Allu Arjun Rejected Tobacco Brand Commercial Advertisement, Details Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun Rejected Tobacco Ad: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన బన్నీ!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌

Published Tue, Apr 19 2022 4:41 PM | Last Updated on Tue, Apr 19 2022 8:27 PM

Allu Arjun Rejected Tobacco Commercial Ad Details Inside - Sakshi

Allu Arjun Rejects Commercial Ad: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై ప్రస్తుతం ఫ్యాన్స్‌, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి కారణం బన్నీ ఓ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడట. కోట్లు ఆఫర్‌ చేసిన ఓ బ్రాండ్‌ ప్రకటనకు ఈ స్టైలిష్‌ స్టార్‌ నో చెప్పాడని సమాచారం. కాగా ఇప్పటికే అల్లు అర్జున్‌ పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కంపెనీ బన్నీకి భారీ ఆఫర్‌ ఇచ్చిందట.

చదవండి: ‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్‌ కొరటాల

ప్రముఖ పొగాకు కంపెనీ తమ ప్రకటనలో నటించేందుకు బన్నీని సంప్రదించగా.. దీనికి అతడు నో చెప్పాడటని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.  అయితే తమ ప్రకటనలో నటించేందుకు సదరు పొగాకు కంపెనీ అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను ఆఫర్‌ చేసిందట. అయినప్పటికీ పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అలాంటి ఉత్పత్తులను తాను ప్రమోట్‌ చేయనని సదరు కంపెనీ యాజమాన్యానికి బన్నీ బదులిచ్చాడట. అంతేకాదు తాను దుమ్మ పానం చేయననని, అలాంటప్పుడు ఇతరులను ఈ ఉత్పత్తులు వినియోగించమని ఎలా చెప్పగలను అన్నాడట.

చదవండి: అక్కినేని ఫ్యామిలీలో మోగనున్న పెళ్లి బాజాలు..!

అంతేగాక ఇది తన ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టిస్తుందని, అందుకే ఈ ప్రకటనలో నటించనంటూ బన్నీ ఈ ఆఫర్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కోట్ల రూపాయలు ఇచ్చే ఆఫర్‌ను తీరస్కరించడంపై అతడి ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బన్నీ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయన బర్త్‌డే సందర్భంగా భార్య స్నేహరెడ్డి, పిల్లలతో కలిసి సెర్భియాకు టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇండియాకు వచ్చిన బన్నీ తిరిగి పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement