అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం.
రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్‌కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment