Film awards
-
Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’ ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిం ఇదని, "సత్య" షార్ట్ ఫిలిం చూసి ఓటు వేయాలని ప్రేక్షకుల్ని కోరారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా "సత్య" ఎన్నో మెమొరీస్ ఇచ్చిందని సాయిదుర్గ తేజ్ పేర్కొన్నారు. "సత్య" షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా "సత్య" ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.For the first time ever, the world can watch Satya and bless us with your valuable vote 🇮🇳❤This story, so dear to our hearts, is competing for the People’s Choice Award at the Filmfare Short Film Awards 2024. We need your support to win—click the link, watch the film, and… pic.twitter.com/vrG0Ddsivn— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 24, 2024 -
నేషనల్ అవార్డ్స్ లో సౌత్ డామినేషన్..
-
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
-
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
సుమన్‌కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
నామినేషన్లు ఫుల్.. అవార్డు నిల్
-
ఫిలిం అవార్డు చెక్స్ బౌన్స్ గందరగోళం: విజేతలకు చేదు అనుభవం
గువహటి: అసోం రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలకుచేదు అనుభవం ఎదురైంది. వారికిచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో గందరగోళం నెలకొంది. ఎనిమిది మంది విజేతలకు ఇచ్చిన చెక్కులను క్లియరెన్స్ కోసం బ్యాంకుకు సమర్పించినప్పుడు అవి బౌన్స్ అయ్యాయి. సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి దాస్ నాథ్ సంతకంతో జారీ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులు మార్చి 17న బౌన్స్ అయ్యాయి. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లు వెత్తాయి. ఈ వ్యవహారంపై సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బిమల్ బోరా తక్షణ విచారణకు ఆదేశించారు. వివరాలను పరిశీలిస్తే చలన చిత్ర రంగానికి చెందిన ఎనిమిది మందికి స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ASFFDC సోమవారం అవార్డులను ప్రదానం చేసింది దీంతో అవార్డు గ్రహీత రచయిత అపరాజిత పూజారి చెక్కును డిపాజిట్ చేశారు. అయితే అది బౌన్స్ అయిందని బ్యాంకు నుండి కాల్ రావడంతో నిర్ఘాంతపోయి, నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. (ఐఫోనా మజాకా? మైనర్ కిడ్నాప్ డ్రామా...కట్‌చేస్తే..!) పూజారి ఉత్తమ రచయితగా అవార్డును గెలుచుకున్నారు. అయితే పూజారితోపాటు, అమృత్ ప్రీతమ్ (సౌండ్ డిజైన్), దేబజిత్ చంగ్మాయి (సౌండ్ మిక్సింగ్), ప్రాంజల్ దేకా (దర్శకత్వం), దేబజిత్ గయాన్ (సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్) బెంజమిన్ డైమరీ (నటన) వంటి ఇతర ప్రముఖ సినీ ప్రముఖులకు అందజేసిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయట. (ఇదీ చదవండి: రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?) అయితే సాంకేతిక కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అయ్యాయని సంబంధిత అధికారి వెల్లడించారు. మొదటి రోజు రూ.18 లక్షల విలువైన చెక్కులు క్లియర్ చేశామనీ, రెంcy రోజు తొమ్మిది చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. సమస్యను పరిష్కరించామని, తమ చెక్కులను డిపాజిట్ చేయాలని, ఈసారి క్లియర్ అవుతాయంటూ మొత్తం ఎనిమిది మందికి శనివారం వ్యక్తిగతంగా సమాచారం అందించినట్టు తెలిపారు. ఇది మాత్రమే కాదు ఈ అవార్డుల్లో మరో తప్పిదం కూడా చోటు చేసుకుంది. ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అవార్డును నహిద్ అఫ్రిన్‌కు ఆమె పాడని పాటకు స్వీకరించారంటూ వివాదం రేగింది. అయితే అఫ్రీన్ 'నిజానోర్ గాన్' చిత్రంలో పాడిన ఆఫ్రీన్కే అవార్డు వచ్చిందని, తప్పిదం జరిగిందని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రకటించడం గమనార్హం. -
అంతర్జాతీయ వేదికలపై సత్తా.. 'దహిణి' చిత్రానికి అరుదైన పురస్కారం..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం ‘దహిణి - మంత్రగత్తె’. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై ఈ సినిమా సత్తా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డుతో రాజేష్ టచ్ రివర్ కీర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచల్ ఫిల్మ్‌గా నిలిచిన చిత్ర మరో అవార్డును సొంతం చేసుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ మూవీగా నామినేట్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జాతీయ అవార్డు గెలుగుచుకున్న యాక్టర్ తన్నిష్ట చటర్జీ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎప్పుడూ చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను పోషించటం విశేషం. ఇంకా అషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లామ్, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేత్, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అసలు కథేంటంటే.. దహిణి - మంత్రగత్తె మూవీ సోషల్ థ్రిల్లర్. భారతదేశం 17 రాష్ట్రాల అన్వేషణలో ఉన్న మంత్రగత్తె కథే ఈ సినిమా. ఇదొక క్రూరమైన వాస్తవికత. అంతర్జాతీయంగా పలు ప్రశంసలను అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మంత్రగత్తె అన్వేషణ అనే విలక్షణమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. దీంతో ఇండియా సహా పలు దేశాలను పీడిస్తున్న మానవ హక్కులకు సంబంధించిన ఆందోళనను ప్రస్తావించారు. లింగ భేదమైన హింసకు సంబంధించిన రూపాల్లో మంత్రగత్తె అన్వేషణ అనేది ఒకటి. సాధారణ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వేలాది మంది మహిళలను చంపడానికి లేదా వ్యక్తుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇందులో కారణంగా చూపించారు.ఈ సినిమాతో అసలు ఎవరూ బహిరంగంగా మాట్లాడని విషయాలను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఒరిస్సాలో మంత్రగత్తెల అన్వేషణ ఎక్కువగా ఉండే మయూర్ భంజ్ జిల్లాలో చిత్రీకరించారు. -
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
-
దర్శకుడు సుధీర్ వర్మ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఘనంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్.. సుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం
కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు. లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు. -
సినీ గోయర్స్ అవార్డుల ప్రదానం ఫోటోలు
-
వర్చ్యువల్‌గా బాఫ్తా అవార్డుల వేడుక!
74వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్తా) విజేతల జాబితా విడుదలైంది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ వేడుక వర్చ్యువల్‌గా జరిగింది. బాఫ్తా విజేతల ఎనౌన్స్మెంట్ ప్రొగ్రామ్ రెండు రోజులు (ఈ నెల 10, 11 తేదీల్లో) జరిగింది. మొత్తం 25 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇందులో 8 విభాగాలకు చెందిన అవార్డు విజేతల వివరాలను మొదటి రోజు, మిగిలిన విభాగాలకు చెందిన అవార్డు విజేతలను మరుసటి రోజు ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ‘నొమాడ్ ల్యాండ్’ నిలిచింది. ఉత్తమ నటుడి అవార్డును సర్ అంథోనీ హాప్కిన్స్ (ఫాదర్), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నొమాడ్ ల్యాండ్) దక్కించుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ అవార్డును క్లో జావ్ (నొమాడ్ ల్యాండ్) దక్కించు కున్నారు. బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్‌గా ‘సోల్’, బెస్ట్ డాక్యుమెంటరీగా ‘మై అక్టోపస్ టీచర్’, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘టెనెట్’ నిలిచాయి. -
ఢిల్లీ క్రైమ్ చిత్రానికి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఢిల్లీ క్రైమ్' చిత్రం 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం ఉత్తమ నాటక ధారావాహిక విభాగంలో అవార్డు అందుకోనుంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను గుర్తించే పోలీస్ డిప్యూటీ కమిషనర్‌గా షెఫాలి షా నటించారు. (‘ప్రాణం’ కమలాకర్ పాట ఏడు భాషల్లో..) ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు రిచీ మెహతా మాట్లాడుతూ... ఎంతో మంది నుంచి వేధింపులు, హింసను భరిస్తూ... అలాంటి సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్న మహిళలందరికి ఈ అవార్డు అంకితమిస్తున్నా. చివరగా, అలసిపోని తల్లి, ఆమె కుమార్తె గురించి ఆలోచించకుండా ఆరోజు గడిచిపోదు. మనలో ఎవరూ వాళ్ల గురించి మరిచిపోరని నేను నమ్ముతున్నానని అన్నారు. అవార్డులు.. ఉత్తమ నటుడి విభాగంలో (అర్జున్ మాథుర్, మేడ్ ఇన్ హెవెన్), ఉత్తమ కామెడీ సిరీస్ (ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్) లో కూడా భారత్ నామినేషన్లు సాధించింది. ఈ అవార్డులు వరుసగా మరోసారి నటుడు బిల్లీ బారట్, (రెస్పాన్సిబుల్ చైల్డ్), నింగూమ్ టా ఓల్హాండో (నోబడీ లుకింగ్) సొంతం చేసుకున్నారు. ఇతర ప్రధాన విభాగాలలో, గ్లెండా జాక్సన్ (ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్) ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన వెర్టిగే డి లా చుట్ (రెస్సాకా) ఉత్తమ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్ అవార్డును గెలుచుకోగా, రెస్పాన్సబుల్ చైల్డ్ ఉత్తమ మినీ-సిరీస్ అవార్డును గెలుచుకుంది. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా న్యూయార్క్‌లోని ఖాళీ థియేటర్లో ఈ వేడుక జరగగా, రిచర్డ్ కైండ్ విజేతలకు అవార్డులను అందించారు. విజేతల జాబితా.. ఉత్తమ డ్రామా సిరీస్: ఢిల్లీ క్రైమ్ (ఇండియా) ఉత్తమ కామెడీ సిరీస్: నింగుమ్ టా ఓల్హాండో (నోబడీ లుకింగ్) (బ్రెజిల్) ఉత్తమ టీవీ మూవీ / మినీ-సిరీస్: రెస్పాన్సిబుల్ చైల్డ్ (యునైటెడ్ కింగ్డమ్) ఉత్తమ నటి: గ్లెండా జాక్సన్, ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్ (యునైటెడ్ కింగ్డమ్) ఉత్తమ నటుడు: బిల్లీ బారట్, రెస్పాన్సిబుల్ చైల్డ్ (యునైటెడ్ కింగ్డమ్) View this post on Instagram A post shared by Shefali Shah (@shefalishahofficial) -
'థప్పడ్' సినిమాకు అరుదైన గౌరవం
ముంబై: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన హిట్ సినిమా ‘థప్పడ్’కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో జరిగే 14వ ప్రతిష్టాత్మక ఆసియా ఫిల్మ్ అవార్డ్‌కు గాను అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన థప్ఫడ్ రెండు ఆవార్డులకు ఎంపికైంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో థప్పడ్ నామినేట్ బరిలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనుభవ్ సిన్హా సోమవారం ట్విట్టర్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తి చేశారు. దీంతో అనుభావ్ సిన్హాకు బాలీవుడ్ నటీనటులు, దర్శకుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నిర్మాత రీమా కాగ్టీ, దర్శకుడు అలకృత శ్రీవాస్తవ ట్వీట్ చేస్తూ అనుభవ్, తాప్పీలకు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: భారత సినీ చరిత్రలో ‘థప్పడ్’ మైలురాయి) అదే విధంగా ఈ ఆవార్డుకు థప్పుడ్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ‘కేయ్ ఇషికవా, సో లాంగ్, మై సన్ బై వాంగ్ జియాషువాయ్, ఎ సన్ బై చుంగ్ మోంగ్-హాంగ్, మొహమ్మద్ రసౌలోఫ్తో పాటు బాంగ్ జూన్ హోలు, ఆస్కార్ గెలిచుకున్న పరాన్నజీవి’ సినిమాలు కూడా ఉత్తమ చిత్రాలకు ఈ ఆవార్డుకు నామినేట్ అయ్యాయి. అదే విధంగా ఉత్తమ ఎడిటింగ్ గాను ‘‘జాంగ్ యేబో ఫర్ బెటర్ డేస్, యంగ్ జిన్ మో ఫర్ ప్యారడైస్, లీ చట్చేటీకూల్ ఫర్ సో లాంగ్, మై సన్’’లతో పాటు పలు సినిమాలు కూడా పోటి పడుతున్నాయి. అయితే భర్త విక్రమ్ (పావైల్ గులాటి)తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న అమృత (తాప్సీ) వైవాహిక బంధాన్ని ఒక్క చెంప దెబ్బ ఎలా ప్రభావితం చేసిందో దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాలో తాప్సి అమృతగా ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. (చదవండి: వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!) -
కరోనా టెస్ట్ కిట్ల కోసం.. ట్రోఫీల వేలం
ముంబై : కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు కొందరు బాలీవుడ్ ప్రముఖులు సిద్దమయ్యారు. ఇందుకోసం వారు పొందిన అవార్డులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, గేయ రచయిత వరుణ్ గ్రోవర్, కమెడియన్ కునాల్ కామ్రా ఉన్నారు. ఈ వేలం ద్వారా 10 టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసేందుకు రూ. 13,44,000 సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కిట్ల ద్వారా దాదాపు వెయ్యి మందికి కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ మేరకు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రానికి గానూ తాను సొంతం చేసుకున్న ఫిల్మ్ ఫేర్ ట్రోపిని వేలం వేస్తున్నట్టు అనురాగ్ కశ్యప్ ప్రకటించారు. ఎక్కువ ధర కోట్ చేసినవారికి ఈ ట్రోపిని అందజేయనున్నట్టు తెలిపారు. మరోవైపు దమ్ లగా కే హైషా చిత్రంలోని తను రాసిన పాటకు అందుకున్న టీవోఐఎఫ్‌ఏ ట్రోఫిని వేలానికి ఉంచనున్నట్టు వరుణ్ గ్రోవర్ వెల్లడించారు. అలాగే కునాల్ కూడా తన యూట్యూబ్ బటన్ అవార్డును వేలం వేయనున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ ద్వారా సేకరించిన మొత్తాన్ని నేరుగా మై ల్యాబ్ డిస్కవరీ సోల్యూషన్ బదిలీ చేయబతుందని మిలాప్ క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. తద్వారా ఆస్పత్రులకు, ప్రయోగశాలలకు కరోనా టెస్టింగ్ కిట్లను అందజేయనున్నట్టు తెలిపింది. While each ruppee counts I appreciate the hell out of Comrade @anuragkashyap72 who is giving away his 2013 gangs of Wasseypur critics award to the highest donor of this charity with my YouTube button Link - https://t.co/xm5mNd2qDZ I urge other artists to help in their own way! https://t.co/izrv9CaxQT — Kunal Kamra (@kunalkamra88) May 20, 2020 -
తొలితాప్సీ అనొచ్చు కదా
ఏదైనా రంగంలో రాణించినప్పుడు అందులో బాగా రాణిస్తున్నవారితో పోలుస్తుంటారు. తాప్సీ మాత్రం పోలిక ఎందుకు? అంటున్నారు. ఎవరితోనో పోల్చకుండా వాళ్ల గుర్తింపు వాళ్లకే ఇవ్వొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారామె. ప్రస్తుతం బాలీవుడ్లో తాప్సీ విభిన్నమైన స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ అవార్డు వేడుకలో ‘సాంద్కీ ఆంఖ్’ సినిమాకు అవార్డు గెలుచుకున్నారామె. ఈ సందర్భంగా తాప్సీని అభినందిస్తూ ‘బాలీవుడ్ ఫీమేల్ ఆయుష్మాన్ ఖురానా’ అని ట్వీటర్లో సంబోధించారు. ‘‘అలా అనేకంటే బాలీవుడ్ తొలి తాప్సీ అని పిలవొచ్చు కదా?’’ అని రిప్లై ఇచ్చారు తాప్సీ. ఆ సమాధానానికి సోషల్ మీడి యాలో ప్రశంసలు అందుకుంటున్నారామె. -
స్పెయిన్ గోయా వార్షిక అవార్డులు 2020
-
టి.ఎస్.ఆర్ అవార్డ్స్ 2019 ప్రెస్ మీట్ ..’చిత్రాలు’…
-
25న ‘శోభన్ బాబు’ అవార్డ్స్
దివంగత హీరో శోభన్ బాబు అభిమానులు ‘శోభన్ బాబు సేవాసమితి’ పేరిట ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శోభన్ బాబు పేరుపై సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 25న తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలు చెప్పేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మొత్తం 19 అవార్డులు ఇస్తున్నాం. వాటిల్లో ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 9 మందికి ఎవర్గ్రీన్ అవార్డులు, తొమ్మిది ప్రామిసింగ్ అవార్డ్స్ ఉంటాయి. ఈ కేటగిరీల్లో దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, సంగీత దర్శకుడు, కమెడియన్లు ఉంటారు. అవార్డుల ప్రదానోత్సవానికి కృష్ణంరాజుగారు ముఖ్య అతిథిగా వస్తున్నారు’’ అన్నారు. ‘‘జనవరి 14న శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని కర్నూలులో వేలాది మందితో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ఎమ్మెల్సీ, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి ప్రతినిధి ఎం. సుధాకర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో నటుడు, ఎంపీ మురళీమోహన్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దర్శకులు రేలంగి నరసింహారావు, రాశీ మూవీస్ నరసింహారావు, నిర్మాత జె. రామాంజనేయులు, నటుడు సంపూర్ణేష్ బాబు, శేష్ట రమేష్ బాబు, పలువురు శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు. -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
మెర్సల్‌కు ఇంటర్నేషనల్ అవార్డు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్ ఫిల్మ్ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే పట్టం కట్టింది. జీఎస్టీ డైలాగులతో ఈ చిత్రం అభ్యంతరాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. మరోవైపు చిత్రంలో కొన్ని డైలాగులు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ప్రైవేట్ వైద్య సంఘాలు సినిమా రిలీజ్ కాకుండా ఆందోళన చేపట్టాయి. అయినప్పటికీ అవన్నీ అధిగమించి విడుదలై మెర్సల్ హిట్ టాక్ కైవసం చేసుకుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ మూల కథను సమకూర్చారు. నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్ గా నటించిన మెర్సల్ తెలుగులో అదిరింది పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. -
ఇన్‌క్లూజన్ రైడర్
‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ల ఫంక్షన్‌కు అందరూ నలుపురంగు దుస్తులే వేసుకుని వెళ్లారు. ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్’ అవార్డుల ప్రారంభోత్సవంలో నటీమణులంతా కలిసికట్టుగా ‘టైమ్స్‌అప్’కు మద్దతు ఇస్తూ ఒక ఉత్తరం రాశారు. అదేవిధంగా ఆస్కార్ ఫంక్షన్లో డోర్మండ్ ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాట వాడారని అనుకోవాలి. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మన్.. చివరిగా రెండు మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను..’’ అని ఒక్క క్షణం ఆగారు హాలీవుడ్ నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్. డాల్బీ థియేటర్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఏమిటా రెండు మాటలు?! డోర్మండ్ చేతిలో ‘ఉత్తమ నటి’గా ఆమె గెలుచుకున్న ఆస్కార్ ప్రతిమ ఉంది. ‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్ మిస్సోరీ’ చిత్రానికి వచ్చిన అవార్డు అది. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మన్.. ఐ హ్యావ్ టూ వర్డ్స్ టు లీవ్ విత్ యు టునైట్’’ అని ఆగి, ఇన్‌క్లూజన్ రైడర్’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు డోర్మండ్. అంతే! ఇంటర్నెట్ జామ్ అయింది. ట్వీటర్ కిక్కిరిసిపోయింది. ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాటలకు మీనింగ్ ఏమై ఉంటుదన్న వెదకులాట మొదలైంది. కొన్ని గంటల తర్వాత గానీ ఒక క్లారిటీ రాలేదు. Inclusion Riderఅనేది ఒక ఫ్రేజ్ కాదు. వేర్వేరుగా రెండు పదాలు అవి. ఇన్‌క్లూజన్ అంటే ‘చేర్పు’. రైడర్ అంటే ‘ఉపవాక్యం’. లేదా ‘అనుబంధ అంశం’. (రైడర్‌కి ఉన్న ఇంకో అర్థం తెలిసిందే. ‘నడిపే వ్యక్తి’). ఇన్‌క్లూజన్ రైడర్ అని డోర్మండ్ అనడంలోని ఉద్దేశం.. ‘చేర్చాలనే షరతు విధించండి’ అని చెప్పడం. ఏంటి చేర్చడం? ఏంటి షరతు? ఏంటి విధించడం? ఇన్ని ప్రశ్నలకూ ఒకే సమాధానం ఏంటంటే.. ‘ఓ.. ప్రధాన నటీనటులారా.. మీరొక సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఎలాంటి జాతి, లైంగిక వివక్ష లేకుండా కథాంశంలోని కాల, స్థలాలను బట్టి నటీనటులు, ఇతర సిబ్బందిని చేర్చుకుంటేనే నేను ఈ చిత్రంలో కొనసాగుతాను అని ‘కొసరు’గా ఒక షరతును విధించండి’.. అని చెప్పడం! ఆ మాటనే ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదాలతో చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు డోర్మండ్! ఒక విధంగా ఇది ‘మీటూ’, ‘టైమ్స్‌అప్’ మహిళా ఉద్యమాలను సమర్థించడమే. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ల ఫంక్షన్‌కు అందరూ నలుపురంగు దుస్తులే వేసుకుని వెళ్లారు. ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్’ అవార్డుల ప్రారంభోత్సవంలో నటీమణులంతా కలిసికట్టుగా ‘టైమ్స్‌అప్’కు మద్దతు ఇస్తూ ఒక ఉత్తరం రాశారు. అదేవిధంగా ఆస్కార్ ఫంక్షన్లో డోర్మండ్ ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాట వాడారని అనుకోవాలి. అయినా, ఈ రెండు మాటలకు అంత అర్థం ఉందని ఎలా అనుకుంటాం? డిక్షనరీలలోకి నేటికింకా ఈ పదాలు రాలేదు కదా! కానీ, ఈ జంట పదాలు రెండేళ్ల క్రితమే జన్మించాయి! డాక్టర్ స్టేసీ స్మిత్ అనే యువతి 2016లో కాలిఫోర్నియా యూనివర్సిటికీ సమర్పించిన ఒక సిద్ధాంత పత్రంలో ఈ పదప్రయోగం చేశారు. ‘ది డేటా బిహైండ్ హాలీవుడ్స్ సెక్సిజం’ అనే పత్రంలో ‘ఎ–లిస్టు హాలీవుడ్ నటులు తమ ఒప్పందాలలో ఒక ‘ఇన్‌క్లూజన్ రైడర్’ను పెడితేనే కానీ చిత్రపరిశ్రమలోని వివక్ష సమసిపోదు’ అని రాశారు. హాలీవుడ్‌లోని అసమానతల్ని తొలగించేందుకు స్టేసీ స్మిత్ చేసిన సూచన అది. అప్పట్లో ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదాలకు ఏమంత ప్రాముఖ్యం రాలేదు. ఇప్పుడు అవే పదాలు ఆస్కార్ విజేత నోటి నుంచి రాగానే ప్రాణం పోసుకున్నాయి. నేడో, రేపో ఒకే పదబంధంగా ఇవి డిక్షనరీల్లో కనిపించడమే ఇక మిగిలింది. -
ఆ విషయంలో చాలా భయపడ్డా: చిరు
దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. రీఎంట్రీ ఇవ్వడానికి భయపడ్డారట. తనను ప్రేక్షకులు తిరిగి ఆదరిస్తారో లేదో అని సందేహపడ్డారట. ఓ సినిమా అవార్డు ఫంక్షన్లో మాట్లాడిన ఆయన, ఖైదీ 150 చిత్రానికి ముందు తనలో ఉన్న భయం గురించి అందరి ముందు చెప్పారు. తన సినిమాలు చూసే వాళ్లు అందరూ ఇప్పుడు సినిమాలు తగ్గించేసి ఉంటారని, అలాంటి సమయంలో తాను రీఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఇప్పటి యువతరాన్ని అలరించగలనా అనే భయం తనలో ఉండేదని, అందుకే ప్రయోగాత్మక చిత్రాలవైపు వెళ్లలేకపోయానన్నారు. ఆ కారణంగానే ఖైదీ నెంబర్ 150 రీమేక్ చేయాల్సి వచ్చిందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కానీ ప్రీరిలీజ్ ఫంక్షన్లో 18-23 ఏళ్ల యువకులను చూసి తనలో ఉన్న భయం మొత్తం పోయిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'ఒక్కసారి ఆదరిస్తే చాలు, తరాలు మారినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనే విషయం అప్పుడు అర్థమైంది. ఈ చిరుజీవిని చిరంజీవిగా మీ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్' అంటూ అభిమానులను ఉద్ధేశించి అన్నారు. -
చిన్నచిత్రాలకే అవార్డుల పంట
- అవార్డులకు నోచుకోని స్టార్స్ తమిళనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ చిత్రాలను, కళాకారులను ఎంపిక చేసి అవార్డులతో ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాలను నిర్వహించడం లేదు. ఇలాంటి పరిíస్థితుల్లో గురువారం ఓకేసారి 2009 నుంచి 2014 ఏడాది వరకూ సినీ అవార్డులను ప్రభుత్వం ప్రకటించడం విశేషం. కాగా ఈ ఆరేళ్లలోనూ ఉత్తమ అవార్డుల పట్టికలో చిన్న చిత్రాలే చోటు చేసుకోవడం, ప్రముఖ నటులకెవరికీ అవార్డులు దక్కకపోవడం గమనార్హం. అయితే ఈ అవార్డులపై అసంతృప్తి అన్నది అక్కడక్కడా వినిపిస్తున్నా 90 శాతం సినీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిత్రాలు మైనా, వాగై చూడవా, వళక్కు ఎన్ 18/9, రామానుజన్, కుట్రం కడిదల్ వంటి మంచి ప్రేక్షకాదరణ పొందిన చిన్న చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం హర్షణీయం. ఇక 2009 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా కరణ్, 2010 లో విక్రమ్, 2011 లో విమల్, 2012 లో జీవా, 2013 లో ఆర్య, 2014 లో సిద్ధార్థ్ వంటి యువ నటులు ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. ఆ పట్టికలో ప్రముఖ నటులకు చోటు దక్కక పోవడం వారి అభిమానులకు నిరాశ అవుతుంది. రాజకీయ హస్తం ఉందా? ఈ ఆరేళ్ల కాల వ్యవధిలో ప్రముఖ నటులు నటించిన పలు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. సాధారణంగా ఒక్క ప్రముఖ నటుడికైనా అవార్డు దక్కే అవకాశం ఉంటుందని, అలాంటిది ఈ సారి ఏ ఒక్క ప్రముఖ నటుడికీ అవార్డు రాకపోవడంతో రాజకీయ హస్తం ఉంటుందనే ప్రచారం వెలుగు చూస్తోంది. నటుడు రజనీకాంత్ అందరు రాజకీయ నాయకులతోనూ సన్నిహితంగా ఉంటున్నా, ఇటీవల ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వ్యవస్థ సరిగా లేదని సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలాన్ని సృష్టించింది. అదే విధంగా నటుడు విజయ్ జల్లికట్టు విషయంలో ఆవేశంగా మాట్లాడిన వీడియోను విడుదల చేసి సంచలనాలకి కారణం అయ్యారు. ఇక నటుడు కమలహాసన్ ఇటీవల రాజకీయపరిణామాలపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇకపోతే 2015, 2016 సంవత్సరాలకు అవార్డులను వెల్లడించలేదు. అందుకు కారణాలేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కథానాయికల పట్టికలో నయనతార, ఓవియ, ఐశ్వర్యరాజేశ్, అమలాపాల్, పద్మప్రియ, లక్ష్మీమీనన్ చోటు చేసుకున్నారు. దర్శకుల విషయానికొస్తే వసంతబాలన్, ప్రభుసాల్మన్, ఏఎల్.విజయ్, బాలాజీ శక్తివేల్, రామ్,రాఘవన్ అవార్డులకు ఎంపికయ్యారు. ఇంకా సంగీతదర్శకులు, గీతరయితలు అవార్డులకు ఎంపికైనవారిలో ఉన్నారు.