అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్‌మాసాలలను నిషేధిస్తూ ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ నాగేందర్ బుధవారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. అటెండెంట్లు ఆస్పత్రిలో వచ్చి సిగరెట్ తాగడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే వీటిపై నిషేధం అమలు చేయాలని అన్ని శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటి మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రోగులు వారి అటెండర్లకు చెందిన లగేజీలు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment