
97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. అవార్డుల కోసం హాలీవుడ్ టాప్ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిశారు. అమెరికాకు చెందిన 'అనోరా' ఉత్తమ చిత్రంగా ఆస్కార్-2025 అవార్డ్‌ను దక్కించుకుంది. అయితే ఇదే చిత్రంలో నటించిన మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ ఉత్తమ హీరోయిన్‌గా అవార్డ్ అందుకుంది.

ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ఆడ్రిన్ బ్రాడీ అందుకున్నారు. ది బ్రూటలిస్ట్ అనే చిత్రంలో ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన 'డ్యూన్: పార్ట్2' చిత్రం కూడా రెండు విభాగాల్లో అవార్డ్స్‌ను అందుకుంది. ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది
ఆస్కార్ విజేతలు- 2025
ఉత్తమ చిత్రం – (అనోరా)
ఉత్తమ నటుడు – అడ్రియన్ నికోలస్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి – మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (అనోరా)
ఉత్తమ దర్శకుడు –సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - లాల్ క్రాలే ( ది బ్రూటలిస్ట్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్‌క్లేవ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – పాల్ టాజ్‌వెల్ (విక్‌డ్- Wicked)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – (ఫ్లో- FLOW)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ ద సైప్రెస్
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్ - సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – "ఎల్ మాల్" (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్‌డ్- Wicked)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్– నో అదర్ ల్యాండ్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ సౌండ్ - డ్యూన్- పార్ట్2
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్- పార్ట్2
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం- ఐ యామ్ నాట్ ఎ రోబోట్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – డేనియల్ బ్లమ్‌బెర్గ్ (ది బ్రూటలిస్ట్)

Comments
Please login to add a commentAdd a comment