![Mersal Got UK National Award - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/30/Mersal-UK-Award.jpg.webp?itok=4PiVcuNY)
మెర్సల్‌లోని ఓ దృశ్యం
సాక్షి, చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్ ఫిల్మ్ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే పట్టం కట్టింది.
జీఎస్టీ డైలాగులతో ఈ చిత్రం అభ్యంతరాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. మరోవైపు చిత్రంలో కొన్ని డైలాగులు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ప్రైవేట్ వైద్య సంఘాలు సినిమా రిలీజ్ కాకుండా ఆందోళన చేపట్టాయి. అయినప్పటికీ అవన్నీ అధిగమించి విడుదలై మెర్సల్ హిట్ టాక్ కైవసం చేసుకుంది.
అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ మూల కథను సమకూర్చారు. నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్ గా నటించిన మెర్సల్ తెలుగులో అదిరింది పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment