సిగరెట్లు తెగ ఊదేస్తున్నారా.. పొగాకు బాగా అలవాటుందా.. అయినా ప్రభుత్వోద్యోగం కావాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.
సిగరెట్లు తెగ ఊదేస్తున్నారా.. పొగాకు బాగా అలవాటుందా.. అయినా ప్రభుత్వోద్యోగం కావాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఈ అలవాట్లు ఉంటే మీకు రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగం రావడం అసాధ్యం. అవును.. రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవలే ఓ ఉత్తర్వు జారీచేసింది. పొగాకు వాడేవాళ్లు, సిగరెట్లు కాల్చే వాళ్లు ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని ఆ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. ముందుగా వాణిజ్య పన్నుల శాఖలో ఈ ఉత్తర్వు అమలుచేసింది.
ఆ శాఖలో ఉన్న 182 ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ జారీచేశారు. అయితే దరఖాస్తుదారుల విషయంలో వసుంధరా రాజె ప్రభుత్వం చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది. ఎవరికైనా ఈ అలవాట్లుంటే వాళ్లు దరఖాస్తు చేయడానికి కూడా అనర్హులవుతారు. అసలు తమకు పొగాకు ఏమాత్రం అలవాటు లేదని, ప్రభుత్వం విధించే నియమ నిబంధనలను తాము కచ్చితంగా పాటిస్తామని చెబుతూ దరఖాస్తుదారులు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి.