జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్‌ | India Reacts On Khalistani Extremists Try To Attack S Jaishankar In London | Sakshi
Sakshi News home page

జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్‌

Published Thu, Mar 6 2025 3:31 PM | Last Updated on Thu, Mar 6 2025 4:24 PM

India Reacts On Khalistani Extremists Try To Attack S Jaishankar In London

ఢిల్లీ : లండన్‌ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కారుపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ దాడిని భారత్‌ ఖండించింది. భద్రతా లోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంత్రి జై శంకర్‌ బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్‌ హౌస్‌లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన కారుపై దూసుకువచ్చారు. పలువురు భారత జాతీయ జెండాలను చించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  

అయితే ఈ ఘటనపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement