Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’ | Sai Durgha Tej Satya Is A Favourite At The Filmfare Short Film Awards 2024 | Sakshi
Sakshi News home page

Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’

Nov 24 2024 3:29 PM | Updated on Nov 24 2024 4:07 PM

Sai Durgha Tej Satya Is A Favourite At The Filmfare Short Film Awards 2024

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’ ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.  

తమ మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిం ఇదని, "సత్య" షార్ట్ ఫిలిం చూసి ఓటు వేయాలని ప్రేక్షకుల్ని కోరారు.  దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా "సత్య" ఎన్నో మెమొరీస్ ఇచ్చిందని సాయిదుర్గ  తేజ్  పేర్కొన్నారు. 

"సత్య" షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా "సత్య" ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement