rajastan government
-
బెగ్గర్లకు బంపరాఫర్: ప్రభుత్వం నుంచి రోజుకు రూ.215
రాజస్తాన్: ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే ఎక్కడో ఒకదగ్గర యాచకులు తారసపడుతుంటారు. కొందరు వారి పరిస్థితిని అర్థం చేసుకుని చేయగలిగిన సాయం చేస్తే మరికొందరు విస్కుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వారి జీవితాలు మర్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జైపూర్‌లో ‘బెగ్గర్‌ఫ్రీ’ అనే వినూత్న కార్యక్రమానికి రాజస్థాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజస్తాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్ఎస్ఎల్డీసీ), సోపన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 43 మంది యాచకులను చేరదీశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి జైపూర్ లో యాచిస్తూ జీవిస్తున్నారు. ఈ 43 మందికి వసతి సదుపాయం కల్పించి, యోగా నేర్పించడం, ఆటలు ఆడించడం, కంప్యూటర్ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమం గురించి రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిరజ్ కుమామర్ పవన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని యాచకులందర్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. రాజస్థాన్ పోలీసులు జైపూర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించామని, దీనికోసం ‘కౌశల్ వర్ధన్’ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాచుల వారీగా శిక్షణ నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 20 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని, శిక్షణ పూరై్తన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొలిసారి జైపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. యోగా ట్రైయినర్ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరు కాస్త భిన్నంగా ఉంటారు. మానసికంగానే గాక, వివిధ అనారోగ్య సమస్యలతో శారీరకంగానూ బలహీనంగా ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి మానసిక, శారీరక స్థితిగతులను అంచనావేసిన తరువాత వారికి యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. ‘‘సమాజంలో యాచకులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమని సోపన్ సంస్థ అధికారి చెప్పారు. మూడున్నర నెలలపాటు వారికి శిక్షణతోపాటు రాజస్థాన్ ప్రభుత్వం వారికి రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ నగదు భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. -
కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది: ప్రియాంక
రాజస్థాన్: పెహ్లూఖాన్ అనే పాలవ్యాపారిపై మూకదాడికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అల్వార్ జిల్లాలోని స్థానిక కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ప్రియాంకా గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు. 2017 ఏప్రిల్1న జైపూర్ నుండి ఆవులను కబేళాకు తరలిస్తున్నాడనే అనుమానంతో ఖాన్‌పై మూకదాడి జరిగింది. ఈ దాడిలో పెహ్లూఖాన్ చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఖాన్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు అక్కడే ఉన్నారు. మూకదాడి చేసిన నిందితులకు శిక్ష పడాలని బాధిత వర్గాలు ఎంత పోరాటం చేసినా ఫలించలేదు. చివరికి స్థానిక కోర్టు కూడా బాధితులకు షాక్ ఇచ్చింది. వారిని నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరుగుతుందని భావించానని, కోర్టు తీర్పు విస్మయానికి గురి చేసిందని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనను షాక్‌కు గురిచేసిందని ఆమె ట్వీట్ చేశారు. కాగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని మూకదాడులకు వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా ఆగస్టు 5న చట్టం తీసుకొచ్చింది. మూకదాడిలో పాల్పడ్డవారికి నాన్‌బెయిలబుల్ వారెంట్, జీవిత ఖైదుతో పాటు ఐదు లక్షల జరిమానా వేసేందుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రాజస్థాన్ ప్రభుత్వం ఈ అంశం పట్ల స్పందిస్తూ, మా ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిందని బాధతులకు అండగా ఉంటామని నిర్దోషులుగా ప్రకటించిన వారిపై హైకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. -
రాజస్థాన్ ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక
కరౌలీ : విద్యా, ఉద్యోగాల్లో అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఎట్టకేలకు రాజస్థాన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గుజ్జర్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. గుజ్జర్లతో బహిరంగ చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ధోల్పూర్ జిల్లాలో జరిగిన అల్లర్లపై విచారణ జరపనున్నట్లు సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అయిదు శాతం రిజర్వేషన్ కోరుతూ గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించి ధర్నాకు దిగటంతో రైల్వేశాఖ... ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించింది. రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రతినిధుల బృందం నిన్న గుజ్జర్లతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనకారులు ఆగ్రా-మొరేనా రహదారి దిగ్భందించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ అమలు అవుతోంది. కాగా రిజర్వేషన్లు అమలు చేసేంతవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని గుజ్జర్ల ఆరక్షన్ సంఘర్షణ్ సమితి అధ్యక్షుడు కిరోరీ సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. తమ ఆందోళనలోకి సంఘ విద్రోక శక్తులు చొరబడ్డాయని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు భైంస్లా తన ఆందోళన విరమించాలంటూ ఆయన నివాసంలో రాజస్థాన్ సర్కార్ నోటీసులు అంటించింది. -
అసలు ‘పద్మావతి’ లో ఏముందో తేలుస్తాం
రాజస్థాన్: వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి మూవీపై రాజస్థాన్ ప్రభుత్వం కమిటీని నియమించనుంది. సంజయ్‌లీలా భన్సాలి నిర్మించిన పద్మావతి చిత్రంపై మొదటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. దీంతో వివాదాల నేపధ్యంలో సినిమాపై కమిటీ వేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే నిర్ణయం తీసుకున్నారు. రాజ్పుట్లు, ఇతర సంఘాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించారంటూ దీనిపై నిషేధం విధించాలని డిమాండ్లు కూడా చేస్తున్నాయి. దీంతో కమిటీ నియమించాలని.. ఆ విషయంపై అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా తెలిపారు. కమిటీ పద్మావతి సినిమాను చూస్తుందని, మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయో లేదో చూస్తామని తెలిపారు. ఆ తర్వాత చిత్ర దర్శక నిర్మాతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కమిటీ చరిత్రకారులతో ఉండే అవకాశం ఉందన్నారు. కాగా పద్మావతి మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. -
50 శాతం రిజర్వేషన్లు ఎందుకు మించరాదు?
సాక్షి, రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక వెనుకబడిన వర్గాల జాబితా కింద ఐదు కులాలను చేర్చి వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే విద్యారంగంలో దళితులకు 16 శాతం, ఆదివాసీలకు 12 శాతం, ఇతర వెనుకబడిన వర్గాల వారికి 21 శాతం చొప్పున 59 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 54 శాతం చేరుకుంటాయి. సుప్రీం కోర్టు 1992లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదు. రాజస్థాన్ ప్రభుత్వం ఇంతకుముందు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల కింద కొన్ని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు యాభై శాతం శీలింగ్ దాటిందన్న ఆరోపణతోపాటు మరికొన్ని ఇతర కారణాలతో 2016లో రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. 2017లో ఒడిశా అదనంగా తీసుకొచ్చిన రిజర్వేషన్లను యాభై శాతం పరిమితి దాటిందన్న కారణంగానే ఒడిశా హైకోర్టు కొట్టివేసింది. అసలు ఈ 50 శాతం రిజర్వేషన్ పరిమితి ఎందుకు ? దీన్ని సుప్రీం కోర్టు 1992లో ఈ పరిమితిని ఎందుకు తీసుకొచ్చింది? 50 శాతానికి మించకూడదన్న నిర్ణయానికి రావడానికి హేతుబద్ధమైన కారణాలేమిటీ? రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న చట్టం కేంద్రంలోగానీ, ఇటు ఏ రాష్ట్రంలోగానీ లేదు. అలాంటి సుప్రీం కోర్టు అత్యుత్సాహంతో ఈ పరిమితిని ఎందుకు తీసుకొచ్చింది? భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం (4) నిబంధన, 16వ అధికరణం (4)వ నిబంధన కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి మించరాదని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టు 1992లో తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే హైకోర్టులు రాష్ట్రాలు పరిమితిని ఉల్లంఘించినప్పుడల్లా రిజర్వేషన్ల నిర్ణయాన్ని కొట్టివేస్తున్నాయి. రిజర్వేషన్లు 40 శాతంగానీ, 80 శాతంగానీ ఎందుకు ఉండకూడదు? దేశంలో ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారో, ఎవరు సామాజికంగా అభివద్ధి చెందారో, ఎవరు సామాజికంగా అభివద్ధి చెందలేదో, వారి శాతం ఎంత ? ఎవరెవరికి రిజర్వేషన్లు ఎంత శాతం అవసరం? అన్న లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్ల పరిమితి ఉండాలిగానీ, గుడ్డిగా సగానికి మించకూడదు అనడంలో అర్థం లేదు. ఈ లెక్కలకు సంబంధించి ఇప్పటి ప్రభుత్వాలు ఎలాంటి కసరత్తు చేయలేదు. మండల కమిషన్ 1980లో ఈ విషయంలో కొంత కసరత్తు చేసింది. ఆ కమిషన్ అంచనాల ప్రకారం దేశంలో 17 శాతం దళితులు, 8 శాతం ఆదివాసులుపోనూ 52 శాతం బీసీలు ఉన్నారు. వీరందరికి రిజర్వేషన్లు కల్పించాలని 77 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. 1931లో దేశంలో జరిగిన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నాటి మండల కమిషన్ 52 శాతం బీసీలు ఉన్నారని అంచనావేసింది. దేశంలో కులాల ప్రాతిపదికన జరిగిన జనాభా లెక్కల కార్యక్రమం 1931లో జరిగినదే. 2011లో కులాలు, సామాజిక అంశాల ప్రాతిపదికన జనాభా లెక్కల కార్యక్రమం జరిగింది. నాటి కులాల లెక్కలను నేటికి కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయలేదు. దేశంలో వెనకబడిన వర్గాల వారే ఎక్కువ శాతమని, అగ్ర కులాల వారు అతి తక్కువ శాతం ఉన్నారనే వాస్తవం వెలుగులోకి వస్తుందని, అప్పుడు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తాయన్న భయంతోనే కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు ఈ వివరాలను వెల్లడించడం లేదు. పటేళ్లు, జాట్లు, మరాఠీలైన అగ్రవర్గాల వారు కూడా రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కులాల వాస్తవ వివరాలను వెల్లడించడమే ఉత్తమం. -
కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రజాసేవకులపై ఆరు నెలలపాటు విచారణ జరపకుండా రక్షణ కల్పిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'అవినీతిని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది' అని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అన్నారు. 'తమ అవినీతి బాగోతాలకు అండగా ఉండే ప్రజా సేవకులను రక్షించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' అని పైలట్ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో వసుంధరారాజే ప్రభుత్వం తాజాగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం 180 రోజులపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాసేవలకులపై విచారణ చేపట్టే హక్కు ఎవరికీ ఉండదు. సదరు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా మీడియా కథనాలు ప్రచురించడానికి వీల్లేదు. ఈ మేరకు మీడియాపై సైతం ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించారు. రాజే సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరు నెలలో కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని.. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ చట్టం సరికాదంటూ వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
ఉద్యోగం కావాలంటే.. సిగరెట్లు మానేయాల్సిందే!
సిగరెట్లు తెగ ఊదేస్తున్నారా.. పొగాకు బాగా అలవాటుందా.. అయినా ప్రభుత్వోద్యోగం కావాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఈ అలవాట్లు ఉంటే మీకు రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగం రావడం అసాధ్యం. అవును.. రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవలే ఓ ఉత్తర్వు జారీచేసింది. పొగాకు వాడేవాళ్లు, సిగరెట్లు కాల్చే వాళ్లు ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని ఆ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. ముందుగా వాణిజ్య పన్నుల శాఖలో ఈ ఉత్తర్వు అమలుచేసింది. ఆ శాఖలో ఉన్న 182 ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ జారీచేశారు. అయితే దరఖాస్తుదారుల విషయంలో వసుంధరా రాజె ప్రభుత్వం చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది. ఎవరికైనా ఈ అలవాట్లుంటే వాళ్లు దరఖాస్తు చేయడానికి కూడా అనర్హులవుతారు. అసలు తమకు పొగాకు ఏమాత్రం అలవాటు లేదని, ప్రభుత్వం విధించే నియమ నిబంధనలను తాము కచ్చితంగా పాటిస్తామని చెబుతూ దరఖాస్తుదారులు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి.