swearing-in ceremony
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్ (india)కు సైతం ఆహ్వానం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. భారత్ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) హాజరు కానున్నారు.గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు. క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం 👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్‌మైండ్ -
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే. రెచి్చపోయిన మూకలు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు. అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు. ఖలీదా ర్యాలీ విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.400 మంది భారతీయులు వెనక్కు కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్ ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం తెలిసిందే. -
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
-
రేపే పదవీ స్వీకారం
సాక్షి, అమరావతి, విజయవాడ: ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఫోన్ చేసిన వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అయితే చంద్రబాబు హాజరవుతారా లేదా? అనేది తెలియ రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులు, తమిళనాడుకు చెందిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే ప్రముఖులపై గురువారం ఉదయం స్పష్టత రావచ్చని తెలుస్తోంది. ఆర్భాటానికి దూరంగా ఏర్పాట్లు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం వెల్లువలా పోటెత్తే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వేదికపై తొలుత వైఎస్ జగన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రజల నుద్దేశించి తొలి ప్రసంగం చేస్తారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఘన విజయం చేకూర్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతోపాటు తాను అందించాలనుకుంటున్న సుపరిపాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాభివృద్ధిపై తనకున్న దూరదృష్టి, ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరును కూడా వెల్లడిస్తారు. కేంద్ర ప్రభుత్వంతో ఉండబోయే సంబంధాలపై కూడా ప్రసంగిస్తారు. ఆర్థిక భారం, ఆర్భాటానికి తావు లేకుండా సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో తన ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయాలని జగన్ ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఠాకూర్ మంగళవారం తాడేపల్లిలో జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల గురించి వివరించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి భారీగా మజ్జిగ ప్యాకెట్లు, లస్సీ, మంచినీరు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ప్రాంగణంలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష లస్సీ ప్యాకెట్లు, 3 లక్షల మంచినీటి పాకెట్లను సిద్ధం చేస్తున్నారు. 25,000 – 35,000 మంది సామర్థ్యం కలిగిన ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమాన్ని వీక్షించే వారి కోసం పైభాగంలో 20 గ్యాలరీలు, కింది భాగంలో వేదిక వద్ద 15 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్యాలరీకి ఒక తహశీల్దారును ఇన్చార్జిగా నియమించారు. మొత్తం 10,500 పాసులు జారీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా మొత్తం 10,500 పాసులు జారీ చేయనున్నారు. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసే ఈ పాసుల్లో డబుల్ ఏ, ఏ 1, ఏ 2, బీ 1, బీ 2 క్యాటగిరీలున్నాయి. ఇవి కాకుండా ప్రెస్ పాసులు అదనంగా జారీ చేస్తారు. డబుల్ ఏ నుంచి బీ 2 పాసులు ఉన్న వారు గేట్ 2 వీఐపీ ఎంట్రన్స్ నుంచి లోపలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వాటర్ ట్యాంకు రోడ్డు వైపున ఉన్న 6వ గేట్ నుంచి ప్రెస్ గ్యాలరీకి వెళ్లాల్సి ఉంటుంది. అదేవైపు 6వ నెంబర్ గేట్ వద్ద సాధారణ ఆహ్వానితులకు ప్రవేశం కల్పించారు. కింద 15 గ్యాలరీల్లో వీవీఐపీలు, వీఐపీలు, ఆయా రంగాల ప్రముఖులు ఉంటారు. పైన ఉండే గ్యాలరీల్లో ఎక్కువగా సాధారణ పౌరులుంటారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారంతా 10 గంటల లోపే చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బయట ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వాహనాలను క్రమబద్ధం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ ఇలా... డబుల్ ఏ పాస్‌లు కలిగిన వాహనాలు ఫుట్‌బాల్ గ్రౌండ్లో, ఆర్అండ్బీ గ్రౌండ్ బిల్డింగ్ ఆవరణలో, ఏ1 పాస్‌లున్న వాహనాలు ఏఆర్ గ్రౌండ్స్‌లో, ఏ 2 పాస్‌లు కలిగిన వారు స్వరాజ్య మైదానంలో, బీ 1 పాస్‌లు కలిగిన వాహనాలు బిషప్ అజరయ్య స్కూల్లో, బి 2 పాస్‌లు కలిగిన వాహనాలు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో, సాధారణ ఆహ్వానితులు (సీ టు ఎన్ గ్యాలరీ ) స్వరాజ్య మైదానం, సబ్–కలెక్టర్ ఆఫీస్, సీఎస్ఐ చర్చిలలో వాహనాలను పార్కింగ్ చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండీ. ఇంతియాజ్ సూచించారు. పాస్‌లు లేని వారు సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, లయోలా కాలేజి, ఈఎస్ఐ హాస్పటల్ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖకు చెందిన ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సెంథిల్ కుమార్, ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్పీ గీతాదేవి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు పరిశీలించారు. స్టేడియం ప్రధాన ద్వారం నుంచి లోపలకు వెళ్లి బారికేడ్లను, గ్యాలరీలను పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ అగ్రనేతలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ అగ్రనేతలు మంగళవారం పరిశీలించారు. పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణతోపాటు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తలశిల రఘురామ్ తెలిపారు. రెండంతస్తులు ఉండే గ్యాలరీల్లో దాదాపు 40 వేల మంది వరకూ కూర్చొనే వీలుంటుందని, పాస్‌లు లేనివారు ఈ గ్యాలరీల్లో కూర్చోవాలని కోరారు. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎండ నుంచి రక్షణగా షామియానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం వెలుపల ఉన్నవారు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ జగన్‌ను కలసిన ద్వివేది సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు వివేక్ యాదవ్, సుజాత శర్మ మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. విశాఖ సీపీ మహేశ్‌చంద్ర లడ్హా, ఐపీఎస్ అధికారులు కె.వెంకటేశ్వరావులు కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్‌ను కలిసి తమ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై వివరించారు. -
చంద్రబాబును ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైఎస్ జగన్
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ ఆహ్వానం
సాక్షి, అమరావతి: తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు వైఎస్ జగన్ మంగళవారం స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎల్లుండి విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబును జగన్ కోరారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులను జగన్ ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవారికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. (ఇందిరాగాంధీ స్టేడియంలో యుద్ధప్రాతిపదికన పనులు) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చంద్రబాబును ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైఎస్ జగన్ -
29న బెజవాడకు సీఎం కేసీఆర్
సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల 29న కుటుంబ సమేతంగా విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ రాత్రికి కేసీఆర్ విజయవాడలోనే బస చేస్తారు. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. కాగా వైఎస్ జగన్ శనివారం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు. -
తెలంగాణ అసెంబ్లీలో 27 కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్ : 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. మహాకూటమి పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 స్థానాలు, టీడీపీకి రెండు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎంకి 7 స్థానాలు, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 27 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ వివరాలు.. తొలిసారి ఎమ్మెల్యేలు.. 1. హరిప్రియ నాయక్ - కాంగ్రెస్ (ఇల్లందు) 2. నాగేశ్వరరావు - టీడీపీ (అశ్వరావు పేట) 3. సురేందర్, కాంగ్రెస్ - (ఎల్లారెడ్డి) 4. సుంకె రవిశంకర్, టిఆర్ఎస్ - (చొప్పదండి) 5. మెతుకు ఆనంద్, టిఆర్ఎస్ - (వికారాబాద్) 6 .రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ - (తాండూరు) 7. హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ - (కొల్లాపూర్) 8. కాలేరు వెంకటేష్, టిఆర్ఎస్ - (అంబర్పేట్) 9. ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ - (పాలేరు) 10. మల్లారెడ్డి, టిఆర్ఎస్ - (మేడ్చల్) 11. బాల్క సుమన్, టిఆర్ఎస్ -(చెన్నూరు) 12. వైరా రాములు నాయక్, ఇండిపెండెంట్ 13. కొరికంటి శంకర్, ఇండిపెండెంట్ (రామగుండం) 14. నరేందర్, టిఆర్ఎస్ - వరంగల్ వెస్ట్ 15. పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ - (నర్సంపేట) 16. భేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ - (ఉప్పల్) 17. ముఠా గోపాల్, టిఆర్ఎస్ - (ముషీరాబాద్) 18. కృష్ణమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ - (గద్వాల్) 19. నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ -(కొడంగల్) 20. బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ - కోదాడ) 21.కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ - (నల్గొండ) 22.డాక్టర్ సంజయ్, టిఆర్ఎస్- (జగిత్యాల) 23. క్రాంతి, టిఆర్ఎస్ -(అందోల్) 24. నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ - (వనపర్తి) 25. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ - (మునుగోడు) 26.మానిక్ రావు జహీరాబాద్, టిఆర్ఎస్ 27.కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి - (టీఆర్ఎస్) -
చంద్రబాబు ఒక్కరోజు ఖర్చు రూ.8.7 లక్షలు
-
వేదికపై మమతా బెనర్జీ అసహనం..వీడియో వైరల్
-
లైవ్ అప్డేట్స్: పోలీసు ఉన్నతాధికారుల బదిలీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.. కర్ణాటక రాజకీయ పరిణామాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవి.. పోలీసు ఉన్నతాధికారుల బదిలీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే బీఎస్ యడ్యూరప్ప పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అమర్‌కుమార్ పాండేను నియమించారు. ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా సందీప్ పాటిల్‌ను నియమించారు. గోవాకు కర్ణాటక సెగ కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ గోవాను తాకింది. గోవా రాజ్‌భవన్ ముందు తమ ఎమ్మెల్యేలతో రేపు పరేడ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష పూర్తయ్యేంత వరకు నియామకం చేయకుండా చూడాలని కోరింది. టచ్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేలు.. పని అయిపోతోంది! అసెంబ్లీ వేదికగా జరిగే బలనిరూపణలో బీజేపీ నెగ్గి తీరుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బీ శ్రీరాములు బలపరీక్షపై స్పందించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, పని అయిపోతుందని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కోరిన కుమారస్వామి మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి వ్యతిరేకంగా రావాలంటూ పిలుపు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి రేపు లేదా ఎల్లుండే బలపరీక్ష..: యడ్యూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా.. రేపు లేదా ఎల్లుండి బలపరీక్ష ఉండొచ్చు కన్నడ ప్రజల ఆశీస్సులతోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు కాంగ్రెస్, జేడీఎస్‌లు అనైతికంగా అధికారంలోకి రావాలనుకున్నాయి: యడ్యూరప్ప కర్ణాటకలో రూ.56వేల కోట్ల రైతు రుణాలు రద్దు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప రుణాల రద్దు ఫైలుపై తొలి సంతకం మళ్లీ రిసార్ట్‌కి చేరిన రాజకీయాలు విధాన సౌధలో ముగిసిన కాంగ్రెస్-జేడీఎస్ ధర్నా ధర్నాలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తిరిగి రిసార్ట్‌కు చేరుకున్న కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు రాంజెఠ్మలానీ బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఇంప్లీడ్‌కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సరైన బెంచ్ ముందు ప్రస్తావించాలని ధర్మాసనం సూచించింది. యడ్యూరప్ప ప్రమాణానికి సుప్రీంకోర్టు ఇప్పటికే లైన్ క్లియర్ చేసింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. యెడ్డీకి వ్యతిరేకంగా ప్రజాకోర్టుకు వెళుతాం: సిద్దూ ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని చాటుతాం: మాజీ సీఎం సిద్దరామయ్య రాజ్‌భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప.. మరికాసేపట్లో 23వ సీఎంగా ప్రమాణస్వీకారం ‘వందేమాతరం, మోదీ.. మోదీ’ అంటూ రాజ్‌భవన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నినాదాలు.. రాజ్‌భవన్ బయలుదేరిన యడ్యూరప్ప.. మరికాసేపట్లో సీఎంగా ప్రమాణం Bengaluru: BS Yeddyurappa leaves for Raj Bhavan, to take oath as Karnataka Chief Minister shortly. pic.twitter.com/gfX5kXi698 — ANI (@ANI) 17 May 2018 రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరు అయ్యారు. Bengaluru: Swearing-in ceremony of BS Yeddyurappa as the Chief Minister of Karnataka to begin shortly; Union Ministers JP Nadda, Dharmendra Pradhan and Prakash Javadekar present at Raj Bhavan #Karnataka pic.twitter.com/yV3BEj8wNL — ANI (@ANI) 17 May 2018 -
మమత ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు
కోల్ కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు శెరింగ్ తొబ్గే హాజరు కానున్నారు. మమత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురు చూస్తున్నానని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తొబ్గే ట్వీట్ పై స్పందించిన మమత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది మమత భూటాన్ వెళ్లిన సందర్భంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భూటాన్ కోల్ కతాతో 180 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. నరేంద్రమోదీ, సోనియా గాంధీ, అరుణ్ జైట్లీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితిష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లను కూడా మమత తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించింది. మమత రెండోసారి సీఎంగా ఈనెల 27 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణ స్వీకారం
జమ్ము : జమ్మూ కశ్మీర్ పదమూడో ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు గర్నవర్ వోహ్రా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె అయిన 56 ఏళ్ల మెహబూబా.. రాష్ట్రంలో తొలి మహిళా సీఎంగా, దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ ఇదివరకు మాదిరిగానే తన వాటా దక్కించుకునే పరిస్థితి ఉన్నా పోర్ట్‌ఫోలియోలు మారే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కౌర్ బాదల్, బీజేపీ నేత రాంమాధవ్ తదితరులు హాజరయ్యారు. కాగా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పీడీపీ- బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఎట్టకేలకు చర్చల అనంతరం ప్రతిష్టంభన తొలగటంతో ప్రభుత్వ ఏర్పాటు సుగమమం అయింది. 87 స్థానాలున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) 15, కాంగ్రెస్12 సీట్లు గెల్చుకున్నాయి. -
గవర్నర్‌తో మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంక్షోభం తొలగిపోయినట్లు అనుకున్నప్పటికీ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. తాజాగా గవర్నర్ ఎన్ ఎన్ వోరాతో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఫ్తీ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్‌ను కలవాల్సి ఉంది. అయితే ఈ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలతో రాంమాధవ్, జితేందర్ సింగ్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. బీజేపీ శాసనసభపక్ష నేతగా నిర్మల్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. కాగా గత జనవరిలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ అనారోగ్యం కారణంగా అనూహ్యంగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ సీఎం పీఠం ఖాళీగా ఉంటోంది. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి మద్దతు లేఖ రావడం లాంఛనమే. -
పండుగలా ప్రమాణ స్వీకారం
‘నారా చంద్రబాబునాయుడు అనే నేను..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ర్ట విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన బాబు పట్టాభిషేక మహోత్సవానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట సభా ప్రాంగణం వేదికయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అతిరథ మహారథుల ఆగమనంతో పండుగను తలపించింది. అధికార యంత్రాంగం శ్రమ ఫలించింది. వారం రోజులు ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కార్యక్రమం విజయవంతం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. సాక్షి, గుంటూరు : సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి 7.27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చంద్రబాబుతోపాటు ఆయన కేబినెట్లో మంత్రులుగా 19 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాకు చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు చంద్రబాబు, గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి అధికారులు, టీడీపీ నేతలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఏఎన్‌యూ ఎదుట మైదానంలో భారీ వేదికను ఏర్పాటు చేసి వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు సభా ప్రాంగణంలో ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి నేతలు అనేక మంది హాజరై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాలు రాజధాని హైదరాబాద్‌లో జరిగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలిసారిగా గుంటూరుకు ఈ అరుదైన గౌరవం దక్కడంతో టీడీపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక్కొక్కరిగా ఆహ్వానిస్తున్న సమయంలో పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావుల పేర్లు పిలిచినప్పుడు ప్రజల నుంచి ఈలలు, కేలు వేస్తూ కేరింతలు కొట్టారు. జిల్లాలో సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆయా సీనియర్ నేతల అనుచరులు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ఫలించిన అధికారుల శ్రమ.. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను గత 15 రోజులుగా పర్యవేక్షిస్తూ అన్ని తామై చూసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, ఐజీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు జెట్టి గోపినాథ్, జె.సత్యనారాయణల శ్రమ ఫలించింది. జాతీయస్థాయి నాయకులు అనేకమంది ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుగు ప్రయాణ సమయంలో చంద్రబాబుతోపాటు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ నరసింహన్‌తోపాటు అనేక మంది వీవీఐపీలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించి వారిని సాగనంపారు. ప్రమాణంలో ప్రత్యేకతలు... సాక్షి ప్రతినిధి, గుంటూరు : పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన ఆనందం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తొలి మంత్రివర్గంలో స్థానం లభించిన ఉద్విగ్న పరిస్థితుల్లో 19 మంది ఎమ్మెల్యేలు మంత్రి, రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆంగ్లంలో, మిగిలిన వారంతా తెలుగు బాషలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ముగ్గురు చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చయ్యనాయుడు అందరికంటే బిగ్గరగా, స్పష్టంగా ప్రమాణం చేసి దివంగత మాజీ ఎంపీ యర్రంనాయుడుని గుర్తుకు తెచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రమాణం చేసే సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, కృష్ణా జిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగిలినవారంతా తెలుగులోనే ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ శాసనసభ్యుడు కేఈ కృష్ణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ టి.నారాయణ, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, విశాఖ జిల్లా బీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే సిద్దా రాఘవరావు, విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరందరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సునీత, సుజాత, కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం బాబు పాదాలకు నమస్కారం చేశారు. -
ఆహ్వానం అందింది.... వచ్చాను
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా, టీడీపీ అధ్యక్షుడు, తన మామ చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ అన్నారు. మామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. ఆదివారం ఉదయం కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని నిమ్మకూరు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్బంగా నిమ్మకూరు గ్రామంలోని స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి జూ.ఎన్టీఆర్‌తోపాటు సోదరుడు కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలిసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిమ్మకూరు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 7.27 గంటలకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
బాబుతో 15 మంది మంత్రుల ప్రమాణం?
*ప్రధాని వస్తే మాత్రం చంద్రబాబు ఒక్కరే.. మోడీ రాక అనుమానమేనంటున్న పార్టీ వర్గాలు హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఈ నెల 8న 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరైతే చంద్రబాబు ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదంటే మంత్రులు కూడా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ప్రధాని రాక అనుమానమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదో తేదీ ఉదయం పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ కార్యక్రమానికి ఆయన తప్పక హాజరు కావాల్సి ఉండటమే దీనికి కారణం. మోడీ రానిపక్షంలో తనతోపాటు ఆరు నుంచి 15 మందికి తగ్గకుండా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గౌతు శ్యామసుందర శివాజీ (శ్రీకాకుళం), పతివాడ నారాయణస్వామి నాయుడు(విజయనగరం), అయ్యన్నపాత్రుడు(విశాఖపట్నం), యనమల రామకృష్ణుడు(తూర్పు గోదావరి), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), దేవినేని ఉమామహేశ్వరరావు (కృష్ణా), కోడెల శివప్రసాదరావు(గుంటూరు), సిద్ధా రాఘవరావు(ప్రకాశం), పి.నారాయణ (ఎస్పీఎస్ఆర్ నెల్లూరు), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(చిత్తూరు), కేఈ కృష్ణమూర్తి (కర్నూలు)లకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ముద్రించిన ఆహ్వానపత్రాల్లో కోరింది. మరోవైపు తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన, పోటీచేయని నేతలు చంద్రబాబు ముందు క్యూ కడుతున్నారు. పరాజితులైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పోటీచేయని టీడీ జనార్దనరావు, కరణం బలరామకృష్ణమూర్తి వీరిలో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి పయ్యావుల కేశవ్ గురువారం రాత్రి బాబును కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్ష ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చంద్రబాబు గురువారం సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకట రాముడు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తదితరులు పాల్గొన్నారు. మనకు విద్యుత్ కష్టాలు తప్పవు: అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు రానున్న కాలంలో విద్యుత్ కష్టాలు తప్పవని చంద్రబాబుకు ఇంధన శాఖ, ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉందని, అదే సమయంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు గ్యాస్ లేదని తెలిపారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలు తయారు చేయాల్సిందిగా చంద్రబాబు వారికి సూచించారు. చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల భేటీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు జేఏ చౌదరి నేతృత్వంలో గురువారం రాత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రూ.5,600 కోట్లతో 12 రకాల పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలో విజయవాడలో పెట్టుబడుల సమ్మిట్ ఏర్పాటు చేస్తామన్నారు. -
హైమాస్ట్ లైట్లు...రెయిన్ ప్రూఫ్ టెంట్లు
*చంద్రబాబు ప్రమాణానికి చకచకా ఏర్పాట్లు గుంటూరు/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వేదిక ఏర్పాట్ల పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రాంగణంలో తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం రాత్రి వేళ జరగనున్న క్రమంలో రెండు వేల హైమాస్ట్ లైట్లను ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 480 అడుగుల వేదికను పూర్తిగా కవర్ చేసేలా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. దాంతో పాటు రెయిన్ ప్రూఫ్ టెంట్లను హైదరాబాద్ నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి నడికుడి మీదుగా వచ్చే రైళ్లకు ప్రాంగణం సమీపంలోని నాగార్జుననగర్ వద్ద హాల్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రానికి ప్రాంగణమంతా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు చెప్తున్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బృందాలు ఈ పనులను స్వయంగా పరిశీలిస్తున్నాయి. 70 ఎకరాల ప్రాంగణంలో 50 ఎకరాల్లో వేదిక, బహిరంగ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మిగిలిన 20 ఎకరాలు పార్కింగ్‌కు కేటాయించారు. తొలుత వీఐపీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, ప్రధాన సభకు మూడు వేదికలు నిర్మించాలని నిర్ణయించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వీఐపీల వేదికను రద్దు చేసి కేవలం రెండు వేదికలనే నిర్మిస్తున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం.దానకిషోర్, అర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించి, అవసరమైన ఆదేశాలు జారీచేశారు. డీఐజీ రామకృష్ణ, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు సత్యనారాయణ, గోపీనాథ్‌లు బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఐదు వేల మందికి వీఐపీ పాస్‌లు... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం 5,000 మంది వీఐపీలకు పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ అధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్ర నేత మన్నవ సుబ్బారావుతో ప్రత్యేకంగా సమావేశమై వీఐపీల పాస్‌ల జారీ విషయమై చర్చించారు. పార్టీ ఎంపీ మొదలుకొని మాజీ ఎమ్మెల్యే వరకు, పార్టీ ముఖ్య నేతలందరికీ వీఐపీ పాస్‌లు జారీ చేయాలని రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు కలెక్టర్‌ను కోరారు. పార్టీ అధ్యక్షులు సూచించిన వారికే జిల్లాల వారీగా పాస్‌లు జారీ చేయనున్నారు. ఇదిలావుంటే.. ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు కాకుండా వేదికపై 40 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాణ స్వీకార అనంతరమే మిగిలిన వారిని వేదికపైకి అనుమతిస్తామన్నారు. రాజ్‌నాథ్ పర్యటన ఖరారు... చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు తెలిపారు. రాజ్‌నాథ్‌తో పాటు ముగ్గురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన ఖరారైందని, అలాగే కేంద్రమంత్రులు కొంతమంది కార్యక్రమానికి వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకారం బందోబస్తుకు అదనంగా రూ.1.5 కోట్లు మంజూరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంజూరు చేసిన దానికి ఇది అదనమని జీవోలో వివరించింది. ఈ నిధుల్ని పోలీసు సిబ్బంది డైట్ చార్జీలు, వాహనాల అద్దె, ఆహారం, మంచినీరు సరఫరా, నిఘా కోసం అద్దె కెమెరాలు సమకూర్చుకోవడంతో పాటు షామియానాల అద్దెకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
కేసీఆర్ ప్రమాణానికి కోదండరామ్ హాజరు
హైదరాబాద్ : కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖులు తరలి వచ్చారు. రాజ్‌భవన్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నాదెండ్ల మనోహర్, నాదెండ్ల భాస్కర్, యాదవరెడ్డి, అసదుద్దీన్ సోదరులు, కోదండరామ్ దంపతులు, మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్, సీపీఐ నారాయణ, గుత్తా జ్వాల, తెలంగాణ రచయితలు, కవులు, రాజకీయ విశ్లేషకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చేశారు. -
భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు
-
ఢిల్లీ చేరుకున్న నవాజ్,హమిద్
-
మోడీ ప్రమాణస్వీకారానికి జయ దూరం!
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలంటూ శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించిన కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రేపు న్యూఢిల్లీలో జరగనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకుడదని జయలలిత నిర్ణయించుకున్నారని ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. అంతేకాదు తన తరఫున కనీసం ఒక్కరిని కూడా ఆ కార్యక్రమానికి పంపడం లేదని సమాచారం. ఎన్నికల ప్రచారంలో మోడీని జయలలిత, జయలలితను మోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. చివరికి ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి 282 సీట్లు రావడం, అలాగే ఏఐఏడీఏంకేకు 35 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ సందర్బంగా ఆ ఇద్దరు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు కూడా. అప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మహేంద రాజపక్సేను ఆహ్వానించారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ హామీయిచ్చిన నేపథ్యంలో రాజపక్సెను ఆహ్వానించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మోడీ నిర్ణయం దురదృష్టకరమన్నారు. మోడీ నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి కూడా మండిపడ్డారు. ఈలం తమిళుల మృతదేహాలను గుట్టలుగాపోసి మానవహక్కులను కాలరాసిన రాజపక్సే సమక్షంలో కొత్త ప్రధానిగా మోడీ ప్రమాణం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు, ఆహ్వానాన్ని మరోసారి పరిశీలించండని మోడీని కరుణానిధి కోరిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ సభ్య దేశాధ్యక్షులను ఆహ్వానించారు. ఆ సభ్య దేశాలలో శ్రీలంక కూడా ఓ సభ్య దేశమైన విషయం విదితమే. -
మోడీ ప్రమాణానికి సన్నాహాలు
రాష్ట్రపతి భవన్లో భారీ ఏర్పాట్లు - 26న తరలి రానున్న ‘సార్క్’ దేశాల అధినేతలు - బీజేపీ ప్రధాన కార్యదర్శులతో రాజ్‌నాథ్ భేటీ - మోడీ తల్లికి, భార్యకు ఎస్పీజీ భద్రత న్యూఢిల్లీ: ఈ నెల 26న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ దేశాధినేతలు సహా సుమారు మూడువేల మంది హాజరు కానున్న ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద కార్యదర్శి ఒమితా పాల్ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థల అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మోడీ ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధినేతలు రానున్నారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధినేతలు తరలి రానుండటం ఇదే తొలిసారి. మోడీ తల్లికి, భార్యకు, సోదరులు, సోదరీమణులకు కావలసిన భద్రతను అంచనా వేసేందుకు ఎస్పీజీ కమాండోలు ఇప్పటికే ఢిల్లీ నుంచి గుజరాత్ బయలుదేరి వెళ్లారు. అవసరాలకు అనుగుణంగా వారికి భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర పోలీసులను కూడా ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 7 రేస్‌కోర్స్ రోడ్డులోని మోడీ అధికారిక నివాసం వద్ద, సౌత్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయం వద్ద వెయ్యిమంది బ్లాక్‌క్యాట్ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు, మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చర్చించేందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక లేఖ ద్వారా అభినందనలు తెలిపారు. కాగా, తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీ పంపిన ఆహ్వానానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మినహా మిగిలిన ‘సార్క్’ దేశాధినేతలందరూ స్పందించారు. వారితో పాటు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షెరింగ్ తాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ హాజరు కానున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా జపాన్ పర్యటనకు వెళుతున్నందున ఆమె తన తరఫున ప్రతినిధిని పంపనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలా వద్దా తేల్చుకోలేకపోతున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశంపై సైనిక ఉన్నతాధికారులు, పౌర సమాజం నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఆహ్వానం పంపి పాక్ ప్రధానిని ఇరకాటంలో పడేశారని దౌత్య నిపుణులు అంటున్నారు. నవాజ్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాజపక్సకు ఆహ్వానంపై తమిళ పార్టీ గుర్రు శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు మోడీ ఆహ్వానం పంపడంపై తమిళ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమిళుల మనోభావాలను పట్టించుకోకుండా శ్రీలంక అధ్యక్షుడికి మోడీ ఆహ్వానం పంపడం దురదృష్టకరమని తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినాయకురాలు జయలలిత అన్నారు. డీంఎకే, ఎండీఎంకే తదితర తమిళ పార్టీలు సైతం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, ప్రధాని ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు ఆహ్వానం పంపడం ఆనవాయితీగా వస్తున్నదేనని, దీనిని ప్రజాస్వామిక వేడుకగా భావించాలని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. తల్లి దీవెనలతో ఢిల్లీకి... ప్రమాణ స్వీకారానికి మరో నాలుగు రోజులు సమయం ఉండగానే, గుజరాత్‌కు వీడ్కోలు పలికిన మోడీ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని, ఆమె దీవెనలు పొందారు. తన డ్రైవర్ సహా వ్యక్తిగత సిబ్బంది తన భద్రత కోసం తన ప్రభుత్వ వాహనంలోనే చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని, తనకోసం రోజూ కొన్నేళ్లుగా ప్రార్థనలు చేసేవారని ‘ట్విట్టర్’లో వెల్లడించారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు ‘ఆవ్జో గుజరాత్’ (వీడ్కోలు గుజరాత్) అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలో మోడీ ప్రభుత్వ ఏర్పాట్లపై మిగిలిన మూడు రోజులూ పార్టీ నేతలతో చర్చల్లో తలమునకలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
'ప్రతి మహిళ ముఖ్యమంత్రే'
తాను ముఖ్యమంత్రి పదవి అలంకరించడంతో రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆ పదవిని చేపట్టినట్లు భావిస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వెల్లడించారు. గురువారం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. ఆ బాధ్యతను త్రీకరణశుద్ధీతో పని చేస్తానని తెలిపారు. గురువారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ కమల బెనివల్... ఆనందీ బెన్ పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి ఆనందీ భర్త మఫత్‌లాల్, ఆమె కుమార్తె అనార్లు హాజరైయ్యారు. అనార్ మాట్లాడుతూ ... తల్లి సీఎం పీఠం అధిష్ఠించిన తరుణం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు, తన కుటుంబానికి ఈ విషయం గర్వంగా భావిస్తున్నామని ఆనందీ భర్త మఫత్‌లాల్ తెలిపారు. గతంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పలు కీలక శాఖలలో పని చేసిన ఆనందీ బెన్ పటేల్ గురువారం గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న మోడీ భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.