ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు.
(ఇది చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!)
అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు.
ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!!
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం.
(ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి)
బలగం సినిమాకే ఛాన్స్!!
ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment