29న బెజవాడకు సీఎం కేసీఆర్‌ | KCR To Attend YS Jagan Swearing-in ceremony | Sakshi
Sakshi News home page

 29న బెజవాడకు సీఎం కేసీఆర్‌

Published Sun, May 26 2019 2:17 PM | Last Updated on Sun, May 26 2019 2:18 PM

KCR To Attend YS Jagan Swearing-in ceremony - Sakshi

సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల 29న కుటుంబ సమేతంగా విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ రాత్రికి కేసీఆర్‌ విజయవాడలోనే బస చేస్తారు. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. కాగా వైఎస్‌ జగన్‌ శనివారం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement