
లండన్ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వాహనంపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడి యత్నాన్ని యూకే ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) అధికారికంగా స్పందించింది.
"యూకే చాఠమ్ హౌస్ బయట భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కారుపై దాడి యత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూకే శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తుంది. కానీ ఇలా దాడులకు యత్నించడం, బెదిరించడం, ప్రజా కార్యక్రమాల్ని అడ్డుకోవడం సరైందని కాదని’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు సైతం జైశంకర్‌పై జరిగిన దాడి యత్నాన్ని ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మా అతిథుల భద్రతను పర్యవేక్షించడం, వారి సంరక్షణ బాధ్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నామని మరో ప్రకటనలో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment