అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్‌లల్లా నేడు(బుధవారం) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్‌కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు.
రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు.
అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్‌లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
Comments
Please login to add a commentAdd a comment