మమత ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు | Bhutan PM Tshering Tobgay To Attend Mamata Banerjee's Swearing-In Ceremony | Sakshi
Sakshi News home page

మమత ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు

Published Sun, May 22 2016 6:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

Bhutan PM Tshering Tobgay To Attend Mamata Banerjee's Swearing-In Ceremony

కోల్ కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు శెరింగ్ తొబ్గే హాజరు కానున్నారు. మమత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురు చూస్తున్నానని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.  తొబ్గే ట్వీట్ పై స్పందించిన మమత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
 
గతేడాది మమత భూటాన్ వెళ్లిన సందర్భంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భూటాన్ కోల్ కతాతో 180 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. నరేంద్రమోదీ, సోనియా గాంధీ, అరుణ్ జైట్లీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితిష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లను కూడా మమత తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించింది. మమత రెండోసారి సీఎంగా ఈనెల 27 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement