ఆస్కార్ ఉత్తమ నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్
‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ల ఫంక్షన్‌కు అందరూ నలుపురంగు
దుస్తులే వేసుకుని వెళ్లారు. ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్’
అవార్డుల ప్రారంభోత్సవంలో నటీమణులంతా
కలిసికట్టుగా ‘టైమ్స్‌అప్’కు మద్దతు ఇస్తూ ఒక ఉత్తరం
రాశారు. అదేవిధంగా ఆస్కార్ ఫంక్షన్‌లో డోర్మండ్
‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాట వాడారని అనుకోవాలి.
‘‘లేడీస్ అండ్ జెంటిల్మన్.. చివరిగా రెండు మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను..’’ అని ఒక్క క్షణం ఆగారు హాలీవుడ్ నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్. డాల్బీ థియేటర్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఏమిటా రెండు మాటలు?! డోర్మండ్ చేతిలో ‘ఉత్తమ నటి’గా ఆమె గెలుచుకున్న ఆస్కార్ ప్రతిమ ఉంది. ‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్ మిస్సోరీ’ చిత్రానికి వచ్చిన అవార్డు అది. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మన్.. ఐ హ్యావ్ టూ వర్డ్స్ టు లీవ్ విత్ యు టునైట్’’ అని ఆగి, ఇన్‌క్లూజన్ రైడర్’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు డోర్మండ్. అంతే! ఇంటర్నెట్ జామ్ అయింది. ట్వీటర్ కిక్కిరిసిపోయింది. ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాటలకు మీనింగ్ ఏమై ఉంటుదన్న వెదకులాట మొదలైంది. కొన్ని గంటల తర్వాత గానీ ఒక క్లారిటీ రాలేదు. Inclusion Riderఅనేది ఒక ఫ్రేజ్ కాదు. వేర్వేరుగా రెండు పదాలు అవి. ఇన్‌క్లూజన్ అంటే ‘చేర్పు’. రైడర్ అంటే ‘ఉపవాక్యం’. లేదా ‘అనుబంధ అంశం’. (రైడర్‌కి ఉన్న ఇంకో అర్థం తెలిసిందే. ‘నడిపే వ్యక్తి’). ఇన్‌క్లూజన్ రైడర్ అని డోర్మండ్ అనడంలోని ఉద్దేశం.. ‘చేర్చాలనే షరతు విధించండి’ అని చెప్పడం. ఏంటి చేర్చడం? ఏంటి షరతు? ఏంటి విధించడం? ఇన్ని ప్రశ్నలకూ ఒకే సమాధానం ఏంటంటే.. ‘ఓ.. ప్రధాన నటీనటులారా.. మీరొక సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఎలాంటి జాతి, లైంగిక వివక్ష లేకుండా కథాంశంలోని కాల, స్థలాలను బట్టి నటీనటులు, ఇతర సిబ్బందిని చేర్చుకుంటేనే నేను ఈ చిత్రంలో కొనసాగుతాను అని ‘కొసరు’గా ఒక షరతును విధించండి’.. అని చెప్పడం! ఆ మాటనే ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదాలతో చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు డోర్మండ్! ఒక విధంగా ఇది ‘మీటూ’, ‘టైమ్స్‌అప్’ మహిళా ఉద్యమాలను సమర్థించడమే. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ల ఫంక్షన్‌కు అందరూ నలుపురంగు దుస్తులే వేసుకుని వెళ్లారు. ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్’ అవార్డుల ప్రారంభోత్సవంలో నటీమణులంతా కలిసికట్టుగా ‘టైమ్స్‌అప్’కు మద్దతు ఇస్తూ ఒక ఉత్తరం రాశారు. అదేవిధంగా ఆస్కార్ ఫంక్షన్‌లో డోర్మండ్ ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాట వాడారని అనుకోవాలి.
అయినా, ఈ రెండు మాటలకు అంత అర్థం ఉందని ఎలా అనుకుంటాం? డిక్షనరీలలోకి నేటికింకా ఈ పదాలు రాలేదు కదా! కానీ, ఈ జంట పదాలు రెండేళ్ల క్రితమే జన్మించాయి! డాక్టర్ స్టేసీ స్మిత్ అనే యువతి 2016లో కాలిఫోర్నియా యూనివర్సిటికీ సమర్పించిన ఒక సిద్ధాంత పత్రంలో ఈ పదప్రయోగం చేశారు. ‘ది డేటా బిహైండ్ హాలీవుడ్స్ సెక్సిజం’ అనే పత్రంలో ‘ఎ–లిస్టు హాలీవుడ్ నటులు తమ ఒప్పందాలలో ఒక ‘ఇన్‌క్లూజన్ రైడర్’ను పెడితేనే కానీ చిత్రపరిశ్రమలోని వివక్ష సమసిపోదు’ అని రాశారు. హాలీవుడ్‌లోని అసమానతల్ని తొలగించేందుకు స్టేసీ స్మిత్ చేసిన సూచన అది. అప్పట్లో ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదాలకు ఏమంత ప్రాముఖ్యం రాలేదు. ఇప్పుడు అవే పదాలు ఆస్కార్ విజేత నోటి నుంచి రాగానే ప్రాణం పోసుకున్నాయి. నేడో, రేపో ఒకే పదబంధంగా ఇవి డిక్షనరీల్లో కనిపించడమే ఇక మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment