కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, ముఖ్యంగా యువతకు రూ.2 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీని కోసం మీరు ఒక పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన విజేతలకు నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తోంది. దీని కోసం స్పెషల్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులొ పాల్గొని గెలిస్తే రూ.2 లక్షలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
రూ.2 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకోవాలంటే మీరు పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలపై కనీసం 30 సెకన్లు, గరిష్టంగా 60 సెకన్ల గల ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనవచ్చు. అయితే, మీరు తీసిన వీడియోను జూన్ 30 లోపు ఘాట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, వారి బంధువులు ఇందులో పాల్గొనడానికి అనర్హులు. మరిన్ని వివరాల కొరకు https://www.mygov.in/task/short-film-making-contest ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
Have you shared your entry for the short film Anti-Tobacco spot competition, yet? Hurry up, visit: https://t.co/YXfZarazpv now and stand a chance to win a cash prize of ₹2,00,000. @MoHFW_India @drharshvardhan pic.twitter.com/tdyqXNQqS0
— MyGovIndia (@mygovindia) June 11, 2021
ప్రైజ్ మనీ వివరాలు:
- 1వ బహుమతి: 2,00,000/-
- 2వ బహుమతి: 1,50,000/-
- 3వ బహుమతి: 1,00,000/-
- అలాగే మరో పది మందికి రూ.10 వేల చొప్పున అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment