సాక్షి, అమరావతి: తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు వైఎస్ జగన్ మంగళవారం స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎల్లుండి విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబును జగన్ కోరారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులను జగన్ ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవారికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. (ఇందిరాగాంధీ స్టేడియంలో యుద్ధప్రాతిపదికన పనులు)
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రబాబును ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment