వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్ (india)కు సైతం ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. భారత్ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) హాజరు కానున్నారు.
గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు.
క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.
ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం
👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్‌మైండ్
Comments
Please login to add a commentAdd a comment