లో పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాలనే నిబంధన తీసుకొచ్చింది. -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
ఆహారభద్రత కమిషనర్‌కు ఆ అధికారం లేదు
సాక్షి, అమరావతి: ఆహారభద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద గుట్కా, పాన్‌మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయం, సరఫరా, పంపిణీ తదితరాలను నిషేధించే అధికారం ఆహారభద్రత కమిషనర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పొగాకు, పొగాకు ఉత్పత్తులు ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రావని చెప్పింది. ఎఫ్ఎస్ఎస్ఏ కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు తదితరాలను నియంత్రించే అధికారం మాత్రమే కమిషనర్‌కు ఉందని, నిషేధం విధించే అధికారం లేదని తెలిపింది. కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పొగాకు ఉత్పత్తులు కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోకి వస్తాయని, అందువల్ల ఆహారభద్రత కమిషనర్ జారీచేసిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమంటూ పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పొగాకు, పాన్‌మసాలా, గుట్కా తదితర పొగాకు ఆధార ఉత్పత్తుల సేవనం ఆహార నిర్వచన పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశాన్ని సింగిల్ జడ్జి ధర్మాసనానికి నివేదించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే ధర్మాసనం విచారించి తీర్పు చెప్పింది. పిటిషనర్ల రోజువారీ చట్టబద్ధ కార్యకలాపాల్లో ఏ రకంగాను జోక్యం చేసుకోవద్దని, ఎఫ్ఎస్ఎస్ఏ కింద జప్తుచేసిన సరుకును తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవారిపై ఎఫ్ఎస్ఎస్ఏ కింద ఎలాంటి కఠినచర్యలు తీసుకోవద్దని పేర్కొంది. -
బడ్జెట్ 23: పొగరాయుళ్లకు ఝలక్, భారీగా పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక సర్వేను కూడా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి మార్గం సుగమం చేసే అనేక కొత్త పన్ను సంస్కరణలు ,రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు పొగాకు, దాని ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా అలాగే సిగరెట్లపై ప్రత్యేక పన్నును శాతాన్ని పెంచ నున్నారనీ , ఇది ధరలలో పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు,యూపీఐ, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇన్సెంటివ్‌లు ,తదితర పన్ను సంబంధిత స్కీమ్‌లపై ఎక్కువగా అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపెరగుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా దాదాపు గత రెండేళ్లుగా సిగరెట్ ధరలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను జీఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే,ఈ సంవత్సరం బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకం (ఎన్సీసీడీ) పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో వాటా 10 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దానిని పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై ఎన్సీసీడీ సాధారణంగా ఐటీసీ లాంటి తయారీ కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ఎన్సీసీడీ భారీ పెంపు వైపు కేంద్రం మొగ్గు చూపితే, అనివార్యంగా ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి. -
ఏపీలో పొగాకు రైతులను ఆదుకోండి : ఎంపీ మాగుంట
-
‘అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?’
లక్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్‌వాది పార్టీ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్‌గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్‌వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్‌నిగంధ బాక్స్‌ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक! महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे। इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे। बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 pic.twitter.com/822d0fQDG7 — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చిన భారత్ -
పొగాకు ఉత్పత్తులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక కొత్తగా..!
న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌లపై డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ‘టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్’ అనే కొత్త ఆరోగ్య హెచ్చరిక, కొత్త చిత్రం ముద్రితమవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవి ఏడాది పాటు కొనసాగుతాయని వివరించింది. 2023 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రమాదాన్ని తెలిపే మరో కొత్త చిత్రంతోపాటు ‘టొబాకో యూజర్స్ డై యంగర్’ అని ముద్రితమవుతుందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రూల్స్–2008 చట్టానికి 2022 జూలై 21వ తేదీన చేసిన సవరణ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారు, దిగుమతి దారు, పంపిణీదారులు ఎవరైనా సరే ఈ హెచ్చరికలను ముద్రించకుంటే జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోందని హెచ్చరించింది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
ఒక సిగరెట్ మీ జీవితకాలాన్ని ఎంత తగ్గిస్తుందో తెలుసా!
సాక్షి, విజయనగరంఫోర్ట్: ధూమపానం కారణంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురైన ప్రతి ముగ్గురులో ఒకరు ధూమపానం కారణంగానే ప్రమాదకర పరిస్థితికి చేరుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సిగరెట్, చుట్టు తాగడం ఫ్యాషన్ మారి ఒకరి నుంచి మరొకరు అలవాటు చేసుకుంటున్నారు. జిల్లాలో పొగతాగే వారు 30 శాతం వరకు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సిగరెట్ కాలిస్తే జీవితకాలం నిమిషం తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం చేసే వారితో పాటు పక్కనున్న వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో నిరాక్షరాస్యులు, గ్రామీణులు ఎక్కువుగా సిగరెట్, చుట్టలు తాగేవారు. కాని నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ పొగ తాగుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా వ్యసనానికి బానిస కావడం ఆందోళన కలిగించే విషయం. పొగ తాగుతున్న వారిలో 8 శాతం మంది యువత ఉండడం గమనార్హం. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి.. సిగరెట్, చుట్ట తాగడం వల్ల ప్రాణంతకమైన క్యాన్సర్ వ్యాపించే అవకాశం ఉంది. గొంతు, నోరు, ఊపరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు క్రానిక్ బ్రాంక్లైటీస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఏడాదికి జిల్లాలో క్యాన్సర్ బారిన 2 నుంచి 5 శాతం మంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్స్తో మరో పది శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. గుర్తించకపోవడంతో ప్రమాదం.. గొంతు, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా గుర్తించకపోవడం వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి రూ.1.20 కోట్లు అన్ని రకాల వర్గాల వారికి సిగరెట్లు, చుట్టలు అంటుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఏడాదికి 1.20 కోట్ల వరకు ధూమపానానికి ఖర్చు చేస్తున్నారు. జీవితకాలం తగ్గిపోతుంది.. సిగరెట్లు తాగడం వల్ల జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఊపరితిత్తులు, గొంతు, అన్నవాహిక, మూత్రాశ్రయం, లివర్ పాడవుతాయి. – వి. విజయ్, పలమనాలజిస్ట్, విజయనగరం -
వినూత్న అవగాహన కార్యక్రమం... యాష్ట్రేల ప్రదర్శన
మద్దిలపాలెం (విశాఖతూర్పు) : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మానడం లేదు. పొగచూరిపోతున్న యువతరాన్ని మేల్కోపేందుకు ఓ విశ్రాంతి ఉద్యోగి వినూత్న ప్రయాత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్వం ధూమపానం ప్రియు లు వినియోగించే యాష్ ట్రేలను సేకరించి వాటిని ప్రతి ఏడాది పొగాకు రహిత దినోత్సవం నాడు ప్రదర్శిస్తున్నారు. పొగాకు వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నట్టు జేఆర్‌నగర్ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా సహకార బ్యాంకు మేనేజర్ జి.ఎస్.శివప్రకాష్ చెప్పారు. సోమవారం తన నివాసంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యాష్ ట్రేలు వారి వ్యసనానికి సాక్షిగా నిలిచాయని నేటి తరానికి తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు. ధూమపానం వలన పర్యావరణానికి ఎంతో చేటు కలుగుతుందని ఆ వ్యసానానికి దూరంగా యువతరం ఉండేలా తన వంతు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పొగాకు నిర్మూలనతోనే వ్యాధుల నివారణ ఎంవీపీకాలనీ: పొగాకు నిర్మూలనతోనే నేడు సమాజాన్ని పీడిస్తున్న అనేక వ్యాధులకు నివారణ సాధ్యమవుతుందని మహాత్మగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డబ్లుహెచ్‌ఓ ఈ ఏడాది నినాదం ‘పర్యావరణం కాపాడుదాం’ అంశంపై ఆయన సోమవారం ఎంవీపీ కాలనీలోని ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. సమాజంలో సంభవిస్తున్న ఎక్కువ వ్యాధులకు, మరణాలకు పొగాకే కారణంగా నిలుస్తోందన్నారు. క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్, ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయన్నారు. దీంతో పాటు సిగరెట్ పీకలలో వాడే మైక్రో ప్లాస్టిక్, నాన్ బయోడిగ్రేడబుల్ పౌచ్‌ల ద్వారా మట్టి పెద్ద ఎత్తున కలుషితం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నినాదం పర్యావరణం కాపాడుదాం విజయవంతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలన్నారు. దేశంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18 వేల కోట్లు ఆదాయం వస్తుండగా వాటి వినియోగించడం ద్వారా వ్యాధుల భారిన పడుతున్న వారి చికిత్సకు రూ.లక్ష కోట్లు ఖర్చువుతుందన్నారు. క్యాన్సర్ మరణాలు అయితే 20శాతానికి పైగా పొగాకు వాడకం ద్వారానే వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు నిర్మూలపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పొగాకు పండించే రైతులకు పత్యామ్నాయమార్గాలు చూపించడం, పొగాకు వాడకం ద్వారా వచ్చే నష్టాలపై ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతం చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి తరఫున ఏటా పదుల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రజలను పొగాకు రహిత జీవనంపై చైతన్యం కలిగిస్తున్నట్లు తెలిపారు. -ఎంజీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ (చదవండి: ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’) -
భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
Allu Arjun Rejects Commercial Ad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రస్తుతం ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి కారణం బన్నీ ఓ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడట. కోట్లు ఆఫర్ చేసిన ఓ బ్రాండ్ ప్రకటనకు ఈ స్టైలిష్ స్టార్ నో చెప్పాడని సమాచారం. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కంపెనీ బన్నీకి భారీ ఆఫర్ ఇచ్చిందట. చదవండి: ‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్ కొరటాల ప్రముఖ పొగాకు కంపెనీ తమ ప్రకటనలో నటించేందుకు బన్నీని సంప్రదించగా.. దీనికి అతడు నో చెప్పాడటని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే తమ ప్రకటనలో నటించేందుకు సదరు పొగాకు కంపెనీ అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసిందట. అయినప్పటికీ పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అలాంటి ఉత్పత్తులను తాను ప్రమోట్ చేయనని సదరు కంపెనీ యాజమాన్యానికి బన్నీ బదులిచ్చాడట. అంతేకాదు తాను దుమ్మ పానం చేయననని, అలాంటప్పుడు ఇతరులను ఈ ఉత్పత్తులు వినియోగించమని ఎలా చెప్పగలను అన్నాడట. చదవండి: అక్కినేని ఫ్యామిలీలో మోగనున్న పెళ్లి బాజాలు..! అంతేగాక ఇది తన ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టిస్తుందని, అందుకే ఈ ప్రకటనలో నటించనంటూ బన్నీ ఈ ఆఫర్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కోట్ల రూపాయలు ఇచ్చే ఆఫర్‌ను తీరస్కరించడంపై అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బన్నీ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఏప్రిల్ 8వ తేదీన ఆయన బర్త్‌డే సందర్భంగా భార్య స్నేహరెడ్డి, పిల్లలతో కలిసి సెర్భియాకు టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇండియాకు వచ్చిన బన్నీ తిరిగి పుష్ప పార్ట్ 2 షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై రేపటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: మ్యూచువల్ బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కాటమనేని భాస్కర్ హెచ్చరించారు. -
ఆడపిల్లల్లోనూ స్మోకింగ్ కల్చర్.. ప్రతి పదిమందిలో ఒకరికి!
సాక్షి, అమరావతి: మన దేశంలో యుక్తవయసు ఆడపిల్లల్లో పొగతాగే అలవాటు పెరుగుతుందా? ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఒకరికి ఈ అలవాటుందా? అంటే అవుననే అంటోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. 2019–21 సంవత్సరాల కాలానికి జరిగిన ఈ సర్వే చెబుతున్న ప్రకారం 15 ఏళ్లు లేదా అంతకు మించిన వయసున్న వారిలో.. పట్టణ ప్రాంతాల్లోనైతే 9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 10.5 శాతం మంది ఆడపిల్లలు, మహిళలు పొగాకును ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లు తేలింది. అదే పురుషుల్లోనైతే దేశవ్యాప్తంగా పొగరాయుళ్ల శాతం 38గా ఉంటే పల్లెల్లో 42.7 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పొగాకును వినియోగించే పురుషుల శాతం 28.8గా, మహిళల శాతం 5.4గా ఉంది. ఆల్కహాల్‌పై అప్రమత్తత.. ఇక ఆల్కహాల్ విషయానికి వస్తే 15 ఏళ్లు, ఆపైన వయసున్న పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 19 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 16.5 శాతం మంది తాగుతున్నారు. ఆల్కహాల్ వ్యవహారంలో మహిళలు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. మొత్తంగా కేవలం 1.3 శాతం మంది మహిళలు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు అంగీకరించారు. పొగాకు, ఆల్కహాల్ వినియోగంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయడం ఇదే ప్రథమం. పురుషులు, మహిళల వారీగా లెక్కలు తీయడం కూడా ఇదే మొదటిసారి. ఒబేసిటీ (అధిక బరువు), క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న గ్రూపులను గుర్తించడం, ఒకవేళ అటువంటి ముప్పున్న వర్గాలకు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయాలి వంటి ఆరోగ్య సమస్యలపై ఈ సర్వే దృష్టి సారించింది. 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో కేవలం 1.9 శాతం మంది మాత్రమే ముందస్తుగా సెర్వికల్ క్యాన్సర్ వంటి పరీక్షలు చేయించుకుంటున్నట్లు సర్వేలో తేలింది. రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న మహిళల సంఖ్య మరింత స్వల్పంగా ఉండడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో వీరి శాతం 1.2గా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా అంటే కేవలం 0.7 శాతంగా ఉంది. మొత్తంగా కలిపి చూస్తే దేశవ్యాప్తంగా 0.9 శాతం మంది మహిళలు మాత్రమే ముందస్తుగా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. పెరుగుతున్న ఒబేసిటీ.. రోజురోజుకు మారుతున్న జీవన విధానం, ఆహారం, ఇతర అలవాట్లతో ఆరోగ్య సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. మహిళల్లో పోషకాహార లోపాన్ని సైతం గుర్తించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో 2015–16లో ప్రతి ఐదుగురిలో ఒకరు ఒబేసిటీతో బాధపడితే ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. గతంలో పురుషుల శాతం 18.9గా ఉంటే ఇప్పుడది 22.9కి చేరింది. ప్రస్తుత సర్వేలో 6,36,699 ఇళ్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషుల నుంచి సమాచారాన్ని సేకరించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019 జూన్‌లో ప్రారంభమైన సర్వే రెండు విడతలుగా సాగి ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. -
పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్ విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల వినియోగంలో ప్రపంచస్థాయిలో అమ్మాయిలు అబ్బాయిలను మించిపోయారు. పాఠశాల స్థాయిలో ఇది ఎక్కువగా ఉంది. 15 ఏళ్లలోపు విద్యార్థులు వివిధ రూపాల్లో పొగాకు వినియోగానికి ఆకర్షితులవుతున్నారు. తోటి విద్యార్థులను చూసి సరదాగా మొదలుపెట్టినవారు ఆ తరువాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. యువత టొబాకో వినియోగంపై గ్లోబల్ యూత్ టొబాకో నిర్వహించిన సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచస్థాయిలో పొగాకు వినియోగంలో అబ్బాయిలు 22శాతం ఉంటే... అమ్మాయిలు 24శాతం. అంటే రెండు శాతం ఎక్కువగా అమ్మాయిలు పొగాకు ఉత్పత్తులను ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు. ధూమపానంలో కూడా అమ్మాయిలదే పైచేయి. మొత్తంగా 2.3శాతం విద్యార్థుల్లో– అమ్మాయిలు 2.7%, అబ్బాయిలు 1.9% పొగ తాగుతున్నారు. 12 శాతం విద్యార్థులు (13% అమ్మాయిలు, 12% అబ్బాయిలు) వివిధ పొగాకు ఉత్పత్తులను (స్మోక్లెస్ టొబాకో) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో మేలు.. యువత పొగాకు వినియోగ పర్యవేక్షణకు ‘గ్లోబల్ టొబాకో సర్వేలెన్స్ సిస్టమ్’ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో గ్లోబల్ యూత్ టొబాకో సర్వే–4 నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి స్కూళ్లలో (550 ప్రభుత్వ, 450 ప్రైవేట్ పాఠశాలలు)ని దాదాపు లక్ష మంది (80 వేలకు పైగా 13–15 ఏళ్ల వయసున్న) విద్యార్థులపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయిలో 2003తో (16.9 శాతంతో) పోల్చితే దేశంలో ఈ వయసు పిల్లల్లో పొగాకు వినియోగం 2019లో 8.5 శాతానికి తగ్గినట్టుగా ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా చూస్తే... భారత్‌లో అబ్బాయిలు–9.6%, అమ్మాయిలు–7.4% పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరిలో 7.3% (అబ్బాయిలు–8.3%, అమ్మాయిలు–6.2%) పొగాకు పొగరూపంలో పీలుస్తున్నారు. 2.6% మంది సిగరెట్ల రూపంలో పొగ తాగుతున్నారు. 2.1% మంది బీడీల రూపంలో పొగ పీలుస్తున్నారు. 4.1% (అబ్బాయిలు–4.6%,అమ్మాయిలు–3.4 %) పొగలేని పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. సరదాగా మొదలై వ్యసనంగా... ‘వివిధ రూపాల్లో పొగాకు వినియోగం మొదట్లో తోటి విద్యార్థుల ›ప్రోద్బలం, ఒత్తిళ్లతో సరదాగా మొదలవుతుంది. ఇది అలవాటయ్యాక ఇతరుల నుంచి తప్పించుకుని రహస్యంగా స్మోకింగ్ కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇతరుల ఎదుట ధైర్యంగా పొగతాగగలుగుతారు. ఈ అలవాటును తల్లిదండ్రులు ముందే నివారించాలి. మొదలుపెట్టినవారిని మానిపించేందుకు ప్రయత్నించాలి’అని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ సెక్రటరీ జనరల్ డా.అభిషేక్ శుక్లా చెబుతున్నారు. అత్యల్ప పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు... ► హిమచల్‌ప్రదేశ్–1.1శాతం ► కర్ణాటక–1.2 ►గోవా–2.1 ► దాద్రా, నగరహవేలి–2.4 ►ఆంధ్రప్రదేశ్–2.6 ► చంఢీగఢ్–3.0 ► కేరళ–3.2 ►హరియాణ–3.8 ►మధ్యప్రదేశ్–3.9 ► రాజస్థాన్–4.1 తెలంగాణ–5.2 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. అత్యధిక పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు... ► మిజోరామ్–57.9 శాతం ►అరుణాచల్‌ప్రదేశ్–57.9 ► నాగాలాండ్–42.6 ► మేఘాలయా–33.6 ►సిక్కిం–24.8 ►యూపీ–22.9 ► మణిపూర్–19.5 ► ఉత్తరాఖండ్–18.5 ► అస్సాం–11.9 ►జమ్మూ,కశ్మీర్–లఢాక్–11.2 పొగ తాగుతున్న ప్రదేశాలు ►ఇళ్ల దగ్గర–23.5 శాతం ►స్కూళ్ల వద్ద–19.5 ►స్నేహితుల ఇళ్ల వద్ద–16.7 ►ఫంక్షన్లు, కార్యక్రమాల్లో–8.7 ►బహిరంగప్రదేశాల్లో–12.2 ► ఇతరచోట్ల–19.4 శాతం -
చిన్నవయసులోనే ఊదేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: పాఠశాలకు వెళ్లే చిన్న వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు కూడా పొగాకు ఉత్పత్తులు వాడటం, బీడీ, సిగరెట్లు తాగడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే ఈ వయసు వారు తెలంగాణలో 5.2 శాతం మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని తేలింది. 13 నుంచి 15 ఏళ్ల వయసు పాఠశాల విద్యార్థులు ఎంత స్థాయిలో పొగాకు వినియోగిస్తున్నారనే దానిపై గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జీవైటీఎస్) జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే వివరాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. మనదేశంలో 2003, 2006, 2009, 2019లో నాలుగు రౌండ్లలో ఈ సర్వే జరిగింది. పొగాకు వినియోగం, మానేయడం, పడేసిన సిగరెట్ పీకలు తాగడం, మీడియా సందేశాలు, ప్రకటనలు, పొగాకు ఉత్పత్తుల లభ్యత, పొగాకు వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానం వంటి అంశాలపై 2019లో సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా 987 పాఠశాలల (544 ప్రభుత్వ, 443 ప్రైవేటు)కు చెందిన 97,302 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిగినా రాష్ట్రాల వారీగా అన్ని వివరాలను ప్రకటించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఎంత శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న సమాచారాన్నే కేంద్రం వెల్లడించింది. సర్వేలోని ముఖ్యాంశాలు.. ►13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను వినియోగించడంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ 20వ స్థానంలో ఉంది. ►అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో అత్యధికంగా 57.9 శాతం చొప్పున పొగాకు ఉత్పత్తులను ఆ వయసు విద్యార్థులు వినియోగిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా 1.1 శాతం మంది వినియోగిస్తున్నారు. ►దేశవ్యాప్తంగా 9.6 శాతం బాలురు, 7.4 శాతం బాలికలు పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ►పట్టణాల్లో 5.5 శాతం మంది, పల్లెల్లో 9.4 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు. ►7.3 శాతం విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండగా, అందులో 8.3 శాతం అబ్బాయిలు, 6.2 శాతం అమ్మాయిలు ఉన్నారు. ►2003లో సిగరెట్ తాగేవారు 4.2 శాతం ఉండగా, 2006లో 3.8 శాతం, 2009లో 4.4 శాతం, 2019లో 2.6 శాతం ఉన్నారు. ►2019లో బీడీ తాగేవారు 2.1 శాతం ఉన్నారు. 2009లో 5.3 శాతం ఉన్నారు. ►ఈ–సిగరెట్ తాగేవారు 2.8 శాతం మంది ఉన్నారు. ►వయసు కారణంగా 54.7 శాతం మంది సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇబ్బందిపడ్డారు. ►పొగతాగే వారిలో 25 శాతం మంది అబ్బాయిలు, 13 శాతం మంది బాలికలు పొగ మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే 21 శాతం మంది మానేయాలని భావిస్తున్నారు. ►పొగ తాగే పాఠశాల విద్యార్థుల్లో 78 శాతం మంది దుకాణం, పాన్‌షాప్, వీధి విక్రయ కేం ద్రాల నుంచి సిగరెట్లు లేదా బీడీలు కొనుగోలు చేశారు. ►71 శాతం మంది విద్యార్థులు సిగరెట్ తాగడం తమకు హానికరమని భావించారు. ఆరోగ్యంపై పెను ప్రభావం ఆ వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రత్యక్షంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి, చాలా జబ్బులకు కారణమవుతుంది. దేశంలో 40 శాతం టీబీ కేసులకు పొగ తాగడమే ప్రధాన కారణం. నోటి, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
రఘునందన్ ఓ వన్ మ్యాన్ మిషన్
హైదరాబాద్: ఉద్యోగం చేస్తూనే.. పొగాకు నియంత్రణకు విశేష కృషి చేస్తున్న మాచన రఘునందన్‌ను ఒక వన్ మ్యాన్ మిషన్‌గా అభివర్ణించవచ్చు అని చండీగఢ్‌కు చెందిన రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సోనూ గోయల్ అన్నారు. బీబీనగర్ ఏయిమ్స్ సందర్శనకు వచ్చిన అయనను రఘునందన్ హైదరాబాద్ మారియట్ హోటల్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య సోనూ గోయల్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సమాజ హితం కోసం మాచన రఘునందన్ చేస్తున్న పొగాకు నియంత్రణ కృషి ఒక అసాధారణమైన యజ్ఞం వంటిది అని ఉదహరించారు. తమ స్వార్థం తాము చూసుకునే నేటి తరంలో కూడా ఒక వ్యక్తి తన శక్తికి మించి సమాజానికి తన వంతు సాయం చెయ్యడం ఆదర్శప్రాయం అని అభినందించారు. యువత ముఖ్యంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండేందుకు ఐదు "డీ" ల సూత్రం అమలు చేయాలని సూచించారు. డీలే , డైవర్ట్, డూ యోగా, డ్రింక్ వాటర్, డూ ఎనీ థింగ్ అన్న పంచ సూత్రాలు ఆచరించాలన్నారు. దీంతో యువత పొగాకు, ధూమపానం అలవాటుకు దూరంగా ఉండే ప్రత్యామ్నాయ ఆలోచన మార్గాలు ఉత్తమంగా పని చేస్తాయని చెప్పారు. పొగాకును నిషేధించే కంటే దాని ప్రభావాలను ప్రజలకు వివరించి మానేయడానికి కృషి చెయ్యటమే గొప్ప ఫలితం ఇస్తుందని వివరించారు. -
ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, ముఖ్యంగా యువతకు రూ.2 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీని కోసం మీరు ఒక పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన విజేతలకు నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తోంది. దీని కోసం స్పెషల్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులొ పాల్గొని గెలిస్తే రూ.2 లక్షలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.2 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకోవాలంటే మీరు పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలపై కనీసం 30 సెకన్లు, గరిష్టంగా 60 సెకన్ల గల ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనవచ్చు. అయితే, మీరు తీసిన వీడియోను జూన్ 30 లోపు ఘాట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, వారి బంధువులు ఇందులో పాల్గొనడానికి అనర్హులు. మరిన్ని వివరాల కొరకు https://www.mygov.in/task/short-film-making-contest ఈ లింక్ మీద క్లిక్ చేయండి. Have you shared your entry for the short film Anti-Tobacco spot competition, yet? Hurry up, visit: https://t.co/YXfZarazpv now and stand a chance to win a cash prize of ₹2,00,000. @MoHFW_India @drharshvardhan pic.twitter.com/tdyqXNQqS0 — MyGovIndia (@mygovindia) June 11, 2021 ప్రైజ్ మనీ వివరాలు: 1వ బహుమతి: 2,00,000/- 2వ బహుమతి: 1,50,000/- 3వ బహుమతి: 1,00,000/- అలాగే మరో పది మందికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
World No Tobacco Day 2021: ధూమపానం.. పోవును ప్రాణం
సంవత్సర కాలం పైగా మృత్యు ఘంటికలు మోగిస్తూ అందరినీ కలిచి వేస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతోంది కరోనా. కరోనాకు బలై ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆక్సిజన్ అందక మరణించేవారే ఎక్కువ. ఊపిరితిత్తుల ఊపిరి తీస్తున్న అనేక కారకాలలో పొగాకు ముఖ్యమైనది. పొగాకు హుక్కా, చుట్ట,బీడీ, సిగరెట్, ఖైనీ తదితర రూపాలలో మార్కెట్లో అందరికీ చేరువలో లభ్యమయ్యే గొప్ప మత్తు పదార్థం. పొగ తాగడం వల్ల నోటి దుర్వాసన, గొంతు వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కఫం, దగ్గు, దమ్ము, ఆయాసం, గుండె కవాటాలు మూసుకుపోయి గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్ లాంటివెన్నో రోగాలు వస్తాయి. సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్ 7ను ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించి విజృంభిస్తున్న పొగాకు మహమ్మారి నుండి ప్రజలను చైతన్య పరచడంకోసం 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. పొగాకు వాడకంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి మరిచి సిగరెట్ ఈజ్ మై సీక్రెట్ అంటూ బాధలో, సంతోషంలో, విందులో, వినోదాల్లో, టీ తాగాక ఒకటి, భోంచేశాక ఒకటి ,ఏం తోచట్లేదని ఒకటి అంటూ టైంపాస్‌కి గుటగుట నాలుగు గుటకలు మింగి ఊపిరితిత్తుల్లో పొగను నింపి ఆరోగ్యం క్షీణించాక ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. మత్తును,ఉద్రేకాన్ని కలిగించే స్వభావం కల నికోటిన్, ఏడువేల రకాల విషతుల్యమైన క్యాన్సర్ కారకాలు గల పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. కాబట్టి ఇప్పటికైనా యువత పొగాకు సేవనం వల్ల కలిగే నష్టాలపై జాగరూకులై, దీని బారిన పడకుండా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. - కమలేకర్ నాగేశ్వర్ రావు అచ్చంపేట, 98484 93223 పొగాకుపై సమగ్ర వ్యూహమేది? మారుతున్న కాలానుగుణంగా నేటి యువతకు ధూమపానం అలవాటుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు, అనారోగ్య కారకాల్లో ధూమపానం మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ధూమపానం చేస్తున్న వారిలో 22.6 కోట్ల మంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సర్వేలో తెలిపింది. భారత్‌లో 5,500 మంది ఏటా ఈ వ్యసనానికి దాసోహం అవుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ ఏడాది ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం‘ను ’పొగాకు త్యజించు – జీవితాన్ని జయించు’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. ప్రభుత్వం 2003లో పొగాకు ఉత్పత్తుల నిషేధంపై చట్టం చేయగా, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని 2008లో నిషేధించింది. ఐనప్పటికీ పొగాకు వినియోగం, ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే రెండవ స్థానం ఆక్రమించింది. పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వారిలో మొత్తం 81 లక్షల మంది పొగరాయుళ్ళు తగ్గారని సర్కారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 30 కోట్ల మంది బాధితులుగా మారుతున్నారు. ఏటా 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం పొగాకుతో మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాల కేన్సర్లు వస్తాయని వివిధ అధ్యయనాల ద్వారా తేలింది. ధూమపానాన్ని వదిలేసినా దాని దుష్ప్రభావం మూడు దశాబ్దాల పాటు ఉంటుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు.. మూడు శాతం మంది పొగరాయుళ్ళు మాత్రమే ఆ అలవాటును మానుకోగలరన్న పార్లమెంటరీ స్థాయీసంఘం అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కిరాణా షాపులలో, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. వాటి ప్రకటనలు, బహిరంగ ధూమపాన నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ధూమపానం అరికట్ట కలిగితే ఆరోగ్య భారతాన్ని నిర్మించగలుగుతాం. పొగాకును పూర్తిగా నిషేధించేలా పటిష్ట వ్యూహం పట్టాలకెక్కితేనే ప్రజారోగ్యానికి భరోసా! - గుమ్మడి లక్ష్మీనారాయణ కొత్తగూడెం, మహబూబాబాద్, మొబైల్: 94913 18409 -
ఊపిరి పీల్చుకున్న సిగరెట్ కంపెనీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తుల మీద పన్నుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు 6.5 శాతానికి పైగా పెరిగాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఇతర సిగరెట్ తయారీ సంస్థల షేర్ ధరలు కూడా పెరిగాయి. విఎస్టి ఇండస్ట్రీస్, గోల్డెన్ టొబాకో, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీల షేర్లు కూడా 2.06 శాతం, 7.94 శాతం, 0.83 శాతం పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున బడ్జెట్ కు ముందు పొగాకు, మద్యం వంటి వాటిపై పన్ను పెంపు ఉంటుందని అందరు భావించారు. కానీ ఎటువంటి పెంపులేకపోవడంతో సిగరెట్ తయారీ దారులు ఊపిరి పీల్చుకున్నారు.(చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!) వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ప్రవేశపెట్టిన అగ్రిసెస్‌ను మద్యం మీద ప్రవేశపెట్టారు. కానీ, పొగాకు ఉత్పత్తులపై మీద విధించలేదు. ఐటీసీ, ఇతర సిగరెట్ తయారీ సంస్థల స్టాక్స్ బడ్జెట్ ప్రకటనకు ముందు ఎక్కువ మంది తమ స్టాక్స్ ను అమ్ముకోవడాని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో సిగరెట్ తయారీ సంస్థలు కొంచం ఉపశమనం లభించింది. బ్రోకరేజ్ సంస్థ ఎడెల్విస్ సెక్యూరిటీస్ ప్రకారం, ఈ ఏడాది బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై పన్నుల పెంపు విధించే అవకాశం తక్కువగా ఉంటుంది అని అంచనా వేసింది. ఎందుకంటే గత ఏడాది 2020 బడ్జెట్ లో ఎక్కువ మొత్తంలో పన్ను విధించారు. -
'పొగ'కు చెక్ పెడదాం
సాక్షి, అమరావతి: స్కూళ్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు.. సిగరెట్, బీడీ, గుట్కా వంటి వాటి వాసన ఉండకూడదు. పొగ పొడ సూపకూడదు. స్కూలు, దాని పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలి. చిన్నతనం నుంచే పొగ అంటే చిన్నారులకు తెలియకూడదు. దాని ప్రభావానికి అసలే లోనుకాకూడదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా స్మోక్ ఫ్రీ జోన్స్‌గా స్కూళ్లను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం దీనిపై మార్గదర్శకాలు రూపొందించగా.. వాటిని అమలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లను స్మోక్ ఫ్రీ జోన్లుగా అమలు చేస్తోంది. ఈ కేటగిరీల్లో పక్కాగా నిబంధనలు ► పొగ తాగే వారే కాదు.. అసలు పొగ ఆనవాళ్లు స్కూలు చుట్టూ కనిపించకూడదు. స్కూలులో పనిచేసే టీచర్లే కాకుండా స్కూలు డ్రైవర్లు పొగ తాగినా నేరమే. ► ప్రతి స్కూలులో ముఖ ద్వారం వద్ద, లోపల గోడలపైన ‘టొబాకో లేని స్కూలు’ అని బోర్డులు తగిలించాలి. స్కూలు కాంపౌండ్‌కు 100 గజాల పరిధిలో బీడీలు, సిగరెట్లు, గుట్కా దుకాణాలు కనిపించకూడదు. ► పొగతో కలిగే హాని ఎలాంటిదో తెలిపే స్టిక్కర్లు స్కూలు గోడలపై కనిపించాలి. స్కూలు ఆవరణలో ఎవరైనా పొగ తాగితే వారిపై చర్యలు తీసుకునే అధికారి, హోదా, ఫోన్ నంబరు గోడపై రాసి ఉండాలి. ► 6 మాసాలకోసారి టొబాకో నిర్మూలనపై విద్యార్థులతో టీచర్లు చర్చించాలి. ఎవరైనా పొగ తాగితే వారిపై తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకూ తెలియజేయాలి. రోజుకు 3,500 మంది మృతి ► దేశంలో పొగాకు వాడకం కారణంగా రోజూ 3,500 మంది మృతి చెందుతున్నారు. దేశంలో 9.95 కోట్ల మంది ఏదో ఒక రూపేణా పొగాకు ఉపయోగిస్తున్నారు. 19.94 కోట్ల మంది పొగలేని పొగాకు వాడుతున్నారు. ► ఒక్కొక్కరు సగటున సిగరెట్‌కు నెలకు రూ.1,192, బీడీలపై రూ.284 వ్యయం చేస్తున్నారు. ఏటా 13 లక్షల మంది పొగాకు కారక క్యాన్సర్లతో మృతి చెందుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడించింది. -
పొగాకు నుంచి కోవిడ్ వ్యాక్సిన్?
లండన్: పొగాకు నుంచి కరోనా వ్యాక్సిన్ రానుందా అంటే అవుననే చెబుతోంది బ్రిటిష్ అమెరికన్ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్ సిగరెట్స్. ఆ కంపెనీకి చెందిన కెంటకీ బయో ప్రాసెసింగ్ తయారు చేస్తున్న వాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పింది. పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్‌తో వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. దీనికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి రావాల్సి ఉందని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కింగ్ స్లే వీటన్ చెప్పారు. కోవిడ్ జెనెటిక్ సీక్వెన్స్‌ను పరిశీలించాక దాన్ని పొగాకులోని ప్రొటీన్లతో అణచివేయవచ్చని ఈ దిశగా ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు స్ట్రైక్స్ సిగరెట్స్ సంస్థ ఇటీవలే తెలిపింది. ఆరు వారాల్లోనే ఈ వాక్సిన్ తయారు చేయవచ్చని అప్పట్లో తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తిదారులు కూడా ఈ తరహా ప్రయోగాలు మొదలు పెట్టారు. -
పొగాకు ఆకులతో కరోనా టీకా!
లండన్: ప్రపంచాన్ని కరోనా వైరస్ హడలెత్తిస్తుంటే అన్ని దేశాలు వైరస్‌ను అడ్డుకట్టవేయడానికి టీకాలు కనిపెట్టె పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా పొగాకుతో కరోనాకు టీకా(వ్యాక్సిన్)ను తయారు చేస్తున్నట్లు లండన్‌కు చెందిన లక్కీ సిగరెట్స్ సంస్థ తెలిపింది. అయితే ప్రొటీన్‌ను ఉపయోగిస్తు పొగాకు ఆకుల నుంచి టీకాను రూపొందిస్తామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. కాగా ఈ టీకాకు సంబంధించిన అనుమతుల కోసం యూఎస్ ఫుడ్ డ్రగ్ శాఖను సంప్రదిస్తామని లక్కీ సిగరెట్స్ సంస్థ అధికారి కింగ్స్లే తెలిపారు. కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ప్రజలకు కచ్చితంగా తమ టీకా స్వాంతన కలిగిస్తుందన్న నమ్మకం ఉందని లక్కీ సిగరెట్స్ ప్రతినిథులు తెలిపారు. అనుమతులు రాగానే త్వరలోనే మానవుల్లో ప్రయోగాలు ప్రారంభిస్తామని తెలిపింది. మరోవైపు కరోనాకు కారణమయ్యే జన్యు శ్రేణి(జెనెటిక్ సీక్వెన్స్) సార్స్ కోవిడ్ 2 వైరస్ రకానికి సంబంధించిన శ్రేణి నుంచి తీసుకోనున్నారు. వేగంగా టీకాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొన్నారు. -
‘రేపటి నుంచి పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నాం’
సాక్షి, ఏపీ సచివాలయం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టనుంది. ఇందకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. బుధవారం నుంచి రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపడుతుందని చెప్పారు. ('వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం') ఒంగోలులోని 1, 2 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. క్రమంగా అన్ని ప్రాంతాల్లో పొగాకు కొనుగోళ్లు చేపడతామని చెప్పారు. ఎఫ్3, ఎఫ్4, ఎఫ్5, ఎఫ్8, ఎఫ్9, లో గ్రేడు పొగాకు కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. పొగాకు బోర్డు చెప్పిన దానికంటే అధిక మొత్తానికి కొనుగోళ్లు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. -
యువతకు గాలమేస్తున్నారు..
న్యూఢిల్లీ: పొగాకు లాబీ కన్ను ఇప్పుడు యువతపై పడింది. వారిని ఎలాగైనా పొగాకుకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సిగరెట్లలో యువతకు నచ్చే రుచి, వాసనలు చేర్చడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. పీచు మిఠాయి, బబుల్గమ్, చెర్రీ పండ్ల రుచి వాసనలతో పొగాకు ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యానికి చేసే హానిని కాదని.. యువత పొగాకును ఎక్కువగా వినియోగిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. అంతేకాదు.... యూఎస్బీ డ్రైవ్, ఐస్‌క్యాండీ వంటి ఆకారాల్లో పొగాకు ఉత్పత్తులను సిద్ధం చేసి మరీ యువతకు గాలమేస్తున్నారు. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) శుద్ధమైనవి, తక్కువ హాని చేసేవన్న లేబుళ్లు తగిలించడం వెనుక కూడా పరిశ్రమ హస్తం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. చాలా దేశాల్లో టెలివిజన్, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో పొగాకు ప్రకటనలివ్వడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో కంపెనీలు యూటూబర్లు, ఇతర సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్షర్లు (ప్రభావం చూపగలవారు)తో పరోక్షంగా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నట్లు, తద్వారా 18 ఏళ్ల లోపు వయసు వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. (ఊపిరాడటం లేదు..!!) యువత ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకం చేపట్టడం, తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ అమ్మే చోట పొగాకు ఉత్పత్తుల ప్రచారం, సిగరెట్లు విడిగా అమ్మడం, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు చేసే అన్ని రకాల ప్రయత్నాలపై కొర్రీలు వేస్తూ వాటి అమలును జాప్యం చేయడం వంటివి ఈ ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి. ఈ ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసే లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ‘నో టొబాకో డే’ ఇతివృత్తంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. కంపెనీల కుటిలయత్నాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘రహస్యం బట్టబయలు’ అన్న శీర్షికతో ప్రచార సామగ్రిని సిద్ధం చేసింది. ఆదాయానికి.. అలవాట్లకు లింకు ధూమపానం అలవాటయ్యేందుకు వ్యక్తులు, దేశాల ఆదాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ధనిక దేశాల్లో పొగతాగే వాళ్లు ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం. అయితే అలవాట్లు మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టడం లేదు. 2000 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు 38 శాతం మంది పొగరాయుళ్లు ఉండగా... తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు ఇది 22 శాతానికి తగ్గిపోయింది. ఇలాంటి హెచ్చుతగ్గులు చాలాదేశాల్లో కనిపిస్తాయి. ధూమపానం మానేస్తే... పొగ తాగడం వల్ల రకరకాల రసాయనాలు శరీరంలోకి చేరతాయి. వీటిల్లో చాలావరకూ రక్తంలోని ఆక్సిజన్‌ను హరించేవే. పొగతాగడం మానేసిన తరువాత కొంత కాలానికే రక్తంలో ఆక్సిజన్ మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా మరింత శక్తి, ఉత్సాహం లభిస్తాయి. అలాగే ఆహారపు రుచి తెలిసేలా చేసే టేస్ట్ బడ్స్ మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో తినే తిండి రుచి, వాసనలు స్పష్టంగా తెలుస్తాయి. పొగాకు కారణంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన గార, రసాయనాలు క్రమేపీ తగ్గిపోయి ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించదు. అంతేకాదు.. పోషకాలు అందడం ఎక్కువ కావడం వల్ల చర్మంపైని ముడుతలు తగ్గుతాయి. -
పొగ... సెగ!
పొగాకుకు వేయి రూపాలు... సిగరెట్, సిగార్, జర్దా, ఖైనీ, పాన్‌మసాలా, ముక్కుపొడుం... ఇంకా ఎన్నో. పొగ ఊపిరి సలపనివ్వదు... తట్టుకోలేం. సెగ మంటపుట్టిస్తుంది... భరించలేం. అయినా పొగ... సెగ... రెంటినీ కలిపి ఆస్వాదిస్తారు కొందరు. గుట్కా ప్రాణాల్ని గుటుక్కుమనిపించేస్తుందని తెలిసినా విచక్షణారహితంగా విషాస్వాదన చేస్తుంటారు మరికొందరు. టొబాకో అన్నది తలవెంట్రుక నుంచి కాలి వేలి చివరి వరకు ఎన్నెన్ని అనర్థాలు తెచ్చిపెడుతుందో అర్థం చేసుకుని... తంబాకు ఏరూపంలో ఉన్నప్పటికీ... అది మనకు మనం ఎక్కుపెట్టుకున్న బందూకు అని తెలుసుకుని దూరంగా మసలుకోవడానికే ఈ కథనం. జీర్ణవ్యవస్థ– పొట్ట అలా ఛాతీ నుంచి కిందికి దిగితే... పొగ తాగడం వల్ల కాలేయం నుంచి పెద్దపేగు మొదలుకొని, మలద్వారం వరకు క్యాన్సర్ రిస్క్ ఉండనే ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించి ∙ఈసోఫేజియల్ క్యాన్సర్ ∙పెద్దపేగు క్యాన్సర్ lమలద్వార క్యాన్సర్... అంటే కొలనోరెక్టల్ క్యాన్సర్ల వరకు పొగాకు ఒక ప్రధాన కారణం. సిగరెట్ జుట్టు పట్టేసి లాగేస్తుందంటే నమ్ముతారా? మీరు తాగే సిగరెట్టులోని విషాలు మీ జుట్టును పలచబార్చి త్వరగా రాలిపోయేలా చేస్తాయంటే నమ్ముతారా? ఇది నిజం... పొగతాగడం వల్ల వెంట్రుకలను పట్టి ఉంచే హెయిర్ ఫాలికిల్స్ బలహీనమవుతాయి. పొగాకులోని విషపదార్థాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచే హార్మోన్లను దెబ్బతీస్తాయి. సంబంధిత డీఎన్ఏను బలహీనపరుస్తాయి. హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుకకు జరిగే రక్తసరఫరా దెబ్బతింటుంది. అంతే... పొగతాగేవారిలో వెంట్రుకల జీవిత చక్రం (సైకిల్) పూర్తి కాకుండానే అవి రాలిపోతుంటాయి. విషాల కారణంగా అవి త్వరగా తెల్లబడతాయి. ఈ వివరాలన్నీ చాలా ఎపిడిమియలాజికల్ అధ్యయనాల్లో నిరూపితమయ్యాయి. అంతేకాదు... ఆ వివరాలు బీఎంజే లాంటి ప్రముఖ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి కూడా. పొగాకుతో... మె‘దడదడ’! సిగరెట్ పొగ పీల్చీపీల్చగానే... ఐదు సెకండ్లలోనే అందులోని నికోటిన్ మెదడును చేరి, హుషారును కలిగించే భావనను కలగజేస్తుంది. ఈ తాత్కాలిక భ్రాంతిభావన కోసమే సిగరెట్‌కు బానిసలవుతారు. పొగ వల్ల నేర్చుకునే సామర్థ్యాలు, అర్థం చేసుకునే శక్తి మందగిస్తాయి. మతిమరపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మెదడులోని రక్తనాళాలు సన్నబారి, రక్తప్రసరణ తగ్గి చిట్లిపోవడం, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరగడం జరుగుతుంది. కళ్ల కాంతి తరుగు... క్యాటరాక్ట్ పెరుగు! కళ్లలోని లెన్స్‌లు పారదర్శకంగా ఉంటేనే మనకు చూపు బాగుంటుంది. కానీ పొగ కారణంగా లెన్స్ పారదర్శకత కోల్పోయి... చాలా త్వరగా ‘క్యాటరాక్ట్’ సమస్య వస్తుంది. పొగతాగడం వల్ల ‘మాక్యులార్ డీజనరేషన్’ అనే వ్యాధి వచ్చి రెటీనాపై బ్లైండ్స్పాట్స్ ఏర్పడతాయి. మామూలుగా ఈ సమస్యలు వయసు పెరగడం వల్ల వస్తాయి. కానీ పొగతాగే అలవాటు వల్ల చాలా త్వరగా వచ్చేందుకు అవకాశాలెక్కువ. ముక్కు... పొగాకు దాని శక్తిని అణగదొక్కు! వాసనను గ్రహించే జ్ఞానేంద్రియ శక్తి ముక్కు సొంతం. అతి సంక్లిష్టమైన ఆ యంత్రాంగం పొగాకు కారణంగా దెబ్బతింటుంది. అందుకే పొగతాగేవారు అన్ని వాసనలనూ సరిగా గ్రహించలేరు. ముక్కులోంచి తలకు కనెక్ట్ అయి ఉండే గాలి గదులైన సైనస్‌లు కూడా దెబ్బతింటాయి. అంతేనా గాలి పీల్చినప్పుడు ముక్కులోకి వచ్చే కొన్ని హానికర బ్యాక్టీరియానూ, క్రిములనూ ముక్కు నిరోధిస్తూ ఉంటుంది. పొగతాగేవారిలో ముక్కుకు ఆ శక్తి తగ్గడం వల్ల తేలిగ్గా జబ్బుపడతారు. నోరు దెబ్బతినే తీరు! సిగరెట్, బీడీ, చుట్ట తాగినా... బుగ్గన గుట్కా పెట్టినా అది జరిగేది నోటి ద్వారానే. దాంతో పొగాకు నేరుగా దుష్ప్రభావం చూపేది నోటిపైనే. అందుకే నోరు చాలారకాలుగా ప్రభావితమవుతుంది. ఉదాహరణకు... ► మొదటి దుష్పరిణామం నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్). ► పళ్లు పసుపుపచ్చగా మారతాయి. చిగుర్లపై కూడా మచ్చలు (స్మోకర్స్ మెలనోసిస్) రావచ్చు. ► నోట్లో ‘ల్యూకోప్లేకియా’ అనే పుండ్లు ఏర్పడి, అవి క్యాన్సర్‌గా మారవచ్చు. ► పంటి చిగుర్లు దెబ్బతిని చిగుర్ల వ్యాధులు వస్తాయి. ► నాలుకపై ఉండే అతి చిన్నచిన్న బుడిపెలపై బ్యాక్టీరియా, ఈస్ట్, నోటిలోని వ్యర్థాలు చిక్కుకుపోవడంతో నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ► నోటిలో ఉండే పైభాగమైన అంగిలి మృదుత్వాన్ని కోల్పోయి, పాలిపోయినట్లుగా తెల్లగా మారిపోయి ‘స్మోకర్స్ ప్యాలెట్’ అనే కండిషన్‌కు దారితీయవ. ► నోటిలో ఉండే లాలాజల గ్రంథులు దెబ్బతినవచ్చు. మగతనాన్నిదెబ్బతీసే పొగ! పొగతాగే అలవాటు రక్తనాళాలను సన్నబరుస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఆ అలవాటు ఉన్న చాలామందిలో రక్తనాళాలు సన్నబారడం అనే ప్రక్రియ పురుషాంగంలో జరగడం కూడా సాధారణమే. దాంతో పురుషాంగంలోకి రక్తం చేరడం సన్నగిల్లి అంగస్తంభన సమస్యలు (ఎలకై్టల్ డిస్ఫంక్షన్) వస్తాయి. అంతేకాదు... పొగతాగే వారిలో వీర్యకణాల కదలికలు, వీర్యం నాణ్యత తగ్గిపోతాయి. దాంతో పిల్లలు పుట్టే అవకాశాలూ తగ్గుతాయి. చెవులు పట్టి ఆడించే పొగాకు... వినికిడి సమస్యలతో ఇంకెంతో చికాకు! సిగరెట్‌పొగలో నికోటిన్‌తో పాటు ఫార్మాల్డిహైడ్, ఆర్సినిక్, వినైల్ క్లోరైడ్, అమోనియా అనే విషపదార్థాలుంటాయి. ఇవి చెవికి కూడా విషాలే కావడం వల్ల వాటిని ‘ఒటో టాక్సిక్’గా పరిగణిస్తారు. వాటివల్ల వినికిడి శక్తి లోపించి, చెవుడు వచ్చే అవకాశాలెక్కువ. అంతేకాదు... మనను బ్యాలెన్స్‌గా నిలిపి ఉంచే యంత్రాంగమంతా చెవిలోనే ఉంటుంది. అది దెబ్బతింటే నిటారుగా నిలబడలేం కూడా. చెవిలో ఎప్పుడూ గుయ్ అనే శబ్దం కలిగించే ‘టినైటిస్’ అనే జబ్బొకటుంది. పొగాకు కారణంగా ఆ జబ్బు వచ్చే అవకాశాలెక్కువ. గొంతు... క్యాన్సర్లకు దారితీసే ఓ కూడలి! పొగ తాగడం వల్ల నోటి తర్వాత ఆ వెంటనే ప్రభావితమయ్యేది గొంతే. తొలుత ప్రభావితమైనందువల్లనే పొగతాగడం వల్ల గొంతు క్యాన్సర్స్ (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు కూడా) చాలా ఎక్కువ. పొగపీల్చగానే అందులోని ఫార్మాల్డిహైడ్, ఆక్రోలీన్ రసాయనాలు గొంతును మండిస్తాయి. పొగతాగేవారిలో స్వరం మారిపోయి బొంగురుగా రావడం, లోగొంతుకతో మాట్లాడుతున్నట్లు అనిపించడం చాలా సాధారణం. లారింగ్స్ దెబ్బతిని లారింజైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే పరిస్థితులూ ఎక్కువే. ఊపిరందక ఉక్కిరిబిక్కిరి! పొగాకు కారణంగా అత్యంత ఎక్కువగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. స్మోకింగ్ కారణంగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్, బ్రాంకైటిస్ అనే వ్యాధులు వచ్చి... ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వీళ్లలో లంగ్స్ సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోయి... ఒకనాటికి ఒక్క అడుగు వేయాలన్నా ఆయాసపడే స్థితికి చేరువవుతారు. సిగరెట్ కారణంగా లంగ్ క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. గుండెమండించే సెగ... గుండెపోటు తెప్పించే పొగ! పొగతాగే అలవాటు గుండెనూ, రక్తప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, తీవ్రంగా దెబ్బతీస్తుంది. గుండెపోటుకు పొగతాగే అలవాటే ప్రధాన కారణం. పొగ తాగే అలవాటు వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలెక్కువ. ఫలితంగా క్లాట్స్ ఏర్పడి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లోని అడ్డంకుల వల్ల గుండెకు తగిన ఆక్సిజన్ అందదు. దాంతో గుండె కండరం శాశ్వతంగా చచ్చుబడిపోతుంది. ఇలా పొగతాగేవారిలో చాలామందికి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కన్నుమూస్తుంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవకాశాలూ ఎక్కువే. రక్తనాళాలు సన్నబారడం వల్ల రక్తం మరింత వేగం పుంజుకుని రక్తపోటు పెరుగుతుంది. ఈ హైబీపీతో శరీరంలోని ఏ కీలకమైన అవయవమైనా దెబ్బతిని, పక్షవాతానికీ, మరణానికీ కారణం కావచ్చు. పొగచూరిపోయే ఎముకలూ... బలహీనపడే కాళ్లు! ఎముకలు పటిష్టంగానూ, బలంగానూ ఉండాలంటే వాటికి క్యాల్షియం ఎక్కువగా అందాలి. కానీ రక్తప్రసరణ వ్యవస్థలో క్లాట్స్ వంటి అనేక కారణాల వల్ల ఎముకలకు అందాల్సిన పోషకాలు క్రమంగా తగ్గుతూ పోతాయి. దాంతో ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా అవి పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోతాయి. పొగతో మొద్దుబారే పాదాలూ... కాలివేళ్ల చివర్లు స్మోకింగ్ చేసేవారిలో రక్తనాళాలు సన్నబడితే పాదాలకూ, కాలి వేళ్ల చివర్ల వరకూ రక్తం అందే అవకాశాలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ఇలాంటి పరిణామాలు ఎక్కువ. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి పొగతాగే అలవాటుంటే ఈ రిస్క్ మరీ ఎక్కువ. దీన్ని పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్ అని అంటారు. ఇక పొగతాగేవాళ్లలోనైతే పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్ అన్నది కేవలం ఆ అలవాటు కారణంగానే రావచ్చు. అలాంటి సమస్యను బర్జర్స్ డిసీజ్ అంటారు. పొగతాగే అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు సన్నబడ్డా, కాళ్లలో, కాలివేళ్ల చివర్లలోగానీ క్లాట్స్ ఏర్పడ్డా... పాదం, కాలివేళ్ల చివర్లు స్పర్శ కోల్పోయి, అవి కుళ్లిపోవడం మొదలవుతుంది. ఈ కండిషన్‌ను గ్యాంగ్రీన్ అంటారు. ఈ రక్తపు గడ్డలు కాళ్లకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏర్పడితే కాళ్లూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. వేళ్లు కుళ్లిపోయే రిస్క్ ఉంటుంది. -
బేళ్ల చూపులు
సాక్షి,నెల్లూరు: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఎక్కువ మంది రైతులకు పొగాకు సాగే ఆధారం. గత ఐదేళ్లు వర్షాభావ పరిస్థితులతో నష్టాలు మూటకట్టుకున్నారు. ఈ ఏడాది ప్రకృతి కరుణించడంతో పంట ఉత్పత్తి పెరిగింది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అంతలోనే కరోనా పొగాకు రైతుల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో వేలం కేంద్రాలు మూతపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లు ఎప్పుడు పునఃప్రారంభిస్తారో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మద్దతు ధర పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్‌పై అధారపడి ఉండడం ఒక వేళ వేలం ప్రారంభించినా ధరలు ఎలా ఉంటాయో అనే ఆందోళన వెంటాడుతోంది. జిల్లాలో డీసీపల్లి, కలిగిరి వేలం కేంద్రాల పరిధిలో 3,142 పొగాకు బ్యారన్లకు లైసెన్స్‌లు ఉన్నా దాదాపు 3,860 మంది రైతులు 8,098 హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది పొగాకు బోర్డు 10.84 మిలియన్ కిలోల ఉత్పత్తి పొగాకు కు అనుమతి ఇచ్చింది. కానీ దాదాపు 15 మిలియన్ కేజీల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 17న డీసీపల్లి, 26న కలిగిరి వేలం కేంద్రాలను ప్రారంభించారు. అయితే కరోనా అలర్ట్ నేపథ్యంలో మార్చి 21 నుంచి అన్ని వేలం కేంద్రాలు ఆపేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. విక్రయాలు తక్కువే రెండు విక్రయ కేంద్రాల పరిధిలో దాదాపు 15 మిలియన్ టన్నుల పొగాకు ఉంది. బోర్డు అనుమతి ఇచ్చిన ఉత్పత్తి కొనుగోళ్లు పూర్తి కావాలంటే దాదాపు 3 నెలల పాటు వేలం జరగాల్సి ఉంటుంది. ఇప్పటికి డీసీపల్లిలో 4,13,854.8 కేజీల మాత్రమే కొనుగోళ్లు చేశారు. కలిగిరిలో 3,51,514 లక్షల కేజీల పొగాకును వ్యాపారులు కొనుగోళ్లు చేశారు. ఆ రెండు కలిపినా కూడా మిలియన్ కిలోల కొనుగోళ్లు కూడా జరగలేదు. ఇంకా 14 మిలియన్ కిలోల పంట ఉంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ రైతుల వద్ద నిల్వ ఉండే మేలిమి రకం పంట నాణ్యత దెబ్బతింటోంది. తూకంలోనూ వ్యత్యాసం వస్తుంది. ప్రతి 150 కిలోల బేలుకు సగటున 5 కిలోల తరుగు వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌తో పోల్చితే బేలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు రైతు నష్టపోనున్నారు. నిల్వ ఉండే పొగాకు మండిలో కూడా వేడి వచ్చి ఆకు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. -
నోటి క్యాన్సర్ అంటున్నారు.. ఏం చేయాలి!
నా వయసు 49 ఏళ్లు. నేను ఇరవై ఏళ్లుగా గుట్కా తింటున్నాను. ఒక నాలుగు నెలల నుంచి నా నోటిలో వాపు కనిపించడంతో పాటు నొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలల నుంచి ఈ బాధ మరీ ఎక్కువయ్యింది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) కూడా వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ కావచ్చని, దగ్గర్లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లమని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎన్. రామస్వామి, సూళ్లూరుపేట గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ముందుగా క్యాన్సర్ స్పెషలిస్ట్ మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందో తొలుత పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌కు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి. ►మొదట మీకు సమస్య ఉన్న భాగంతో పాటు, మెడ భాగంలోనూ సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ► ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కూడా కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగించిన భాగాన్ని ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ► సర్జరీ తర్వాత నోరు మునపటిలా తెరచుకోదేమోనని కొందరు ఆందోళన చెంతుటుంటారు. కానీ రోబోటిక్ సర్జరీతో కుట్లూ ఉండవు. నోరు కూడా పూర్తిగా మునపటిలాగే తెచుకుంటుంది. ముందులాగే నోటిద్వారా ఆహారం తీసుకోవచ్చు. ► ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు పూర్తిగా మానిపోయాక, రేడియోథెరపీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొదట మీరు గుట్కా/పొగాకు నమలడం పూర్తిగా మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. మీరు వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ సచిన్ మార్దా, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
అంతా బాగుండాలి.. అందులో మీరూ ఉండాలి
అదిగో... అదిగో..! అందరూ వచ్చేశారా!! ప్రతిసారీ ఈ రోజున మనం ఎక్కడో ఓ చోట కలుసుకుంటూనే ఉన్నాం. ఈసారి ఈ రచ్చబండ దగ్గర!!. ఎన్నో కోరికలు కోరి... అవి తీరుతాయన్న ఆశతో మీరిలా రావటం... అన్నీ సాధ్యం కాకున్నా కొన్నిటినైనా నెరవేర్చడానికి నేను ప్రయత్నించటం కొత్తేమీ కాదుగా!!. ఈసారి మన ఊరి పరిస్థితులు అంత బాగాలేవు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య లంకె కుదరటం లేదు. ధరలు పెరుగుతున్నాయి. వాటి మాదిరే అప్పులు కూడా!!. అలాగని ఖర్చులు మానుకోలేం కదా? మీరంతా బాగుండాలని నా ప్రయత్నమైతే నేను చేశా.. ఇదిగో చెబుతా వినండి!!. రైతన్నా... నేనున్నా నీకు విత్తులేసే నాటికి చేతిలో పైకం ఉండాలి. బ్యాంకులకు చెప్పాంలే!! దండిగా రుణాలివ్వమని. ఓ రెండేళ్లలో నీ చేతిలోకి రెండింతల సొమ్ము వచ్చేలా చేయాలన్నదే నా కల. అందుకోసమే ఇదంతా!!. మీరు సోలార్ పంపుసెట్టు పెట్టుకోండి. దానిక్కాస్త డబ్బులిస్తాం. అంతేకాదు!! పంటతో పాటు కరెంటూ పండించండి!!. ఆ కరెంటును మేం కొని డబ్బులిస్తాం. నీటి కష్టాలు లేకుండా చేస్తాం. మరి మీరు కూడా నీళ్లు, ఎరువులు తక్కువ వాడాలి సుమా!. మీరు పండించే వస్తువులు పాడైపోకుండా రవాణా చెయ్యటానికి కోల్డ్ స్టోరేజీ రైళ్లు మరిన్ని తేవటానికి ప్రయత్నిస్తాం. మీ రైతాంగానికిచ్చే నిధులు కూడా భారీగానే పెంచాంలే!!. నేను సీతయితే... నువ్వు లక్ష్మి మరి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలంటే ధన లక్ష్ములే కాదు! ధాన్య లక్ష్ములూ కావాలి!!. అందుకే విత్తనాలు నిల్వ చేయండి. స్టోరేజీలకు కావాల్సిన అప్పులు మేం ఇప్పిస్తాం. గిడ్డంగులూ మేమే కట్టిస్తాం. మీ పంట ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకే కాదు... విదేశాలకూ పంపించొచ్చు. ఆడపిల్లల పెళ్లికి కనీస వయసు పెంచాలని ఉంది. దానికోసం ఓ టాస్క్‌ఫోర్స్ పెడతాం. అంగన్వాడీలకు సెల్ఫోన్లు కూడా ఇస్తున్నాం. పన్ను తగ్గింపు కావాలా.. నాయనా!! మీ ఉద్యోగులెప్పుడూ ఇంతే! పన్ను రేట్లు తగ్గించండని అడుగుతూనే ఉంటారు!!. అదెలా కుదురుతుంది? మీరు పన్నులు కడితేనేగా ఊరికి ఆదాయం వచ్చేది. అయినా సరే... మీరు అడుగుతున్నారు కనక ఏదోకటి చేశాలే!!. మీలో కొందరేమో పొదుపరులు. కొందరేమో వచ్చింది వచ్చినట్లే ఖర్చుపెట్టేస్తారు. అందుకే.. మీ ఇద్దరినీ వేరు చేసి మీకు తగ్గ పన్ను విధానాలు తెచ్చాను. మీరు పొదుపు చేసుకుంటే మీకు మునుపటిలానే పన్ను ఎలాగూ కాస్త మినహాయిస్తాం. ఖర్చు పెట్టేవాళ్లకు మినహాయింపులుండవు కనక పన్ను రేట్లు తగ్గించాం. ఇది ఎవరికి లాభమని మాత్రం నన్ను అడక్కండి. మాక్కూడా లాభం ఉండాలిగా!!. కార్పొరేట్లూ... ఇంకా ఎంత తగ్గిస్తాం? బడ్జెట్ కోసం మీరు ఎదురు చూడటమే సరికాదు. ఎందుకంటే మొన్నేగా మీ పన్ను తగ్గించింది!!. అసలు ప్రపంచం మొత్తమ్మీద కంపెనీలకు తక్కువ పన్నులున్నది ఇక్కడే తెలుసా? ఇంకా ఎంత తగ్గిస్తాం చెప్పండి!!. మీరిప్పుడు డివిడెండ్లు ఇస్తూ... వాటిపైనా పన్ను చెల్లించాల్సి వస్తోంది కదా? దాన్ని... అదే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను తీసేస్తున్నాం లెండి. కాకపోతే ఇకమీదట డివిడెండ్ తీసుకునే వాళ్ళు పన్ను కడతారు. ఇద్దరూ కట్టకపోతే ఎలా చెప్పండి? సురక్షితంగా దాచుకోండి... బ్యాంకుల్లో పాపం! బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు కానీ మీ భయం మీకుంటుంది!!. ఏ బ్యాంకు ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో తెలీదు. అందుకే... ఇకపై మీరు చేసే డిపాజిట్లకు రూ.5 లక్షలవరకూ బీమా ఉండేలా చూస్తాం. ఇప్పటిదాకా ఇది లక్ష రూపాయలే కదా!!. అలాగని మీరు చేసే డిపాజిట్లన్నిటికీ 5 లక్షల చొప్పున గ్యారంటీ ఉంటుందనుకోకండి. మీరు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్లు చేసినా... ఒక మనిషికి రూ.5 లక్షల వరకే బీమా ఉంటుంది. అది కాస్తా చూసుకోండి!!. చిన్న కంపెనీకి... చింతలుండవు మరీ పెద్ద కంపెనీలు కాదుగానీ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలన్నిటికీ ఇది మంచి వార్తే లెండి!!. మీ టర్నోవర్ రూ.5 కోట్ల లోపుంటే మీకు ఆడిటింగ్ అవసరం లేదు. ఇపుడు కోటిదాటితే ఆడిట్ చేయాల్సి వస్తోంది కదా? దీన్ని సవరించాం. ఎందుకంటే ఎకానమీ బాగుండాలంటే మీరే ముందుండి నడిపించాలి. మీకు తక్కువ వడ్డీ రేటుండే రుణాలివ్వటానికి (సబార్డినేట్) కూడా మరో పథకం తెస్తున్నాం. మీకు రుణ పునరుద్ధరణ సదుపాయ విండోను 2021 మార్చి వరకు కొనసాగించాలని ఆర్బీఐని అడిగాం. రేపో మాపో ఊ కొడుతుంది లెండి!!. విద్యార్థులూ... టూరిస్టులూ రవాణా ఎంత ముఖ్యమో మీకు తెలుసు? కొత్త హైస్పీడ్ రైళ్లు... 100 కొత్త ఎయిర్పోర్ట్లూ తెస్తాం. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి చేస్తాం. హరియాణా, గుజరాత్, తమిళనాడు, అసోం సహా ఐదు చారిత్రక ప్రాంతాలతో పాటు రాంచీలో ట్రైబల్ మ్యూజియం, అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్ మ్యూజియం కడతాం. ఎంచక్కా మీరు వెళ్లి చూడొచ్చు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులొస్తాయి. 150 యూనివర్సిటీల్లో కొత్త స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడతాం. జిల్లా ఆసుపత్రులన్నీ మెడికల్ కాలేజీలుగా మారుస్తాం. పెరిగేవి.. తగ్గేవి! ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో సిగరెట్లు, హుక్కా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. ఈ బాటలో సుంకాలు పెంచడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు, ఫ్యాన్లు, టేబుళ్లు, ఫుట్‌వేర్, ఎలక్ట్రిక్ వాహనాలు, టేబుల్‌వేర్, కిచెన్వేర్, బొమ్మలు, ఫర్నిచర్ తదితర ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ జాబితాలో దిగుమతి చేసుకునే బటర్ నెయ్యి, పీనట్ బటర్, చ్యూయింగ్ గమ్, షెల్‌తో ఉన్న వాల్నట్స్, సోయా ప్రొటీన్ చేరాయి. దిగుమతయ్యే ఫుట్‌వేర్, షేవర్స్, వాటర్ ఫిల్టర్, గ్లాస్‌వేర్, పింగాణీ పాత్రలు, జెమ్ స్టోన్స్, వాటర్ హీటర్లు, హెయిర్ డయ్యర్స్, ఎలక్ట్రిక్ ఐరన్స్, ఒవెన్స్, కుకర్స్, గ్రైండర్స్, కాఫీ, టీ మేకర్స్ ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే పీసీబీలు, మొబైల్ ఫోన్లు, డిస్ప్లే ప్యానళ్లు, మొబైల్స్‌లో వినియోగించే ఫింగర్‌ప్రింట్ రీడర్లు, ల్యాంపులు, లైటింగ్ ఫిట్టింగ్స్, స్టేషనరీ వస్తువుల ధరలు సైతం పెరగనున్నాయి. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్, క్రీడా పరికరాలు, మైక్రోఫోన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు చౌక కానున్నాయి. -
టీడీపీలో ఐటీ కలకలం
సాక్షి, గుంటూరు/పాత గుంటూరు: గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ పొగాకు గ్రూప్ ఆఫ్ కంపెనీలపై రెండు రోజులుగా ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా రెండు పొగాకు కంపెనీల మధ్య రూ.వందల కోట్ల ఆస్తుల క్రయవిక్రయాల్లో గుంటూరు అర్బన్ జిల్లాలోని ఓ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మధ్యవర్తిత్వం చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ టీడీపీ నాయకుడిని ఒక రోజంతా ఐటీ అధికారులు విచారించినట్టు విశ్వసనీయ సమాచారం. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ టీడీపీ నాయకుడు వ్యాపార లావాదేవీల్లో అనేక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. గుంటూరులోని దివాలా తీసిన ఓ పొగాకు వ్యాపారి తన ఆస్తులను విక్రయానికి పెట్టాడు. వాటిలో టీడీపీ నేత మధ్యవర్తిత్వం వహించాడని సమాచారం. రూ.వందల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తుల విక్రయాల్లో వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద మధ్యవర్తిత్వం వహించిన టీడీపీ నేత భారీ మొత్తంలో కమీషన్ దండుకున్నట్టు సమాచారం. దీంతో గుంటూరులోని సదరు టీడీపీ నేత ఇళ్లు, గెస్ట్ హౌస్‌లు, ఆయన బినామీగా ఉన్న మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లోని గోడల్లో ఏవో వస్తువులు ఉన్నట్టు మెటల్ డిటెక్టర్ బృందం గుర్తించగా అక్కడి నుంచి బృందాన్ని వెనక్కు పంపాక గోడలను బద్దలు కొట్టిన అధికారులు సుమారు 30 కేజీల వరకూ బంగారు తీగలు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈయన ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించారు. -
ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇ-సిగరెట్లపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. అంటే, పొగను ఉత్పత్తి చేసే పరికరాలను దేశంలో తయారు చేయడం, వాటిని దిగుమతి చేసుకోవడం లేదా అమ్మడం ఇక మీదట నిషేధం. దేశంలో ధూమపానానికి బానిసలైన వారిని, ఆ బానిసత్వం నుంచి తప్పించి వారితో ధూమపానాన్ని మాన్పించాలనే ఉద్దేశంతో తొలుత ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ లక్ష్యం నెరవేక పోగా, విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లకు ఎక్కువ అలవాటు పడడం మొదలైంది. చదవండి: ఇ–సిగరెట్లపై నిషేధం అమెరికాలో హైస్కూల్ విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇ-సిగరెట్లకు ఎక్కువ బానిసలవుతున్నారని అక్కడి నుంచి అందిన డేటా తెలియజేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. గత 30 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మొదటిసారి యువత ఇ-సిగరెట్లకు అలవాటు పడినట్లు అక్కడి డేటా తెలియజేస్తోంది. పొగాకుతో చేసిన రెగ్యులర్ సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్లు వస్తాయని, ఇ-సిగరెట్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని చెప్పడమే కాకుండా వాటిలో రకరకాల ఫ్లేవర్లు తీసుకరావడంతో ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే విస్తరించింది. పొగాకు సిగరెట్ల వల్ల మానవులకు క్యాన్సర్ వస్తుందని వైద్యులు తేల్చి చెప్పడానికి కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. అదే ఇ-సిగరెట్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని వైద్యులు తేల్చి చెప్పడానికి ఎక్కువ కాలం పట్టక పోవడానికి కారణాలను ఊహించవచ్చు. మార్కెట్ వర్గాలు ఇప్పటి వరకు వారి ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోగలిగాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెరగడమో, మరో కారణమో తెలియదుగానీ ఇ-సిగరెట్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ వరుసగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకొని ఉంటుందనడంలో సందేహం లేదు. మరి అంతే ప్రమాదకరమైన పొగాకు సిగరెట్లను నిషేధించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? పొగాకు సిగరెట్లతో క్యాన్సర్లు వచ్చినా ఫర్వాలేదుగానీ ఇ-సిగరెట్ల వల్ల రాకూడదనే ఉద్దేశమా ? అయితే ఎందుకు ? దీనికి సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. దేశంలో సిగరెట్ల పరిశ్రమ 11.79 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడంతోపాటు 4.57 కోట్ల మందికి ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బడ్డీ కొట్లు నడవడానికి సిగరెట్లే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. పొగాకు పంటలపై లక్షలాది మంది రైతులు కూడా ఆధారపడి బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇ-సిగరెట్ల పరిశ్రమ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ దశలో చర్య తీసుకోకపోతే ఆ పరిశ్రమ విస్తరించి పొగాకు సిగరెట్ల పరిశ్రమ ఉనికిని దెబ్బతీసే అవకాశం ఉందని, తద్వారా కోట్లాది మందికి ఉపాధి పోతుందని భావించే కేంద్రం ‘నిషేధం’ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. పొగాకుతో పోలిస్తే గంజాయితో తక్కువ నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కనుక గంజాయిని చట్టబద్ధం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నా ఆ దిశగా చర్య తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సాహసించడం లేదు. -
పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి
న్యూ ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ ఎంపీ జీ వీ ఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా తక్కువ నాణ్యత కలిగిన పొగాకు కిలో రూ.20 చొప్పున ధరను అమలు చేయాలని కోరారు. అదే విధంగా పంట మార్పిడికి నష్ట పరిహారంగా ఒక బారన్ పొగాకుకు సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
పొగాకు...ఆరోగ్యాన్ని పొడిచే టొబాకు
భూతాల గురించి కథల్లో చదువుతుంటాం. హారర్ సినిమాల్లో చూస్తుంటాం. వాటిలో భూతాలూ, దెయ్యాలూ పొగ రూపంలో ఉంటాయి. వాస్తవానికి ఆ దెయ్యాలూ, భూతాలన్నీ కల్పితం. కానీ ఈ లోకంలో నిజంగానే పొగరూపంలో ఉండే భూతప్రేతపిశాచాలున్నాయి. అవే... సిగరెట్లు, బీడీలు, చుట్టలు, హుక్కాలు. మరికొన్ని ఆరోగ్యాన్ని పీల్చిపిప్పిచేసే పిశాచాలు మనం తినేందుకు వీలుగా పాన్‌మసాలా డబ్బాల్లో దాగుంటాయి. ఇంకొన్ని పీల్చే నశ్యం డబ్బాల్లో ఉంటాయి.ఈ ఉత్పాదనలన్నింట్లోనూ వాడే ఆకే ‘పొగాకు’. ఆ కల్పిత భూతాలున్నాయో లేదో, అవి హాని చేస్తాయో లేదో తెలియదు. కానీ... ఈ పొగభూతాలు మాత్రం నిజంగానే ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆర్థికంగానూ నష్టం చేస్తాయి. నేడు (ఈ నెల 31న) ‘వరల్డ్ నో టొబాకో డే’. ఈ సందర్భంగా పొగాకు గురించీ, అది చేసే హాని గురించీ తెలుసుకుందాం. ఆ అవగాహనతో ఎన్నో రకాల ప్రమాదకరమైన జబ్బులతోపాటు అనేక రకాల క్యాన్సర్ల నుంచి విముక్తమయ్యేందుకు గాను... బోలెడన్ని ఆసక్తికరమైన అంశాలను మీ ముందుకు తెస్తున్నాం.చాలా ఆకులు చాలా మేళ్లు చేస్తాయి. మామిడాకులు మంగళప్రదం. శుభకార్యాలకు తోరణాలుగా కడతాం. తాటాకులూ, కొబ్బరాకులూ అంతే. పెళ్లిళ్లకు పందిళ్లుగా వేస్తాం. అరిటాకులను వేడుకలకూ, వేదికలకూ ప్రవేశమార్గాల ఆర్చీలకు ఇరువైపులా కడతాం. అరిటాకుల్లో భోజనాలు ఆరగిస్తాం. బాదం ఆకుల్లో చిరుతిండ్లూ పెట్టుకుని తింటాం. తామరాకుల్లో ఫలహారాలు పెట్టుకుని భోంచేస్తాం. ఇక విస్తరాకులు సరేసరి.ఇంతా చేసి పొగాకు ఏమాత్రం ఆకర్షకరంగా ఉండదు. దాని వాసన వెగటు. పైగా విపరీతమైన ఘాటు. పైన కనువిందు చేసే ఎన్నో ఆకుల గురించి చెప్పుకున్నాం కదా. పైగా అన్నీ ఆరోగ్యకరమే. అయినా దేన్నీ మన ఒంట్లోకి ఆహ్వానించం. కానీ... అదేమిటో... అల్లంతదూరం నుంచి ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసే ఆ పొగాకును మాత్రం మనిషి కోరి కోరి ఆహ్వానిస్తాడు. నోట్లోకి తీసుకుంటాడు. ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటాడు. పేరుకు పొగాకు... కానీ ఆరోగ్యానికి ‘పగాకు’ అది. టొబాకో కాదది... మీ హెల్త్‌లోకి కసుక్కున దిగే... టొ‘బాకు’! ఇదీ పొగాకు విస్తృతి! మీకు తెలుసా...? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తంలో 1.1 బిలియన్ల మంది (110 కోట్ల మంది) సిగరెట్లు తాగేవాళ్లున్నారు. వీళ్లు ప్రతిరోజూ సిగరెట్లు తాగుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం కోటి సిగరెట్లు అమ్ముడవుతుంటాయి. పొగరాయుళ్లు ప్రతిరోజూ 15 బిలియన్లు (1500 కోట్ల) సిగరెట్లను తగలేస్తూ, ఈ పొగధారావ్రతాన్ని అలా కొనసాగి...స్తూ ఉంటున్నారు. ఇదే ధోరణి గనక కొనసాగితే... డబ్ల్యూహెచ్ఓ లెక్కల అంచనాల ప్రకారం 2025 నాటికి ఈ పొగరాయుళ్ల సంఖ్య 1.6 బిలియన్లు (160 కోట్లకు) పెరుగుతుంది. ఇది కేవలం ఒక్క పొగతాగేవారి సంఖ్య మాత్రమే. దీనికి తోడు గుట్కా, ఖైనీ వంటి పొగాకు నమిలే అలవాట్లు ఉన్నవారూ, పొగాకుని నశ్యంలా పీల్చేవారి సంఖ్యనూ దీనికి కలుపుకుంటే... పొగాకు వినియోగించే వారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువ.అందుకే ఇంతటి విస్తృతమైన పొగాకు వినియోగంతో... కేవలం ఈ దురలవాటు కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల మంది చనిపోతున్నారు. అంతేకాదు... ప్రపంచంలో చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం స్మోకింగ్ తాలుకు దుష్ప్రభావాల వల్లనే మరణిస్తున్నారన్నది నమ్మలేని పచ్చి వాస్తవం. స్వయంకృత అపరాధంగా వాళ్లు ఎలాగూ చచ్చిపోతున్నారు సరే... పక్కవాళ్లు తాగకపోయినా, ఈ పొగరాయుళ్ల కారణంగా ఒక అంచనా ప్రకారం ఏడాదికి దాదాపు 8.9 లక్షల మంది ఎలాంటి అలవాటు లేకపోయినా మరణిస్తున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది కుటుంబసభ్యులైన మహిళలూ, చిన్నారులే. అంటే ఇదే మరోరకంగా చెప్పాలంటే... స్మోకర్లు సిగరెట్ అనే ఆయుధంతో ఏటా దాదాపు 9 లక్షల మంది అమాయకులను హత్య చేస్తున్నారు. తమ పాపమేమీ లేకపోయినా వీళ్లు అమాయకంగా మొహమాటానికి స్మోకర్లకు బలవుతున్నారు. ఇలా పొగకమ్మేసినట్టే ఈ దురలవాటూ లోకాన్ని కమ్మేసింది. పొగాకు నిండా విషాలే! సిగరెట్ పొడవు దాదాపు నాలుగు అంగుళాలు మాత్రమే కదా. కానీ దాన్లో ఉండే హానికరమైన రసాయనాల సంఖ్య మాత్రం 4,800. మళ్లీ అందులోని 50 నుంచి 69 రసాయనాలు క్యాన్సర్‌ను తప్పకుండా కలగజేసేవే! వీటినే నిపుణులు గ్రూప్–1 కార్సినోజెన్స్ అని వర్గీకరించారు.మనం ఒక్క కాలకూట విషం గురించి భయం భయంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ పొగాకులో ఎన్ని రకాల కాలకూట విషాలున్నాయో తెలుసా? ఆర్సినిక్, బెంజీన్, కార్బన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్ సయనైడ్, పొలోనియమ్ 210... ఇలాంటి ఎన్నో ఎన్నో విషాలు సిగరెట్లో ఉంటాయి. నికోటిన్ అనే పదార్థమూ ఉంటుంది. ఆర్సినిక్ అనేది ప్రపంచంలోనే చాలా వేగంగా పనిచేసే శక్తిమంతమైన విషం. పైగా పైన పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా కాస్తంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనిషి తక్షణం చనిపోతాడు. ఒక అధ్యయనం ప్రకారం ఐదు సిగరెట్లలోని నికోటిన్ చాలు మనిషిని చంపేయడానికి! ఈ అధ్యయన వివరాలు ‘ఆర్కైవ్స్ ఆఫ్ టాక్సికాలజీ’లో నమోదై ఉన్నాయి కూడా.ఒకేసారి పెద్దసంఖ్యలో టోకున మనుషులను చంపేయడానికి రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్ హైడ్రోజన్ సయనైడ్‌ను (జెనోసైడల్ ఏజెంట్‌గా) ఉపయోగించాడట. దాన్ని మనం స్వచ్ఛందంగా రోజూ సిగరెట్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. అలాంటి విషాలను మనం రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటామని గుర్తుంచుకుంటే సిగరెట్ మానడం చాలా తేలిక. సిగరెట్లు ఎంత ప్రమాదకరమైనవో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఈ విషయమై మనం ఇంకాస్త తమాషా ఉదాహరణ చెప్పుకుందాం. ఆపిల్ కంప్యూటర్ల దగ్గర సిగరెట్లు తాగితే... ఆ సిస్టమ్‌లకు గ్యారంటీ ఉండదంటూ ఆ కంపెనీ వారంటీ నిబంధనల్లో పొందుపరచారు. అదీ సిగరెట్లకు ఉన్న అపకీర్తి! అలవాటయ్యేలా చేసే నికోటిన్! పొగాకులోని నికోటిన్ అనే పదార్థం ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. ఫ్రెంచ్ జాతీయుడైన జీన్ నికోట్ అనే వ్యక్తి పేరుమీద నికోటిన్ అనే మాట ఆవిర్భవించింది. ఇతడు 1560లో మొదటిసారి ఫ్రాన్స్‌కు పొగాకును పరిచయం చేశాడు. అతడి పేరిటే పొగాకులోని హుషారునిస్తుందని పేరున్న ఆ విష పదార్థానికి నికోటిన్ అని పేరుపెట్టారు. నిజానికి మనం సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. మెదడులో కొన్ని రిసెప్టర్లు ఉంటాయి. నిజానికి మనమేమైనా సంతోషం కలిగే పనిచేసినప్పుడు అవి స్పందించి డోపమైన్ అనే రసాయనాన్ని వెలువడేలా చేస్తాయి. నికోటిన్ మన మెదడును చేరగానే ఈ రిసెప్టార్లు డోపమైన్ ద్వారా మనకు హాయిగా, రిలాక్స్డ్గా, సంతోషంగా ఉన్న భావనను కలగజేస్తాయి. దాంతో ఈ ఆనందాన్ని తరచూ పొందేందుకు ఆ పొగాకుకు అలవాటైపోతాం. మాటిమాటికీ డోపమైన్‌ను స్రవింపజేసేందుకు పొగాకును ఆశ్రయిస్తాం. అలా పొగాకు అలవాటైపోతుంది. ఈ నికోటిన్ వ్యసనం ఎంతో బలమైనది. నికోటిన్ బానిసత్వం...ఎంతో బలీయం నికోటిన్ మనిషిని ఎంతగా బానిసను చేసుకుంటుందో తెలుసుకునేందుకు రెండు ఉదాహరణలు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు క్యాన్సర్ సోకింది. ఆ క్యాన్సర్ వల్ల అతడికి దాదాపు 30కి పైగా సర్జరీలు అయ్యాయి. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు.ఇంకా చెప్పుకోవాలంటే... హిండెన్ బర్గ్ అనేది ఒక జర్మన్ పాసెంజర్ ఎయిర్‌షిప్. మనందరికీ టైటానిక్ షిప్‌కు జరిగిన ప్రమాదం గురించే తెలుసు. కానీ ఇది ఆ స్థాయికి తగ్గని దుర్ఘటన. కాకపోతే అంతమంది చనిపోలేదంతే. హిండెన్‌బర్గ్ అనే ఈ పాసెంజర్ ఎయిర్‌షిప్ చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ఈ లాంగెస్ట్ క్లాస్ ఫ్లయింగ్ మెషిన్ వాడుక తర్వాత్తర్వాత అమిత ధనవంతుల ప్రయాణాలన్నీ ఇలాంటి ఎయిర్షిప్స్లోనే జరుగుతాయనేది ఆ రోజుల్లో ఒక ఊహ. అయితే 1937 మే 3న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిన అది మే 6న యూఎస్ న్యూజెర్సీలోని మాంఛెస్టర్ టౌన్షిప్ దగ్గర దగ్ధమైపోయింది. చిన్న స్పార్క్ కారణంగా మొత్తం ఇంధనం అంటుకొని ప్రమాదం జరిగింది. దాంతో ఆ ఎయిర్షిప్లోని 97 మంది ప్రయాణికుల్లో 35 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని టైటానిక్ ఆఫ్ స్కైస్ అంటారు. ఆ ఎయిర్‌షిప్‌లో 70 లక్షల క్యూబిక్ అడుగుల హైడ్రోజన్ ఇంధనం ఉంది. చిన్నపాటి నిప్పు స్పార్క్ చాలు... అదంతా అంటుకుని తగలబడిపోవాడానికి. అంతటి ప్రమాదం ఉందని తెలిశాక కూడా... అంతమంది ప్రయాణం చేసే ఆ మెగాఎయిర్షిప్లోనూ ఒక స్మోకింగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు పొగతాగడాన్ని అమితంగా ఇష్టపడే ఆనాటి ప్రయాణికులు. ఆ ప్రమాదానికి ఎలక్ట్రిక్ స్పార్క్ వల్ల ఇంధనం మండిపోవడం కారణం కావచ్చని ఊహిస్తున్నా... పొగతాగే సమయంలోని నిప్పురవ్వ వల్లే జరిగిందని నిర్ధారణగా చెప్పలేకపోయినా... నిప్పు కణిక వల్ల తామంతా భస్మమైపోయేంతటి ప్రమాదం పొంచిఉన్నా కూడా ప్రయాణికులు స్మోకింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారంటే... పొగతాగే అలవాటు ఎంతటి పెద్ద వ్యసనమో మనకు అర్థమవుతుంది. ఒకటా రెండా... ఎన్నెన్నో జబ్బులు దాదాపు 25% నుంచి 30% క్యాన్సర్లు కేవలం పొగాకు వల్లనే కలుగుతున్నాయి. వీటిల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువ. ఆ తర్వాత పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్లూ ఎక్కువగానే వస్తాయి. ఇక పొగాకు వినియోగం వల్ల స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, క్లోమగ్రంథి క్యాన్సర్లు, మూత్రాశయ క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఇక ప్రోస్టేట్(పౌరుషగ్రంథి) క్యాన్సర్‌కూ, పొగతాగడానికీ సంబంధాలు చాలా చాలా ఎక్కువ. బెంజీన్ అనే రసాయనం అక్యూట్ మైలాయిడ్ లుకేమియా (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)ను కలగజేస్తుంది. వీటితో పాటు గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్), పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా ఒకటేమిటి... శరీరంలోని ప్రతి అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుందన్నది అతిశయోక్తి కాని వాస్తవం. ఇక మీకు తెలియని విషయం ఏమిటంటే... ప్రతి సిగరెట్‌లోనూ 20 శాతం చక్కెర ఉంటుంది. అందువల్ల సిగరెట్ తాగగానే ఒంట్లో చక్కెరపాళ్లు పెరుగుతాయి. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇక డయాబెటిస్ ఒంట్లోని రోగనిరోధకతను దెబ్బతీస్తుందన్నది తెలిసిందే. దాంతో వరసగా క్యాన్సర మొదలు ఎన్నో వ్యాధులు, వాటివల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. పొగమానేస్తే ఎన్నో ప్రయోజనాలు... పొగతాగడం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెంటనే సమకూరడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు చివరి సిగరెట్ తాగిన 20 నిమిషాల్లో మీ గుండె వేగం తగ్గి, మళ్లీ దాని నార్మల్ వేగంతో కొట్టుకోవడం మొదలవుతుంది. 12 గంటల తర్వాత మీ కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గడం మొదలవుతుంది. మూడు నెలల్లో మీ ఊపిరితిత్తులు నార్మల్కు రావడానికి ఉద్యుక్తమవుతాయి. ఆ తర్వాత వాటి పనితీరు క్రమంగా నార్మల్కు వస్తుంటుంది. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. 15 ఏళ్లలో మీరంతా నార్మల్ అయిపోయి నాన్స్మోకర్లో ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో అలాంటి ప్రయోజనాలూ ఒకప్పటి మాజీస్మోకర్స్కూ కలుగుతాయి. చాలామంది పొగ మానేయడానికి ఇష్టపడేవాళ్లే! వాస్తవానికి పొగతాగేవాళ్లలో 69 శాతం మంది ఇష్టం లేకుండానే పొగతాగుతుంటారట. ఎందుకంటే... వాళ్లెప్పటికప్పుడు తమ దురలవాటు సిగరెట్ మానాలని అనుకుంటూనే, తమకం ఆపుకోలేక మళ్లీ మళ్లీ సిగరెట్ ముట్టిస్తూ ఉంటారు. వీళ్లలో చాలామంది సోమవారం రోజున తమ సిగరెట్ అలవాటుకు స్వస్తిచెప్పాలనుకుంటారు. ఆదివారం సెలవు రోజున తమ మనసుతీరా సిగరెట్ తాగేసి, సోమవారం నుంచి ఆ అలవాటుకు గుడ్–బై చెప్పాలనుకుంటార్ట. కానీ వీళ్లలో చాలామంది మళ్లీ పొగభూతానికి లొంగిపోతారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ పొగతాగడం మానేశారనుకుందాం. ఇప్పుడున్న క్యాన్సర్ రోగుల సంఖ్యలో తక్షణం 30% కేసులు తగ్గుతాయి. క్రమంగా 50 శాతానికి పైగా క్యాన్సర్‌తో సంభవించే మరణాలూ తగ్గుతాయని ఒక అంచనా. పొగాకుఉత్పాదనల కోసం అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ఒక రంగు. ఇది ఒకరకమైన గోధుమరంగు వంటిది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు (ద అగ్లియెస్ట్ కలర్) అని అంటారు. ఈ రంగును చావును సూచించే రంగుగా చెబుతారు. జీఎఫ్కే అనే పరిశోధన సంస్థ ఈ రంగుమీద అనేకరకాల పరిశోధనలు చేశాక... ఈ అసహ్యకరమైన రంగును ‘పొగాకు ఉత్పదనలకు’ వాడితే బాగుంటుందని సూచించింది. అయితే ఇదేరంగును మరింత ఆకర్షణీయంగా చేసి సిగరెట్ పెట్టెలకు వాడుతుంటారు. యూరప్ తొలి స్మోకర్‌కు ఏడేళ్ల జైలు! యూరప్‌కు పొగాకును పరిచయం చేసిన మరొక వ్యక్తి రోడ్రిగో డి జెరెజ్. ఇతడు అమెరికాను కొనుగొన్న కొలంబస్ నావికుల బృందంలోని సభ్యుడు. శాంటామారియా నౌక మీద ప్రయాణం చేస్తూ 1492లో వీళ్లు బహమాస్‌లోని శాన్సాల్వడార్ ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడి గౌనహని అనే తెగకు సంబంధించిన వారు పొగతాగడాన్ని చూశాడు రోడ్రిగో డి జెరేజ్. వారి నుంచి పొగతాగడం నేర్చుకున్నాడు. యూరప్‌లోని స్వదేశానికి తిరిగి వచ్చాక మరికొంతమందికి కూడా అతడు స్మోకింగ్ అలవాటు చేశాడు. అప్పట్లో నోటినుంచి అలా పొగను వెలువరించడం అనేది ‘దెయ్యపు చర్య’ అనీ, దెయ్యాలు చేసే ఆ పని చేసినందుకు ‘స్పానిష్ ఇంక్విజిషన్’కు చెందిన అక్కడి మతపెద్దలు అతడికి ఏడేళ్లు కారాగార శిక్ష విధించారు. కానీ... ఏడేళ్ల తర్వాత అతడు విడుదలయ్యేనాటికి పొగతాగే అలవాటు యూరప్ అంతటా విస్తరించింది. అది అపోహ మాత్రమే... చాలామంది పొగతాగేవాళ్లు భోజనం చేశాక ఒక దమ్ము లాగితే... తిన్నది వేగంగా జీర్ణమవుతుందని అనుకుంటారు. తమ అనుభవం వల్ల ఆ అపోహనే వాస్తవంగా భ్రమిస్తుంటారు. కానీ నిజానికి సిగరెట్ జీర్ణప్రక్రియను చాలా ఆలస్యం చేస్తుంది. అరిగే ప్రక్రియ అతి నెమ్మదిగా కొనసాగేలా చూస్తుంది. ఎందుకంటే... సిగరెట్ తాగగానే తమ ఒంట్లోకి ప్రవేశించే విషాలను బయటకు తరమడానికి శరీర వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుంది. ఆ విషాలు మెదడును చేరితే అది చాలా ప్రమాదకరం కాబట్టి మన శారీరక జీవక్రియల వ్యవస్థ అంతా తమ దృష్టిని విషాలను నిర్వీర్యం చేసే పనిమీద కేంద్రీకరిస్తుంది. దాంతో ఈ ప్రాధాన్యక్రమం వల్ల జీర్ణప్రక్రియ ఆలస్యమవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు మొదలుకొని మళ్లీ ఎన్నో అనర్థాలు. అందుకే ఈసోఫేజియల్ క్యాన్సర్లు మొదలుకొని, పెద్దపేగు (కొలోన్) క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల క్యాన్సర్లకు పొగతాగే అలవాటే ఒక ప్రధాన కారణం. Dr. Ch.Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
చేబ్రోలు పొగాకు గోదాంలో పెను మంటలు
-
పంటలు.. ఇబ్బడి ముబ్బడి!
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా అత్యధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గం కనుక్కున్నారు. కిరణజన్య సంయోగ క్రియ వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిచేయడం ద్వారా మొక్కలు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపునిచ్చేలా చేయవచ్చునని దీనిద్వారా పంట దిగుబడులు కనీసం 40 శాతం వరకూ పెరుగుతాయని పాల్ సౌత్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు శక్తిగా మార్చుకునే ప్రక్రియకు కిరణ జన్య సంయోగ క్రియ అంటారన్నది తెలిసిందే. అయితే యుగాలుగా ఈ ప్రక్రియ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఒక దశలో కార్బన్డయాక్సైడ్ కణాలను లాక్కునేందుకు రుబిస్కో అనే ఎంజైమ్ ఉపయోగపడుతూంటుంది.అయితే కొన్నిసార్లు ఈ ఎంజైమ్ కార్బన్‌డయాక్సైడ్‌కు బదులుగా ఆక్సిజన్‌ను లాగేసుకుంటుంది. దీని ప్రభావం దిగుబడులపై ఉంటుంది. సౌత్ తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ ఎంజైమ్‌ను నియంత్రించేందుకు ఒక పద్ధతిని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతితో సాగైన పొగాకు పంట తక్కువ కాలంలోనే 40 శాతం వరకూ ఎక్కువ దిగుబడిని ఇచ్చింది. సోయా, వరి, బంగాళాదుంప, టమోటా వంటి పంటల్లోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఆ తరువాత విస్త్రత వినియోగానికి అందుబాటులోకి తెస్తామని సౌత్ తెలిపారు. -
‘ధూమపానం’పై బడి పిల్లల ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: ధూమపానం నిర్మూలనపై పాఠశాల విద్యా శాఖ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. భావి పౌరులతోనే ధూమపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలను స్మోక్ ఫ్రీ, టొబాకో ఫ్రీ స్కూల్‌గా ప్రకటించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పాఠశాలల ఆవరణలో పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించాలనేదే విద్యా శాఖ లక్ష్యం. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షించి నివేదికను ఉన్నతాధికారులకు పంపాలని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్టు–2003 ప్రకారం ప్రతి విద్యా సంస్థ తప్పకుండా నిబంధనలు పాటించాలని అందులో పేర్కొన్నారు. ఏం చేయాలి.. ముందుగా ప్రతి పాఠశాలలో ‘నో స్మోకింగ్/స్మోక్లెస్ టొబాకో’బోర్డులు ఏర్పాటు చేయాలి. టొబాకొ ఫ్రీ కేంద్రంగా విద్యా సంస్థలు స్వీయ ప్రకటన చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారి తన జిల్లా పరిధిలోని అన్ని విద్యా సంస్థలను టొబాకో ఫ్రీ ఇన్‌స్టిట్యూట్స్‌గా సర్టిఫై చేయాలి. క్షేత్రస్థాయిలో ధూమపాన నిషేధం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. నెలవారీ నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖకు సమర్పించాలి. పొగాకు నియంత్రణ అత్యంత ఆవశ్యకం.. గ్లోబల్ అడల్ట్ టొబాకొ సర్వే ఆఫ్ ఇండియా 2016–17 నివేదిక ప్రకారం తెలంగాణలో 17.8 శాతం మంది పెద్దలు (15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ) పొగాకు లేదా పొగాకు ఉత్పత్తుల్ని ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల ఆరోగ్యం క్షీణించడం, వ్యాధులు రావడం, వైకల్యం, చివరికి మరణం సంభవించడం వంటి వైపరత్యాలు చోటుచేసుకునే ప్రమాదముంది. రాష్ట్రంలో పొగాకు నియంత్రణ అత్యంత ఆవశ్యక అంశంగా పరిగణించాలని ఆ నివేదిక సూచించింది. చట్టం ఏం చెబుతోంది.. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టయిజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లయి అండ్ డిస్ట్రిబ్యూషన్) 2003 చట్టం (కోప్టా) సెక్షన్ 6 ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధం. విద్యా సంస్థలకు 100 గజాల కంటే తక్కువ దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్టం సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమంటూ సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలి. -
పొగాకు మానే క్విట్‌లైన్ ఇదిగో
సాక్షి,హైదరాబాద్: ధూమపానం, పొగాకు నమలడం వంటి దుర్వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా కౌన్సెలింగ్ మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘క్విట్‌లైన్ ఫోన్ నంబర్’ను ప్రచురించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి తయారవుతున్న అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘1800–11–2356’అనే క్విట్‌లైన్ నంబర్‌ను ప్రచురిస్తున్నా రు. ఈమేరకు పొగాకు నియంత్రణ కోసం పని చేస్తోన్న వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ధూమపానం, పొగాకు నమలడం వంటి వ్యసనాలను మా నుకోవాలనుకునే వాళ్లు ఈ నంబర్‌కి ఫోన్ చేస్తే వారికి తగిన సాయం అందుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 46 దేశాలు పొగాకు ఉత్పత్తులపై ఇటువంటి క్విట్‌లైన్ నంబర్లను ప్రచురిస్తుండగా, ఆసియాలో థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్ మాత్రమే ఈ చర్యకు పూనుకున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ చేరనున్నట్లు సంస్థ తెలిపింది. ఏటా పది లక్షల మంది.. సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో దేశంలో ఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. ఆ దురలవాటు నుంచి బయట పడాలన్నా చాలామంది మానుకోలేని పరిస్థితి. అన్ని పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు కేన్సర్ కారకం’, ‘పొగాకు వల్ల బాధాకరమైన మరణం సంభవిస్తుంది’వంటి హెచ్చరికలు వ్యాధుల ఫొటోలతో సహా ప్రచురిస్తున్నారు. ఈ ప్రకటనలు ప్యాకెట్లపై 85% స్థలాన్ని ఆక్రమిస్తాయి. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టుల నిర్ణయంతో 2016 ఏప్రిల్ నుంచి ఫొటోలతో ఈ హెచ్చరికలను ప్రచురిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై అనారోగ్య సంబంధిత హెచ్చరికలను ప్రచురించడంలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు కెనడా కేన్సర్ సొసైటీ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. ఈ విషయంలో మొత్తం 205 దేశాల్లో మన దేశానికి మూడో స్థానం రావడం విశేషం. హెచ్చరికలతో మంచి ఫలితాలు.. పొగాకు ఉత్పత్తులపై ఫొటోలతో కూడిన హెచ్చరికలను ప్రచురించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జరిపిన ఒక సర్వే వెల్లడించింది. ఆ శాఖ ఇటీవల జరిపిన గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వేలో పొగాకు ఉత్పత్తులపై కనిపిస్తున్న ఆ హెచ్చరికలను చూశాక తమ అలవాటు మానుకోవాలని లేదా తగ్గించుకోవాలని సిగరెట్ తాగేవాళ్లలో 62%, బీడీ తాగేవాళ్లలో 54% మంది భావించారని ఆ సర్వే వెల్లడించింది. మొత్తంగా పొగాకు వాడకం ప్రమాదకరమని పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డవాళ్లలో 96% మంది అంగీకరించారని ఆ సర్వే తెలిపింది. ధూమపానం చేసేవాళ్లలో 55% మంది, పొగాకు నేరుగా నమిలే వాళ్లలో 50% మంది తమ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సర్వేలో వెల్లడయ్యింది. అందువల్ల ప్రస్తుతం పొగాకు వ్యసనాన్ని తగ్గించే చికిత్సా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది. ‘పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వ్యాధుల ఫొటోలతో సహా హెచ్చరికలు ప్రచురించడం చెప్పుకోదగ్గ ఫలితాన్నిచ్చింది. అనేక భాషలతో దేశంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పొగాకు దుష్ఫలితాలను అర్థమయ్యేట్లు చేయడంలో ఈ హెచ్చరికలు సఫలీకృతమయ్యాయి. అందువల్లే చాలామంది పొగాకు వాడకం ప్రమాదమన్న భావనకు రాగలిగారని’ వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. -
ఉస్మానియాలో గుట్కా, సిగరెట్లపై నిషేధం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్‌మాసాలలను నిషేధిస్తూ ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ నాగేందర్ బుధవారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. అటెండెంట్లు ఆస్పత్రిలో వచ్చి సిగరెట్ తాగడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే వీటిపై నిషేధం అమలు చేయాలని అన్ని శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటి మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రోగులు వారి అటెండర్లకు చెందిన లగేజీలు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
‘పొగాకు’ నిషేధంపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పొగాకుతో తయారు చేసే గుట్కా, పాన్ మసాలాలు తదితర ఉత్పత్తుల నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. గుట్కా, పాన్ మసాలాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాన్‌మసాలా ఉత్పత్తుల తయారీ, భద్రపర్చడం, పంపిణీ, రవాణాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ యూనిక్ టుబాకో ప్రొడక్ట్స్ సంస్థ అధిపతి సయ్యద్ ఇర్ఫానుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆహార భద్రత కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీచేశారని, అసలు పొగాకు ఆహారం కాదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. బండ్లగూడలోని తమ పరిశ్రమలోకి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే తనిఖీలకు వస్తున్నారన్నారు. రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, గుంటూరులోని టుబాకో చైర్మన్, ఆహార భద్రత శాఖ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. -
ప్రాణాలకు ‘పొగ’!
తెలుగు రాష్ట్రాల్లో పొగాకు పలువురి ప్రాణాలు తీస్తోంది. పొగాకు ఉత్పత్తులతో ఏటా లక్షలాది మంది కేన్సర్ బారిన పడుతున్నారు. పలు రాష్ట్రాలతో పోలిస్తే పొగతాగే వారు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉండటం ఆందోళన కలిగించే విషయం సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొగరాయుళ్లు ఏటా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య కోటీ ఎనభై లక్షలు. పొగ తాగే వారిలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా (14.2 శాతం), గుట్కా, కిళ్లీ, పాన్‌మసాలాలు వంటివి వాడేవారు తెలంగాణలో ఎక్కువ (10.1) శాతం ఉన్నారు. పొగతాగే వారి కనిష్ట వయసు 17 ఏళ్లు కాగా.. గుట్కా, పాన్‌మసాలాలు పదిహేనేళ్ల వయసు నుంచే మొదలెడుతున్నట్టు వెల్లడైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొగతాగే వారు, గుట్కాలు వాడే వారు ఎంత ఎక్కువగా పెరుగుతున్నారో.. అంత తీవ్ర స్థాయిలో క్యాన్సర్ బాధితులూ పెరిగిపోతున్నారు. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలున్నా నామమాత్రంగా కూడా లెక్కచేయడం లేదని తేటతెల్లమైంది. భారీగా పెరుగుతున్న పొగాకు కారక క్యాన్సర్లు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పొగాకు, గుట్కా కారక క్యాన్సర్లు తీవ్రమైనట్టు గాట్స్ (గ్లోబల్ అడల్ట్స్ టుబాకో సర్వే) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పొగాకు, గుట్కా కారక క్యాన్సర్లు 35 వేలకు పైనే నమోదవుతున్నట్టు తేలింది. నోరు, నాలుక, మెడ భాగాలకు ఈ క్యాన్సర్ వస్తోంది. ప్రతి పది క్యాన్సర్లలో 3 పొగాకు కారక క్యాన్సర్లే. ఇవిగాకుండా ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్లు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్లు ఎక్కువగా మూడు, లేదా నాలుగో స్టేజ్‌లోనే తెలుస్తుండటంతో 80% మంది మృత్యువాత పడుతున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 150 నుంచి 200 మందికి ఏటా కొత్తగా క్యాన్సర్లు వస్తుంటే.. అందులో 30 శాతం పొగాకు కారక క్యాన్సర్లే ఉన్నాయి. మెడ, తల భాగంలోనే అధికం పొగాకు వాడే వారికి ఎక్కువగా మెడ, తల భాగంలో క్యాన్సర్లు సోకుతున్నాయి. నా దగ్గరకు వచ్చే కేసుల్లో ప్రతి పదింటిలో మూడు లేదా నాలుగు ఇలాంటి క్యాన్సర్లే. వీరి వయసు కూడా 30 నుంచి 40 ఏళ్లలోపే. బాధితుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. –డా.రమేష్ మాటూరి, క్యాన్సర్ శస్త్రచికిత్సా నిపుణులు,ఎంఎన్‌జే ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్ చిన్న వయసు వారిలోనూ వస్తోంది పొగతాగడం, గుట్కాలు తీసుకోవడం వంటి వాటి వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్లు వస్తున్నాయి. దీన్నిబట్టి పొగాకు తీవ్రత ఎలా ఉందో అంచనా వేయొచ్చు. అయితే చివరి దశలో గుర్తించడం వల్ల చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. – డా.రవికిరణ్ బొబ్బా, మెడికల్ ఆంకాలజిస్ట్ రవి అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, విజయవాడ -
సిగతరగ
చాలా మంది సిగరెట్ మానేస్తున్నారు... మరి మీ సంగతి...? ప్రపంచవ్యాప్తంగా ధూమపానం తగ్గుముఖం పడుతోంది. ఇదొక ఆశాజనకమైన పరిణామం. ధూమపానం, పొగాకు వాడకం కనుమరుగవలేదు గాని, ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది. గడచిన దశాబ్ద కాలంలో దాదాపు అన్ని దేశాల్లోనూ పొగరాయుళ్ల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్లు దాదాపు వంద కోట్ల వరకు ఉన్నారు. పొగరాయుళ్లలో 80 శాతం మంది అల్పాదాయ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు... పొగాకుతో ‘చుట్ట’రికం పొగాకుతో ‘చుట్ట’రికం క్రీస్తుపూర్వం 1400 ఏళ్ల నాడే మొదలైంది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని స్థానిక తెగల వారు పొగాకును దేవుని కానుకగా పరిగణించేవారు. వేడుకల్లో పొగతాగేవారు. పొగ చుట్టల నుంచి వెలువడే ధూమమేఘాల ద్వారా తమ ప్రార్థనలు భగవంతుని చేరుకుంటాయని వారు నమ్మేవారు. యూరోపియన్లు అమెరికాలో అడుగుపెట్టడం ప్రారంభమయ్యాక క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటికి పొగాకు క్రమంగా యూరోపియన్ దేశాలకు, ఆ తర్వాత శరవేగంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటిష్ వారి ద్వారా పొగాకు భారతదేశానికి చేరుకుంది. పొగాకు పరిచయం కావడానికి ముందు భారతదేశంలో ఎక్కువగా గంజాయితోనే పొగతాగేవారు. ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పొగాకును ఔషధంగా పరిగణించేవారు. సిగరెట్ల కంపెనీలు వైద్యులతో వ్యాపార ప్రకటనలు ప్రచారం చేసుకునేవి. ఇరవయ్యో శతాబ్దిలో సగానికి సగం కాలం ఇలాగే గడిచింది. పొగాకు వల్ల క్యాన్సర్ వంటి అనర్థాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. పలు ప్రభుత్వాలు కూడా పొగాకు వాడకంపై ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. పొగాకు ఉత్పాదనలో టాప్–10 ►చైనా 29,95,400 ►భారత్ 7,20,725 ►ఇండోనేసియా 1,96,300 ►మలావి 1,26,348 ►జాంబియా 1,12,049 ► బ్రెజిల్ 8,62,396 ►అమెరికా 3,97,535 ►పాకిస్తాన్ 1,29,878 ►అర్జెంటీనా 1,19,434 ►మొజాంబిక్ 97,075 పొగ తక్కువ దేశాల్లో టాప్–10 దేశం – జనాభాలో పొగరాయుళ్ల శాతం ►స్వీడన్ 14.5 ►అమెరికా 15.4 ►ఆస్ట్రేలియా 16.6 ►కెనడా 17.7 ►న్యూజిలాండ్ 18.1 ►బ్రెజిల్ 18.3 ►దక్షిణాఫ్రికా 18.6 ►లగ్జెంబర్గ్ 18.8 ►ఐస్లాండ్ 19.0 ►భారత్ 19.5 -
పరి పరిశోధన
చలికాలంలోనే గుండెపోట్లు ఎక్కువ! వాతావరణం చల్లబడితే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు తైవాన్ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నప్పుడు ఎక్కువమంది మరణించినట్లు గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పో జూయి వూ తెలిపారు. 2008 – 2011 మధ్యకాలంలో గుండెపోటుకు గురైన 40 వేల మంది వివరాలు.. రెండు ఇతర అధ్యయనాల ద్వారా సేకరించిన పది లక్షల మంది వివరాలను కలిపిపరిశీలించినప్డుపు ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పారు. చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురై.. ఆ మరుసటి రోజు చాలామంది గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. చలికాలంలో ఎవరైనా గుండెపోటు తాలూకూ లక్షణాలతో ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. గుండెపోట్లకు.. చలికాలానికి కార్యకారణ సంబంధం ఉందా? లేదా? అన్నది మాత్రం ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. ఆసియా పసఫిక్ కార్డియాలజీ సొసైటీ సమావేశంలో ఈ అధ్యయన వివరాలను ప్రకటించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ఇన్సులిన్ మాత్రలతో సత్ఫలితాలు... మధుమేహులు తరచూ సూదిమందు తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించే ఇన్సులిన్ మాత్రల ప్రభావం బాగానే ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఓరామెడ్ అనే సంస్థ అభివద్ధి చేసిన ఈ మాత్రలపై ఇంకో దశ ప్రయోగాలు పూర్తి అయితే అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా. మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందివ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని దశాబ్దాలుగా తెలిసినప్పటికీ ఇలాంటి మాత్రలను తయారు చేయడం ఇప్పటివరకూ వీలుపడలేదు. కడుపులో ఉండే ఆమ్లాలు ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఓరామెడ్ సంస్థ ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించింది. దీంతో ఈ కంపెనీ మాత్రలు చిన్నపేవులను చేరేవరకూ ఇన్సులిన్‌ను విడుదల చేయవు. తొలి రెండు దశల ప్రయోగాల్లో ఈ మాత్రల ప్రభావ శీలతను, భద్రతలను రుజువు చేయగా.. ఇది అందరిలో దాదాపు ఒకేలా పనిచేస్తుందని తెలుసుకునేందుకు ఇంకో దశ ప్రయోగాలు జరిపారు. గతంలో మందు 28 రోజుల పాటు మందు ప్రభావం ఏమిటన్నది గుర్తిస్తే... తాజా ప్రయోగాల్లో 90 రోజులపాటు పరిశీలనలు జరిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ మాత్రలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఓరామెడ్తోపాటు కొన్ని ఇతర కంపనీలు కూడా ఇన్సులిన్ మాత్రలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. పొగాకు పూలలో సరికొత్త యాంటీబయాటిక్ వ్యాధి కారక బ్యాక్టీరియా మందులకు నిరోధకత పెంచుకుంటున్న ప్రస్తుత తరుణంలో లా ట్రోబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పొగాకు పూలలో ఉండే ఓ రసాయన మూలకం మెరుగైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుందని గుర్తించారు. యాంటీబయాటిక్ నిరోధకత ఎక్కువైతే.. ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త యాంటీబయాటిక్ మూలకాల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల జంతువులు, సేంద్రీయ ఉత్పత్తుల నుంచి కొత్త యాంటీబయాటిక్‌లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుతున్నాయి. లా ట్రోబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అలాంటిదాన్ని పొగాకు పూలలో గుర్తించారు. నికోటినా అలాటా అని పిలిచే పొగాకు మొక్క శిలీంధ్రాల దాడిని తట్టుకునేందుకు కొన్ని రసాయలను ఉత్పత్తి చేసుకుంటుందని.. వీటిల్లో ఒకటైన ఎన్ఏడీ1 మనుషుల్లో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై కూడా ప్రభావం చూపగలదని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని హ్యులెట్ అనే శాస్త్రవేత్త తెలిపారు. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ముర్రే రివర్ ఎన్‌సెఫిలైటిస్ వంటి అనేక వ్యాధులకు ఈ కొత్త యాంటీబయాటిక్ ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని అంచనా. -
ఖైదీల కూలర్లో భారీగా ‘కట్టలు’.. వైరల్!
అమృత్సర్ : విడుదలైన ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్లో బయటపడ్డ వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు జైలు అధికారులు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్సర్ సెంట్రల్ జైలు అధికారులు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి జైల్లోని కొన్నిచోట్ల వాటర్ కూలర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇటీవలే కొందరు ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి ఈ విషయం తెలిసింది. దీంతో తాము కూడా జైలు కోసం కూలర్ బహూకరిస్తామని అభ్యర్థించారు. అందుకు అధికారులు అంగీకరించడంతో ఓ వాటర్ కూలర్ని తెచ్చి వారికి అందజేశారు. అయితే, కూలర్ విషయంలో జైలు సిబ్బందికి ఎక్కడో అనుమానం వచ్చింది. దాంతో తెరచిచూసిన అధికారులు కంగుతిన్నారు. అందులో నుంచి ఏకంగా 1780 బీడీ కట్టలు, రెండు ప్యాకెట్ల పొగాకు బయటపడ్డాయి. జైలు లోపల ఉన్న తమ సహచర ఖైదీల కోసం విడుదలైన ఖైదీలు ఈ ప్లాన్ వేశారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. మహిందర్ సింగ్ అనే వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. -
వైరల్ : ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్లో
-
పొగాకు కంపెనీ నిధులతోనే ధూమపానంపై..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ శతాబ్దంలో ధూమపానంతో సంక్రమించే జబ్బుల కారణంగా మరణించే వంద కోట్ల మంది ప్రాణాలను రక్షించడం ఎలా ? అన్న అంశంపై దక్షిణాఫ్రికాలో గతవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్యులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు అనర్గళంగా మాట్లాడారు. ‘యునైటింగ్ ది వరల్డ్ ఫర్ టొబాకో ఫ్రీ జనరేషన్ (పొగాకురహిత తరం కోసం ప్రపంచాన్ని ఏకం చేద్దాం)’ అన్న థీమ్పైనా ముందుగా ఈ చర్చ సజావుగానే జరిగింది. ఈ థీమ్‌ను ఖరారు చేసిందీ లాభాపేక్షలేని స్వతంత్ర, స్వచ్ఛంద సంస్థగా చెప్పుకునే ‘ఫౌండేషన్ ఫర్ ఏ స్మోక్ ఫ్రీ వరల్డ్’. ఈ అంతర్జాతీయ సంస్థకు సంధానకర్తగా వ్యవహరించిందీ కూడా ఈ సంస్థనే. అంతేకాదు, ధూమపానాన్ని నియంత్రించేందుకు ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ లేదా ఎఫ్‌సీటీసీ) పేరిట ఓ అంతర్జాతీయ ఒప్పందం కుదరడానికి కూడా గతేడాదే అమల్లోకి వచ్చిన ఈ స్మోక్ ఫ్రీ వరల్డ్ ఫౌండేషన్ అధిపతి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి డెరెక్ యాచ్ చేసిన కషే కారణం. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం వెలుగులోకి రావడంతో అప్పటి వరకు సజావుగా జరిగిన చర్చ మరో దిశకు మారి ధూమపానంలా వక్తలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సంస్థకు ఏడాదికి 8 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని విరాళంగా ఇస్తున్నది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద టొబాకో కంపెనీ అయిన ‘ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ (పీఎంఐ)’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘మార్ల్బోరో’ బ్రాండ్ ఈ కంపెనీదే. ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులు అమ్ముకుంటూ అధిక లాభాలు గడిస్తున్న ఈ సంస్థ తమ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం శాస్త్ర విజ్ఞాన, వైద్య అంశాలను వక్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్మోక్ ఫ్రీ వరల్డ్ ఫౌండేషన్ అధికారి డెరెక్ యాచ్ రాసిన కొన్ని వ్యాసాలు కూడా అలాంటివేనన్న విమర్శలు ఉన్నాయి. ‘ఓ పొగాకు కంపెనీ నుంచి భారీ ఎత్తున విరాళాలు తీసుకుంటూ పొగాకు రహిత సమాజం కోసం ఎలా కషి చేయగలం? అందులో చిత్తశుద్ధి ఉంటుందా? నైతికత ఉంటుందా? ఆత్మవంచన కాదా? అభాసుపాలు కామా ? అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా అర్థం చేసుకుంటుందీ? అన్న ప్రశ్నలు సదస్సులో కొందర విమర్శకులు లేవనెత్తడంతో ముందుగా ఉక్కురిబిక్కిరైన వక్తలు ఆ తర్వాత తమలో తాము వాదించుకున్నారు. పొగాకు కంపెనీలకు పొగాకు, ధూమపానం నియంత్రణా సంస్థలు, విధానకర్తలు దూరంగా ఉండాటంటూ కొందరు వక్తలు ‘బ్రేకింగ్ బిగ్ టొబాకోస్ గ్రిప్’ అన్న నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘స్మోక్ ఫ్రీ వరల్డ్’ ఫౌండేషన్‌కు దూరంగా ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు. ‘ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్’ కంపెనీ తన వెబ్సైట్లో ‘డిజైనింగ్ స్మోక్ ఫ్రీ ఫ్యూచర్’ అని చెప్పుకుంటోంది. అంతేకాదు, సిగరెట్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన తమ కంపెనీ ‘మానేయడానికి’ ప్రయత్నిస్తోందంటూ ఈ ఏడాది వాణిజ్య ప్రకటనలను కూడా విడుదల చేసింది. ఇక్కడ ‘డిజైనింగ్ స్మోక్ ఫ్రీ ఫ్యూచర్’ అంటే పొగ రహిత భవిష్యత్తు కోసం అని అర్థం. సిగరెట్ల ఉత్పత్తిని మానేసేందుకు ప్రయత్నిస్తున్నామంటే వాటి స్థానంలో తక్కువ హానికరమైన మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నామని అర్థం. ‘ఇక్కడ స్మోక్ ఫ్రీ, టొబాకో ఫ్రీ’ అనే పదాలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిలిప్ మోరిస్ కంపెనీ ‘స్మోక్ ఫ్రీ’ అని చెబుతుందిగానీ ‘టొబాకో ఫ్రీ’ అని చెప్పడం లేదు. పొగరాని ఉత్పత్తులను తీసుకొస్తాంగానీ పొగాకులేని ఉత్పత్తులు తీసుకరామని కంపెనీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ధూమపానం నియంత్రణ కోసం కషి చేస్తున్న ‘స్మోక్ ఫ్రీ వరల్డ్’కు తాము చిత్తశుద్ధితోనే విరాళాలు ఇస్తున్నామని అంతర్జాతీయ సదస్సలో గొడవ జరగడంతో ఫిలిప్ మోరిస్ కంపెనీ సమర్థించుకుంది. హానికరమైన ఉత్పత్తులపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించేందుకు, అవసరమైన విధాన నిర్ణయాలు వెలువడేందుకు, తక్కువ హానికరమైన ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఈ చర్చలు దోహద పడతాయని ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సీఈవో ఆండ్రీ కలాంట్జోపౌలస్ చెప్పారు. ఇలాంటి చర్చల ఫలితంగానే తాము తక్కువ హానికరమైన, తక్కువ వేడినిచ్చే సన్నటి సెగరెట్లను ‘ఐక్యూఓఎస్’ బ్రాండ్ పేరిట విడుదల చేశామని చెప్పారు. ఇప్పటికీ తమదీ ‘స్మోక్ ఫ్రీ ఫ్యూచర్’ అన్నదే నినాదమని ఆయన సమర్థించుకున్నారు. ‘స్వేచ్ఛగా ధూమపానం చేయండి’ అన్నది ఆయన మాటల్లోని అంతర్లీనార్థమేమో!. -
ఆగని గుట్కా దందా..
సాక్షి,ఆసిపాబాద్: కాగజ్‌నగర్ పట్టణం నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. నిత్యం ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాలు, ఖైనీలు, పొగాకు ఉత్పత్తులను కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిషేధించినా కాగజ్‌నగర్‌లో మాత్రం ఆ నిబంధనలేవీ అమలవడం లేదు. ఇప్పటికే జిల్లాలో పొగాకు నమలడం ద్వారా అనేక మంది నోటి క్యాన్సర్ వ్యాధి బారిన పడి నరకం అనుభవిస్తుంటే మార్కెట్లో విచ్చలవిడిగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యం అవుతుండం ఆందోళన కలిగిస్తోంది. పట్టణానికి చెందిన ముగ్గురు బడా వ్యాపారులు పథకం ప్రకారం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ మీదుగా పెద్ద ఎత్తున అంబర్ ఖైనీ, గుట్కా, పాన్ మసాల వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. పల్లెలకు రవాణా.. కాగజ్‌నగర్ నుంచి జిల్లాలోని అన్ని మారుమూల గ్రామాలకు అక్రమార్కులు రవాణా చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిషేధిత ఖైనీలపై రూ.3 ధర ఉండగా ఏకంగా రూ.10కి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటితోపాటు మాధవి ఖైని, పుల్చాప్, ఘన్‌శ్యాం పొగాకుతో పాటు ఎంసీ గుట్కాలను ట్రాన్స్‌పోర్టుల ద్వారా ఇక్కడికి దిగుమతి చేసుకుని పల్లె పల్లెకూ రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పాన్ టేలాలు, చిన్న షాపులకు సరఫరా చేయడమే కాకుండా సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, పెంచికల్‌పేట, చింతలమానెపల్లి, మండలాల్లోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తూ అమాయక ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కొంత మంది నిరుద్యోగ యువకులను పావుగా వాడుకుంటూ వారికి కమిషన్ ఆశ చూపి వారి ద్వారా రైళ్లలో అంబర్, మాధవి ఖైనీ, పుల్చాప్, ఘన్‌శ్యాం, ఎంసీ గుట్కాలు రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారులు పెద్ద ఎత్తున నిషేధిత వ్యాపారం చేస్తున్నట్లు కొంత మంది అధికారులకు తెలిసినా వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిరు వ్యాపారులు, పాన్ టేలాల నిర్వాహకులపై అడపాదడపా చర్యలు తీసుకుంటున్న అధికారులు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే బడా వ్యాపారుల జోలికి ఎందుకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. నిత్యం దిగుమతి.. ప్రతీ రోజు వివిధ ట్రాన్స్‌పోర్టుల ద్వారా హైద్రాబాద్, నాగ్‌పూర్, బెంగళూరు, గుజరాత్ నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులు కాగజ్‌నగర్‌కు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. అనేక సార్లు పోలీసులు ఆయా ట్రాన్స్‌పోర్టులపై దాడి చేశారు. పెద్ద ఎత్తున పొగాకు ఉత్పత్తులు బయటపడినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఒక ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడు కేవలం ఈ రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ భారీగా పోగాకు ఉత్పత్తులు తరలిస్తున్నాడని సమాచారం. రూ. కోట్లలో దందా.. పోగాకు ఉత్పత్తుల చీకటి వ్యాపారం ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ నుంచి రూ.13,500 రూపాయలకు ఒక్కో అంబర్ ఖైరీ కార్టన్ (బాక్స్)లను దిగుమతి చేస్తున్న వ్యాపారులు దాన్ని స్థానిక మార్కెట్లో రూ.18,500 రూపాయలకు వరకు విక్రయిస్తున్నారు. 100 ప్యాకెట్లు ఉన్న ఒక్క బాక్స్ విక్రయించి రూ. 5వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా ప్రతీ రోజు 40 నుంచి 50 కార్టన్ల అంబర్ ఖైనీ జిల్లాలో మారుమూల గ్రామాలన్నింటికీ చేరుతోంది. రోజుకు సగటున 40 నుంచి 60 కార్టన్ల నిషేధిత పొగాకు ఉత్పత్తులను కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, చంద్రాపూర్, ఆదిలాబాద్, రాజురా, వంటి నగరాలకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే ప్రతీ రోజు 80 కార్టన్ల అంబర్ ఖైనీ విక్రయాలు జరిగినా బాక్సుకు ఐదు వేల చొప్పున అంటే సుమారుగా రూ.4 లక్షల రూపాయల వరకు దండుకుంటున్నారు. ఈ విక్రయాలను నెలసరి లెక్కిస్తే ఇక్కడ ఉన్న ముగ్గురు బడా వ్యాపారులు అర్జన కోట్లలోనే ఉంటోంది. వేకువ జామునే రవాణా! పలు ట్రాన్స్‌పోర్టుల ద్వారా హైద్రాబాద్, నాగ్‌పూర్ వంటి ప్రాంతాల నుంచి కాగజ్‌నగర్‌లో దిగుమతి చేసుకున్న పొగాకు ఉత్పత్తులను సదరు వ్యాపారులు రహస్య గోదాంలలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి ఆర్డర్‌ను బట్టి పక్క జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో తెల్లవారు జామున సమయాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు బులేరో, టాటా 207, అశోక్ లేలాండ్ దోస్త్, మినీ ఆటోలు తదితర వాహనాల్లో కింది భాగంలో పొగాకు ఉత్పత్తులను భద్రపర్చి పై భాగంలో అటకుల సంచులు, కుర్కురే సంచులు నింపి దర్జాగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉదయం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడం, అధికారుల తనిఖీలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ఆరోగ్యానికి హానికరం అంబర్ ఖైనీ, గుట్కాలు నమలడం ఆరోగ్యానికి హానికరం. ఎవరైనా దీర్ఘకాలంగా ఇవి వాడితే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. నోటి క్యాన్సర్ బారినపడి ఆరోగ్యం దెబ్బతినక ముందే అంబర్, గుట్కా నమిలే అలవాట్లను వెంటనే మానుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. – డాక్టర్ రమేశ్, సీనియర్ వైద్యులు, కాగజ్‌నగర్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి ఈ ప్రాంతంలో అంబర్ ఖైనీ, ఎంసీ గుట్కా వంటి నిషేధిత ఉత్పత్తులను దిగుమతి చేస్తూ వందలాది మంది చావుకు కారణమవుతున్న బడా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యుల చితిపై రొట్టెలు కాల్చి తింటున్న వారిని గుర్తించి ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుట్కాలు, ఖైనీలు నమిలే వారికి కౌన్సెలింగ్ ఇస్తాం. – గజ్జెల లక్ష్మణ్, స్వర్ణకమలం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, కాగజ్‌నగర్ -
సిగరెట్లు, పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం తొలగింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలాపై అదనపు ఎక్సయిజ్ సుంకాన్ని ఆర్థిక శాఖ తొలగించింది. అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తూ 2010 ఫిబ్రవరి 27న జారీ అయిన సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేషన్‌ను రెవెన్యూ విభాగం కొట్టి వేసింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కింద.. 28 శాతం పన్ను పరిధిని దాటిన డీమెరిట్, లగ్జరీ గూడ్స్‌పై సెస్సు విధించడం జరుగుతుంది. దీని ప్రకారం పాన్ మసాలాపై సెస్సు 60%, పొగాకుపై 71–204% దాకా ఉంటుంది. ఇక సెంటెడ్ జర్దా, ఫిల్టర్ ఖైనీపై 160%, గుట్కా ఉన్న పాన్‌మసాలాపై 204 శాతం సెస్సు విధిస్తారు. 65 మి.మీ. పైగా 70 మి.మీ. లోపు పొడవుండే నాన్ ఫిల్టర్ సిగరెట్స్ వెయ్యికి 5 శాతం సెస్సుతో పాటు రూ. 2,876.. ఫిల్టర్ సిగరెట్స్ అయితే 5 శాతంతో పాటు రూ. 2,126 విధిస్తారు. సిగార్లపై అత్యధికంగా ప్రతి వెయ్యిపై 21 శాతం లేదా రూ. 4,170 (ఏది ఎక్కువైతే అది) సెస్సు ఉంటుంది. నందన్ నీలేకని -
పొగాకు @181
♦ కొండపి వేలం కేంద్రంలో రికార్డు ధర నమోదు ♦ ఏపీలోనే అత్యధికం అంటున్న అధికారులు కొండపి: నియోజకవర్గ కేంద్రమైన కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం మేలి రకమైన పొగాకుకు రికార్డు ధర లభించింది. అత్యధికంగా కిలో 181 రూపాయలు పలికింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వేలం కేంద్రాల్లోకి ఇదే అత్యధిక ధర అని వేలం కేంద్రం నిర్వహణ అధికారి మధుసూదనరావు తెలిపారు. కొండపి వేలం కేంద్రం పరిధిలోని అక్కచెరువుపాలెం, గోగినేనిపాలెం, పైడిపాడు, చతుకుపాడు, అగ్రహారం గ్రామాల నుంచి శుక్రవారం రైతులు 692 బేళ్లు అమ్మకానికి తీసుకొచ్చారు. వ్యాపారులు అందులో 482 బేళ్లు కొనుగోలు చేశారు. అత్యధిక ధర కిలో 181 రూపాయలు పలకగా అత్యల్ప ధర కేజీ 74 రూపాయలు పలికింది. సరాసరి ధర కేజీ 141.91 రైతుకు దక్కింది. ఇదిలా ఉండగా ఒకటీఅరా బేళ్లకు అత్యధిక ధర చూపుతున్న వ్యాపారులు మిగతావి తక్కువ ధరలకు కొంటున్నారనేది రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరంభం ఆశాజనకం
► ఆశాజనకంగా తొలిరోజు పొగాకు వేలం ధరలు ► మున్ముందు ఈ ధరలు కొనసాగించడంపైనే అనుమానం ► 38 మంది వ్యాపారులకు గాను వేలంలో పాల్గొన్నది తొమ్మిది మందే ► వ్యాపారులంతా వేలంలో పాల్గొనేలా బోర్డు చర్యలు తీసుకోవాలి ► పొగాకు రైతు నాయకుల డిమాండ్ ఒంగోలు టూటౌన్: జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 12 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు తొలిరోజు జరిగాయి. వెల్లంపల్లి వేలం కేంద్రంలో కిలోకి రూ.160కు వేలం మొదలైంది. తొలిరోజు కావడంతో తొమ్మిది బేళ్లే వచ్చాయి. దీంతో పాటు వెల్లంపల్లి –1,2 కేంద్రాలను కలిపి ఒకే వేలం కేంద్రాన్ని చేశారు. కొండపి వేలం కేంద్రంలో అత్యధిక ధర కిలోకు రూ.162 లభించింది. ఒంగోలు వేలం కేంద్రం–2 లో ధర కిలోకి రూ.161 వచ్చింది. పొదిలి–1 వేలం కేంద్రానికి 9 బేళ్లు రాగా తొమ్మిదీ కొనుగోలు చేశారు. అత్యధిక ధర రూ.160 రాగా అత్యల్ప ధర రూ.158 పలికింది. అదేవిధంగా కందుకూరు–2 వేలం కేంద్రంలో కూడా అత్యధిక ధర కిలోకి రూ.160 రాగా అత్యల్ప ధర రూ.159 వచ్చింది. అదే విధంగా టంగుటూరు–1, టంగుటూరు–2 వేలం కేంద్రాలలో ఇవే ధరలు పలికాయి. నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలలో కూడా అత్యధిక ధర గ్రేడ్–1 రకానికి రూ.160 రాగా అత్యల్ప ధర రూ.157 వచ్చింది. మొత్తం చూసుకుంటే తొలిరోజు వేలం కేంద్రాల్లో వచ్చిన ధరలు రైతులకు కొంత ఊరట కలిగించాయి. అయితే ఈ ధరలు మున్ముందు కొనసాగుతాయా లేదా అన్న సందేహాన్ని అటు రైతులు, ఇటు రైతు సంఘాల నాయకులు వెలిబుచ్చుతున్నారు. వేలం కేంద్రాల్లో పాల్గొనే వ్యాపారులు మొత్తం 38 మంది ఉండగా..వీరంతా బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారే. ప్రస్తుతం వీరిలో తొలి రోజు కేవలం తొమ్మిదిమందే వేలం కేంద్రాలలో పాల్గొనటంపై రైతులు కొంత నిరాశ వెలిబుచ్చారు. వేలం కేంద్రాల్లో పోటీ రావాలంటే వ్యాపారులందరూ పాల్గొనాలి. పోటీతత్వం పెరగాలి. ఇలా జరిగితేనే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. కనుక ఈ పరిస్థితుల్లో వ్యాపారులందరూ వేలంలో పాల్గొనేలా బోర్డు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినా«థ్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలో రైతులు పొగాకు పంట సాగు చేశారు. మొత్తం జిల్లాలో 82 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతివ్వగా కేవలం 50 మిలియన్ ఉత్పత్తి మాత్రమే వచ్చిందని అంచనా. దాదాపు 30 మిలియన్ కిలోల నుంచి 35 మిలియన్ వరకు ఉత్పత్తి తగ్గింది. వర్షాలు లేకపోవడం, పొగమల్లె తెగుళ్ల వలన రైతులు ఖర్చు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్క కిలో పొగాకు ఉత్పత్తికి దాదాపు రూ.135 ఖర్చు చేశారు. ఇలా గత రెండేళ్లలోనూ పొగాకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. అయినా బ్యాంక్ కు సుమారుగా రూ. 2 లక్షలకుపైగా నష్టపోయారు. ఈ ఏడాది ఎకరానికి అదనంగా రూ.15 వేలకుపైగా ఖర్చు పెట్టి పంటను కాపాడుకున్నారు. పంట ఉత్పత్తి తగ్గింది. ఈ పరిస్థితుల్లో రైతులకు మంచి ధరలు ఇస్తేనే గట్టెక్కుతారు. కనుక వేలం కేంద్రాలలో పొగాకు వ్యాపారులందరూ పాల్గొనేలా బోర్డు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వేలంలో పోటీ పెరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
నట్టేట ముంచారు
జంగారెడ్డిగూడెం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అధికారులు తమను నట్టేముంచారని వర్జీనియా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం స్థానిక ఎస్బీఐ, ఎస్బీహెచ్ వద్ద వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దెత్తున ధర్నా నిర్వహించారు. ఏటా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు వర్జీనియా రైతులకు బ్యాంకులు రుణాలుగా ఇచ్చేవని అయితే ఈ ఏడాది రూ.3 లక్షలు ఇచ్చి మిగిలిన రుణాన్ని తర్వాత ఇస్తామని చెప్పి పంట చేతికి వచ్చే సమయంలో మోసం చేశారని ఆరోపించారు. రెండు నెలలుగా తిరుగుతున్నా.. గతేడాది బ్యార¯ŒSకు 25 క్వింటాళ్లు పంట అనుమతి ఇవ్వగా బ్యాంకులు ఐదు నుం చి ఆరు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాయని, ఈ ఏడాది బ్యార¯ŒSకు 30 క్వింటాళ్లు అనుమతి ఉన్నా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెండు నెలలుగా బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించినా ఫలితం లేదన్నారు. అదనపు రుణం వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకు అధికారుల నిర్ణయం శరాఘాతంగా తగిలిందన్నారు. 30 ఏళ్లుగా లేని నిబంధనలు పెట్టి రైతులను నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నారు. బకాయిలకు జమ రైతులకు మంజూరు చేసిన రూ.3 లక్షలూ గత బకాయిలకు బ్యాంకులు జ మచేసుకున్నాయని, దీంతో రైతు చేతికి కనీసం రూ.25 వేలు కూడా అందలేదని అన్నారు. పంట చేతికి వచ్చే సమయం లో ఎక్కువ ఖర్చులు ఉంటాయని కూ లీలకు పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇటువంటి సమయంలో బ్యాంకర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం ఎస్బీహెచ్ చీఫ్ మేనేజర్ ఎంవీ సీతారామన్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏవో పి.సత్యనారాయణకు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పొగాకు బోర్డు సభ్యులు గడ్డమణుగు సత్యనారాయణ, గంటశాల గాంధీ, జి.రవికుమార్, చెరుకూరి సందరరావు, వేగేశ్న రాధాకృష్ణరాజు, తెల్లం వెంకటేశ్వరరావు, గద్దే వీరకృష్ణ తది తరులు పాల్గొన్నారు. మభ్యపెట్టి మోసం చేశారు ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకులు వర్జీనియా రైతులను నట్టేట ముంచాయి. రుణాలు పెంచి ఇస్తామని మభ్యపెడుతూ ఇప్పుడు అకస్మాత్తుగా రుణం పెంచేది లేదని చేతులెత్తేశాయి. వర్జీనియా తోటలు మధ్యరకంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పవు. మధ్యస్థంగా ఉన్న, చేతికి వచ్చే పంట దశలో ఉన్న రైతులు నష్టపోతారు. –గడ్డమణుగు సత్యనారాయణ, పొగాకుబోర్డు సభ్యుడు ఆత్మహత్యలే శరణ్యం వర్జీనియా రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పటివరకు రుణాలు పెంచి ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో వర్జీనియా రైతులంతా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. అదంతా కోల్పోవాల్సి వస్తోంది. –గంటశాల గాంధీ, వర్జీనియా పొగాకు రైతు -
నిర్మలా సీతారామన్ తేల్చేశారు
న్యూఢిల్లీ: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పూర్తి నిషేధానికి మంత్రిత్వ శాఖ సన్నద్ధమవుతోంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్ వేగంగా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదననుక్యాబినెట్ ఆమోదం కోసం పంపించారు. పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిషేధ ప్రతిపాదనను కేబినెట్ పరిశీలనకు పంపినట్టు కేంద్రమంత్రి తెలిపారు. ఈ రంగలో ఎఫ్ డీఐ లను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకోవడంలేదని పీటీఐకిచెప్పారు. పొగాకు ఉత్పత్తుల నియంత్రణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. సిగరెట్లు, తదితర పొగాకు ఉత్పతులను ప్రోత్సహించదలుచుకోలేదన్నారు. ఈ నిర్ణయం పాక్షికంగా రైతులపై ప్రభావం చూపించనున్నప్పటికీ, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టనున్నట్టు చెప్పారు. మరోవైపు ఎఫ్ డీఐల నిషేధంపై కేంద్రమంత్రి స్పష్టత ఇవ్వడంతో మార్కెట్ లో పొగాకు సంబంధిత షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఐటీసీ, గోల్డెన్ టుబాకో తదితర షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. -
పొగాకులో ఎఫ్డీఐపై నిషేధం!
త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదన న్యూఢిల్లీ: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిషేధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలను పెద్ద పరిమాణంలో పేర్కొనాలంటూ లోగడ కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా ఈ రంగంలో ఎఫ్‌డీఐ రాకను నిషేధించే అంశాన్ని కేంద్రం పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ కేబినెట్ పరిశీలన కోసం పంపినట్టు అధికార వర్గాలు తెలిపారుు. ఈ నోట్‌కు అన్ని మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు, కేంద్ర ఆరోగ్య, ఆర్థిక శాఖల అభిప్రాయాలను సైతం జతచేసినట్టు వెల్లడించారుు. ప్రస్తుతం పొగాకు రంగంలో ఫ్రాంచైజీ లెసైన్సింగ్, ట్రేడ్‌మార్క్, బ్రాండ్ నేమ్, కాంట్రాక్టుల నిర్వహణ తదితర సాంకేతిక సహకార అంశాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. అదే సమయంలో సిగార్లు, సిగరెట్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాల తయారీలో ఎఫ్డీఐపై నిషేధం అమలవుతోంది. తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ తన ప్రతిపాదనలో ఈ విభాగాల్లోనూ ఎఫ్‌డీఐల నిషేధానికి ప్రతిపాదించింది. దేశీయ తయారీదారులకు ప్రతికూలమే ఒకవేళ పొగాకు రంగంలో ఎఫ్‌డీఐల సంపూర్ణ నిషేధానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది దేశీయ సిగరెట్ తయారీదారులకు ప్రతికూలంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. పరోక్షంగా ఈ రంగంలోకి వచ్చే నిధుల ప్రవాహానికి కూడా బ్రేక్ పడుతుందంటున్నారు. అంతేకాదు, పొగాకు నియంత్రణకు కట్టుబడి ఉన్న దేశంగా భారత్‌ను నిలబెడుతుంది. కాగా, ఈ ప్రతిపాదనపై సిగరెట్ల తయారీ సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
చినుకు రాలదు.. ఆశ చావదు
► ప్రశ్నార్థకంగా పొగాకు సాగు ►మడుల్లో ఏపుగా పెరిగిన నారు.. ►చినుకు జాడలేక సాగని పొగనాట్లు ► అదును దాటిపోతోందని జిల్లా రైతుల ఆందోళన ►ఇప్పటికే వేసిన పంట వాడుముఖం ►వరుణుడి కోసం ఆశగా ఎదురుచూపు ►పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం జిల్లాలో పొగాకు రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వర్షా భావం దెబ్బకు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలే వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోరుున పొగాకు రైతుపై అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రెండూ పగబట్టారుు. ఓ వైపు పొగాకు సాగును క్రమంగా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాగుకు సిద్ధంచేసిన చేలల్లో అదునులో మొక్క నాటుకుందామంటే చినుకు జాడలే దు. ఆశ చావని రైతన్న రెండు మూడు రోజులుగా ఊరిస్తున్న మబ్బులను చూసి, సాగుచేసేందుకు వ్యవయప్రయూసలు పడుతున్నాడు. ఏపుగా పెరిగిన పొగనారు మడుల్లోనే రంగు మారుతోంది. ఇప్పటికే సాగయిన పొలాల్లో మొక్కలు ఎండిపోతున్నాయి. క్యూరింగ్‌కు రావాల్సిన సమయంలో పంటను కాపాడుకునేందుకు రైతన్న భగీర థ ప్రయత్నం చేస్తున్నాడు. ఒంగోలు టూటౌన్/కందుకూరు రూరల్/కొనక నమిట్ల/: జిల్లాలో మొత్తం 14 వేలం కేంద్రాలు ఉండగా..17,149 మంది పొగాకు రైతులు ఉన్నారు. తేలిక నేలల పరిధి అయిన పొదిలి, కందుకూరు, కనిగిరి, కలిగిరి, డీసీ పల్లి ప్రాంతంలో ఈ యేడాది 39 మిలియన్ కిలోల ఉత్పత్తికి ఆధరైజ్డ్ ఇచ్చారు. 26 వేల హెక్టార్లలో పంట సాగుకు పొగాకు బోర్డు ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1859 హెక్టార్లే సాగయింది. సాగయిన పొగాకు పంట కూడా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంది. కురిచేడు ప్రాంతంలో 30 రోజుల దశలో ఉన్న పంట పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. నీటికొరత వల్ల ఆకులు ఎండిపోతున్నాయి. డీసీపల్లి, కొనకనమిట్ల మండలాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్‌కు రూ.2 వేలకుపైగా ఖర్చు అవుతున్నా.. రైతులు వెనకంజ వేయకుండా పొగమొక్కలకు నీటితడులు అందించేందుకు భగీర థ ప్రయత్నంచేస్తున్నారు. నల్లరేగడి నేలల పరిధిలో సాగు పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 22వేల హెక్టార్లకు రిజిస్ట్రేషన్ అనుమతిస్తే.. ఇప్పటి వరకు కేవలం సుమారుగా 1000 హెక్టార్లలోనే పొగాకు సాగయింది. వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు కొండపి ప్రాంతాలలో ఏడు వేలం కేంద్రాలు ఉండగా.. వీటి పరిధిలో సాగయిన పంట కూడా వర్షాభావం దెబ్బకు విలవిలలాడుతుంది. కౌలు రైతు పరిస్థితి దయనీయం.. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అదనపు రుసుం రూ.400లతో బ్యారన్ల రిజిస్ట్రేషన్‌కు ఒక్క రోజే గడువు ఉంది. ఎస్ఎల్స్ పరిధిలో 11, 976 బ్యారన్లు ఉండగా ఇప్పటి వరకు 11, 687 బ్యారన్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఎస్బీఎస్ పరిధిలో కూడా 10,168 బ్యారన్లు ఉండగా.. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నా.. ప్రస్తుతం వేసిన పంటను కాపాడుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా.. వరుణుడు కరిణించకపోతే .. పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి.. కందుకూరులోని 26, 27వ వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది పొగనారు సాగు కూడా తగ్గిపోయింది. మండలంలో ఓగూరు, విక్కిరాలపేట, దూబగుంట, వలేటివారిపాలెం మండలం, పొన్నలూరు మండలాల్లో అధికంగా పొగనారు మళ్లు పెట్టారు. ఓగూరులో సుమారు 50, విక్కిరాలపేట, దూబగుంట ప్రాంతంలో మోరు 30 ఎకరాల్లో పొగనారుమళ్లు సాగు చేశారు. పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భయపడి నారు మడులు సాగు చేసేందుకు రైతులు వెనుకంజ వేశారు. ఒక ఎకరం పొలంలో నారు సాగు చేయాలంటే కౌలు, కూలీల ఖర్చుతో సహా సుమారు రూ. 2 లక్షల పెట్టుబడి అయింది. వర్షాభావం కారణంగా నాట్లు వేకపోవడంతో ఇప్పటికే మడుల్లో పెరిగిన నారు చివర ఆకులను కోస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా గుంటల్లో నీరు నింపుకొని స్ప్రిక్లర్లు ద్వారా నారుమడులకు నీరు పెడుతున్నారు. నీటి కష్టాలు ఉన్నప్పటికి నారు కొనే నాధులు ఇప్పటి వరకు రాలేదు. పెరిగిన నారును పై తలలు కోయడంతోపాటు ముదిరిన నారును నేరుగా పికి బయటపడేస్తున్నారు. వర్షాలు లేకపోతే నారుమడులు వదులుకోవాల్సిందే. పరిస్థితిని చూస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం మూట పొగ నారు రూ.500 నుంచి రూ.700 పలుకుతుంది. కందుకూరు 26వ వేలం కేంద్ర పరిధిలో 2225 బ్యారన్లు ఉండగా 4231 హెక్టార్లలో నాట్లు పడాలి. కాని ఇప్పటి వరకు 238 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. 27వ వేలం కేంద్ర పరిధిలో 1997 బ్యారన్లు ఉండగా 4168 హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉండగా కేవలం 86 హెక్టార్లలో మాత్రమే రైతులు నాట్లు వేసినట్లు బోర్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ఏటా 50 ఎకరాలలో పొగాకు సాగు చేసే తాను ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఐదెకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నానని కొనకనమిట్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు పొదిలి తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాలు పడితే నారుకు డిమాండ్ వర్షాలు పడితేనే నారుకు డిమాండ్ వస్తుంది. నారుని ఎంతో ఆరోగ్యకరంగా పెంచాం. వర్షాలు పడకపోవడంతో రైతులు పొగ నాట్లు వేసేందుకు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే సగం నారు కొనుగోలు చేస్తారు. కాని ఇప్పటి వరకు ఒక రైతుల కూడా నారు వైపు రాలేదు. పెట్టుబడులు మాత్రం ఎకరానికి రెండు లక్షల రూపాయల వరకు పెట్టాం. వర్షాలు లేకపోతే నష్టాలు తప్పవు. - రామిరెడ్డి, పొగాకు నారు రైతు, కందుకూరు నాట్లు పడకపోతే నష్టాలే.. పొగాకు సాగు చేసే రైతులు పొగనాట్లు వేయకపోతే నష్టాలు తప్పవు. ఏడెనిమిదేళ్లుగా నారు సాగు చేస్తున్నాను. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వర్షం నారుమళ్ల రైతులపై కన్నేర్ర చేసింది. నారంతా పీకేందుకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడితే నారుకు ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షాలు పడకపోతే నష్టాలు సవి చూడాల్సి వస్తుంది. - శ్రీనివాసులరెడ్డి, పొగనారు రైతు -
ఈ–సిగరెట్లు వద్దు!
డబ్ల్యూహెచ్ఓ సూచన సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న ఈ–సిగరెట్ల (ఎలక్ట్రానిక్ సిగరెట్ల) వినియోగాన్ని కట్టడి చేసే చర్యలను ప్రపంచ దేశాలు పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. సిగరెట్ మానేసేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తన నివేదికలో తెలిపింది. పొగాకు నియంత్రణకు సంబంధించి సోమవారం నుంచి భారత్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచన చేసింది. – సాక్షి, ఏపీ డెస్క్ పొగాకు వినియోగం కారణంగా ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పొగాకు నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’పై సంతకాలు చేసిన 180 దేశాలు సోమవారం భారత్‌లో సమావేశం కానున్నాయి. సమావేశపు అజెండాలో ‘వేపింగ్’ కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ–సిగరెట్లపై ఇంకా నిషేధం విధించని దేశాలు వాటిపై కఠిన నియంత్రణలు విధించే అంశాన్ని పరిశీలించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిం చింది. ఈ–సిగరెట్ల ఫ్లేవర్లపై నిషేధం విధించడంతో పాటు అమ్మకాలు, ప్రకటనలు, యువకులు వినియోగించడంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరింది. కఠిన నిబంధనలు అవసరం... నికోటిన్ విడుదల చేసే పరికరాల గురించి పలు దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నివేదిక రూపొందించామని కన్వెన్షన్ సెక్రటేరియట్ హెడ్ డాక్టర్ వెరా లూయిజా డిసిల్వా తెలిపారు. ‘ఈ–సిగరెట్లపై నియంత్రణలు ఉండాలని స్పష్టమైన అభిప్రాయం ఉంది. యువకులు, గర్భిణులు వీటిని వినియోగించడాన్ని ప్రోత్సహించకూడదు. కఠిన నియంత్రణలు అవసరం.’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ–సిగరెట్లను నిషేధించిన దేశాలు అర్జెంటినా బ్రెజిల్ కాంబోడియా సింగపూర్ యుఏఈ ఉరుగ్వే వెనిజులా సీషెల్స్ ఈ–సిగరెట్లూ ప్రమాదకరమే! ఈ సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకర రసాయనాలే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రెండింటిలోనూ నికోటిన్ కామన్‌గానే ఉంటుందని, ఇది దానికి బానిస చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సిగరెట్లలోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలు, విషపూరిత రసాయనాలు ఉంటాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్ల నుంచి వచ్చే దుష్పరిణామాలు ఈ సిగరెట్లతోనూ వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటిల్లోనూ ఉండేది నికోటినే కా బట్టి, వీటికీ అడిక్ట్ అవుతారని పేర్కొంటున్నారు. 60 లక్షలు: ధూమపానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న మరణాలు 6: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరు సెకన్లకు ఓ మరణం సంభవిస్తోంది 22%: ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో 22 శాతం మంది ధూమపానం సేవిస్తున్నారు. 12%: ప్రపంచవ్యాప్తంగా పొగతాగేవారిలో భారతీయులు 9: లక్షలు ధూమపానంతో భారత్‌లో ఏటా సంభవిస్తున్న మరణాలు -
పొగాకుతో కేన్సర్ ముప్పు
నెల్లూరు(అర్బన్): పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా నోటి, గొంతు, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, తదితర రకాల కేన్సర్లు సోకుతాయని వైద్యశాఖ శిక్షణా మండలి అధికారి పెద్దిశెట్టి రమాదేవి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గాంధీ నగర్ మహిళా ప్రాంగణం నుంచి వేదాయపాళెం సెంటర్ వరకు ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బందితో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేదాయపాళెం సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఊబకాయం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, పక్షవాతం, తదితర సమస్యలు వస్తాయన్నారు. పొగాకు తీసుకోవడం ద్వారా ప్రతి సెకనుకు ఇద్దరు చొప్పున, ఏటా 10లక్షల మందికిపైగా మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ లక్ష్మీనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్, డీసీఎం సునీత, సిబ్బంది శ్రీనివాసులు, జ్యోతి, ఉష, శిరీష, సక్కుబాయి, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు వాడకం ప్రమాదకరం
ప్రొద్దుటూరు క్రైం: పొగాకు వాడకంతో ఏటా లక్షల కుటుంబాలు క్యాన్సర్ బారిన పడుతున్నాయని అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ అరుణసులోచన అన్నారు. జాతీయ పొగాకు నియంత్రణలో భాగంగా గురువారం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పొగాకు ఉత్పత్తుల వాడకం, అలవాట్లు మాన్పించే కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొగాకు ఉత్పత్తులు వాడిన కారణంగా ప్రపంచంలో ప్రతి ఏడాది సుమారు 60 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. మన దేశంలో అయితే 10 లక్షల మంది ప్రతి ఏడాది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. బీడీ, గుట్కా, సిగరెట్లకు బానిసలైన వారిని ఇక్కడికి తీసుకొని వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మాన్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా ధూమ పానం చేస్తుంటే ధైర్యంగా తాగవద్దని చెప్పాలన్నారు. అవసరమైతే వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ధూమపానం చేసేవారు 40 శాతం మాత్రమే పొగతాగి మిగతా 60 శాతం బయటికి వదులుతున్నారని చెప్పారు. దీనివల్ల పొగతాగని వారు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని వివరించారు. నోడల్ ఆఫీసర్ మహ్మద్‌బాషా మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో 100 జిల్లాలు ఈ కార్యక్రమానికి ఎంపిక కాగా అందులో వైఎస్సార్ జిల్లా కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డేవిడ్ సెల్వరాజ్, హెల్త్‌ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగరాజు, వైద్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
ఇంట్లో సిగరెట్ తాగినా అక్కడ నేరమే!
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ నగరంలో ధూమపానం నిషేధాన్ని, పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని కఠినంగా నియంత్రిస్తున్నారు. వీధులు, పార్కులు, థియేటర్లు, హోటళ్లు లాంటి బహిరంగ స్థలాలతోపాటు ఇంట్లో ధూమపానం సేవించడం లాంటి ఇండోర్ స్మోకింగ్ కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. దీని వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని, జరిమానాల ద్వారా ఈ ఏడాది 3,30,000 డాలర్లు బీజింగ్ హెల్త్ ఇనిస్పెక్షన్ అధికారులు వసూలు చేశారని బీజింగ్ మున్సిపల్ స్థాయి సంఘం వెల్లడించింది. ధూమపానాన్ని, పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కోసం గత జూన్ నెల నుంచి కఠినంగా వ్యవహరించడం వల్ల బహిరంగ స్థలాల్లో స్మోకింగ్ చేయని వారి సంఖ్య 3.8 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగినందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అలాగే ధూమపానాన్ని మానాయాలనుకుంటున్న వారి సంఖ్య కూడా 11.6 శాతం నుంచి 46 శాతం పెరిగిందని వారు చెబుతున్నారు. గతంలో బహిరంగ స్థలాల్లో ధూమపానాన్ని నిషేధించగా, గతేడాది జూన్ నెల నుంచి ప్రైవేటు స్థలాల్లో ఇండోర్ స్మోకింగ్‌ను కూడా నిషేధించారు. గత మే 31వ తేదీనాటికి బీజింగ్ హెల్త్ అధికారులు 1,54,000 సార్లు, 75,828 ఇళ్లపై దాడులు నిర్వహించారని మున్సిపల్ అధికారులు తెలిపారు. నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘించిన 310 వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నామని, 108 పొగాకు ఉత్పత్తుల విక్రయ షాపులను మూసివేశామని వారు తెలిపారు. పాఠశాలలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని వారు స్పష్టం చేశారు. -
పొగాకు నియంత్రణ చట్టం అమలుకు చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొగాకు నియంత్రణ చట్టం అమలుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ–2 పి.రజనీకాంతారావు ఆదేశించారు. తన చాంబర్లో జిల్లాస్థాయి పొగాకు నియంత్రణ కార్యక్రమం అమలు కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు నియంత్రణ చట్టం 2003 ప్రకారం సిగరెట్లు, సిగార్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఖైనీలను ఆస్పత్రులు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఆడిటోరియం, స్టేడియం, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్ వంటి ప్రాంతాల్లో అమ్మకం, సేవించడం నిషేధమన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే శిక్షార్హులని పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రత్నకుమారి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ధవళ భాస్కరరావు, డీఐఓ డాక్టర్ ఎ.హేమంత్, దంతవైద్యులు డాక్టర్ వినోద్, డిప్యూటీ డీఈఓ ప్రభాకరరావు, ఆర్వీఎం పీఓ పాల్గొన్నారు. -
'గుట్కా'య.. స్వాహా
* నిషేధిత పొగాకు ఉత్పత్తులు యథేచ్ఛగా విక్రయం * పాన్‌పరాగ్, ఖైనీ, డీలక్స్ ప్యాకెట్లు రెట్టింపు ధరలకు విక్రయం * నిత్యం రూ.కోట్లలో వ్యాపారం మామూళ్ల మత్తులో అధికారులు రాజాం: జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఏ పాన్ షాపులో చూసినా గుట్కాల తోరణాలే దర్శనమిస్తున్నాయి. ఒడిశా నుంచి నిత్యం కోట్లాది రూపాయల సరుకు జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పొందూరు, రాజాం వంటి పట్టణాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రామీణ రిటైల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్క రాజాం పట్టణంలోనే హోల్‌సేల్ వ్యాపారులు 20 మంది వరకు ఉన్నారు. వీరంతా సుమారు 500 మంది రిటైల్ వ్యాపారులకు సరుకును తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క రాజాం పట్టణంలోనే రోజుకి సుమారు రూ.10 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో ఇంకెంత వ్యాపారం జరుగుతుందో ఇట్టే అర్ధమవుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో నష్టాలు పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, పాన్‌మసాలా, గుట్కా, పాన్‌పరాగ్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పళ్లు పుచ్చిపోవడం, రంగు మారిపోవడం వంటి వ్యాధులు సోకుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీటి విక్రయాలను నిషేధించింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మార్కెట్లో దొరికిన సరుకే విక్రయిస్తున్నాం ఇంట్లో అమ్మ, భార్య ఖాళీగా ఉన్నారని పట్టణంలో రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నాం. మార్కెట్లో దొరికిన సరుకే విక్రయిస్తున్నాం. ఇందులో లాభనష్టాలు ఏమిటో మాకు తెలియదు. అధికారులు వద్దంటే మానేస్తాం. కేవీ పార్వతీశం, డోలపేట, రాజాం నగర పంచాయతీ వ్యసనంగా మారింది ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచక పాన్‌పరాగ్ తినేవాడిని. అది ఇప్పుడు వ్యసనంగా మారింది. రోజుకి 4 నుంచి 5 ప్యాకెట్లు తింటా. ఇవి తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో నాకు తెలియదు. - ఇనుమల సత్యనారాయణ, పొనుగుటివలస, రాజాం నగర పంచాయతీ అలవాటు మార్చుకుంటాం మార్కెట్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేస్తే అలవాటు మార్చుకుంటాం. మార్కెట్లో లభించినంత వరకు వాటిపైనే దృష్టి మరలుతోంది. - కెంబూరు వెంకటరమణ, రాజాం ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారుల తూట్లు ప్రజారోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక అధికారులకు అప్పగిస్తూ జీఓ నంబర్‌ను 6 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. అప్పుడప్పుడు రాజాం, పొందూరు, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాల్లో దాడులు జరిపి, వ్యాపారులపై పెట్టీ కేసులు నమోదు చేసి, విడిచిపెడుతున్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల ఒడిశా నుంచి లారీల్లో తరలిస్తున్న పాన్‌పరాగ్, ఖైనీ, డీలక్స్ వంటి సరుకును ఇచ్ఛాపురంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఈ సరుకు మద్రాస్ రవాణా చేస్తున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లను సైతం అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. రెట్టింపు ధరలకు విక్రయం ఇటీవల అధికారులు వరుస దాడులు చేయడంతో ఒడిశా ప్రాంతం నుంచి సరుకు దిగుమతి తగ్గిపోయింది. కొంతమంది చాటుమాటుగా సరుకుతెచ్చి విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ప్రజల వ్యసనాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. -
పొగాకు రంగంలో ఎఫ్‌డీఐలు ఇక ఉండవా ?
న్యూఢిల్లీ: ప్రస్తుతం అమల్లో ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం మార్కెట్లలో పొగాకు షేర్లు భారీగా పడిపోవడమే ఇందుకు ముఖ్యకారణమని తెలుస్తోంది. ఎఫ్‌డీఐ(ఒక దేశానికి చెందిన కంపెనీలు వేరొక దేశంలో పెట్టుబడులు పెట్టడం). దేశంలోని పొగాకు సెక్టారుకు సంబంధించి ఫ్రాంచైజీ, ట్రేడ్ మార్క్, బ్రాండ్ నేమ్, మేనేజ్మెంట్ కాంట్రాక్ట్‌లలో ఎఫ్‌డీఐలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంతో ఏ విదేశీ కంపెనీ పొగాకు రంగంలో ఎటువంటి పెట్టుబడులు చేయడానికి వీలు కాదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో దాదాపు 11బిలియన్ల మార్కెట్ కలిగిన పొగాకు పరిశ్రమ ఇప్పటికే సిగరెట్ ప్యాకెట్ల మీద 85 శాతం మేర ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలు ముద్రించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు 17 శాతం, ఐటీసీ షేర్లు ఒక శాతం,హైదరాబాద్‌కు చెందిన వీఎస్టీ ఇండస్ట్రీస్ షేర్లు 2.5 శాతం మేర పడిపోయాయి. -
పొగాకు ఉత్పత్తులపై ‘85% హెచ్చరిక’ వద్దు
పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్: పొగాకు ఉత్పత్తులపై 85% గ్రాఫిక్ ఆరోగ్య హెచ్చరికలు ఉండాలన్న నిబంధనను ఉపసంహరించాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాన్‌షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరాజ్ శంకర్రావు, నేతలు సతీష్‌నాయక్, మహ్మద్ ఆఫ్జలుద్దీన్లు మాట్లాడుతూ ప్రపంచంలోనే పొగాకు అత్యధికంగా వినియోగించే యూఎస్ఏ, జపాన్, చైనా వంటి దేశాల్లో సున్నా ఛాయాచిత్ర హెచ్చరికలుంటే ఇండియాలో 85% ఉండాలన్న నిబంధన విధించడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. వేలాది కుటుంబాలు పాన్‌షాప్‌ల ద్వారా జీవనం కొనసాగిస్తున్నాయని, అంతేగాక, తంబాకు అమ్మే వ్యాపారులు, రిటైలర్లు జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి హెచ్చరికల ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. -
పొగాకు రైతు ఆత్మహత్య
మద్దిపాడు: తాను పండించిన పంటకు మద్దతు ధర సరిగ్గా రావడం లేదని, దీంతో తెచ్చిన అప్పులు తీర్చే దారి కనపడక ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఎనమనమెల్లూరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వాకా రమణా రెడ్డి(46) రెండు బ్యారెన్లకు (ఒక బ్యారెన్ అంటే ఎడు ఎకరాలలో సాగు చేసిన పొగాకు నుంచి వచ్చే దిగుబడి) పొగాకు వేశాడు. కానీ ప్రస్తుతం ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యాడు. ఇప్పటి వరకు పంట కోసం తెచ్చిన అప్పులను ఒక చీటీలో రాసుకొని పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.