best foreign film
-
ఆస్కార్ బరిలో మన 'బలగం'.. టాలీవుడ్ నుంచి ఆ రెండే!
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. (ఇది చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు. ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!! దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి) బలగం సినిమాకే ఛాన్స్!! ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆస్కార్ అవార్డ్‌ను దున్నుతుందా?
పోటీ మొదలయింది. ఆస్కార్ పరుగులోకి ఒక్కొక్కటిగా సినిమాలను ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు మంచి పేరు లభించింది. 2019, అక్టోబర్ 4న ‘జల్లికట్లు’ విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో. ప్రతీ ఏడాది మన దేశం నుంచి పంపే సినిమాయే మన రేసు గుర్రం. ఆ గుర్రం గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. ఈ ఏడాది మన రేసు గుర్రం, ఈ దున్న. ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసే తుది జాబితాలో మన సినిమా ఉండాలని, ఆస్కార్ తీసుకురావాలని అందరం చీర్ చేద్దాం. హిప్ హిప్ బర్రె! ఎంట్రీగా పోటీపడ్డ సినిమాలు ఈ ఏడాది మన దేశం తరఫు నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లేందుకు పలు సినిమాలు ఇవే అని ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, హన్సల్ మెహతా ‘చాలెంజ్’, ‘ది డిసైపుల్’, ‘మూతాన్’, ‘కామ్యాబ్’, ‘షికారా’, ‘బిట్టర్ స్వీట్’ వంటి సినిమాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఉపయోగించలేదు. యానిమేట్రానిక్స్ ద్వారా దున్న బొమ్మలను తయారు చేశారు. సుమారు మూడు నాలుగు దున్నలను తయారు చేశారు ఆర్ట్ డైరెక్టర్ గోకుల్ దాస్. ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షలు అయిందట. -
మెర్సల్‌కు ఇంటర్నేషనల్ అవార్డు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్ ఫిల్మ్ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే పట్టం కట్టింది. జీఎస్టీ డైలాగులతో ఈ చిత్రం అభ్యంతరాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. మరోవైపు చిత్రంలో కొన్ని డైలాగులు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ప్రైవేట్ వైద్య సంఘాలు సినిమా రిలీజ్ కాకుండా ఆందోళన చేపట్టాయి. అయినప్పటికీ అవన్నీ అధిగమించి విడుదలై మెర్సల్ హిట్ టాక్ కైవసం చేసుకుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ మూల కథను సమకూర్చారు. నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్ గా నటించిన మెర్సల్ తెలుగులో అదిరింది పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. -
ట్రంప్‌పై కోపం: ఆస్కార్ విజేత బాయ్‌కాట్
తాను తీసిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే జీవితంలో అంతకంటే పెద్ద పండగ ఏమీ ఉండదు. అందులోనూ ఇంగ్లీషు సినిమా కాకుండా, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో బహుమతి పొందాలంటే దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలతో పోటీ పడాలి. కానీ అలాంటి బహుమతి వచ్చినా కూడా తనకు అక్కర్లేదంటూ ఓ దర్శకుడు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ను బహిష్కరించారు. అందుకు కారణం ఎవరో తెలుసా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 'ద సేల్స్‌మన్' అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు పొందిన ఇరానీ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ముస్లిం దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్‌ను నిరసిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ట్రంప్ విధానాలతో అగౌరవపడిన ప్రజలకు సంఘీభావంగా తాను ఆస్కార్ ఫంక్షన్‌కు దూరంగా ఉంటున్నట్లు తన పేరుతో పంపిన ప్రకటనతో ఫర్హాదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని అమెరికా, దాని శత్రువులుగా విభజించడం ద్వారా మిగిలిన దేశాలకు ఒకరకమైన భయం కలిగించారని, ఇది యుద్ధ కాంక్షతో కూడిన దాడిలాంటిదేనని ఆయన అన్నారు. ఫర్హాదీ పంపిన సందేశాన్ని ఇరాన్లో పుట్టి, అమెరికాలో ఇంజనీర్, వ్యోమగామి అయిన అనౌషే అన్సారీ ఆస్కార్ వేదికపై చదివి వినిపించారు. ఈ యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కులను హరిస్తాయని కూడా ఫర్హాదీ అన్నారు. కాగా, అస్ఘర్ ఫర్హాదీకి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆయన 2011 సంవత్సరంలో 'ఎ సెపరేషన్' అనే సినిమాకు కూడా అవార్డు పొందారు. పెళ్లయిన దంపతులలో భార్య మీద అపార్టుమెంటులో దాడి జరిగిన తర్వాత వాళ్లిద్దరూ ప్రశాంతమైన జీవితం, న్యాయం కోసం చేసే పోరాటమే 'ద సేల్స్‌మన్' చిత్రం ఇతివృత్తం.